(అవయవవిశేషములతో కూడియున్న అనేక కారణ ద్రవ్యములు కలియుటచేత ఒక కార్యవస్తువు కలుగుచున్నది. జగత్తు ఆరంభమగుటకు ఇదే కారణమని చెప్పుట ఆరంభవాదము. అనేకములైన దారములు కలిసియుండుటచేట బట్ట తయారగునట్లుగనే - ఇదియే ఆరంభవాదము. ఈ ఆరంభవాదము ప్రకారము కార్య కారణములకు అత్యంత భేదమున్నదని చెప్పబడుచున్నది. కాని జగత్తునకు కారణమైన పరబ్రహ్మ ఒక్కడే; అతనే ఈ ప్రపంచమంతయు, అతను తప్ప మరేదియు లేనేలేదు. అందుచేత పరబ్రహ్మ అపరిచ్ఛిన్నుడు, అవయవములు లేనివాడు. అందు అవయవవిశేషములు కలిగి వేఱు వేఱుగా అనేక రూపములతో నున్న ఈ ప్రపంచము మఱియొకవిధ ముగా పుట్టజాలదు). .
భూరేణువులు, జలము, అగ్ని, వాయువు అనునవి నాలుగు విధములైన పరమాణువులు; ఈ అణువులు రెండుకలిసి, మూడు కలిసి, తర్వాత నాలుగు కలిసి ఈ విధముగా కలిసి జగత్సృష్టిని ఆరంభించినవిమొదట. ఈ అణువులకుముందు ఏమియును లేదు - అసత్తు ఒకటే ఉండెను. ఈ అసత్తే కార్యకారణవ్యాపారమువలన ఉత్పత్తి కలుగచేయుచున్నది. అని తార్కికుల, మీమాంసకులవాదము. ఇదియే ఆరంభవాదము -
“కార్యం పూర్వం అసత్, పశ్చాత్ సత్” - కార్యము పుట్టుటకు ముందులేదు, పుట్టినతర్వాత ఉన్నది. కార్యమగు జగత్తు పుట్టకపూర్వము లేదు, అణువులుమాత్రము గలవు. నూలుదారములు కలియుటవలన బట్ట తయారగునట్లు పరమాణువులు కలియుటవలన జగత్తు కలిగినది. అందుచేత కార్యకారణములకు భేదముగలదు అనియు, ఆ పరమాణువులు వేఱు, జగత్తు వేఱు అను వదము ఆరంభవాదము. జగత్తు ఎట్లు ఆరంభమైనది అను విషయమును గుఱించిన వాదము. పరమాణువులు కలియుటకు ఈ వాదములో కారణము అదృష్టమని చెప్పబడినది. అదృష్టమనునది జడము కనుక పరమాణువులకు ఒకదానిలో ఒకటి కలిసి జగత్తును సృష్టించే శక్తి లేదు. ప్రతి పరిమాణువులోను పరమాత్మ ఉండి (సంకర్షణుడు - సమ్యక్ కర్షతి ఆకర్షతి - ఆకర్షింప శక్తికలవాడు అగుటచేత) ఒకపరమాణువుచేత ఇంకొక పరమాణువును ఆకర్షింపచేసి, అట్టివాటి సాముదాయక శక్తివలన వేరు వేరు పదార్థములుగా చేయుచున్నాడు - (Every particle of matter attracts every other particle). - అందుచేత ఆరంభవాదము ఖండింపబడినది. (చూడుము - ‘సంకర్షణుడు’. ‘సృష్టి’ ‘సృష్టిక్రమము’).
(avayavaviśēṣamulatō kūḍiyunna anēka kāraṇa dravyamulu kaliyuṭacēta oka kāryavastuvu kalugucunnadi. jagattu āraṃbhamaguṭaku idē kāraṇamani ceppuṭa āraṃbhavādamu. anēkamulaina dāramulu kalisiyuṃḍuṭacēṭa baṭṭa tayāragunaṭluganē - idiyē āraṃbhavādamu. ī āraṃbhavādamu prakāramu kārya kāraṇamulaku atyaṃta bhēdamunnadani ceppabaḍucunnadi. kāni jagattunaku kāraṇamaina parabrahma okkaḍē; atanē ī prapaṃcamaṃtayu, atanu tappa marēdiyu lēnēlēdu. aṃducēta parabrahma aparicchinnuḍu, avayavamulu lēnivāḍu. aṃdu avayavaviśēṣamulu kaligi vēṟu vēṟugā anēka rūpamulatō nunna ī prapaṃcamu maṟiyokavidha mugā puṭṭajāladu). .
bhūrēṇuvulu, jalamu, agni, vāyuvu anunavi nālugu vidhamulaina paramāṇuvulu; ī aṇuvulu reṃḍukalisi, mūḍu kalisi, tarvāta nālugu kalisi ī vidhamugā kalisi jagatsṛṣṭini āraṃbhiṃcinavimodaṭa. ī aṇuvulakumuṃdu ēmiyunu lēdu - asattu okaṭē uṃḍenu. ī asattē kāryakāraṇavyāpāramuvalana utpatti kalugacēyucunnadi. ani tārkikula, mīmāṃsakulavādamu. idiyē āraṃbhavādamu -
“kāryaṃ pūrvaṃ asat, paścāt sat” - kāryamu puṭṭuṭaku muṃdulēdu, puṭṭinatarvāta unnadi. kāryamagu jagattu puṭṭakapūrvamu lēdu, aṇuvulumātramu galavu. nūludāramulu kaliyuṭavalana baṭṭa tayāragunaṭlu paramāṇuvulu kaliyuṭavalana jagattu kaliginadi. aṃducēta kāryakāraṇamulaku bhēdamugaladu aniyu, ā paramāṇuvulu vēṟu, jagattu vēṟu anu vadamu āraṃbhavādamu. jagattu eṭlu āraṃbhamainadi anu viṣayamunu guṟiṃcina vādamu. paramāṇuvulu kaliyuṭaku ī vādamulō kāraṇamu adṛṣṭamani ceppabaḍinadi. adṛṣṭamanunadi jaḍamu kanuka paramāṇuvulaku okadānilō okaṭi kalisi jagattunu sṛṣṭiṃcē śakti lēdu. prati parimāṇuvulōnu paramātma uṃḍi (saṃkarṣaṇuḍu - samyak karṣati ākarṣati - ākarṣiṃpa śaktikalavāḍu aguṭacēta) okaparamāṇuvucēta iṃkoka paramāṇuvunu ākarṣiṃpacēsi, aṭṭivāṭi sāmudāyaka śaktivalana vēru vēru padārthamulugā cēyucunnāḍu - (Every particle of matter attracts every other particle). - aṃducēta āraṃbhavādamu khaṃḍiṃpabaḍinadi. (cūḍumu - ‘saṃkarṣaṇuḍu’. ‘sṛṣṭi’ ‘sṛṣṭikramamu’).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.