← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆకాశము ākāśamu

Original — తెలుగు
  1. ఆకాశోనామ శబ్దగుణో అవకాశకరో మూర్త ద్రవ్యాణాం.

(మూర్తులకు, ద్రవ్యములకు ఉండుటకు అవకాశము - చోటు - ఇచ్చునది, ఆకాశము; శబ్దము గుణముగా కలది).

(” ఆకాశంబు సకల జనంబులకు నవకాశంబిచ్చు“) (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 29 -)

  1. మూర్త ద్రవ్యాశ్రయత్వం హ్యాకాశస్య కార్యం - స్థూలాశ్రయో అవకాశః; సూక్ష్మాశ్రయః ఛిద్రం; పరమాణ్వాశ్రయః సుషిఠః.

(ఆకాశముయొక్క కార్యము - అకాశము చేయుపని - మూర్తులకు, ద్రవ్యములకు ఆశ్రయమిచ్చుట - ఉండుటకు అవకాశమిచ్చుట. ఆశ్రయము మూడు విధములు - స్థూలాశ్రయము - ఆవకాశము; సూక్ష్మాశ్రయము ఛిద్రము -, పరమాశ్రయము సుషిరము; అనగా, స్థూలవస్తువులకు ఆశ్రయమిచ్చునది - అవకాశము; సూక్ష్మరూపములోనుండు వస్తువులకు ఆశ్రయమిచ్చునది- ఛిద్రం; కన్నము ఖాళీ జాగా, పరమాణువులవలె అతిసూక్ష్మములైనవాటికి ఆశ్రయమిచ్చునది సుషిరము - అని చెప్పబడినది –

“తస్యాంతే సిషిరం సూక్ష్మం తస్మిస్సర్వం ప్రతిష్ఠితం” - (మంత్రపుష్పం)

(హృదయములోపల సూక్ష్మాతి సూక్ష్మమైన సుషిరము ఉన్నది - సూక్ష్మరూపములో కనబడకయుండు రూపములో ఒక రంధ్రము, లేక గొట్టమువలెనుండు ఖాళీస్థలము ఉన్న. అందులోనే సర్వము, అంతయు, ప్రతిష్టింపబడియున్నది).

  1. యత్ సుషిరం తదాకాశం - (సుషిరమని చెప్పబడినదే ఆకాశము) - (చూడుము - 2).

  2. ఆసమం తాత్ కాశతే ప్రకాశతే ఇత్యాకాశః - పరిపూర్ణ ప్రకాశరూపం - ఇత్యర్థః -

(ఆ = అంతటా, కాశతే = ప్రకాశించునది - అంతటా అన్నింటిలోను ప్రకాశించునది కనుక ఆకాశమనిచెప్పబడినది - పూర్తిగా ప్రకాశరూపమైనది - జ్యోతి స్వరూపము - జ్యోతిర్మయము) - “తేజోమయం” (శ్రీమద్భగవద్గీత - 11 - 47)

  1. “ఆసమంతాత్ కాశతే దీప్యత్య ఇతి ఆకాశః స్వయం జ్యోతిషి బ్రహ్మణి ఆకాశ శబ్దస్య విభుత్వ లక్షణతో వా ప్రసిద్ధః”.

(అంతటను ప్రకాశించునది కనుక ఆకాశము. అందుచేత స్వయంజ్యోతి - తనంతట తానే ప్రకాశించునది - అగు బ్రహ్మముకూడా, అన్నిటిమీద విభుత్వముకలిగియుండుటచేత, ఆకాశము అన్నమాటచే చెప్పబడుచున్నాడు).

  1. “ఆకాశతే స్వస్మైప్రకాశతే, ఆకాశయతి అన్యం ప్రకాశయతి స్వాత్మనే ఇతి చ ఉత్పత్యా పరమాత్మ పరో అయం ఆకాశ శబ్దః ఇతి”.

(తాను స్వయముగా ప్రకాశించును, తనయందు ఉన్న ఇతర వస్తువులను ప్రకాశింపచేయును. అందుచేతఆకాశము అని చెప్పబడినది అను ఉత్పత్యర్థమువలన ఆకాశమనగా పరమాత్మయని కూడ అర్థమగుచున్నది - ఆకాశము - ఆకాశము అను మాట పరమాత్మపరము అని వాడబడుచున్నది).

“వియద్యా బ్రహ్మవా (ఆ)కారో వైనామేతి శ్రుతం వియత్ |

అవకాశ ప్రదానేన సర్వ నిర్వాహకత్వతః |

బ్రహ్మ స్యాద్వాక్య శేషేచ బ్రహ్మాత్మేత్యాది శబ్ద తః ||“.

(వియత్ అనగా ఆకాశము అని, బ్రహ్మ అని చెప్పబడినది. అన్నింటికీ ఉండుటకు అవకాశము నిచ్చుటచేతను, అన్నింటినీ నిర్వహించుటచేత ఆకాశమనిన్నీ, వాక్య శేషమునుబట్టి - ఇక్కడ సందర్భమునుబట్టి బ్రహ్మ అనియు చెప్పబడును).

  1. ఆకాశస్యమాత్రా గుణః అసాధారణీభూతో గుణః శబ్దః.

(ఆకాశము యొక్క సూక్ష్మ అసాధారణగుణముశబ్దము).

  1. శబ్దగుణమాకాశం; తచ్చైకం, విభూ నిత్యం.

(తచ్చైకం = విభాజక ధర్మద్వయ శూన్యం; విభుత్వం = సర్వ మూర్త ద్రవ్య సం యోగిత్వం, మూర్తత్వంచ = క్రియాశ్రయత్వం - విభుః సర్వమూర్తిద్రవ్య సం యోగీత్యర్థః).

(శబ్దము గుణముగా గలది ఆకాశము. అది ఏకము, ఒకటే - అనగా, విభజించుటకు వీలగు ధర్మము (గుణము) లేనిది - విభజించుటకు వీలుకానిది - సముద్రములోని నీరు అంతా ఒకటే - ఎందులో ఉన్నా ఆకాశము అనునది ఒకటే. రూపముగల సమస్త వస్తువులను దగ్గరకు ఆకర్షించి ఒకదానితో నొకటినికూర్చగల శక్తి కలది - అందుచేతనే ప్రభువు - వాటిమీదనిట్టి ప్రభుత్వముకలది. ఆకాశమునుండియే మిగిలిన భూతములు పుట్టినవి - వాటి సం యోగమువలననే ప్రపంచములోని వస్తువులన్నియు పుట్టినవి,

  1. ఆకాశస్యైవ చైతన్యస్యాపి చతుర్విధో భేదః - యథా ఏకస్యైదాకాశస్య ఘటాకాశః, జలాకాశః మేఘాకాశః, మహాకాశః ఇతి చతుర్విధ భేదో అస్తి. తథా ఏకస్యైవ చైతన్యస్య కూటస్థః, జీవః, ఈశ్వరః, బ్రహ్మా చ భేద చతుష్టయమస్తి“.

(ఆకాశమువలెనే పరబ్రహ్మ కూడ నాలుగు విధములు - అకాశము ఒకటే అయినను ఘటాకాశము, జలాకాశము, మేఘాకాశము, మహాకాశము అని నాలుగు విధములుగ నున్నది.ఆ ప్రకారముగానే చైతన్యమనునది - పరబ్రహ్మ అనునది ఒకటే అయినను కూటస్థుడు, జీవుడు, ఈశ్వరుడు, పరబ్రహ్మ అని నాలుగు విధములుగా గ్రహింప బడుచున్నాడు).

“ఆకాశాహిత్రయో, రామ, విద్యంతే వితతాం తరాః |

చిత్తాకాశశ్చిదాశో భూతాకాశస్తృతీయకః ||“. (యోగవాశిష్టము)

(ఆకాశము మూడు విధములుగ తెలియబడుచున్నది - చిత్తాకాశము, చిదాకాశము, భూతాకాశము - సర్వభూతములందు వ్యాపించియుండినది చిదాకాశము, జీవుల వ్యాపరములకు కారణమైనది చిత్తకాశము, దిక్కులలో వ్యాపించియున్నది భూతాకాశము).

  1. స్వయముగా ప్రకాశించునది, అంతటినీ ప్రకాశింపచేయునది అన్నింటిలోను వ్యాపించియుండు భగవత్తత్వమే ఆకాశము.

  2. “కాలము యొక్క అస్తిత్వమే ఆకాశము. ఆకాశముయొక్క విస్తీర్ణమే వాయువు” (బ్రహ్మవిద్యా సుధార్ణవము)

  3. “ఆకాశవత్స్దర్వగతశ్చ నిత్యః”.

(ఆకాశమువలె అన్నింటిలోను ప్రవేశించియుండువాడు - బ్రహ్మ) - దీనిని బట్టి ఆకాశము అన్నింటిలోను ప్రవేశించి యున్నది)

  1. పంచభూతములలోను ప్రతిభూతమునకును అధిదేవతయున్నది. ఆకాశమునకు సదాశివుడు అధిదేవత -

“పృధివ్యాం బ్రహ్మ, జలేవిష్ణుస్తతో రుద్రో హుతాశనే |

ఈశ్వరః పవనే. తస్మిన్ ఆకాశే (అ) స్మిన్ సదాశివః ||“.

  1. సృష్టి క్రమములో ఆకాశము గుఱించి ఈ క్రిందవిధముగా చెప్పబడినది : -

  2. “ద్రవ్య శక్తి శబ్ద నాచ్యాత్ తామసాహంకారాత్ అపి భూతాదిః పంచభూతానాం ఆదిః ఆదికరణీభూతం నభః ఆకాశః అభూత్”.

(ద్రవ్య శక్తియను తామసాహంకారమువలన భూతములకు కారణమైనటువంటిన్నీ, పంచభూతములలోమొదటిది అయినటువంటిన్నీ, కారణవస్తువులలో మొదటిది అయినటువంటిన్నీ ఆకాశము పుట్టెను).

  1. “తామసాహంకారాత్ ప్రధమం శబ్దో భవతి. నతు తస్య నభసః మాత్రా సూక్ష్మరూపం, శబ్ద ద్వారా నభః ఉత్పద్యతే, ఏవ మేవ స్పర్శాదిషు అపి ద్రష్టవ్యం”.

(తామసాహంకారమునుండి మొదట శబ్దము పుట్టినది. ఆ శబ్దము ఆకాశమంత, సూక్ష్మరూపము, శబ్దముద్వారా ఆకాశము పుట్టును. ఈ ప్రకారముగానే స్పర్శము మొదలగువాటి గుఱించి తెలుసుకొనవలెను - అనగా, స్పర్శమునుండి వాయువు - వాయువుయొక్క సూక్ష్మరూపము స్పర్శ. ఈ ప్రకారముగానే పంచభూతములలోను మిగిలిన భూతములగుఱించి తెలుసుకొనవలెను).

    1. “భగవత్ప్రేరితంబైన తామసాహంకారంబువలన శబ్ద తన్మాత్రంబు పుట్టె. దానివలన నాకాశంబును నాకాశంబువలన శ్రోత్రేంద్రియంబును బుట్టె. శ్రోత్రంబు శబ్దగ్రాహి య య్యె. శబ్దంబర్ధంబునకు నాశ్రయంబై శ్రోతకు జ్ఞానజనకంబయ్యె. మఱియు శబ్ద తన్మాత్రంబువలన నాకాశంబయి యా యాకాశంబు భూతంబులకు బాహ్యాభ్యంతరంబుల నవకాశం బిచ్చుటయు, నాత్మ ప్రాణేంద్రియాదులకు నాశ్రయంబగుటయు నను లక్షణంబులు గలిగియుండు. కాలగతిచే వికారంబునొందు. శబ్ద తన్మాత్రలక్షణంబగు నభంబువలన స్పర్శంబును, స్పర్శంబువలన వాయువును బుట్టె”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 6 -)

    2. తాను సాహంకారముబు వలన శబ్ద స్పర్శరూప రసగంధంబులుదయించె. అందుశబ్దంబు నిజగుణము వలన నాకాశంబు బుట్టించె. గగనంబు గాలమాన యోగంబునం బుండరీకాక్షు నిరీక్షణంబున స్పర్శతన్మాత్రంబువలన వాయువుం గలిగించె“.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 5 - 202)

(పైన చెప్పిన (1), (2) ప్రకారము మాయా శక్తితోకూడియున్న పరమాత్మలోనుండి మహత్తత్త్వము, మహత్తత్త్వములోనుండి అహంకారము, అహంకారములోనుండి ఆకాశము పుట్టినదని తెలియవచ్చుచున్నది. కానిశ్రుతిలో కొన్నిచోట్ల పరమాత్మనుండియే ఆలాశము పుట్టినది అని చెప్పబడినది –

“తస్మాద్వా ఏతస్మాదాత్మనాకాశస్సంభూతః” (తైతిరీయోపనిషత్ -2 - 1)

(ఆత్మనుండే, పరమాత్మనుండే ఆకాశము పుట్టినది). ఈ ప్రకారము చెప్పినప్పటికీ సృష్టిక్రమము పరమాత్మనుండి మహత్తత్త్వము, మహత్తత్త్వములోనుండి అహంకారము, అహంకారములోనుండి పైన ఆకాశము అనిపైమ 13,14 లో చెప్పిన ప్రకారముగానే అని అన్వయించుకోవలెను.)

  1. “సర్వాణి హవా ఇమాని భూతాని ఆకాశదేవ సముత్పర్యంతే ఆకాశం ప్రత్యస్తమ్యాంతి” (చాందోగ్యోపనిషత్ 1 - 9 - 1)

(ఆకాశములోనుండి సర్వభూతములు పుట్టుచున్నవి, ఆకాశములోనే లీనమగుచున్నవి. ఈ ప్రకారముగా చెప్పుటచేత ఆకాశమే జగత్కారణమని స్ఫురించును. ఆకాశము తర్వాత పుట్టిన తత్వములన్నియు ఒకదానిలోనుండి ఒకటిగా పుట్టినవి -

“ఆకాశాద్వాయుః, వాయోరగ్బిః, అగ్నేరాపః, అభ్యః పృధివీ”.

(ఆకాశములోనుండి వాయువు, వాయువులోనుండి అగ్ని, అగ్నినుండి జలము, జలమునుండి భూమి పుట్టినవి అని చెప్పబడియున్నది. ఈ పంచభూతముల మేళనము వలననే మిగిలిన చరాచరవస్తుజాతమంతయు పుట్టినది. ఇందువలన ఆకాశమే జగత్తు అంతటికీ పుట్టుటకు కారణమనికాదు. అందుచేత మాయతోకూడిన పరమాత్మ, ప్రకృతితో కూడిన పరబ్రహ్మ జగత్తునకు మూలకారణము - ఆకాశమువలన భూతములు పరంపరగా పుట్టినవి. ఆకాశము పరబ్రహ్మమే అని చెప్పబడినది - “ఖం బ్రహ్మ” - జగత్తులోని వస్తువులన్నింటికి ఉండుటకు అవకాశమిచ్చునది ఆకాశము - అట్లే జగత్తులోని వస్తువులన్నియు స్థితిసమయములో భగవంతుని విశ్వరూపములో నున్నవి, విశ్వరూపములో భగవంతుడు ఆశ్రయమిచ్చెను - అట్లే ప్రళయకాలమందు తనలోనే సూక్ష్మరూపములో అవి అన్నియు ఉండునట్లు ఆశ్రయమిచ్చెను - అందుచేత భూతములన్నింటికి అతనే ఆశ్రయుడగుటచేతను, ఉండుతకు అవకాశము ఇచ్చుటచేతను, ఆకాశమనగా ఇచ్చట, - ఈ సందర్భములో - పరబ్రహ్మమనియే అర్థము. అందుచేత అన్నింటికీ మూలకారణమైన పరబ్రహ్మనుండియే భూతములన్నియు పుట్టుచున్నవని చెప్పవలసియున్నది. మఱియు –

“తత్రత్య ఆకాశ శబ్దః ఉపాశ్యబ్రహ్మ పరః ఉద్గథే ఆకాశశబ్ద వాచ్య బ్రహ్మ దృష్టః కర్తవ్యేత్యర్థః”

(ఈ సందర్భములో ఆకాశము అనుమాట ఉపాసించు బ్రహ్మగుఱించి చెప్పబడినది - ఆకాశమే బ్రహ్మ అని ఉపాసించవలెనని చెప్పబడినదని గ్రహించవలెను).

(పైన 19.2 లో “పుండరీకాక్షు నిరీక్షణంబున” అని చెప్పబడినది - ఒక తత్వములోనుండి ఇంకొక తత్వము పుట్టినపుడు భగవంతుని దానిలోనుండి ప్రేరేపించుటచేతనే అందులోనుండిమఱియొక వస్తువు పుట్టుటకు అవకాశము కలుగుచున్నది. భగవంతుని చిచ్ఛక్తియుండుటవలననే సృష్టి క్రమముగా జరుగుచున్నది. అది లేనిచో సృష్టి ఏనాడో ఆగిపోయియుండు (A dead body cannot brimg forth a child).

Transliteration
  1. ākāśōnāma śabdaguṇō avakāśakarō mūrta dravyāṇāṃ.

(mūrtulaku, dravyamulaku uṃḍuṭaku avakāśamu - cōṭu - iccunadi, ākāśamu; śabdamu guṇamugā kaladi).

(” ākāśaṃbu sakala janaṃbulaku navakāśaṃbiccu”) (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 29 -)

  1. mūrta dravyāśrayatvaṃ hyākāśasya kāryaṃ - sthūlāśrayō avakāśaḥ; sūkṣmāśrayaḥ chidraṃ; paramāṇvāśrayaḥ suṣiṭhaḥ.

(ākāśamuyokka kāryamu - akāśamu cēyupani - mūrtulaku, dravyamulaku āśrayamiccuṭa - uṃḍuṭaku avakāśamiccuṭa. āśrayamu mūḍu vidhamulu - sthūlāśrayamu - āvakāśamu; sūkṣmāśrayamu chidramu -, paramāśrayamu suṣiramu; anagā, sthūlavastuvulaku āśrayamiccunadi - avakāśamu; sūkṣmarūpamulōnuṃḍu vastuvulaku āśrayamiccunadi- chidraṃ; kannamu khāḷī jāgā, paramāṇuvulavale atisūkṣmamulainavāṭiki āśrayamiccunadi suṣiramu - ani ceppabaḍinadi –

“tasyāṃtē siṣiraṃ sūkṣmaṃ tasmissarvaṃ pratiṣṭhitaṃ” - (maṃtrapuṣpaṃ)

(hṛdayamulōpala sūkṣmāti sūkṣmamaina suṣiramu unnadi - sūkṣmarūpamulō kanabaḍakayuṃḍu rūpamulō oka raṃdhramu, lēka goṭṭamuvalenuṃḍu khāḷīsthalamu unna. aṃdulōnē sarvamu, aṃtayu, pratiṣṭiṃpabaḍiyunnadi).

  1. yat suṣiraṃ tadākāśaṃ - (suṣiramani ceppabaḍinadē ākāśamu) - (cūḍumu - 2).

  2. āsamaṃ tāt kāśatē prakāśatē ityākāśaḥ - paripūrṇa prakāśarūpaṃ - ityarthaḥ -

(ā = aṃtaṭā, kāśatē = prakāśiṃcunadi - aṃtaṭā anniṃṭilōnu prakāśiṃcunadi kanuka ākāśamaniceppabaḍinadi - pūrtigā prakāśarūpamainadi - jyōti svarūpamu - jyōtirmayamu) - “tējōmayaṃ” (śrīmadbhagavadgīta - 11 - 47)

  1. “āsamaṃtāt kāśatē dīpyatya iti ākāśaḥ svayaṃ jyōtiṣi brahmaṇi ākāśa śabdasya vibhutva lakṣaṇatō vā prasiddhaḥ”.

(aṃtaṭanu prakāśiṃcunadi kanuka ākāśamu. aṃducēta svayaṃjyōti - tanaṃtaṭa tānē prakāśiṃcunadi - agu brahmamukūḍā, anniṭimīda vibhutvamukaligiyuṃḍuṭacēta, ākāśamu annamāṭacē ceppabaḍucunnāḍu).

  1. “ākāśatē svasmaiprakāśatē, ākāśayati anyaṃ prakāśayati svātmanē iti ca utpatyā paramātma parō ayaṃ ākāśa śabdaḥ iti”.

(tānu svayamugā prakāśiṃcunu, tanayaṃdu unna itara vastuvulanu prakāśiṃpacēyunu. aṃducētaākāśamu ani ceppabaḍinadi anu utpatyarthamuvalana ākāśamanagā paramātmayani kūḍa arthamagucunnadi - ākāśamu - ākāśamu anu māṭa paramātmaparamu ani vāḍabaḍucunnadi).

“viyadyā brahmavā (ā)kārō vaināmēti śrutaṃ viyat |

avakāśa pradānēna sarva nirvāhakatvataḥ |

brahma syādvākya śēṣēca brahmātmētyādi śabda taḥ ||“.

(viyat anagā ākāśamu ani, brahma ani ceppabaḍinadi. anniṃṭikī uṃḍuṭaku avakāśamu niccuṭacētanu, anniṃṭinī nirvahiṃcuṭacēta ākāśamaninnī, vākya śēṣamunubaṭṭi - ikkaḍa saṃdarbhamunubaṭṭi brahma aniyu ceppabaḍunu).

  1. ākāśasyamātrā guṇaḥ asādhāraṇībhūtō guṇaḥ śabdaḥ.

(ākāśamu yokka sūkṣma asādhāraṇaguṇamuśabdamu).

  1. śabdaguṇamākāśaṃ; taccaikaṃ, vibhū nityaṃ.

(taccaikaṃ = vibhājaka dharmadvaya śūnyaṃ; vibhutvaṃ = sarva mūrta dravya saṃ yōgitvaṃ, mūrtatvaṃca = kriyāśrayatvaṃ - vibhuḥ sarvamūrtidravya saṃ yōgītyarthaḥ).

(śabdamu guṇamugā galadi ākāśamu. adi ēkamu, okaṭē - anagā, vibhajiṃcuṭaku vīlagu dharmamu (guṇamu) lēnidi - vibhajiṃcuṭaku vīlukānidi - samudramulōni nīru aṃtā okaṭē - eṃdulō unnā ākāśamu anunadi okaṭē. rūpamugala samasta vastuvulanu daggaraku ākarṣiṃci okadānitō nokaṭinikūrcagala śakti kaladi - aṃducētanē prabhuvu - vāṭimīdaniṭṭi prabhutvamukaladi. ākāśamunuṃḍiyē migilina bhūtamulu puṭṭinavi - vāṭi saṃ yōgamuvalananē prapaṃcamulōni vastuvulanniyu puṭṭinavi,

  1. ākāśasyaiva caitanyasyāpi caturvidhō bhēdaḥ - yathā ēkasyaidākāśasya ghaṭākāśaḥ, jalākāśaḥ mēghākāśaḥ, mahākāśaḥ iti caturvidha bhēdō asti. tathā ēkasyaiva caitanyasya kūṭasthaḥ, jīvaḥ, īśvaraḥ, brahmā ca bhēda catuṣṭayamasti”.

(ākāśamuvalenē parabrahma kūḍa nālugu vidhamulu - akāśamu okaṭē ayinanu ghaṭākāśamu, jalākāśamu, mēghākāśamu, mahākāśamu ani nālugu vidhamuluga nunnadi.ā prakāramugānē caitanyamanunadi - parabrahma anunadi okaṭē ayinanu kūṭasthuḍu, jīvuḍu, īśvaruḍu, parabrahma ani nālugu vidhamulugā grahiṃpa baḍucunnāḍu).

“ākāśāhitrayō, rāma, vidyaṃtē vitatāṃ tarāḥ |

cittākāśaścidāśō bhūtākāśastṛtīyakaḥ ||“. (yōgavāśiṣṭamu)

(ākāśamu mūḍu vidhamuluga teliyabaḍucunnadi - cittākāśamu, cidākāśamu, bhūtākāśamu - sarvabhūtamulaṃdu vyāpiṃciyuṃḍinadi cidākāśamu, jīvula vyāparamulaku kāraṇamainadi cittakāśamu, dikkulalō vyāpiṃciyunnadi bhūtākāśamu).

  1. svayamugā prakāśiṃcunadi, aṃtaṭinī prakāśiṃpacēyunadi anniṃṭilōnu vyāpiṃciyuṃḍu bhagavattatvamē ākāśamu.

  2. “kālamu yokka astitvamē ākāśamu. ākāśamuyokka vistīrṇamē vāyuvu” (brahmavidyā sudhārṇavamu)

  3. “ākāśavatsdarvagataśca nityaḥ”.

(ākāśamuvale anniṃṭilōnu pravēśiṃciyuṃḍuvāḍu - brahma) - dīnini baṭṭi ākāśamu anniṃṭilōnu pravēśiṃci yunnadi)

  1. paṃcabhūtamulalōnu pratibhūtamunakunu adhidēvatayunnadi. ākāśamunaku sadāśivuḍu adhidēvata -

“pṛdhivyāṃ brahma, jalēviṣṇustatō rudrō hutāśanē |

īśvaraḥ pavanē. tasmin ākāśē (a) smin sadāśivaḥ ||“.

  1. sṛṣṭi kramamulō ākāśamu guṟiṃci ī kriṃdavidhamugā ceppabaḍinadi : -

  2. “dravya śakti śabda nācyāt tāmasāhaṃkārāt api bhūtādiḥ paṃcabhūtānāṃ ādiḥ ādikaraṇībhūtaṃ nabhaḥ ākāśaḥ abhūt”.

(dravya śaktiyanu tāmasāhaṃkāramuvalana bhūtamulaku kāraṇamainaṭuvaṃṭinnī, paṃcabhūtamulalōmodaṭidi ayinaṭuvaṃṭinnī, kāraṇavastuvulalō modaṭidi ayinaṭuvaṃṭinnī ākāśamu puṭṭenu).

  1. “tāmasāhaṃkārāt pradhamaṃ śabdō bhavati. natu tasya nabhasaḥ mātrā sūkṣmarūpaṃ, śabda dvārā nabhaḥ utpadyatē, ēva mēva sparśādiṣu api draṣṭavyaṃ”.

(tāmasāhaṃkāramunuṃḍi modaṭa śabdamu puṭṭinadi. ā śabdamu ākāśamaṃta, sūkṣmarūpamu, śabdamudvārā ākāśamu puṭṭunu. ī prakāramugānē sparśamu modalaguvāṭi guṟiṃci telusukonavalenu - anagā, sparśamunuṃḍi vāyuvu - vāyuvuyokka sūkṣmarūpamu sparśa. ī prakāramugānē paṃcabhūtamulalōnu migilina bhūtamulaguṟiṃci telusukonavalenu).

    1. “bhagavatprēritaṃbaina tāmasāhaṃkāraṃbuvalana śabda tanmātraṃbu puṭṭe. dānivalana nākāśaṃbunu nākāśaṃbuvalana śrōtrēṃdriyaṃbunu buṭṭe. śrōtraṃbu śabdagrāhi ya yye. śabdaṃbardhaṃbunaku nāśrayaṃbai śrōtaku jñānajanakaṃbayye. maṟiyu śabda tanmātraṃbuvalana nākāśaṃbayi yā yākāśaṃbu bhūtaṃbulaku bāhyābhyaṃtaraṃbula navakāśaṃ biccuṭayu, nātma prāṇēṃdriyādulaku nāśrayaṃbaguṭayu nanu lakṣaṇaṃbulu galigiyuṃḍu. kālagaticē vikāraṃbunoṃdu. śabda tanmātralakṣaṇaṃbagu nabhaṃbuvalana sparśaṃbunu, sparśaṃbuvalana vāyuvunu buṭṭe”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 6 -)

    2. tānu sāhaṃkāramubu valana śabda sparśarūpa rasagaṃdhaṃbuludayiṃce. aṃduśabdaṃbu nijaguṇamu valana nākāśaṃbu buṭṭiṃce. gaganaṃbu gālamāna yōgaṃbunaṃ buṃḍarīkākṣu nirīkṣaṇaṃbuna sparśatanmātraṃbuvalana vāyuvuṃ galigiṃce”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 5 - 202)

(paina ceppina (1), (2) prakāramu māyā śaktitōkūḍiyunna paramātmalōnuṃḍi mahattattvamu, mahattattvamulōnuṃḍi ahaṃkāramu, ahaṃkāramulōnuṃḍi ākāśamu puṭṭinadani teliyavaccucunnadi. kāniśrutilō konnicōṭla paramātmanuṃḍiyē ālāśamu puṭṭinadi ani ceppabaḍinadi –

“tasmādvā ētasmādātmanākāśassaṃbhūtaḥ” (taitirīyōpaniṣat -2 - 1)

(ātmanuṃḍē, paramātmanuṃḍē ākāśamu puṭṭinadi). ī prakāramu ceppinappaṭikī sṛṣṭikramamu paramātmanuṃḍi mahattattvamu, mahattattvamulōnuṃḍi ahaṃkāramu, ahaṃkāramulōnuṃḍi paina ākāśamu anipaima 13,14 lō ceppina prakāramugānē ani anvayiṃcukōvalenu.)

  1. “sarvāṇi havā imāni bhūtāni ākāśadēva samutparyaṃtē ākāśaṃ pratyastamyāṃti” (cāṃdōgyōpaniṣat 1 - 9 - 1)

(ākāśamulōnuṃḍi sarvabhūtamulu puṭṭucunnavi, ākāśamulōnē līnamagucunnavi. ī prakāramugā ceppuṭacēta ākāśamē jagatkāraṇamani sphuriṃcunu. ākāśamu tarvāta puṭṭina tatvamulanniyu okadānilōnuṃḍi okaṭigā puṭṭinavi -

“ākāśādvāyuḥ, vāyōragbiḥ, agnērāpaḥ, abhyaḥ pṛdhivī”.

(ākāśamulōnuṃḍi vāyuvu, vāyuvulōnuṃḍi agni, agninuṃḍi jalamu, jalamunuṃḍi bhūmi puṭṭinavi ani ceppabaḍiyunnadi. ī paṃcabhūtamula mēḷanamu valananē migilina carācaravastujātamaṃtayu puṭṭinadi. iṃduvalana ākāśamē jagattu aṃtaṭikī puṭṭuṭaku kāraṇamanikādu. aṃducēta māyatōkūḍina paramātma, prakṛtitō kūḍina parabrahma jagattunaku mūlakāraṇamu - ākāśamuvalana bhūtamulu paraṃparagā puṭṭinavi. ākāśamu parabrahmamē ani ceppabaḍinadi - “khaṃ brahma” - jagattulōni vastuvulanniṃṭiki uṃḍuṭaku avakāśamiccunadi ākāśamu - aṭlē jagattulōni vastuvulanniyu sthitisamayamulō bhagavaṃtuni viśvarūpamulō nunnavi, viśvarūpamulō bhagavaṃtuḍu āśrayamiccenu - aṭlē praḷayakālamaṃdu tanalōnē sūkṣmarūpamulō avi anniyu uṃḍunaṭlu āśrayamiccenu - aṃducēta bhūtamulanniṃṭiki atanē āśrayuḍaguṭacētanu, uṃḍutaku avakāśamu iccuṭacētanu, ākāśamanagā iccaṭa, - ī saṃdarbhamulō - parabrahmamaniyē arthamu. aṃducēta anniṃṭikī mūlakāraṇamaina parabrahmanuṃḍiyē bhūtamulanniyu puṭṭucunnavani ceppavalasiyunnadi. maṟiyu –

“tatratya ākāśa śabdaḥ upāśyabrahma paraḥ udgathē ākāśaśabda vācya brahma dṛṣṭaḥ kartavyētyarthaḥ”

(ī saṃdarbhamulō ākāśamu anumāṭa upāsiṃcu brahmaguṟiṃci ceppabaḍinadi - ākāśamē brahma ani upāsiṃcavalenani ceppabaḍinadani grahiṃcavalenu).

(paina 19.2 lō “puṃḍarīkākṣu nirīkṣaṇaṃbuna” ani ceppabaḍinadi - oka tatvamulōnuṃḍi iṃkoka tatvamu puṭṭinapuḍu bhagavaṃtuni dānilōnuṃḍi prērēpiṃcuṭacētanē aṃdulōnuṃḍimaṟiyoka vastuvu puṭṭuṭaku avakāśamu kalugucunnadi. bhagavaṃtuni cicchaktiyuṃḍuṭavalananē sṛṣṭi kramamugā jarugucunnadi. adi lēnicō sṛṣṭi ēnāḍō āgipōyiyuṃḍu (A dead body cannot brimg forth a child).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.