← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆనందః ānaṃdaḥ

Original — తెలుగు
  1. సుఖాతిశయః. (అతిశయసుఖము, అత్యంత సుఖము కలది).

  2. దుఃఖ రాహిత్యరూపః (దుఃఖము లేకుండనుండు స్థితి - అది అయినవాడు).

  3. వృత్తిరాహిత్య స్వరూప స్థితి. (ఏ విధమైన వ్యాపారము లేకయుండు స్థితి గలవాడు).

  4. “ఆనందః స్వరూపమస్యేతి ఆనందః”. (శ్రీశంకరః)

(ఆనందమే స్వరూపముగా గలవాడు).

  1. సుఖ స్వరూపత్వాత్ ఆనందీ - సర్వ సంపత్ సమృద్ధత్వాత్ ఆనందీవా -

(సుఖమే స్వరూపముగా గలవాడగుటచేత ఆనందీ - లేక, అన్నివిధములైన సంపదలు సమృద్ధిగా కలిగియుండుటచేత ఆనందుడు).

  1. “నీవు పరిపూర్ణానంద స్వరూపుండవు” - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 24 - 701)

  2. పరమ ప్రేమాలంబనత్వేన ఉపలక్షితః, సర్వదుఃఖ వినిర్ముక్త సుఖ స్వరూపః.

(పరమ ప్రేమకు - ప్రేమీభక్తికి - పట్టుకొమ్మగా ఉపలక్షణముగా చెప్పబడిన ఏ విధమైన దుఃఖములు లేనటువంటి సుఖమే స్వరూపముగా గలవాడు).

  1. “ఆనందం నామ అంభసామర్ణవమివ సుఖచేతనానాం అధిష్ఠాన నిత్య శుద్ధా ఖండా ద్వైత చిదానందైక రసం ఆనందం”. (సర్వసారోపనిషత్)

నీటికి సముద్రగని అయినట్లు సకల జీవులకు వాటియందు అధిష్ఠించియుండు నిత్యుడు, శుద్ధుడు చైతన్యమూర్తి పరిపూర్ణుడు, అద్వైతుడు చిత్ అను ఆనందమొకటే రసముగా గలవాడు - శక్తిగా నుండువాడు గనుక ఆనందుడు, చిద్రూపుడు. ఒకే చిచ్ఛక్తిరూపమై అన్ని జీవులకు తన చిచ్ఛక్తినిచ్చువాడు)

  1. “ఆత్మా పరమానందస్వభావః పరమప్రేమాస్పదత్వాత్ వ్యతిరేకే ఘటవదిత్యాది యూక్త్యా ఆనందో బ్రహ్మ”.

(తైత్తరీయోపనిషత్ - 3 - 6)

ఇత్యాదిశ్రుత్యా చం నందాత్మకమిత్యర్థః (వేదాంతపరిభాషా)

(ఆత్మ పరమప్రేమకు ఆస్పదమైనదగుట వలన పరమానందమే స్వభావముగా గలది, అట్లు కాకపోయినయడల ఘటము వంటిదే - “నందో బ్రహ్మ” అని తైత్తిరియోపనిషత్తులో చెప్పబడియుండుట చేత కూడా ఆత్మ ఆనందాత్మకము).

  1. “రసో వైసః, రసం హ్యేవాయం లబ్దానందీ భవతి”; (తైత్తిరీయోపనిషత్ - 2 - 7)

(పరమాత్మ రసస్వరూపుడు, ఆనందస్వరూపుడు - అతనిని పొంది జీవుడు ఆనందముకలవాడగుచున్నాడు, ఆత్మ మోక్షమునిచ్చుటద్వారా ఆనందమును కలుగచేయువాడు. “ఏషహ్యేనానందయాతి” -

(ఇతనే ఆనందము కలుగచేయుచున్నాడు - బ్రహ్మ ఆనంద ఘనమని ఆనందప్రచురమని చెప్పబడుచున్నాడు).

  1. “ప్రజ్ఞానమానందం బ్రహ్మ”, “ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్”, “ఏషహ్యేవానందయాతి” (భగవంతుడే ఆనందమను - మోక్షమను పరమానందమును పొందించువాడు).

  2. “ఆనందరూపం వరదం ప్రసన్నం” (శ్రీరామకర్ణామృతం - 4 - 36)

Transliteration
  1. sukhātiśayaḥ. (atiśayasukhamu, atyaṃta sukhamu kaladi).

  2. duḥkha rāhityarūpaḥ (duḥkhamu lēkuṃḍanuṃḍu sthiti - adi ayinavāḍu).

  3. vṛttirāhitya svarūpa sthiti. (ē vidhamaina vyāpāramu lēkayuṃḍu sthiti galavāḍu).

  4. “ānaṃdaḥ svarūpamasyēti ānaṃdaḥ”. (śrīśaṃkaraḥ)

(ānaṃdamē svarūpamugā galavāḍu).

  1. sukha svarūpatvāt ānaṃdī - sarva saṃpat samṛddhatvāt ānaṃdīvā -

(sukhamē svarūpamugā galavāḍaguṭacēta ānaṃdī - lēka, annividhamulaina saṃpadalu samṛddhigā kaligiyuṃḍuṭacēta ānaṃduḍu).

  1. “nīvu paripūrṇānaṃda svarūpuṃḍavu” - (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 24 - 701)

  2. parama prēmālaṃbanatvēna upalakṣitaḥ, sarvaduḥkha vinirmukta sukha svarūpaḥ.

(parama prēmaku - prēmībhaktiki - paṭṭukommagā upalakṣaṇamugā ceppabaḍina ē vidhamaina duḥkhamulu lēnaṭuvaṃṭi sukhamē svarūpamugā galavāḍu).

  1. “ānaṃdaṃ nāma aṃbhasāmarṇavamiva sukhacētanānāṃ adhiṣṭhāna nitya śuddhā khaṃḍā dvaita cidānaṃdaika rasaṃ ānaṃdaṃ”. (sarvasārōpaniṣat)

nīṭiki samudragani ayinaṭlu sakala jīvulaku vāṭiyaṃdu adhiṣṭhiṃciyuṃḍu nityuḍu, śuddhuḍu caitanyamūrti paripūrṇuḍu, advaituḍu cit anu ānaṃdamokaṭē rasamugā galavāḍu - śaktigā nuṃḍuvāḍu ganuka ānaṃduḍu, cidrūpuḍu. okē cicchaktirūpamai anni jīvulaku tana cicchaktiniccuvāḍu)

  1. “ātmā paramānaṃdasvabhāvaḥ paramaprēmāspadatvāt vyatirēkē ghaṭavadityādi yūktyā ānaṃdō brahma”.

(taittarīyōpaniṣat - 3 - 6)

ityādiśrutyā caṃ naṃdātmakamityarthaḥ (vēdāṃtaparibhāṣā)

(ātma paramaprēmaku āspadamainadaguṭa valana paramānaṃdamē svabhāvamugā galadi, aṭlu kākapōyinayaḍala ghaṭamu vaṃṭidē - “naṃdō brahma” ani taittiriyōpaniṣattulō ceppabaḍiyuṃḍuṭa cēta kūḍā ātma ānaṃdātmakamu).

  1. “rasō vaisaḥ, rasaṃ hyēvāyaṃ labdānaṃdī bhavati”; (taittirīyōpaniṣat - 2 - 7)

(paramātma rasasvarūpuḍu, ānaṃdasvarūpuḍu - atanini poṃdi jīvuḍu ānaṃdamukalavāḍagucunnāḍu, ātma mōkṣamuniccuṭadvārā ānaṃdamunu kalugacēyuvāḍu. “ēṣahyēnānaṃdayāti” -

(itanē ānaṃdamu kalugacēyucunnāḍu - brahma ānaṃda ghanamani ānaṃdapracuramani ceppabaḍucunnāḍu).

  1. “prajñānamānaṃdaṃ brahma”, “ānaṃdō brahmēti vyajanāt”, “ēṣahyēvānaṃdayāti” (bhagavaṃtuḍē ānaṃdamanu - mōkṣamanu paramānaṃdamunu poṃdiṃcuvāḍu).

  2. “ānaṃdarūpaṃ varadaṃ prasannaṃ” (śrīrāmakarṇāmṛtaṃ - 4 - 36)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.