“క. అరయగ కల్ప ప్రళయాం
తరమున నాద్యంత విరహిత క్రియతోడం
బరిపూర్ణ నిత్యమహిమం
బరమాత్ముడనైన సరోజభవ ! యేనుందున్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 9 - )
(సృష్టి ప్రారంభసమయమునగాని, సృష్టి లయించు ప్రళయ సమయమందుగాని, ఈ రెండింటికి మధ్యకాలమందుకాని ఆది, అంతము లేనివాడనై నామహిమలో ఏ మాత్రము తరుగక ఎల్లపుడు పరిపూర్ణమహిమతో పరమాత్మనే అయియుందును. అందుచేత నేను ఆద్యంతరహితుడను - జననమరణములు లేనివాడను).
“ka. arayaga kalpa praḷayāṃ
taramuna nādyaṃta virahita kriyatōḍaṃ
baripūrṇa nityamahimaṃ
baramātmuḍanaina sarōjabhava ! yēnuṃdun”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 9 - )
(sṛṣṭi prāraṃbhasamayamunagāni, sṛṣṭi layiṃcu praḷaya samayamaṃdugāni, ī reṃḍiṃṭiki madhyakālamaṃdukāni ādi, aṃtamu lēnivāḍanai nāmahimalō ē mātramu tarugaka ellapuḍu paripūrṇamahimatō paramātmanē ayiyuṃdunu. aṃducēta nēnu ādyaṃtarahituḍanu - jananamaraṇamulu lēnivāḍanu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.