← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆదిత్యః ādityaḥ

Original — తెలుగు
  1. అదితి దేవతయాః పుత్రః -

(అదితి దేవత యొక్క కుమారుడు కనుక ఆదిత్యుడు అని చెప్పబడుచున్నాడు -).

  1. ఆదిత్యాం కశ్యపాత్ వామనరూపేణ జాతః ఇత్యాదిత్యః -

(కశ్యపునివలన అదితి యందు వామనరూపముతో పుట్టినవాడు - వామనావతారము).

  1. అది తేః అపత్య భూతః ఇంద్రావరజః పుత్రత్వేన అవరజత్వేన, దూతత్వేన, సుహృత్వేన చ అన్యైరప్యేవంభూతైః ప్రకారైః ఆశ్రిత సమ్రక్షణైక విశారదః ఇత్యర్థః -

(అదితికుమారుడైన వామనుడు ఆమెకు పుత్రుడుగాను, ఇంద్రునకు తమ్ముడుగాను, దేవతులకు దూతగాను, పిత్రుడుగాను - ఇట్లు ఎవరెట్లు కోరిరో వారినాప్రకారముగా అనుగ్రహించు సామర్థ్యముగలవాడు).

  1. అదితేః అఖండి తాయాః మహ్యాః అయం పతిరితి ఆదిత్యః - (భూమి అంతటికి పతి అయినవాడు).

  2. నవిద్యతే వినాశో సోయమదితిః - దితిః (వినాశము లేనివాడు). అదితిరేవ ఆదిత్యః - (అదితియే ఆదిత్యుడు).

దితినాశో న విద్యతే యస్యాసా అదితిః, బ్రహ్మవిద్యా, తస్యాః పుత్రః తల్లభ్యత్వాత్.

(దితి అనగా నాశము - నాశము లేనిది అదితి, బ్రహ్మవిద్యా దానివలన పొందతగినది కనుక పుత్రుడు అని చెప్పబడినది).

  1. ఆదత్తే గ్రసతే విశ్వం ఉపసమ్హారకాలేస్వాత్మని ఇతి; అధవా, సర్వస్యాది భూతః.

(ప్రళయకాళమందు ప్రపంచమునంతను తనలోనికి గ్రసించువాడు; లేక, అన్నింటికి మొదటివాడు, కారణమైనవాడు).

  1. యస్మాత్ సర్వం ఆదత్తే తస్మాత్ ఆదిత్యః ఇతి ఔపనిషద వ్యుత్పత్యా అశేష విషయ భోక్తా.

(అన్నింటిని తినువాడు అని ఉపనిషత్తులలో ఆదిత్య పదమునకు వ్యుత్పత్యర్థము చెప్పబడినది. అందుచేత అదితి అనగా పరమాత్మ - ఆత్మ అనగా ‘అత్తి’ తినువాడు అని అర్థము). (చూడుము - ఆత్మః – 5.1.5)

  1. ఆదిత్యమండలాంతస్థః హిరణ్మయః పురుషః ఆదిత్యః; ద్వాదశాదిత్యేషు విష్ణుర్వా. యథా ఆదిత్యః ఏక ఏవ అనేకేషు బలభాజనేషు అనేక సత్ప్రతిభాసతే ఇతి ఆదిత్య సాధర్మ్యాత్ వా ఆదిత్యః - ” య ఏతస్మిన్ మండలే పురుషః “.

(ఆదిత్యమండలమందు ఉన్న పురుషుడు - పరమ పురుషుడు అని చెప్పబడినది. సూర్యమండలము మధ్య (లోన) ఉన్న హిరణ్మయమైన పురుషుడు ఆదిత్యుడు.- హిరణ్మయమనగా చైతన్యఘనమైనది - లేక, పండ్రెండుగురు ఆదిత్యులలో ఒకడు అయిన విష్ణువు (ఆదిత్యానాం అహం విష్ణుః = ఆదిత్యులలో విష్ణువను ఆదిత్య్తుడను నేనే - (శ్రీమద్భవద్గీత - 10 - 21)

ఒకే సూర్యుడు అనేకమైన నీటికుండలలో అనేక సూర్యులుగా కనుపించినట్లు పరమాత్మ తాను ఒక్కడే అయినను అనేకముగా తోచుటచేత ఆదిత్యుని లక్షణముగల వాడగుటచేత పరమాత్మ కూడ ఆదిత్యుడే -

  1. సూర్యుడు.
Transliteration
  1. aditi dēvatayāḥ putraḥ -

(aditi dēvata yokka kumāruḍu kanuka ādityuḍu ani ceppabaḍucunnāḍu -).

  1. ādityāṃ kaśyapāt vāmanarūpēṇa jātaḥ ityādityaḥ -

(kaśyapunivalana aditi yaṃdu vāmanarūpamutō puṭṭinavāḍu - vāmanāvatāramu).

  1. adi tēḥ apatya bhūtaḥ iṃdrāvarajaḥ putratvēna avarajatvēna, dūtatvēna, suhṛtvēna ca anyairapyēvaṃbhūtaiḥ prakāraiḥ āśrita samrakṣaṇaika viśāradaḥ ityarthaḥ -

(aditikumāruḍaina vāmanuḍu āmeku putruḍugānu, iṃdrunaku tammuḍugānu, dēvatulaku dūtagānu, pitruḍugānu - iṭlu evareṭlu kōrirō vārināprakāramugā anugrahiṃcu sāmarthyamugalavāḍu).

  1. aditēḥ akhaṃḍi tāyāḥ mahyāḥ ayaṃ patiriti ādityaḥ - (bhūmi aṃtaṭiki pati ayinavāḍu).

  2. navidyatē vināśō sōyamaditiḥ - ditiḥ (vināśamu lēnivāḍu). aditirēva ādityaḥ - (aditiyē ādityuḍu).

ditināśō na vidyatē yasyāsā aditiḥ, brahmavidyā, tasyāḥ putraḥ tallabhyatvāt.

(diti anagā nāśamu - nāśamu lēnidi aditi, brahmavidyā dānivalana poṃdataginadi kanuka putruḍu ani ceppabaḍinadi).

  1. ādattē grasatē viśvaṃ upasamhārakālēsvātmani iti; adhavā, sarvasyādi bhūtaḥ.

(praḷayakāḷamaṃdu prapaṃcamunaṃtanu tanalōniki grasiṃcuvāḍu; lēka, anniṃṭiki modaṭivāḍu, kāraṇamainavāḍu).

  1. yasmāt sarvaṃ ādattē tasmāt ādityaḥ iti aupaniṣada vyutpatyā aśēṣa viṣaya bhōktā.

(anniṃṭini tinuvāḍu ani upaniṣattulalō āditya padamunaku vyutpatyarthamu ceppabaḍinadi. aṃducēta aditi anagā paramātma - ātma anagā ‘atti’ tinuvāḍu ani arthamu). (cūḍumu - ātmaḥ – 5.1.5)

  1. ādityamaṃḍalāṃtasthaḥ hiraṇmayaḥ puruṣaḥ ādityaḥ; dvādaśādityēṣu viṣṇurvā. yathā ādityaḥ ēka ēva anēkēṣu balabhājanēṣu anēka satpratibhāsatē iti āditya sādharmyāt vā ādityaḥ - ” ya ētasmin maṃḍalē puruṣaḥ “.

(ādityamaṃḍalamaṃdu unna puruṣuḍu - parama puruṣuḍu ani ceppabaḍinadi. sūryamaṃḍalamu madhya (lōna) unna hiraṇmayamaina puruṣuḍu ādityuḍu.- hiraṇmayamanagā caitanyaghanamainadi - lēka, paṃḍreṃḍuguru ādityulalō okaḍu ayina viṣṇuvu (ādityānāṃ ahaṃ viṣṇuḥ = ādityulalō viṣṇuvanu āditytuḍanu nēnē - (śrīmadbhavadgīta - 10 - 21)

okē sūryuḍu anēkamaina nīṭikuṃḍalalō anēka sūryulugā kanupiṃcinaṭlu paramātma tānu okkaḍē ayinanu anēkamugā tōcuṭacēta ādityuni lakṣaṇamugala vāḍaguṭacēta paramātma kūḍa ādityuḍē -

  1. sūryuḍu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.