← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆనందమ యకోశము ānaṃdama yakōśamu

Original — తెలుగు
  1. “స్వరూపజ్ఞానమానందమయకోశః” (పైంగళోపనిషత్)

‘తత్ కారణశరీరం’

(స్వరూపా జ్ఞానము - అనగా తానే పరమాత్మయని యెఱుంగకుండుట. ఇట్టి అజ్ఞానమందుండి ఆనందముననుభవించు అవిద్య ఆనందమయకోశము - అదియే కారణశరీరము).

  1. “అన్నమయ ప్రాణమయ మనోమయ, విజ్ఞానమయ కోశ చతుష్టయ కారణాజ్ఞాన సంపృక్తం స్వకారణజ్ఞానం స్వరూపసుఖే వటధానాసు వటవృక్ష ఇవ యదావర్తతే తదానందమయ కోశః”. (అర్వసారోపనిషత్)

(అన్నమయకోశము, ప్రానమయకోశము; మనోమ యకోశము, విజ్ఞానమ యకోశము అను నాలుగు కోశములకు కారణమయి తన నిజస్వరూపమును తెలియనీయకుండునట్లు మర్రిగింజలో సూక్ష్మరూపములో అణగియుండు చెట్టువలె అణచియుంచి, ఆచ్ఛాదించు కోశమువలె నుండునది ఆనందమయకోశము).

  1. ఆనందః ఏవ ఆత్మనః స్వరూపం. ఆత్మస్వరూపానంద ప్రతిబింబ సహితా, ప్రియ, మోద, ప్రమోదరూపవృత్తయః జాగ్రత్స్వప్నయోః లయావధి భూతా, యాః స ఏవ అవిద్యా, స ఏవ కారణ దేహః స ఏవ ఆనందమయకోశః. ప్రియమోద ప్రమోదరూప వృత్తయః జాగ్రత్స్వప్నయోః అవస్థయోః పుణ్యకర్మఫలభూత సుఖానుభవకాలే ఉద్భవంతి; సుషుప్తౌ తా వృత్తయః స్వకారణే అజ్ఞానే లీయంతే. ఏతాదృశం అజ్ఞానం ఆనందమయకోశః ఇత్యుచ్యతే -

(ఆత్మయొక్క స్వరూపము ఆనందమే. ఆత్మస్వరూపమైన ఆనంద ప్రతిబింబముతోకూడియున్న ప్రియ, మోద. ప్రమోదములు అను ఆనందరూపముల వృత్తి నశించుటయే అవధిగాగల అవిద్య అనునది కారణదేహము. అదియే ఆనందమయకోశము, ప్రియ, మోద ప్రమోదముల వృత్తులు జాగ్రదవస్థ స్వప్నావస్థ యను రెండు అవస్థలకాలమందు కలుగుచున్నవి. సుషుప్త్యవస్థయందు ఆ వృత్తులు వాటికి కారణమగు నజ్ఞానమునందు లయమగుచున్నవి - లీనమగుచున్నవి. ఇటువంటిదగు అజ్ఞానమే ఆనందమ యకోశము).

  1. “కారణదేహరూపంబగు నవిద్యయును జాగ్రదవస్థయందు వనితాదీష్ట విషయ దర్శన సామీప్యం సంయోగంబను క్రమంబున పుట్టెడు ప్రియ, మోద, ప్రమోదంబులనియెడి యీ త్రివిధంబులంగూడి యానందమయ కోశంబునంబడు”. (వివేకచింతామణి - ఆనందతీర్థ)

  2. “మలినసత్వగుణమూ లేక, రజస్తమోగుణములతో అనగా కూడిన సత్వగుణము; ప్రియ, మోద, ప్రమోదములతో అనగా ఇంద్రియభోగానుభవము పూర్తిగా కలిగియుండు, వాటి యడల పూర్ణసంతుష్టి కలిగియుండి మలిన సత్వగుణము, లేక, రజస్తమోగుణములతో కలిసిన సత్వగుణము గల అవిద్య లేక అజ్ఞానము”.

Transliteration
  1. “svarūpajñānamānaṃdamayakōśaḥ” (paiṃgaḷōpaniṣat)

‘tat kāraṇaśarīraṃ’

(svarūpā jñānamu - anagā tānē paramātmayani yeṟuṃgakuṃḍuṭa. iṭṭi ajñānamaṃduṃḍi ānaṃdamunanubhaviṃcu avidya ānaṃdamayakōśamu - adiyē kāraṇaśarīramu).

  1. “annamaya prāṇamaya manōmaya, vijñānamaya kōśa catuṣṭaya kāraṇājñāna saṃpṛktaṃ svakāraṇajñānaṃ svarūpasukhē vaṭadhānāsu vaṭavṛkṣa iva yadāvartatē tadānaṃdamaya kōśaḥ”. (arvasārōpaniṣat)

(annamayakōśamu, prānamayakōśamu; manōma yakōśamu, vijñānama yakōśamu anu nālugu kōśamulaku kāraṇamayi tana nijasvarūpamunu teliyanīyakuṃḍunaṭlu marrigiṃjalō sūkṣmarūpamulō aṇagiyuṃḍu ceṭṭuvale aṇaciyuṃci, ācchādiṃcu kōśamuvale nuṃḍunadi ānaṃdamayakōśamu).

  1. ānaṃdaḥ ēva ātmanaḥ svarūpaṃ. ātmasvarūpānaṃda pratibiṃba sahitā, priya, mōda, pramōdarūpavṛttayaḥ jāgratsvapnayōḥ layāvadhi bhūtā, yāḥ sa ēva avidyā, sa ēva kāraṇa dēhaḥ sa ēva ānaṃdamayakōśaḥ. priyamōda pramōdarūpa vṛttayaḥ jāgratsvapnayōḥ avasthayōḥ puṇyakarmaphalabhūta sukhānubhavakālē udbhavaṃti; suṣuptau tā vṛttayaḥ svakāraṇē ajñānē līyaṃtē. ētādṛśaṃ ajñānaṃ ānaṃdamayakōśaḥ ityucyatē -

(ātmayokka svarūpamu ānaṃdamē. ātmasvarūpamaina ānaṃda pratibiṃbamutōkūḍiyunna priya, mōda. pramōdamulu anu ānaṃdarūpamula vṛtti naśiṃcuṭayē avadhigāgala avidya anunadi kāraṇadēhamu. adiyē ānaṃdamayakōśamu, priya, mōda pramōdamula vṛttulu jāgradavastha svapnāvastha yanu reṃḍu avasthalakālamaṃdu kalugucunnavi. suṣuptyavasthayaṃdu ā vṛttulu vāṭiki kāraṇamagu najñānamunaṃdu layamagucunnavi - līnamagucunnavi. iṭuvaṃṭidagu ajñānamē ānaṃdama yakōśamu).

  1. “kāraṇadēharūpaṃbagu navidyayunu jāgradavasthayaṃdu vanitādīṣṭa viṣaya darśana sāmīpyaṃ saṃyōgaṃbanu kramaṃbuna puṭṭeḍu priya, mōda, pramōdaṃbulaniyeḍi yī trividhaṃbulaṃgūḍi yānaṃdamaya kōśaṃbunaṃbaḍu”. (vivēkaciṃtāmaṇi - ānaṃdatīrtha)

  2. “malinasatvaguṇamū lēka, rajastamōguṇamulatō anagā kūḍina satvaguṇamu; priya, mōda, pramōdamulatō anagā iṃdriyabhōgānubhavamu pūrtigā kaligiyuṃḍu, vāṭi yaḍala pūrṇasaṃtuṣṭi kaligiyuṃḍi malina satvaguṇamu, lēka, rajastamōguṇamulatō kalisina satvaguṇamu gala avidya lēka ajñānamu”.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.