← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆగమములు āgamamulu

Original — తెలుగు

“ఆగతః శివ వక్త్రేభ్యో గతంతు గిరిజాముఖే |

మతంతు వాసుదేవస్య తస్మాదాగమ ముచ్యతే ||“.

ఇతి నిరుక్తః

(శివుని నుండి వచ్చినదియు, పార్వతి ముఖము చొచ్చినదియు, వాసుదేవినికి సమ్మతమైనదియు అగుటచేత ఆగమము అని చెప్పబడినది - ‘ఆగతం’, ‘గతంతు’, మతంతు ’అను పదములలోనిమొదటి అక్షరములు “ఆగమ” క్లిసి ఆగమములు అని చెప్పబడినది) - (ఈశ్వరముఖమువలన పుట్టినవి, పార్వతి ముఖమును పొందినవి, విష్ణుమతమును ప్రతిపాదించునవి - ఆగమములు).

  1. పరమేశ్వరా దా గత ఏవ ఆగమః. (పరమేశ్వరునుండి పుట్టినవి).

  2. ఆగమనాంతు స్యయం శంభుః కర్తా వేదానుసారతః.

(వేదానుసారముగ శివుడు స్వయముగా ఆగమములను చేసెను - ఆగమముల కర్త శివుడు).

  1. “ఆసమంతాత్ గమ యతి ధర్మా ధర్మౌ పరం పదం”.

(అందఱికి, అంతటను ధర్మా ధర్మములను తెలియచేయునది, పరమపదమును పొందింప చేయునది).

  1. సంతి వేదమ యీని శైవ తంత్రాణ్యష్టా వింశతిః, కామికాదని వైదికాని నిగమ పదవాచ్యాని పరమేశ్వర ముఖోద్భూతత్వాత్ ఆజ్ఞా రూపాణి సంహితా ఇత్యుచ్యంతే - పునరధో భాగాదుత్పన్నాని వేద విరుద్ధాని మహామాయావీని; తేషామా గమమితి సంజ్ఞా.

(వేదమయములైన శైవతంత్రములు అష్టావింశతి, కామికము మొదలగునవి నిగమములు పరమేశ్వరుని ముఖమునుండి పుట్టినవి అగుటచేత ఆజ్ఞారూపములు సంహితములని చెప్పబడుచున్నవి. అధోభాగమునుండి పుట్టి, వేదవిరుద్ధములైనవి ఆగమములని చెప్పబడుచున్నవి).

(పరమేశ్వరుడే వచించెనని దీని భావము - ఇవి శైవాగమములు, వైష్ణవాగమములు - పాంచరాత్రములు, వైఘానసములని రెండు విధములు).

  1. సృష్టి, ప్రళయము, అర్చన, మంత్రము, ధ్యానము మొదలగు విషయములగుఱించి చెప్పెడు శాస్త్రము).
Transliteration

“āgataḥ śiva vaktrēbhyō gataṃtu girijāmukhē |

mataṃtu vāsudēvasya tasmādāgama mucyatē ||“.

iti niruktaḥ

(śivuni nuṃḍi vaccinadiyu, pārvati mukhamu coccinadiyu, vāsudēviniki sammatamainadiyu aguṭacēta āgamamu ani ceppabaḍinadi - ‘āgataṃ’, ‘gataṃtu’, mataṃtu ’anu padamulalōnimodaṭi akṣaramulu “āgama” klisi āgamamulu ani ceppabaḍinadi) - (īśvaramukhamuvalana puṭṭinavi, pārvati mukhamunu poṃdinavi, viṣṇumatamunu pratipādiṃcunavi - āgamamulu).

  1. paramēśvarā dā gata ēva āgamaḥ. (paramēśvarunuṃḍi puṭṭinavi).

  2. āgamanāṃtu syayaṃ śaṃbhuḥ kartā vēdānusārataḥ.

(vēdānusāramuga śivuḍu svayamugā āgamamulanu cēsenu - āgamamula karta śivuḍu).

  1. “āsamaṃtāt gama yati dharmā dharmau paraṃ padaṃ”.

(aṃdaṟiki, aṃtaṭanu dharmā dharmamulanu teliyacēyunadi, paramapadamunu poṃdiṃpa cēyunadi).

  1. saṃti vēdama yīni śaiva taṃtrāṇyaṣṭā viṃśatiḥ, kāmikādani vaidikāni nigama padavācyāni paramēśvara mukhōdbhūtatvāt ājñā rūpāṇi saṃhitā ityucyaṃtē - punaradhō bhāgādutpannāni vēda viruddhāni mahāmāyāvīni; tēṣāmā gamamiti saṃjñā.

(vēdamayamulaina śaivataṃtramulu aṣṭāviṃśati, kāmikamu modalagunavi nigamamulu paramēśvaruni mukhamunuṃḍi puṭṭinavi aguṭacēta ājñārūpamulu saṃhitamulani ceppabaḍucunnavi. adhōbhāgamunuṃḍi puṭṭi, vēdaviruddhamulainavi āgamamulani ceppabaḍucunnavi).

(paramēśvaruḍē vaciṃcenani dīni bhāvamu - ivi śaivāgamamulu, vaiṣṇavāgamamulu - pāṃcarātramulu, vaighānasamulani reṃḍu vidhamulu).

  1. sṛṣṭi, praḷayamu, arcana, maṃtramu, dhyānamu modalagu viṣayamulaguṟiṃci ceppeḍu śāstramu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.