← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆద్యంతములు ādyaṃtamulu

Original — తెలుగు

యథా భౌతికాదీనాం, శరాహదీనాం ఆకాశాది పంచభూతాని ఆద్యంత రూపాణి, తథా, సర్వభూతానాం - జరాయుజాదీనాం - ఆద్యంతాదిః భగవాన్ పరమేశ్వరః.

(భూతములవలన పుట్టినవాటికి - మూకుడు మొదలగు వాటికి ఆకాశము మొదలగు పంచభూతములు ఆది, అంతములైనట్లే, సమస్త భూతములకు - జరాయుజములు (మావి మొదలగువాటినుండి పుట్టినవి) ఆది అంతము పరమాత్మయే - పంచభూతములనుండి పుట్టినవి అన్నియు భౌతికములు. అవి అన్నియు వాటిలోనే అంతమగును - దేనిలోనుండి పుట్టినవస్తువు దానిలోనే లయమగును - మట్టి (భూమి) లోనుండి పుట్టిన కుండ మొదలగునవి, బ్రద్దలై, భూమిలోనే కలియును. అట్లే సమస్త భూతములు భగవంతునిలోనుండి, ఒకదానిలోనుండి ఒకటిగా, పుట్టినవి కనుక, అవి అన్నియు భగవంతునిలోనే లయమగును - అంతమునొందును. అందుచేత వాటికి ఆద్యంతములు భగవంతుడే).

Transliteration

yathā bhautikādīnāṃ, śarāhadīnāṃ ākāśādi paṃcabhūtāni ādyaṃta rūpāṇi, tathā, sarvabhūtānāṃ - jarāyujādīnāṃ - ādyaṃtādiḥ bhagavān paramēśvaraḥ.

(bhūtamulavalana puṭṭinavāṭiki - mūkuḍu modalagu vāṭiki ākāśamu modalagu paṃcabhūtamulu ādi, aṃtamulainaṭlē, samasta bhūtamulaku - jarāyujamulu (māvi modalaguvāṭinuṃḍi puṭṭinavi) ādi aṃtamu paramātmayē - paṃcabhūtamulanuṃḍi puṭṭinavi anniyu bhautikamulu. avi anniyu vāṭilōnē aṃtamagunu - dēnilōnuṃḍi puṭṭinavastuvu dānilōnē layamagunu - maṭṭi (bhūmi) lōnuṃḍi puṭṭina kuṃḍa modalagunavi, braddalai, bhūmilōnē kaliyunu. aṭlē samasta bhūtamulu bhagavaṃtunilōnuṃḍi, okadānilōnuṃḍi okaṭigā, puṭṭinavi kanuka, avi anniyu bhagavaṃtunilōnē layamagunu - aṃtamunoṃdunu. aṃducēta vāṭiki ādyaṃtamulu bhagavaṃtuḍē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.