← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆహారము āhāramu

Original — తెలుగు
  1. ఆహ్రియతే ఇతి అహారం - అన్నం, తత్తద్ద్రవ్యాణి ప్రతీయంతే.

(ఆహరించబడునది ఆహారము - అన్నము, అటువంటి ద్రవ్యములు).

  1. “ఇంద్రియైః విషయాణాం ఆహరణం గ్రహణం ఆహారః” (శ్రీధరీయవ్యాఖ్యా)

(ఇంద్రియములచేట వాటి వాటి విషయములను ఆహరించుట, గ్రహించుట).

  1. ఆహరంతి రసమస్మాదిత్యాహారః -

(దీనియందు, దీనిలోని రసమును ఆహరించెదరు, గ్రహించెదరు. అందుచేత ఆహారమని చెప్పబడినది).

  1. రస్యాః రసోపేతాః ఆహారాః స్నేహవంతః, దేహే చిరకాలస్థా యినః | స్థిరపరిణామాః, సాత్వికాహారాః.

(రసముతోకూడిన ఆహారము - ఎండిపోక, వాడిపోకయుండునవి, పక్వమునకు వచ్చినవి, చిరకాలము శరీరములో ఉండునవి సాత్వికాహారములు - ఆరోగ్యకరమైనవి).

  1. “ఆహారోపి సర్వస్య ప్తాణి జాతస్య సత్వాది త్రిగుణతయా స్వయేన త్రివిధః ప్రియోభవతి” (శ్రీరామానుజః)

(సమస్తమైన ప్రాణులకు ఆహారము సత్వరజస్తమోగుణములతో కూడియుండుటచేత మూడు విధములు - సాత్వికాహారము, రాజసాహారము, తామసాహారము).

  1. “రస్యన్నిగ్దాదుషు ఆహార విశేషు ఆత్మనః ప్రీత్యతి రేకేణ లింగేన సాత్వికత్వం, రాజసత్వం తామసత్వంచ బుద్ధ్యా రాజస్తమో లింగానాం ఆహారాణాం పరివర్జనార్థం సత్వ లింగానాం చ ఉపాదానార్థం” (శ్రీశంకరః)

(రసముకూడియున్న ఆహారవిశేషములందు ఆత్మ ప్రీతిననుసరించి మూడు విధములు - సాత్వికములు. రాజసములు. తామసములు. వాటిలో రాజసాహారమును తామసాహారమును వదలి సాత్వికాహారమును సేవించవలెను).

  1. “హితం మేధ్యం మితం యస్య భోజనం ప్రాణధారణం”

(ఇష్టమైనది, మితమైనది అయిన ఆహారము ప్రాణవాయువు శరీరములో దాని వృత్తిని చేయుటకు ఉపకరించును - పరిమితముకాని ఆహారము వాయువృత్తికి అడ్డుతగులును).

  1. ఆయుర్వివర్థనత్వాదియః ఆహారగుణాః.

(ఆయుర్దాయమును వృద్ధిచేయుట మొదలగునవి ఆహారగుణములు - ఆహారమును బట్టి ఆరోగ్యము, ఆరోగ్యమునుబట్టి ఆయుర్దాయము కలుగును).

  1. “ఉర్వినాహార దోషం చె విజ్ఞాన నాశంబునకు మూలంబు” (శ్రీనాధుడు - కాశీఖండము)

  2. “ఆహార శుద్ధౌ సత్వ శుద్ధిః, సత్వ శుద్ధౌ ధృవాస్మృతిః |

స్మృతిలాభే సర్వగ్రంధీనాం విప్రమోక్షం ||” (చాందోగ్యోపనిషత్)

- ఇతి జ్ఞాన సాక్షాత్కార రూపః జ్ఞానం ఆహార శుద్ధ్యాయత్తం శ్రూయ తే “.

(శుద్ధమైన ఆహారము తినుటవలన సత్వము - సత్వగుణము వృద్ధియగును - సత్వగుణము వృద్ధి యగుటవలన స్మృతి స్థిరముగానుండును. దానివలన శరీరములోని గ్రంధులన్నియు విడిపోవును - శరీరములోని అడ్డులన్నియు వదలిపోవుటవలన శరీరము ఆరోగ్యవంతముగా నుండును - ఈ విధముగా శ్రుతిచెప్పుటవలన ఆత్మసాక్షాత్కారమునకు కావలసిన జ్ఞానము కలుగును - “జ్ఞానే నైవతు కైవల్యం” - (బ్రహ్మజ్ఞానము కలుగుటవలననే మోక్షము అని చెప్పబడినది కనుక శుద్ధమైన ఆహారము వలననే బ్రహ్మజ్ఞానము, దానివలన మోక్షము కలుగును).

“ఆహారశుద్ధౌ సత్వశుద్ధిః, సత్వ శుద్ధౌ ధృవా స్మృతిః |

స్మృతిలాభాత్ దుఃఖనాశస్తతః చిత్త ప్రసన్నతా ||“.

ఇతి మనోస్థైర్యస్య ఆహారాది నియమపూర్వకత్వేన ఉక్తం.

(ఆహారమువలన సత్వశుద్ధి, దానివలన స్మృతి స్థిరముగానుండును - నిశ్చలబుద్ధి కలుగును - అందువలన దుఃఖము నశించును, దానివలన మనస్సు నిర్మలమగును).

  1. “అన్నమయం హి సేమ్య ! మనః”.

(మనస్సు అన్నమయము - తినిన ఆహారమును బట్టి మనస్సు ప్రవర్తించును - త్రిగుణములుగల ఆహారము వాటివాటి గుణములను కలుగచేయును - మనసుద్వారా ప్రవర్తింపచేయును). (Tell me what you eat and I will tell you what you are) (Savarin?)

  1. “అన్నేన కుక్షేర్ద్వా వంశౌ పానే నైకం ప్రపూరయేత్ |

ఆశ్రయం పవనాదీనాం చతుర్థ మవ శేష యేత్ ||“. (చికిత్సాసారసంగ్రహము)

(కడుపు నాలుగు భాగములుగ చేసుకొని అందులో రెండు భాగములను అన్నముతో నింపవలయును, ఒకభాగము నీరుతో నింపవలయును. మిగిలినభాగము వాయువు సంచరించుటకు వీలుగా - ఉచ్ఛ్వాస నిశ్వాసములకు - వదలివేయవలెను).

  1. “అతిమాత్రః పునః సర్వానాశు దోషాన్ ప్రకోపయేత్”. (చికిత్సాసారసంగ్రహము)

(మిక్కిలి అధికముగా భుజించినయడల సకలరోగములను మరల ఉద్రిక్తముగా చేయును).

  1. “భోజనం హీనమాత్రం తు న బలోపచయే జసే |

సర్వేషాం వాతరోగాణాం హేతుతాం చ ప్రపద్యతే ||“. (చికిత్సాసారసంగ్రహము)

(అతి తక్కువగా భోజనము చేయుటవలన, బలము తక్కువ యగుటయే కాక వాత రోగములను పుట్టించును).

  1. “భోజనకాలే ఆదావంతేచ ద్రవభూతం గ్రాహ్యం, మధ్యే కఠినం” ఇతి విష్ణుపురాణే -

(భోజనము చేయునపుడు భోజనమునకు ముందు, తర్వాత ద్రవపదార్థము - నీరు వంటిది - పలచనిది - తీసుకోవలెను - మధ్యను గట్టి పదార్థాము తీసుకొనవలెను -).

  1. “నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంతమనశ్నతః |”

“యుక్తాహార విహారస్య యోగో భవతి దుఃఖహా ||”. (శ్రీమద్భగవద్గీత - 6 - 16, 17)

“యోగా భ్యాసైక నిష్ఠస్య ప్రాహా హారాది సం యమం |

భుక్తం సు జ్జీర్యతి స్వస్య యదన్నం దేహ ధారణం |

తదాత్మ సం మితం జ్ఞేయం తద తిక్రమ్య లోభతః |

అధికం చాశ్నతో నాస్తి యోగో (అ)జీర్ణాది దోషతః |

అత్యల్పాహారతో నాస్తి నాస్త్యనాహారతః స చ |

అధవా యోగశాస్త్రోక్త మాహారం నైవ లంఘ యేత్ ||“. (గీతాభావప్రకాశము - 6 - 74 to 78)

(యోగభ్యాసము చేయుటయందు నిష్ఠగలవానికి ఆహారవిషయమై నియమము ఈ క్రింద విధముగా చెప్పబడినది :- దేహమును ధరించియుండుటకు - అనగా, జీవించియుండుటకు - కావలైసినంత అన్నమే తినినయడల అది బాగుగా జీర్ణమగును - ఇది శరీరమునకు అనుగుణమైనది. ఆహారలోభమువలన ఆహారములోని రుచికి ఆసించి ఇంతకు మించి ఆహారము తినినయడల అది అజీర్ణమునకు - అరగకుండుటకు - కారణమగుటవలన ఆ ప్రకారము ఆహారము తినినయడల అదియోగాభ్యాసమునకు పనికిరాదు - అజీర్ణమువల్ల అనేకవ్యాధులు ఉత్పన్నమై శరీరమును యోగాభ్యాసమునకు తగినస్థితిలో లేనట్లు చేయును, ఏకాంత మనసు కుదరదు. ఆ ప్రకారముగానే మిక్కిలి తక్కువ ఆహారము తినిననూ, ఆహారము తినుటయే మానివసినను, శరీరస్వస్థతలేక యోగాభ్యాసమునకు శరీరము తగినట్లుండదు. యోగాభ్యాసము చేయువాడు యోగశాస్త్రములో చెప్పిన ప్రకారము ఆహారము తినవలెను. కడుపులోని నాలుగు వంతులలోను రెండువంతులు - అనగా కడుపులోసగము ఆహారముతో నింపవలెను - ఒకవంతు నీటితో నింపవలెను - మిగిలినవంతు - నాలుగవవంతు కాళీగా ఉంచవలెను. ఇట్లు చేయుటవలన వాయువు శరీరములోనికి పోయి మరల పైకి వచ్చునపుడు ఆయాసము లేకుండుటకు సహకరించును. పైన చెప్పిన ప్రకారముగా ఆహార నియమములు పాటించువానికి యోగాభ్యాసము కష్టములేకుండునట్లు చేయును. అట్టివాని యోగము దుఃఖమును పోగొట్టును).

  1. “అహస్తాని సహస్తానా మపదాని చతుష్పదాం |

ఫల్గూని తత్రమహతాం జీవో జీవస్య జీవనం ||“. (శ్రీమద్భాగవతం 1 - 13 - 47)

(చేతులున్నవాటికి చేతులు లేనివియు, కాళ్ళున్నవాటికి కాళ్ళు లేనివియు, పెద్దవాటికి చిన్నవియు, ఈ ప్రకారముగా ఒక జీవికి ఇంకొకజీవి ఆహారమగుచున్నది. (చూడుము - “ఆత్మ - 5.1.5”). (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 13 - 288)

  1. “అత్రాహారార్థం కర్మకుర్యాదనింద్యం, కుర్యాదాహారం ప్రాణ సంధారణార్థం, ప్రాణాః సంధార్యాస్తత్వ జిజ్ఞాసనార్థం, తత్వం జిజ్ఞాస్యం యేన భూయో న దుఃఖం”. (గీతాభావప్రకాశము - 6- 82)

  2. (ఆహారముకొఱకు నింద్యముకాని కర్మ చేయవలయును. అట్లు సంపాదించిన ఆహారము ప్రాణములను బొందిలో నుంచుకొనుటకు - ఉంచుకొనుటకు చాలినంతే - తినవలెను. ఆ ప్రకారము శరీర ధారణకుపయోగించు ప్రాణములను భగవత్తత్త్వమును తెలుసుకొనుటకు ఉపయోగించవలెను. ఇట్లు భగవత్తత్త్వమును తెలుసుకొనుట దుఃఖములేక యుండుటకే. అందుచేత ఆహారము గుఱించి చెప్పబడిన నియమములను పాటించవలెను).

  3. తినిన ఆహారము శరీరములో మూడువిధములుగా మారును - ఆహారములోని కఠినపదార్థము మలరూపముగా శరీరమునుండి పైకిపోవును; దానిలోని మధ్యభాగము - మాంసము మొదలగువాటిగను, సూక్ష్మభాగము మనస్సుగను మారును. ఇట్లే ఆహారములోని జలము మూత్రముగను, రక్తముగను, ప్రాణముగను మారును. నెయ్యి మొదలగునవి వేడిమిని, శక్తిని కలిగించునవి అయిన అస్థి, మజ్జా వాక్కు రూపముగా మారును.

Transliteration
  1. āhriyatē iti ahāraṃ - annaṃ, tattaddravyāṇi pratīyaṃtē.

(āhariṃcabaḍunadi āhāramu - annamu, aṭuvaṃṭi dravyamulu).

  1. “iṃdriyaiḥ viṣayāṇāṃ āharaṇaṃ grahaṇaṃ āhāraḥ” (śrīdharīyavyākhyā)

(iṃdriyamulacēṭa vāṭi vāṭi viṣayamulanu āhariṃcuṭa, grahiṃcuṭa).

  1. āharaṃti rasamasmādityāhāraḥ -

(dīniyaṃdu, dīnilōni rasamunu āhariṃcedaru, grahiṃcedaru. aṃducēta āhāramani ceppabaḍinadi).

  1. rasyāḥ rasōpētāḥ āhārāḥ snēhavaṃtaḥ, dēhē cirakālasthā yinaḥ | sthirapariṇāmāḥ, sātvikāhārāḥ.

(rasamutōkūḍina āhāramu - eṃḍipōka, vāḍipōkayuṃḍunavi, pakvamunaku vaccinavi, cirakālamu śarīramulō uṃḍunavi sātvikāhāramulu - ārōgyakaramainavi).

  1. “āhārōpi sarvasya ptāṇi jātasya satvādi triguṇatayā svayēna trividhaḥ priyōbhavati” (śrīrāmānujaḥ)

(samastamaina prāṇulaku āhāramu satvarajastamōguṇamulatō kūḍiyuṃḍuṭacēta mūḍu vidhamulu - sātvikāhāramu, rājasāhāramu, tāmasāhāramu).

  1. “rasyannigdāduṣu āhāra viśēṣu ātmanaḥ prītyati rēkēṇa liṃgēna sātvikatvaṃ, rājasatvaṃ tāmasatvaṃca buddhyā rājastamō liṃgānāṃ āhārāṇāṃ parivarjanārthaṃ satva liṃgānāṃ ca upādānārthaṃ” (śrīśaṃkaraḥ)

(rasamukūḍiyunna āhāraviśēṣamulaṃdu ātma prītinanusariṃci mūḍu vidhamulu - sātvikamulu. rājasamulu. tāmasamulu. vāṭilō rājasāhāramunu tāmasāhāramunu vadali sātvikāhāramunu sēviṃcavalenu).

  1. “hitaṃ mēdhyaṃ mitaṃ yasya bhōjanaṃ prāṇadhāraṇaṃ”

(iṣṭamainadi, mitamainadi ayina āhāramu prāṇavāyuvu śarīramulō dāni vṛttini cēyuṭaku upakariṃcunu - parimitamukāni āhāramu vāyuvṛttiki aḍḍutagulunu).

  1. āyurvivarthanatvādiyaḥ āhāraguṇāḥ.

(āyurdāyamunu vṛddhicēyuṭa modalagunavi āhāraguṇamulu - āhāramunu baṭṭi ārōgyamu, ārōgyamunubaṭṭi āyurdāyamu kalugunu).

  1. “urvināhāra dōṣaṃ ce vijñāna nāśaṃbunaku mūlaṃbu” (śrīnādhuḍu - kāśīkhaṃḍamu)

  2. “āhāra śuddhau satva śuddhiḥ, satva śuddhau dhṛvāsmṛtiḥ |

smṛtilābhē sarvagraṃdhīnāṃ vipramōkṣaṃ ||” (cāṃdōgyōpaniṣat)

- iti jñāna sākṣātkāra rūpaḥ jñānaṃ āhāra śuddhyāyattaṃ śrūya tē “.

(śuddhamaina āhāramu tinuṭavalana satvamu - satvaguṇamu vṛddhiyagunu - satvaguṇamu vṛddhi yaguṭavalana smṛti sthiramugānuṃḍunu. dānivalana śarīramulōni graṃdhulanniyu viḍipōvunu - śarīramulōni aḍḍulanniyu vadalipōvuṭavalana śarīramu ārōgyavaṃtamugā nuṃḍunu - ī vidhamugā śruticeppuṭavalana ātmasākṣātkāramunaku kāvalasina jñānamu kalugunu - “jñānē naivatu kaivalyaṃ” - (brahmajñānamu kaluguṭavalananē mōkṣamu ani ceppabaḍinadi kanuka śuddhamaina āhāramu valananē brahmajñānamu, dānivalana mōkṣamu kalugunu).

“āhāraśuddhau satvaśuddhiḥ, satva śuddhau dhṛvā smṛtiḥ |

smṛtilābhāt duḥkhanāśastataḥ citta prasannatā ||“.

iti manōsthairyasya āhārādi niyamapūrvakatvēna uktaṃ.

(āhāramuvalana satvaśuddhi, dānivalana smṛti sthiramugānuṃḍunu - niścalabuddhi kalugunu - aṃduvalana duḥkhamu naśiṃcunu, dānivalana manassu nirmalamagunu).

  1. “annamayaṃ hi sēmya ! manaḥ”.

(manassu annamayamu - tinina āhāramunu baṭṭi manassu pravartiṃcunu - triguṇamulugala āhāramu vāṭivāṭi guṇamulanu kalugacēyunu - manasudvārā pravartiṃpacēyunu). (Tell me what you eat and I will tell you what you are) (Savarin?)

  1. “annēna kukṣērdvā vaṃśau pānē naikaṃ prapūrayēt |

āśrayaṃ pavanādīnāṃ caturtha mava śēṣa yēt ||“. (cikitsāsārasaṃgrahamu)

(kaḍupu nālugu bhāgamuluga cēsukoni aṃdulō reṃḍu bhāgamulanu annamutō niṃpavalayunu, okabhāgamu nīrutō niṃpavalayunu. migilinabhāgamu vāyuvu saṃcariṃcuṭaku vīlugā - ucchvāsa niśvāsamulaku - vadalivēyavalenu).

  1. “atimātraḥ punaḥ sarvānāśu dōṣān prakōpayēt”. (cikitsāsārasaṃgrahamu)

(mikkili adhikamugā bhujiṃcinayaḍala sakalarōgamulanu marala udriktamugā cēyunu).

  1. “bhōjanaṃ hīnamātraṃ tu na balōpacayē jasē |

sarvēṣāṃ vātarōgāṇāṃ hētutāṃ ca prapadyatē ||“. (cikitsāsārasaṃgrahamu)

(ati takkuvagā bhōjanamu cēyuṭavalana, balamu takkuva yaguṭayē kāka vāta rōgamulanu puṭṭiṃcunu).

  1. “bhōjanakālē ādāvaṃtēca dravabhūtaṃ grāhyaṃ, madhyē kaṭhinaṃ” iti viṣṇupurāṇē -

(bhōjanamu cēyunapuḍu bhōjanamunaku muṃdu, tarvāta dravapadārthamu - nīru vaṃṭidi - palacanidi - tīsukōvalenu - madhyanu gaṭṭi padārthāmu tīsukonavalenu -).

  1. “nātyaśnatastu yōgōsti nacaikāṃtamanaśnataḥ |”

“yuktāhāra vihārasya yōgō bhavati duḥkhahā ||”. (śrīmadbhagavadgīta - 6 - 16, 17)

“yōgā bhyāsaika niṣṭhasya prāhā hārādi saṃ yamaṃ |

bhuktaṃ su jjīryati svasya yadannaṃ dēha dhāraṇaṃ |

tadātma saṃ mitaṃ jñēyaṃ tada tikramya lōbhataḥ |

adhikaṃ cāśnatō nāsti yōgō (a)jīrṇādi dōṣataḥ |

atyalpāhāratō nāsti nāstyanāhārataḥ sa ca |

adhavā yōgaśāstrōkta māhāraṃ naiva laṃgha yēt ||“. (gītābhāvaprakāśamu - 6 - 74 to 78)

(yōgabhyāsamu cēyuṭayaṃdu niṣṭhagalavāniki āhāraviṣayamai niyamamu ī kriṃda vidhamugā ceppabaḍinadi :- dēhamunu dhariṃciyuṃḍuṭaku - anagā, jīviṃciyuṃḍuṭaku - kāvalaisinaṃta annamē tininayaḍala adi bāgugā jīrṇamagunu - idi śarīramunaku anuguṇamainadi. āhāralōbhamuvalana āhāramulōni ruciki āsiṃci iṃtaku miṃci āhāramu tininayaḍala adi ajīrṇamunaku - aragakuṃḍuṭaku - kāraṇamaguṭavalana ā prakāramu āhāramu tininayaḍala adiyōgābhyāsamunaku panikirādu - ajīrṇamuvalla anēkavyādhulu utpannamai śarīramunu yōgābhyāsamunaku taginasthitilō lēnaṭlu cēyunu, ēkāṃta manasu kudaradu. ā prakāramugānē mikkili takkuva āhāramu tininanū, āhāramu tinuṭayē mānivasinanu, śarīrasvasthatalēka yōgābhyāsamunaku śarīramu taginaṭluṃḍadu. yōgābhyāsamu cēyuvāḍu yōgaśāstramulō ceppina prakāramu āhāramu tinavalenu. kaḍupulōni nālugu vaṃtulalōnu reṃḍuvaṃtulu - anagā kaḍupulōsagamu āhāramutō niṃpavalenu - okavaṃtu nīṭitō niṃpavalenu - migilinavaṃtu - nālugavavaṃtu kāḷīgā uṃcavalenu. iṭlu cēyuṭavalana vāyuvu śarīramulōniki pōyi marala paiki vaccunapuḍu āyāsamu lēkuṃḍuṭaku sahakariṃcunu. paina ceppina prakāramugā āhāra niyamamulu pāṭiṃcuvāniki yōgābhyāsamu kaṣṭamulēkuṃḍunaṭlu cēyunu. aṭṭivāni yōgamu duḥkhamunu pōgoṭṭunu).

  1. “ahastāni sahastānā mapadāni catuṣpadāṃ |

phalgūni tatramahatāṃ jīvō jīvasya jīvanaṃ ||“. (śrīmadbhāgavataṃ 1 - 13 - 47)

(cētulunnavāṭiki cētulu lēniviyu, kāḷḷunnavāṭiki kāḷḷu lēniviyu, peddavāṭiki cinnaviyu, ī prakāramugā oka jīviki iṃkokajīvi āhāramagucunnadi. (cūḍumu - “ātma - 5.1.5”). (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 13 - 288)

  1. “atrāhārārthaṃ karmakuryādaniṃdyaṃ, kuryādāhāraṃ prāṇa saṃdhāraṇārthaṃ, prāṇāḥ saṃdhāryāstatva jijñāsanārthaṃ, tatvaṃ jijñāsyaṃ yēna bhūyō na duḥkhaṃ”. (gītābhāvaprakāśamu - 6- 82)

  2. (āhāramukoṟaku niṃdyamukāni karma cēyavalayunu. aṭlu saṃpādiṃcina āhāramu prāṇamulanu boṃdilō nuṃcukonuṭaku - uṃcukonuṭaku cālinaṃtē - tinavalenu. ā prakāramu śarīra dhāraṇakupayōgiṃcu prāṇamulanu bhagavattattvamunu telusukonuṭaku upayōgiṃcavalenu. iṭlu bhagavattattvamunu telusukonuṭa duḥkhamulēka yuṃḍuṭakē. aṃducēta āhāramu guṟiṃci ceppabaḍina niyamamulanu pāṭiṃcavalenu).

  3. tinina āhāramu śarīramulō mūḍuvidhamulugā mārunu - āhāramulōni kaṭhinapadārthamu malarūpamugā śarīramunuṃḍi paikipōvunu; dānilōni madhyabhāgamu - māṃsamu modalaguvāṭiganu, sūkṣmabhāgamu manassuganu mārunu. iṭlē āhāramulōni jalamu mūtramuganu, raktamuganu, prāṇamuganu mārunu. neyyi modalagunavi vēḍimini, śaktini kaligiṃcunavi ayina asthi, majjā vākku rūpamugā mārunu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.