← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆజ్ఞాచక్రము ājñācakramu

Original — తెలుగు
  1. కనుబొమలనడుమను చక్రాకారముగానుండు - పద్మాకారముగనుండు - నాడీ సమూహము - దీనినేఅజ్ఞాకమలమనికూడ చెప్పుదురు.

  2. తన ఆజ్ఞను చెల్లించు చక్రముకనుక ఆజ్ఞాచక్రము.

  3. మనస్సునకు నెలవుకనుక మనస్సునకు సంబంధించిన సంకల్ప వికల్పములను రెండు దళములుగల పద్మాకారముగలది - ‘హం క్షం’ అను రెండు అక్షరములు గలది.

  4. తత్ చక్రే నిహిత చిత్తస్య పురుషస్య సర్వపదార్థ సాక్షాత్కారేణ ఏవం భూతం ఏవం వర్తతే ఏవం భవిష్య తీతి జ్ఞానేన ఆజ్ఞయా ఇతః పరం త్వయా ఏదం కర్తవ్యం ఇతి పరమేశ్వరా జ్ఞాయాః సంక్రమణం భవతి, తేన హేతునా తదా జ్ఞాచక్రమతి కీర్తితం.

(ఈ చక్రస్థానములో మనసు నిలిపి పరమాత్మను ధ్యానించువానికి సమస్త పదార్థములు సాక్షాత్కరించుటచేత - ఈ ప్రకారముగా ఉండెడిది, ఈ ప్రకారముగా ఇప్పుడు ఉన్నది, ఈ ప్రకారముగా ముందు ఉండును అను భూతభవిష్యత్వర్తమాన కాలముల జ్ఞానము కలుగుటవలన ఇటుపైన నీవు ఈ ప్రకారము వర్తించవలెను అని పరమేశ్వరుని ఆజ్ఞ కలుగును. అందుచేత ఇది ఆజ్ఞాచక్రమని చెప్పబడినది).

“ప్రయాణకాలే మనసా చలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ |

భృవోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ స తం పురుషముపైతి దివ్యం’ ||“. (శ్రీమద్భగవద్గీత - 8 - 10)

(ఆదౌహృది వశీకృత్య తతో భూమి జయక్రమాత్ |

సుషుమ్నయోర్థ్వగామిన్యా నాఢ్యా (ఆ) చార్యోక్త మార్గతః |

స్థాపయిత్వాత్మనః ప్రాణమాజ్ఞా చక్రే సమాహితః |

బ్రహ్మరంధ్రాత్స ఉత్క్రమ్యో పాసకస్తం స్వ చింతితం |

కలిం పురాణ మిత్యాది లక్షణం పురుషం పరం |

జ్యోతనాత్మక మీశాన మద్భుతం ప్రతి పద్యతే || (గీతాభావప్రకాశము - 8 - 73 to 75)

(మొదట హృదయమును తనవశములో నుంచుకొని, ఆసనమును స్థిరపఱచుకొని, తర్వాత మూలాధారమునుండి బ్రహ్మరంధ్రమువఱకు పోవు సుషుమ్నానాడి ద్వారా, గురువు చెప్పిన ప్రకారముగా, ప్రాణమును ఆజ్ఞాచక్రమునకు తీసుకొనివచ్చి, నిలిపి, బ్రహ్మరంధ్రమునుండి వెలుపలకు ఉత్క్రమించి ప్రాణము బ్రహ్మరంధ్రముద్వారా వెడలిపోవునట్లు చేయగలిగిన ఉపాసకుడు, - నిర్గుణోపాసకుడు, తాను ధ్యానించుచున్న కవి, పురాణపురుషుడు, దివ్యుడు మొదలగు లక్షణములుగల పరంజ్యోతిస్స్వరూపమైన ఈశ్వరుని - పరబ్రహ్మను - పొందును), (ఈ ఆజ్ఞాచక్రము కనుబొమలకును. నాసికకు సంధి - దీనినే అవిముక్తము త్రికూటము అని చెప్పుదురు). (చూడుము - ‘అవిముక్తము’, వారణాసీ’).

  1. దీని అధిదేవత పరబ్రహ్మ.

“శ్లో ||. భ్రూమధ్యే నిగమాగమోజ్వలపదే త్రిమార్గాంతరే |

- - - సుషుమ్నోన్ముఖే |

ఆసీనం - - రామ భజే శ్యామలా ||“. (శ్రీరామకర్ణామృతం - 2 - 58)

(కనుబొమల మద్ఝ్యను, మూడుమార్గములమధ్యను - అనగా, కనుబొమలు, ముక్కు, అను ఈ మూడు కలసి యుండు ప్రదేశమునందు - సుషుమ్నానాడికి ఉన్ముఖమైయున్నచోట ఆసీనుడైయున్న శ్రీరామచంద్ర పరబ్రహ్మను భజించెదను).

Transliteration
  1. kanubomalanaḍumanu cakrākāramugānuṃḍu - padmākāramuganuṃḍu - nāḍī samūhamu - dīninēajñākamalamanikūḍa ceppuduru.

  2. tana ājñanu celliṃcu cakramukanuka ājñācakramu.

  3. manassunaku nelavukanuka manassunaku saṃbaṃdhiṃcina saṃkalpa vikalpamulanu reṃḍu daḷamulugala padmākāramugaladi - ‘haṃ kṣaṃ’ anu reṃḍu akṣaramulu galadi.

  4. tat cakrē nihita cittasya puruṣasya sarvapadārtha sākṣātkārēṇa ēvaṃ bhūtaṃ ēvaṃ vartatē ēvaṃ bhaviṣya tīti jñānēna ājñayā itaḥ paraṃ tvayā ēdaṃ kartavyaṃ iti paramēśvarā jñāyāḥ saṃkramaṇaṃ bhavati, tēna hētunā tadā jñācakramati kīrtitaṃ.

(ī cakrasthānamulō manasu nilipi paramātmanu dhyāniṃcuvāniki samasta padārthamulu sākṣātkariṃcuṭacēta - ī prakāramugā uṃḍeḍidi, ī prakāramugā ippuḍu unnadi, ī prakāramugā muṃdu uṃḍunu anu bhūtabhaviṣyatvartamāna kālamula jñānamu kaluguṭavalana iṭupaina nīvu ī prakāramu vartiṃcavalenu ani paramēśvaruni ājña kalugunu. aṃducēta idi ājñācakramani ceppabaḍinadi).

“prayāṇakālē manasā calēna bhaktyā yuktō yōgabalēna caiva |

bhṛvōrmadhyē prāṇamāvēśya samyak sa taṃ puruṣamupaiti divyaṃ’ ||“. (śrīmadbhagavadgīta - 8 - 10)

(ādauhṛdi vaśīkṛtya tatō bhūmi jayakramāt |

suṣumnayōrthvagāminyā nāḍhyā (ā) cāryōkta mārgataḥ |

sthāpayitvātmanaḥ prāṇamājñā cakrē samāhitaḥ |

brahmaraṃdhrātsa utkramyō pāsakastaṃ sva ciṃtitaṃ |

kaliṃ purāṇa mityādi lakṣaṇaṃ puruṣaṃ paraṃ |

jyōtanātmaka mīśāna madbhutaṃ prati padyatē || (gītābhāvaprakāśamu - 8 - 73 to 75)

(modaṭa hṛdayamunu tanavaśamulō nuṃcukoni, āsanamunu sthirapaṟacukoni, tarvāta mūlādhāramunuṃḍi brahmaraṃdhramuvaṟaku pōvu suṣumnānāḍi dvārā, guruvu ceppina prakāramugā, prāṇamunu ājñācakramunaku tīsukonivacci, nilipi, brahmaraṃdhramunuṃḍi velupalaku utkramiṃci prāṇamu brahmaraṃdhramudvārā veḍalipōvunaṭlu cēyagaligina upāsakuḍu, - nirguṇōpāsakuḍu, tānu dhyāniṃcucunna kavi, purāṇapuruṣuḍu, divyuḍu modalagu lakṣaṇamulugala paraṃjyōtissvarūpamaina īśvaruni - parabrahmanu - poṃdunu), (ī ājñācakramu kanubomalakunu. nāsikaku saṃdhi - dīninē avimuktamu trikūṭamu ani ceppuduru). (cūḍumu - ‘avimuktamu’, vāraṇāsī’).

  1. dīni adhidēvata parabrahma.

“ślō ||. bhrūmadhyē nigamāgamōjvalapadē trimārgāṃtarē |

- - - suṣumnōnmukhē |

āsīnaṃ - - rāma bhajē śyāmalā ||“. (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 58)

(kanubomala madjhyanu, mūḍumārgamulamadhyanu - anagā, kanubomalu, mukku, anu ī mūḍu kalasi yuṃḍu pradēśamunaṃdu - suṣumnānāḍiki unmukhamaiyunnacōṭa āsīnuḍaiyunna śrīrāmacaṃdra parabrahmanu bhajiṃcedanu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.