(వాచికయజ్ఞము శ్రద్దతో చెప్పుచున్నాను - పరాత్పరుడైనటువంటిన్నీ, చైతన్యమే లక్షనముగా గలిగినటువంటిన్నీ, స్వశక్తితోకూడిన శివునినుండి జ్యోతిర్మయమైనటివంటిదిన్నీ, స్వభావముచేతనే సూక్ష్మమైనటువంటిదిన్నీ, అఖండితమైన శబ్దము పుట్టినది. అది అంతటను వ్యాపించినది, ఆవరించినది. ఆ శబ్దము ప్రాణులయొక్క ఆధారచక్రమునందు పిండీభూతమై మరుగుతూ ఉన్న జంబూనదమువలె ప్రకాశించును - ఆ శబ్దమే బ్రహ్మనాడిద్వారా హృదయపద్మమును ప్రవేశించి అక్కడనుండి అగ్నికాంతితో శివునియొక్క సాక్షాత్తు ఉత్తమస్థానమైన బ్రహ్మరంధ్రమును ప్రవేశించును. అక్కడ ఉండి ఈ శబ్దము సూక్ష్మమైన ఒకే అక్షరముగా నగును. ఇదియే ఆదిమంత్రము - మొదటిమంత్రము, ఉత్కృష్టమైన మంత్రము, సుప్రసిద్ధమైన మంత్రము. ఈ ఆది మంత్రముమునుండి రెండు మంత్రములు పుట్టినవి - క్రిందముఖముగా ఒకటి, మీదిముఖముగా ఒకటి. అందుచేత ఈ మంత్రము ఆద్యమంత్రము - మంత్రములలో మొదటిది, మిగిలిన మంత్రములు పుట్టినచోటు, కనుకనే వాటికి ఇది మాతృక - తల్లివంటిది).
(పై దాని యర్థము ఈ క్రింద ప్రకారముగా తెలియబడుచున్నది :- జగత్తు పుట్టుటకుముందు అదివఱకు జగత్తుయొక్క కర్మలు సూక్ష్మావస్థలోనుండును - భగవంతుని శక్తి అయిన మాయ లేక ప్రకృతిలో ఈ సూక్ష్మరూపములోనుండు కర్మవాసనలు కాలక్రమమున పరిపక్వము చెందుచుండును - అవి ఫలమునిచ్చుటకు తగినస్తితిలోనికివచ్చినపుడు మాయ. భగవంతుడు తనలోనుండుటచేత స్పందనము కలిగినదై, సృష్టించు శక్తిగలదగును. అప్పటి ప్రకృతియొక్క అవస్థయే భగవంతుడు తపింప చేసెను, భగవంతునికి సృష్టి చేయు కోరిక కలిగెను - (“సైక్షత”, “బహుశ్యాం”, “చికీర్షుః” అను వాక్యములచే చెప్పబడెను. కర్మలు పరిపక్వముగాకుండుటవలననే అవు ఘనీభూతమగుట. ఆ స్థితిలోనున్నదానిని పరిపక్వము చేయుటకొఱకే భగవంతుని విచికీర్ష. పరిపక్వమైన మాయ యొక్క స్థితియే బిందువు. ఈ విషయము శ్రుతి యీ ప్రకారముగా చెప్పుచున్నది - “విచికీర్షు ర్ఘనీభూతా క్వచిదభ్యేతి బిందుతామితి”. అవిభక్తమై వేరువేరుగా చెదరిపోవుటకుముందు ఉన్న స్థితియే అవ్యక్తము. ఇదియే జగత్తునకు మొలక. దీనిలోనుండియే ప్రపంచమంతయు సంభవించినది. “తస్మాదవ్యక్త ముత్పన్నం త్రిగుణం” అని శ్రుతి చెప్పుచున్నది. పైన చెప్పిన బిందువు కాల క్రమమున భగవచ్ఛక్తివలన మూడు విధములుగా మారెను –
ఆ మూడువిధములు ఏవి అనగా బిందువు, నాదము, బీజము, స్థూలరూపము చైతన్యము లేనిది (అచిత్) అగుభాగము - బీజము చిత్ అచిత్ కలిసిన సూక్ష్మభాగము - (సూక్ష్మాంశము); నాదము - అదియే పురుషుడు. కేవల చిదంశము పరుడై ఈశ్వరుడైన బిందువు –
ఆ బిందువు మూడువిధములుగా విభజించబడిన సమయముననే అవ్యక్తాత్మకమైన ఒక రవము (శబ్దము) (Big Bang?) పుట్టెను. దీనినే శబ్దబ్రహ్మ అని చెప్పుదురు. ఇదియే ప్రపంచమంతటిలోను - ప్రపంచములోనున్న ప్రాణులన్నింటిలోను వ్యాపించియున్నది. మూలాధారము మొదలు బ్రహ్మరంధ్రమువరకు బ్రహ్మనాడిద్వారా వ్యాపించుయున్నది. ఈ శబ్దము అఖండితము అని పైన శ్లోకములో చెప్పబడినది. అఖండితమనగా స్వప్రకాశమైన బిందువువలన కలిగినదగుటచేత - దాని తత్వమే కలిగియుండుటచేత ఈ శబ్దముకూడ దానివలనే స్వప్రకాశము, అన్నింటిలోను వ్యాపించియుండునదిగనుక అఖండితము అని చెప్పబడినది. అక్షరములు రెండురకములు - స్థూలములు, సూక్ష్మములు - స్థూలము నాదాత్మకము, సమస్తమైన శబ్దములకు ఉపాదానభూతమైనది శిరస్సునుండి (బ్రహ్మరంధ్రమునుండి) పుట్టినది. సూక్ష్మము లోపలిది (అంతరము) - ఈ శబ్దములు కలుగుటకు ప్రాణవాయువు కారణము - “నాభేరుత్థితః ప్రానః ఉరసి విస్తీర్ణః కంఠే పరివృతోమూర్థానమాహృత్య పరావృత్తౌ వివిధాన్ శబ్దాన్ వ్యనక్తి”.
(vācikayajñamu śraddatō ceppucunnānu - parātparuḍainaṭuvaṃṭinnī, caitanyamē lakṣanamugā galiginaṭuvaṃṭinnī, svaśaktitōkūḍina śivuninuṃḍi jyōtirmayamainaṭivaṃṭidinnī, svabhāvamucētanē sūkṣmamainaṭuvaṃṭidinnī, akhaṃḍitamaina śabdamu puṭṭinadi. adi aṃtaṭanu vyāpiṃcinadi, āvariṃcinadi. ā śabdamu prāṇulayokka ādhāracakramunaṃdu piṃḍībhūtamai marugutū unna jaṃbūnadamuvale prakāśiṃcunu - ā śabdamē brahmanāḍidvārā hṛdayapadmamunu pravēśiṃci akkaḍanuṃḍi agnikāṃtitō śivuniyokka sākṣāttu uttamasthānamaina brahmaraṃdhramunu pravēśiṃcunu. akkaḍa uṃḍi ī śabdamu sūkṣmamaina okē akṣaramugā nagunu. idiyē ādimaṃtramu - modaṭimaṃtramu, utkṛṣṭamaina maṃtramu, suprasiddhamaina maṃtramu. ī ādi maṃtramumunuṃḍi reṃḍu maṃtramulu puṭṭinavi - kriṃdamukhamugā okaṭi, mīdimukhamugā okaṭi. aṃducēta ī maṃtramu ādyamaṃtramu - maṃtramulalō modaṭidi, migilina maṃtramulu puṭṭinacōṭu, kanukanē vāṭiki idi mātṛka - tallivaṃṭidi).
(pai dāni yarthamu ī kriṃda prakāramugā teliyabaḍucunnadi :- jagattu puṭṭuṭakumuṃdu adivaṟaku jagattuyokka karmalu sūkṣmāvasthalōnuṃḍunu - bhagavaṃtuni śakti ayina māya lēka prakṛtilō ī sūkṣmarūpamulōnuṃḍu karmavāsanalu kālakramamuna paripakvamu ceṃducuṃḍunu - avi phalamuniccuṭaku taginastitilōnikivaccinapuḍu māya. bhagavaṃtuḍu tanalōnuṃḍuṭacēta spaṃdanamu kaliginadai, sṛṣṭiṃcu śaktigaladagunu. appaṭi prakṛtiyokka avasthayē bhagavaṃtuḍu tapiṃpa cēsenu, bhagavaṃtuniki sṛṣṭi cēyu kōrika kaligenu - (“saikṣata”, “bahuśyāṃ”, “cikīrṣuḥ” anu vākyamulacē ceppabaḍenu. karmalu paripakvamugākuṃḍuṭavalananē avu ghanībhūtamaguṭa. ā sthitilōnunnadānini paripakvamu cēyuṭakoṟakē bhagavaṃtuni vicikīrṣa. paripakvamaina māya yokka sthitiyē biṃduvu. ī viṣayamu śruti yī prakāramugā ceppucunnadi - “vicikīrṣu rghanībhūtā kvacidabhyēti biṃdutāmiti”. avibhaktamai vēruvērugā cedaripōvuṭakumuṃdu unna sthitiyē avyaktamu. idiyē jagattunaku molaka. dīnilōnuṃḍiyē prapaṃcamaṃtayu saṃbhaviṃcinadi. “tasmādavyakta mutpannaṃ triguṇaṃ” ani śruti ceppucunnadi. paina ceppina biṃduvu kāla kramamuna bhagavacchaktivalana mūḍu vidhamulugā mārenu –
ā mūḍuvidhamulu ēvi anagā biṃduvu, nādamu, bījamu, sthūlarūpamu caitanyamu lēnidi (acit) agubhāgamu - bījamu cit acit kalisina sūkṣmabhāgamu - (sūkṣmāṃśamu); nādamu - adiyē puruṣuḍu. kēvala cidaṃśamu paruḍai īśvaruḍaina biṃduvu –
ā biṃduvu mūḍuvidhamulugā vibhajiṃcabaḍina samayamunanē avyaktātmakamaina oka ravamu (śabdamu) (Big Bang?) puṭṭenu. dīninē śabdabrahma ani ceppuduru. idiyē prapaṃcamaṃtaṭilōnu - prapaṃcamulōnunna prāṇulanniṃṭilōnu vyāpiṃciyunnadi. mūlādhāramu modalu brahmaraṃdhramuvaraku brahmanāḍidvārā vyāpiṃcuyunnadi. ī śabdamu akhaṃḍitamu ani paina ślōkamulō ceppabaḍinadi. akhaṃḍitamanagā svaprakāśamaina biṃduvuvalana kaliginadaguṭacēta - dāni tatvamē kaligiyuṃḍuṭacēta ī śabdamukūḍa dānivalanē svaprakāśamu, anniṃṭilōnu vyāpiṃciyuṃḍunadiganuka akhaṃḍitamu ani ceppabaḍinadi. akṣaramulu reṃḍurakamulu - sthūlamulu, sūkṣmamulu - sthūlamu nādātmakamu, samastamaina śabdamulaku upādānabhūtamainadi śirassunuṃḍi (brahmaraṃdhramunuṃḍi) puṭṭinadi. sūkṣmamu lōpalidi (aṃtaramu) - ī śabdamulu kaluguṭaku prāṇavāyuvu kāraṇamu - “nābhērutthitaḥ prānaḥ urasi vistīrṇaḥ kaṃṭhē parivṛtōmūrthānamāhṛtya parāvṛttau vividhān śabdān vyanakti”.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.