← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆనందతారతమ్యము ānaṃdatāratamyamu

Original — తెలుగు
  1. పుత్రదర్శనసుఖం ప్రియం, తద్వార్తాదినా మోదః, తస్య qవిద్యాద్యతిశయేన ప్రమోదః ఆనందః సుఖమిత్యేవం తారతమ్యవంతో ధర్మాః -

(ప్రియము, మోదము, ప్రమోదము ఆనందము అని ఆనందములో హెచ్చుతగ్గులున్నవి. పుత్రుడు కలుగగానే కలుగు సుఖము ప్రియము, ఆవార్త వినుటచే కలుగుసుఖము మోదము; పుత్రుడు విద్వాన్సుడయిన యడల కలుగు సుఖము ప్రమోదము; అని ఆనందములో తారతమ్యములు - ఇవి ఒకదానికంటె ఒకటి హెచ్చు అయినవి).

  1. తేయేమానుషానందా, స్స ఏవ మనష్యు గంధర్వణామానందః - - - :

అని మొదలగు ఆనందతారతమ్యము బ్రహ్మానందమువఱకు శ్రుతిలో చెప్పబడినది. ఇట్లు ఆనందములో తారతమ్యమున్నను ఆనందస్వరూపు డైన పరబ్రహ్మయందు ఈ తారతమ్యములేదు - కాని బ్రహ్మజ్ఞానము పొంది బ్రహ్మ దర్శనము కలిగి ముక్తినొందుటయను బ్రహ్మానందముకన్న హెచ్చు అయిన ఆనందము లేదు - అందుచేతనే ముక్తిని ‘అత్యంతసుఖము’ అని చెప్పబడినది. “ఎవరి వెర్రి వారికానందము” అని ఆర్యోక్తి – మహారాజు వంటివాడు రాజభోగములవలన ఆనందించును - సామాన్యమానవుడు పంచభక్ష్యపరమాన్నములతో ఆనందము చెందును. “పంది బురదమెచ్చు పన్నీరు మెచ్చునా” అని చెప్పినట్లు ఎవరి స్వభావమునుబట్టి వారికి ఆనందములో ఆయా తారతమ్యములు కలుగుచుండును. భగవంతుడు ఆనందమయుడే అయినను తాను ఉన్న ఉపాధిని బట్టి ఆనందానుభవములో తారతమ్యము కలుగ చేయుచున్నాడు.

Transliteration
  1. putradarśanasukhaṃ priyaṃ, tadvārtādinā mōdaḥ, tasya qvidyādyatiśayēna pramōdaḥ ānaṃdaḥ sukhamityēvaṃ tāratamyavaṃtō dharmāḥ -

(priyamu, mōdamu, pramōdamu ānaṃdamu ani ānaṃdamulō heccutaggulunnavi. putruḍu kalugagānē kalugu sukhamu priyamu, āvārta vinuṭacē kalugusukhamu mōdamu; putruḍu vidvānsuḍayina yaḍala kalugu sukhamu pramōdamu; ani ānaṃdamulō tāratamyamulu - ivi okadānikaṃṭe okaṭi heccu ayinavi).

  1. tēyēmānuṣānaṃdā, ssa ēva manaṣyu gaṃdharvaṇāmānaṃdaḥ - - - :

ani modalagu ānaṃdatāratamyamu brahmānaṃdamuvaṟaku śrutilō ceppabaḍinadi. iṭlu ānaṃdamulō tāratamyamunnanu ānaṃdasvarūpu ḍaina parabrahmayaṃdu ī tāratamyamulēdu - kāni brahmajñānamu poṃdi brahma darśanamu kaligi muktinoṃduṭayanu brahmānaṃdamukanna heccu ayina ānaṃdamu lēdu - aṃducētanē muktini ‘atyaṃtasukhamu’ ani ceppabaḍinadi. “evari verri vārikānaṃdamu” ani āryōkti – mahārāju vaṃṭivāḍu rājabhōgamulavalana ānaṃdiṃcunu - sāmānyamānavuḍu paṃcabhakṣyaparamānnamulatō ānaṃdamu ceṃdunu. “paṃdi buradameccu pannīru meccunā” ani ceppinaṭlu evari svabhāvamunubaṭṭi vāriki ānaṃdamulō āyā tāratamyamulu kalugucuṃḍunu. bhagavaṃtuḍu ānaṃdamayuḍē ayinanu tānu unna upādhini baṭṭi ānaṃdānubhavamulō tāratamyamu kaluga cēyucunnāḍu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.