← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

అద్యో(అ)వతారము adyō(a)vatāramu

Original — తెలుగు
  1. “పురుష సూక్త ప్రతిపాదిత సహస్ర శీర్షత్వ సహస్రపాదత్వాద్సహితః, ప్రపంచ శరీరకః అండాధిష్ఠాతా పురుషః ఆద్యో అవతారః, నిఖిలావతార కదంబ భూతః ప్రథమో అవతారః. తస్య పురుషస్య స్వరూపం - కాలస్వరూపః, నిత్యానిత్య శరీరవస్తుతయా తద్ద్రవ్యం చ రూపం మూల ప్రకృతిరూప ద్రవ్యం తచ్చరీరకతయా తదభిన్న వికారః మహదహంకార తన్మాత్రాది శరీరకతయా తద్రూపః; ఇంద్రియ శరీరకతయా ఇంద్రియ స్వరూపః, గుణసత్వాది శరీరకతయా తద్రూపః, విరాట్ అండాధిష్ఠా తృతయా, అండ శరీరకతయా చ అండ స్వరూపః, స్వరాట్ ఇంద్రాదిరూపకం, కృత్స్నచేతనా చేతన శరీరకతయా తదభిన్నః - ఏతాదృశః పురుషః నారాయణస్య ఆద్యో అవతారః”.

సహస్ర శీర్షా పురుషః సహస్రాక్షస్సహస్రపాద్ - వేలకొలది తలలు, వేలకొలది కన్నులు, వేలకొలది పాదములు మొదలుగాగల పురుషుడు - అని పురుష సూక్తములో చెప్పబడిన ప్రకారము వేలకొలది శిరస్సులు వేలకొలది పాదములు మొదలుగా అవయవములతో కూడియున్న ప్రపంచమే శరీరముగా కలిగినవాడు, బ్రహ్మాండము నధిష్ఠించియుండు పురుషుడు - ఇదియే భగవంతునియొక్క మొదటి యవతారము, అవతారములన్నింటికి గని యైనటువంటిది. ఇందులోనుండియే మిగిలిన అవతారములు పుట్టినవి. భగవంతునియొక్క ఆ మొదటి అవతారముయొక్క రూపము ఎట్టిదనిన - కాలస్వరూపము, నిత్యానిత్య శరీరములకు కారణమగు ద్రవ్యరూపము, అందువలనా వస్తువులరూపము - మూల ప్రకృతి - తానే అయి యుండుటవలన దాని వికారమున్నూ, అందులకుపచరించు ద్రవ్యమున్నూ (వస్తు సామగ్రి), ఇంద్రియములు తానే అయి యున్నందున -దాని నధిష్ఠించియుండుటచేత బ్రహ్మాండస్వరూపమున్నూ సమస్త చరాచరములు తన శరీరమే అయి యున్నం దున వాటి రూపమున్నూ కలిగి, వీటి అన్నింటితో కూడియున్న మొత్తము శరీరము కలది శ్రీమన్నారాయణుని మొదలి యవతారము.

  1. “అమ్మహనీయ తేజోనిధి మొదలియవతారంబు సహస్రశీర్షాది యుక్తంబయి ప్రకృతి ప్రవర్తకంబగు నాదిపురుషరూపంబగు”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 6 - 42)

Transliteration
  1. “puruṣa sūkta pratipādita sahasra śīrṣatva sahasrapādatvādsahitaḥ, prapaṃca śarīrakaḥ aṃḍādhiṣṭhātā puruṣaḥ ādyō avatāraḥ, nikhilāvatāra kadaṃba bhūtaḥ prathamō avatāraḥ. tasya puruṣasya svarūpaṃ - kālasvarūpaḥ, nityānitya śarīravastutayā taddravyaṃ ca rūpaṃ mūla prakṛtirūpa dravyaṃ taccarīrakatayā tadabhinna vikāraḥ mahadahaṃkāra tanmātrādi śarīrakatayā tadrūpaḥ; iṃdriya śarīrakatayā iṃdriya svarūpaḥ, guṇasatvādi śarīrakatayā tadrūpaḥ, virāṭ aṃḍādhiṣṭhā tṛtayā, aṃḍa śarīrakatayā ca aṃḍa svarūpaḥ, svarāṭ iṃdrādirūpakaṃ, kṛtsnacētanā cētana śarīrakatayā tadabhinnaḥ - ētādṛśaḥ puruṣaḥ nārāyaṇasya ādyō avatāraḥ”.

sahasra śīrṣā puruṣaḥ sahasrākṣassahasrapād - vēlakoladi talalu, vēlakoladi kannulu, vēlakoladi pādamulu modalugāgala puruṣuḍu - ani puruṣa sūktamulō ceppabaḍina prakāramu vēlakoladi śirassulu vēlakoladi pādamulu modalugā avayavamulatō kūḍiyunna prapaṃcamē śarīramugā kaliginavāḍu, brahmāṃḍamu nadhiṣṭhiṃciyuṃḍu puruṣuḍu - idiyē bhagavaṃtuniyokka modaṭi yavatāramu, avatāramulanniṃṭiki gani yainaṭuvaṃṭidi. iṃdulōnuṃḍiyē migilina avatāramulu puṭṭinavi. bhagavaṃtuniyokka ā modaṭi avatāramuyokka rūpamu eṭṭidanina - kālasvarūpamu, nityānitya śarīramulaku kāraṇamagu dravyarūpamu, aṃduvalanā vastuvularūpamu - mūla prakṛti - tānē ayi yuṃḍuṭavalana dāni vikāramunnū, aṃdulakupacariṃcu dravyamunnū (vastu sāmagri), iṃdriyamulu tānē ayi yunnaṃduna -dāni nadhiṣṭhiṃciyuṃḍuṭacēta brahmāṃḍasvarūpamunnū samasta carācaramulu tana śarīramē ayi yunnaṃ duna vāṭi rūpamunnū kaligi, vīṭi anniṃṭitō kūḍiyunna mottamu śarīramu kaladi śrīmannārāyaṇuni modali yavatāramu.

  1. “ammahanīya tējōnidhi modaliyavatāraṃbu sahasraśīrṣādi yuktaṃbayi prakṛti pravartakaṃbagu nādipuruṣarūpaṃbagu”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 6 - 42)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.