(అన్నింటికి మొదలైనవాడు, కారణమైనవాడు, మఱియు పురుషరూపము ధరించినవాడు). (ప్రకృతి, దాని వికారములు - వీటితోకలిసిన సమస్త వస్తువులు పురములుగా చేసుకొని - శరీరములుగా చేసుకొని - వాటిలో శయనించి యుండువాడు పురుషుడు - అంతర్యామి యై గూఢముగానున్నవాడు - లేక మొదట పురమను ప్రకృతిలో - ఉపాధిలో - శయనించియుండువాడు, దానిని వదలక యుండువాడు).
(మొదటినుండి ఉన్న పురుషుడు, పూర్వకాలమునుండి ఉన్న పురుషుడు. ప్రకృతి వికారములగు పురములని చెప్పబడు వస్తువులలో మొట్టమొదటి పురము అయిన ప్రకృతిలో నుండువాడు).
(మొదటి పురుషుడు. పురుషులు అని చెప్పబడు బ్రహ్మ, ఈశ్వరుడు, ఇంద్రుడు మొదలగువారికి కూడా కారణమైనవాడు, వారికికూడా పురుషత్వమునిచ్చువాడు, సాక్షాత్తు పరమేశ్వరుడే - ఇతరుల అందరికీ ఈశ్వరత్వము కలిగియుండుట అతని అధీనమే).
ఆదికర్తా స భూతానాం బ్రహ్మగ్రే సమవర్తత ||“. (మార్కండేయ పురాణము - 45 - 65)
(అతనే మొదట శరీరముగలవాడు, అతనే మొదటి పురుషుడు, భూతములను మొదట సృజించినవాడు, సృష్టికి పూర్వము ఉన్నవాడు).
(అంతటను, అన్నింటిలోను పూర్తిగా వ్యాపించియుండుటవలన పురుషుడు, లేక, పురములందు శయనించియుండువాడు కాన పురుషుడు - సూర్యమండలమథ్యమందున్న పురుషుడు అధిదైవతము అని చెప్పబడుచుండువాడు - సమస్తమైన వాటియొక్క ప్రాణములకు, ఇంద్రియములకు కర్త అయినవాడు (వాటిని అనుగ్రహించువాడు), ఆదిత్యునిలోపలనుండువాడు. ఇతనే హిరణ్యగర్భుడు అని తెలియబడుచున్నాడు - అతనే మొదట శరీరముగలవాడు - శరీరముగలవారిలో మొదటివాడు, ప్రధమ పురుషుడు - పురుషులలో మొదటివాడు అని చెప్పబడుచున్నాడు).
(చేతులు లేకుండగనే గ్రహించువాడు, కాళ్ళు లేకుండగనే త్వరగా నడుచువాడు, కండ్లు లేకపోయినను, చెవులు లేకపోయినను అన్నింటిని చూచును, వినును - అన్నింటిని తెలుసుకోవలయు నన్నింటిని తెలిసినవాడు - ఎవరికిని తెలియనివాడు. అటువంటి గొప్పవాడు, ఉత్కృష్టమైనవాడు ప్రధమపురుషుడు, ఆది పురుషుడు).
తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః |
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ ||“. (శ్రీమద్భగవద్గీత - 15 - 3, 4)
(స్థిరముగా ఉండనిది కనుక అశ్వత్థము అని చెప్పబడు ఈ సంసారమను వృక్షమును దేనియందును ఆశలేకయుండుట అను శస్త్రముతో వేళ్ళతోకూడా భేధించి - మరల మొలక ఎత్తకయుండునట్లు భేధించి - పునర్జన్మ లేనటువంటి పరమపదము పొందవలెను - ఆ పరమపదమే ఆదిపురుషుడు).
(జాగ్రత్స్వప్నసుషుప్తులన మూడు అవస్థలుగల పురుషులలో మొదటివాడు, ప్రకృతివలన రూపించుచున్న పురుషులలో మొదటి పురుషుడు).
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 6 - 112)
బంచమహాభూత భాసితుండై శుద్ధ సత్వుడై సర్వాతిశాయి యగుచు
జరణోరు భిజ ముఖ శ్రవణాక్షినాసా శిరములు నానా సహస్రములు వెలుగ
నంబర కేయూర హార కుండల కిరీటాదులు పెక్కువేలమరుచుండ
తే. పురుష రూపంబు ధరియించి పరుడనంతు
డఖిల బువనైక వర్తన యత్నమమర
మానితోదార జలరాశిమధ్యమునన
యోగనిద్రా విలాసియై యొప్పుచుండు.”
“వ. అది సకలావతారంబులకు మొదలిగనియైన శ్రీమన్నారాయణ దేవుని విరాజమానంబైన దివ్యరూపంబు”
(పోతన తెలుగు భాగవతము - 1 - 62)
(మహత్తత్వము, అహంకారము మొదలగు తత్వములన్నియు సూక్ష్మరూపములో తనలో నిండియుండ, తనలోనుండి తర్వాత పుట్టు సమస్త వస్తువులయొక్క ఇంద్రియములు అన్నియు తనలోనే సూక్ష్మరూపములో నిమిడి యుండుటచేత ఆ ఇంద్రియములన్నియు తనవే అయినందున వేలకొలది అవయవములు గలిగి, శరీరమునిండ ఆభరణములు కలిగియుండిన ఆకారము అను పురమున నుండి జలరాశిలోనుండి సృష్టి చేయుటకు ఉద్యమించి ఉన్ముఖుడై పరమాత్మయుండెను. అదియే తరువాత కలిగెడు భవంతుని అవతారములన్నింటికీ నిధి. దీనిలోనుండియే సమస్త చరాచరములు పుట్టినవి. భగవంతునియొక్క ఈ రూపము పురమనియు దానిలో అతను శయనించియుండుటచేత పురుషుడనియు, ఇదియే భగవంతునకు మొట్ట మొదటి పురమువంటిదియగుటచేత అతనిని ఆదిపురుషుడని, ఆది పురుషావతారమనియు చెప్పబడినది. ఇదియే అవ్యక్తమనియు ప్రకృతి లేక మాయ యనియు, చతుర్ముఖ బ్రహ్మ అనియు చెప్పబడినది).
(భగవంతుడు నిరాకారుడు - కాని ప్రకృతిలో చేరినంతమాత్రమున ప్రకృతి గుణములయిన సత్వరజస్తమముల వలన ఆకారము - రూపము - కలిగినది. అట్లు రూపముకలిగినవాటిలో మొదటిరూపము అయినందున ఆదిపురుష రూపము ఇది).
(anniṃṭiki modalainavāḍu, kāraṇamainavāḍu, maṟiyu puruṣarūpamu dhariṃcinavāḍu). (prakṛti, dāni vikāramulu - vīṭitōkalisina samasta vastuvulu puramulugā cēsukoni - śarīramulugā cēsukoni - vāṭilō śayaniṃci yuṃḍuvāḍu puruṣuḍu - aṃtaryāmi yai gūḍhamugānunnavāḍu - lēka modaṭa puramanu prakṛtilō - upādhilō - śayaniṃciyuṃḍuvāḍu, dānini vadalaka yuṃḍuvāḍu).
(modaṭinuṃḍi unna puruṣuḍu, pūrvakālamunuṃḍi unna puruṣuḍu. prakṛti vikāramulagu puramulani ceppabaḍu vastuvulalō moṭṭamodaṭi puramu ayina prakṛtilō nuṃḍuvāḍu).
(modaṭi puruṣuḍu. puruṣulu ani ceppabaḍu brahma, īśvaruḍu, iṃdruḍu modalaguvāriki kūḍā kāraṇamainavāḍu, vārikikūḍā puruṣatvamuniccuvāḍu, sākṣāttu paramēśvaruḍē - itarula aṃdarikī īśvaratvamu kaligiyuṃḍuṭa atani adhīnamē).
ādikartā sa bhūtānāṃ brahmagrē samavartata ||“. (mārkaṃḍēya purāṇamu - 45 - 65)
(atanē modaṭa śarīramugalavāḍu, atanē modaṭi puruṣuḍu, bhūtamulanu modaṭa sṛjiṃcinavāḍu, sṛṣṭiki pūrvamu unnavāḍu).
(aṃtaṭanu, anniṃṭilōnu pūrtigā vyāpiṃciyuṃḍuṭavalana puruṣuḍu, lēka, puramulaṃdu śayaniṃciyuṃḍuvāḍu kāna puruṣuḍu - sūryamaṃḍalamathyamaṃdunna puruṣuḍu adhidaivatamu ani ceppabaḍucuṃḍuvāḍu - samastamaina vāṭiyokka prāṇamulaku, iṃdriyamulaku karta ayinavāḍu (vāṭini anugrahiṃcuvāḍu), ādityunilōpalanuṃḍuvāḍu. itanē hiraṇyagarbhuḍu ani teliyabaḍucunnāḍu - atanē modaṭa śarīramugalavāḍu - śarīramugalavārilō modaṭivāḍu, pradhama puruṣuḍu - puruṣulalō modaṭivāḍu ani ceppabaḍucunnāḍu).
(cētulu lēkuṃḍaganē grahiṃcuvāḍu, kāḷḷu lēkuṃḍaganē tvaragā naḍucuvāḍu, kaṃḍlu lēkapōyinanu, cevulu lēkapōyinanu anniṃṭini cūcunu, vinunu - anniṃṭini telusukōvalayu nanniṃṭini telisinavāḍu - evarikini teliyanivāḍu. aṭuvaṃṭi goppavāḍu, utkṛṣṭamainavāḍu pradhamapuruṣuḍu, ādi puruṣuḍu).
tataḥ padaṃ tatparimārgitavyaṃ yasmin gatā na nivartaṃti bhūyaḥ |
tamēva cādyaṃ puruṣaṃ prapadyē yataḥ pravṛttiḥ prasṛtā purāṇī ||“. (śrīmadbhagavadgīta - 15 - 3, 4)
(sthiramugā uṃḍanidi kanuka aśvatthamu ani ceppabaḍu ī saṃsāramanu vṛkṣamunu dēniyaṃdunu āśalēkayuṃḍuṭa anu śastramutō vēḷḷatōkūḍā bhēdhiṃci - marala molaka ettakayuṃḍunaṭlu bhēdhiṃci - punarjanma lēnaṭuvaṃṭi paramapadamu poṃdavalenu - ā paramapadamē ādipuruṣuḍu).
(jāgratsvapnasuṣuptulana mūḍu avasthalugala puruṣulalō modaṭivāḍu, prakṛtivalana rūpiṃcucunna puruṣulalō modaṭi puruṣuḍu).
(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 6 - 112)
baṃcamahābhūta bhāsituṃḍai śuddha satvuḍai sarvātiśāyi yagucu
jaraṇōru bhija mukha śravaṇākṣināsā śiramulu nānā sahasramulu veluga
naṃbara kēyūra hāra kuṃḍala kirīṭādulu pekkuvēlamarucuṃḍa
tē. puruṣa rūpaṃbu dhariyiṃci paruḍanaṃtu
ḍakhila buvanaika vartana yatnamamara
mānitōdāra jalarāśimadhyamunana
yōganidrā vilāsiyai yoppucuṃḍu.”
“va. adi sakalāvatāraṃbulaku modaliganiyaina śrīmannārāyaṇa dēvuni virājamānaṃbaina divyarūpaṃbu”
(pōtana telugu bhāgavatamu - 1 - 62)
(mahattatvamu, ahaṃkāramu modalagu tatvamulanniyu sūkṣmarūpamulō tanalō niṃḍiyuṃḍa, tanalōnuṃḍi tarvāta puṭṭu samasta vastuvulayokka iṃdriyamulu anniyu tanalōnē sūkṣmarūpamulō nimiḍi yuṃḍuṭacēta ā iṃdriyamulanniyu tanavē ayinaṃduna vēlakoladi avayavamulu galigi, śarīramuniṃḍa ābharaṇamulu kaligiyuṃḍina ākāramu anu puramuna nuṃḍi jalarāśilōnuṃḍi sṛṣṭi cēyuṭaku udyamiṃci unmukhuḍai paramātmayuṃḍenu. adiyē taruvāta kaligeḍu bhavaṃtuni avatāramulanniṃṭikī nidhi. dīnilōnuṃḍiyē samasta carācaramulu puṭṭinavi. bhagavaṃtuniyokka ī rūpamu puramaniyu dānilō atanu śayaniṃciyuṃḍuṭacēta puruṣuḍaniyu, idiyē bhagavaṃtunaku moṭṭa modaṭi puramuvaṃṭidiyaguṭacēta atanini ādipuruṣuḍani, ādi puruṣāvatāramaniyu ceppabaḍinadi. idiyē avyaktamaniyu prakṛti lēka māya yaniyu, caturmukha brahma aniyu ceppabaḍinadi).
(bhagavaṃtuḍu nirākāruḍu - kāni prakṛtilō cērinaṃtamātramuna prakṛti guṇamulayina satvarajastamamula valana ākāramu - rūpamu - kaliginadi. aṭlu rūpamukaliginavāṭilō modaṭirūpamu ayinaṃduna ādipuruṣa rūpamu idi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.