← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆదిమూలము ādimūlamu

Original — తెలుగు
  1. కారణమైనదానికి కారణమైనవాడు.

(ఆది అనగా జన్మ, లేక, కారణము. మూలము అనగా కారణము లేక పుట్టుచోటు మూలము అనగా వేరు, దుంప - చెట్టు పుట్టుటకు పెరుగుటకు కారణమైనది. అందుచేత ఆదిమూలము అనగా కారణమునకు కారణము - భగవంతుడులోనుండి ప్రకృతి, ప్రకృతిలోనుండి మహత్తత్త్వము పుట్టినది - భగవంతుడు కారణము, ప్రకృతి కార్యము - ప్రకృతిలోనుండి మహత్తత్త్వము పుట్టినది. అప్పుడు ప్రకృతి కారణము, మహత్తత్త్వము కార్యము. ఈ ప్రకారముగా తత్వములన్నియు పుట్టినవి - వీటిలో ఒకదానికి కారణము ఇంకొకటి చెప్పబడినది. ఈ కారణములన్నింటికి భగవంతుడు మొదటికారణము, మూల కారణము - ఆదిమూలము).

  1. “ఆ. మూడు మూర్తులకును, మూడు లోకములకు

మూడుకాలములకు మూలమగుచు,

భేదమగుచు, దుది నభేదమై యొప్పారు

బ్రహ్మమనగ నీవ ఫాలనయన”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 7 - 227)

  1. “కోదండ దీక్షా గురుమాది మూలం”. (శ్రీరామకర్ణామృతం - 2 - 52)
Transliteration
  1. kāraṇamainadāniki kāraṇamainavāḍu.

(ādi anagā janma, lēka, kāraṇamu. mūlamu anagā kāraṇamu lēka puṭṭucōṭu mūlamu anagā vēru, duṃpa - ceṭṭu puṭṭuṭaku peruguṭaku kāraṇamainadi. aṃducēta ādimūlamu anagā kāraṇamunaku kāraṇamu - bhagavaṃtuḍulōnuṃḍi prakṛti, prakṛtilōnuṃḍi mahattattvamu puṭṭinadi - bhagavaṃtuḍu kāraṇamu, prakṛti kāryamu - prakṛtilōnuṃḍi mahattattvamu puṭṭinadi. appuḍu prakṛti kāraṇamu, mahattattvamu kāryamu. ī prakāramugā tatvamulanniyu puṭṭinavi - vīṭilō okadāniki kāraṇamu iṃkokaṭi ceppabaḍinadi. ī kāraṇamulanniṃṭiki bhagavaṃtuḍu modaṭikāraṇamu, mūla kāraṇamu - ādimūlamu).

  1. “ā. mūḍu mūrtulakunu, mūḍu lōkamulaku

mūḍukālamulaku mūlamagucu,

bhēdamagucu, dudi nabhēdamai yoppāru

brahmamanaga nīva phālanayana”. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 7 - 227)

  1. “kōdaṃḍa dīkṣā gurumādi mūlaṃ”. (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 52)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.