← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆదిత్య పురుషః āditya puruṣaḥ

Original — తెలుగు
  1. అదితేరపత్యభూతః ఆదిత్యః,

(అదితి కుమారుడు ఆదిత్యుడు. దితి అనగా నాశము. అదితి అనగా నాశము లేమిది. ఆదిత్యుడు అనగా నాశము లేనిదానినుండు పుట్టినవాడు - అనగా, నాశములేని, తరుగులేని, చైతన్యఘనమైనటువంటి పర మాత్మనుండి పుట్టి, వేరుగా ప్రకాశించుచున్నటువంటి పరమాత్మాకారము - పురుషుడు అనగా పూర్ణుడు, తేజస్సుతో పూర్తిగా నిండియున్నవాడు. మన సూర్యుడు ఒక నక్షత్ర సముదాయములో (galaxy లో) పుట్టి, దానినుండి వేరుపడినవాడు. ఈ ప్రకారముగానే మిగతా నక్షత్రములన్నియు అని అన్వయించుకోవలెను.

  1. “అధయ ఏషో అంతరాదిత్యే హిరణ్మయః పురుషో దృశ్యతే”. (ఛాందోగ్యోపనిషత్ - 1 - 6 - 7 - 8)

(సూర్యునిలోపల జ్యోతిర్మయుడగు పురుషుడు ఎవడు కనబడుచున్నాడో ఆ జ్యోతిస్వరూపుడు పరమాత్మ). (భగవంతుడు నిరాకారుడు, ఉపాసన చేయుటకు వీలుగానుండుటకై ఒక ఆకారము, ఆధారము కల్పించబడినది. సూర్యునిలో పురుషాకారమేమియును లేదు. పరమాత్మ జ్యోతిస్వరూపము - తేజో ఘనము - ఘనీభవించిన తేజోమయం. అంతా తేజస్సే - ఆ తేజస్సే చిద్ఘనము - (source of heat, light and energy). సూర్యునిలోని అణువణువులోను పరమాత్మ ఉండి తనే తేజోరూపముగా మారిన ఫలితమే ఆదిత్యుడు - (Hydrogen Helium గా మారినందువల్ల సూర్యునిలోని వేడిమి, కాంతి, చైతన్య శక్తి ఏర్పడినవి. అణువణువులోను భగవంతుడు - తన చైతన్యశక్తి రూపములో - ఉన్నాడుకదా). ఆదిత్యుడు అను పదము మన సూర్యునికొక్కరికే చెందుటకాదు. జ్యోతిస్వరూపములన్నింటికి - నక్షత్రరూపములో ఉన్న అన్నింటికి ఇది వర్తించును. వాటి అన్నింటిలోను పరమాత్మ ఉండుట బట్టియే వాటికి ఆ తేజోరూపము కలిగినది. అందుచేత ఈ తేజోరూపములను ప్రకాశింపచేయువాడు పరమాత్మయే. “తత్తేజో విద్ధి మామకం” (శ్రీమద్భగవద్గీత - 15 - 12)

(‘సూర్యచంద్రాదులలోని తేజస్సు నాదే’ అని భగవద్వచనము). ఈ పరబ్రహ్మ తేజస్సునే - సూర్యునిలో ఉన్న చైతన్యఘనమునే దానికి కారణమైన భగవంతుని రూపముగా భావించి ఉపాసన చేయవలెను అని చెప్పబడినది. ‘హిరణ్మయము’ అనగా సృష్టి చేయుటకు తగిన శక్తిగల పదార్థము. (హిరణ్య గర్భుడు) - “ధ్యేయస్సదా సవితృ మండల మధ్యవర్తీ నారాయణః - - - హిరణ్మయవపుః - - - ప్రోద్య దాత్యి వర్గాభః సూర్యమండల మధ్యగః” (సూర్యమండలమధ్యమందున్నటువంటిన్నీ, హిరణ్మయమైన శరీరము గలిగినటువంటిన్నీ - - - సూర్యుని కాంతి వంటి కాంతి గలిగినటువంటిన్నీ శ్రీమన్నారాయణుడు ఎల్లపుడు ధ్యానము చేయతగినవాడు).

  1. “య ఆదిత్యే తిష్టన్నాదిత్యాదంతరో ఊమాదిత్యో నవేద”.

(ఆదిత్యుని లోపల ఉన్నప్పటికి అతనిని ఆదిత్యుడు తెలుసుకొనలేడు). దీనినిబట్టి అన్ని వస్తువులలోను ఉన్నట్లే ఆదిత్యమండలమందున్నూ పరమాత్మ ఆదిత్యుని తెలియకుండునట్లు, గూఢముగా, ఉన్నట్లు తెలియకుండునట్లు - ఉన్నాడని తెలియవచ్చుచున్నది).

  1. “సూర్యమండల మధ్యస్థః పురుషశ్చాధి దైవతం |”

- హిరణ్యగర్భ ఏవాసావాదిత్యాంతర్గతః స్మృతః |

సవై శరీరీప్రథమః సవై పురుష ఉచ్యతే, |

ఆదికర్తా స భూతానాం బ్రహ్మగ్రే సమవర్తిత” || (గీతాభావప్రకాశము - 8 - 23 to 25)

(సూర్యమండలమధ్యమందున్న పురుషుడు. అతనినే హిరణ్యగర్భుడందురు. అతనే శరీరముగల మొదటి పురుషాకారము గలవాడు - భూతములకు ఆదికర్త).

  1. “ఆదిత్యస్థః పురుషః అముష్మాదాతిత్యాత్ ఊర్ధ్వగా యేకేచన లోకాః తేషాం ఈశ్వరో దేవభోగానాంచ ఇత్యర్థః”.

(ఆదిత్యునిలోనున్న పురుషుడు ఆదిత్యునిమీదనున్న లోకములకు, దేవభోగములకు ఈశ్వరుడైనవాడు).

Transliteration
  1. aditērapatyabhūtaḥ ādityaḥ,

(aditi kumāruḍu ādityuḍu. diti anagā nāśamu. aditi anagā nāśamu lēmidi. ādityuḍu anagā nāśamu lēnidāninuṃḍu puṭṭinavāḍu - anagā, nāśamulēni, tarugulēni, caitanyaghanamainaṭuvaṃṭi para mātmanuṃḍi puṭṭi, vērugā prakāśiṃcucunnaṭuvaṃṭi paramātmākāramu - puruṣuḍu anagā pūrṇuḍu, tējassutō pūrtigā niṃḍiyunnavāḍu. mana sūryuḍu oka nakṣatra samudāyamulō (galaxy lō) puṭṭi, dāninuṃḍi vērupaḍinavāḍu. ī prakāramugānē migatā nakṣatramulanniyu ani anvayiṃcukōvalenu.

  1. “adhaya ēṣō aṃtarādityē hiraṇmayaḥ puruṣō dṛśyatē”. (chāṃdōgyōpaniṣat - 1 - 6 - 7 - 8)

(sūryunilōpala jyōtirmayuḍagu puruṣuḍu evaḍu kanabaḍucunnāḍō ā jyōtisvarūpuḍu paramātma). (bhagavaṃtuḍu nirākāruḍu, upāsana cēyuṭaku vīlugānuṃḍuṭakai oka ākāramu, ādhāramu kalpiṃcabaḍinadi. sūryunilō puruṣākāramēmiyunu lēdu. paramātma jyōtisvarūpamu - tējō ghanamu - ghanībhaviṃcina tējōmayaṃ. aṃtā tējassē - ā tējassē cidghanamu - (source of heat, light and energy). sūryunilōni aṇuvaṇuvulōnu paramātma uṃḍi tanē tējōrūpamugā mārina phalitamē ādityuḍu - (Hydrogen Helium gā mārinaṃduvalla sūryunilōni vēḍimi, kāṃti, caitanya śakti ērpaḍinavi. aṇuvaṇuvulōnu bhagavaṃtuḍu - tana caitanyaśakti rūpamulō - unnāḍukadā). ādityuḍu anu padamu mana sūryunikokkarikē ceṃduṭakādu. jyōtisvarūpamulanniṃṭiki - nakṣatrarūpamulō unna anniṃṭiki idi vartiṃcunu. vāṭi anniṃṭilōnu paramātma uṃḍuṭa baṭṭiyē vāṭiki ā tējōrūpamu kaliginadi. aṃducēta ī tējōrūpamulanu prakāśiṃpacēyuvāḍu paramātmayē. “tattējō viddhi māmakaṃ” (śrīmadbhagavadgīta - 15 - 12)

(‘sūryacaṃdrādulalōni tējassu nādē’ ani bhagavadvacanamu). ī parabrahma tējassunē - sūryunilō unna caitanyaghanamunē dāniki kāraṇamaina bhagavaṃtuni rūpamugā bhāviṃci upāsana cēyavalenu ani ceppabaḍinadi. ‘hiraṇmayamu’ anagā sṛṣṭi cēyuṭaku tagina śaktigala padārthamu. (hiraṇya garbhuḍu) - “dhyēyassadā savitṛ maṃḍala madhyavartī nārāyaṇaḥ - - - hiraṇmayavapuḥ - - - prōdya dātyi vargābhaḥ sūryamaṃḍala madhyagaḥ” (sūryamaṃḍalamadhyamaṃdunnaṭuvaṃṭinnī, hiraṇmayamaina śarīramu galiginaṭuvaṃṭinnī - - - sūryuni kāṃti vaṃṭi kāṃti galiginaṭuvaṃṭinnī śrīmannārāyaṇuḍu ellapuḍu dhyānamu cēyataginavāḍu).

  1. “ya ādityē tiṣṭannādityādaṃtarō ūmādityō navēda”.

(ādityuni lōpala unnappaṭiki atanini ādityuḍu telusukonalēḍu). dīninibaṭṭi anni vastuvulalōnu unnaṭlē ādityamaṃḍalamaṃdunnū paramātma ādityuni teliyakuṃḍunaṭlu, gūḍhamugā, unnaṭlu teliyakuṃḍunaṭlu - unnāḍani teliyavaccucunnadi).

  1. “sūryamaṃḍala madhyasthaḥ puruṣaścādhi daivataṃ |”

- hiraṇyagarbha ēvāsāvādityāṃtargataḥ smṛtaḥ |

savai śarīrīprathamaḥ savai puruṣa ucyatē, |

ādikartā sa bhūtānāṃ brahmagrē samavartita” || (gītābhāvaprakāśamu - 8 - 23 to 25)

(sūryamaṃḍalamadhyamaṃdunna puruṣuḍu. ataninē hiraṇyagarbhuḍaṃduru. atanē śarīramugala modaṭi puruṣākāramu galavāḍu - bhūtamulaku ādikarta).

  1. “ādityasthaḥ puruṣaḥ amuṣmādātityāt ūrdhvagā yēkēcana lōkāḥ tēṣāṃ īśvarō dēvabhōgānāṃca ityarthaḥ”.

(ādityunilōnunna puruṣuḍu ādityunimīdanunna lōkamulaku, dēvabhōgamulaku īśvaruḍainavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.