← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆర్జవము ārjavamu

Original — తెలుగు
  1. “ఋజుభావః; అవక్రత్వం; అవక్రతా;” (శ్రీశంకరః)

ఋజుతా; అకౌటిల్యం.

(ఋజుత్వము కలిగియుండుట; వక్రముగాకుండుట; కుటిలత్వము లేకుండుట; కపటము లేకుండుట).

(పామువలె వక్రతగలవానియందు పాములో విషమున్నట్లు, అట్టివాడు విషస్వభావము కలిగియుండును).

  1. “పరాన్ ప్రతివాఙ్మనః కాయ ప్రవృత్తీనాం ఏకరూపతా” (శ్రీరామానుజః)

(ఇతరుల విషయములో మనోవాక్కాయముల వృత్తులను ఒకేరీతిగా ప్రవర్తింపచేయుట - అనగా మనసులో అనుకొనినట్లుగనే శరీరముతో చేయుట. మనసులోని ఉద్దేశము ఒకటి, శరీరముతో చేయుపని మఱియొకటి కాకుండుట - త్రికరణ శుద్ధి కలిగియుండుట).

  1. “యథా మనశ్శారీర వృత్తం” (శ్రీరామానుజః)

(మనసులోని ఆలోచన ప్రకారము శరీర చేష్టలు కలిగియుండుట).

  1. “పరేషు మనోనురూపం బాహ్య చేష్టా ప్రకా శనం” (శ్రీరామనుజః)

(చూడుము - 3)

  1. స్వచ్ఛతా -

  2. సరలతా.

  3. “ఆర్జవం నామ మనోవాకాయకర్మణాం విహితా విహితేషు జనేషు ప్రవృత్తౌ నివృత్తేవా ఏకరూపత్వం” (శాండిల్యోపనిషత్)

(మనోవాకాయకర్మలందు ఇష్టమైనవారియడల, ఇష్టముకానివారలందు, ప్రవృత్తి నివృత్తి రూపకర్మలందు ఒకే రీతిగా ప్రవర్తించుట).

  1. “మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం మహాత్మనాం”

(మహాత్ములకు మనసులోను, మాటలోను, కర్మలోను ఒకేరీతిగానుండును).

  1. “పుత్రౌ, మిత్రౌ, కళత్రేచ రిపౌ, స్వాత్మని సంతతం ||”. (దర్శనోపనిషత్)

(పుత్రునియందు, మిత్రునియందు, కళత్రమందు, శత్రువునందు, తనయందు ఒకేరీతిగానుండుట ఆర్జవము అని చెప్పబడుచున్నది).

  1. “మనోవాక్కాయ కర్మణాం అవైపరీత్యం” (ఆనంద తీర్థః)

(మనోవాక్కాయకర్మలు వేరువేరుగా కాక ఒకేరీతిగానుండుట).

  1. త్రికరణశుద్ధి కలిగియుండుట; ధర్మ ప్రవర్తనము, ముక్కుకు సూటిగా నడచుట; తిన్నని నడక.

  2. స్వధర్మే మనోవాక్కాయ ప్రవృతై సదా ఏకరూపత్వం.

(స్వధర్మమందు మనోవాక్కాయకర్మలు ఒకే విధముగా నుంచుట). (చింతించిన ప్రకారము మాటలాడుట, మాటలాడిన ప్రకారము పని చేయుట).

Transliteration
  1. “ṛjubhāvaḥ; avakratvaṃ; avakratā;” (śrīśaṃkaraḥ)

ṛjutā; akauṭilyaṃ.

(ṛjutvamu kaligiyuṃḍuṭa; vakramugākuṃḍuṭa; kuṭilatvamu lēkuṃḍuṭa; kapaṭamu lēkuṃḍuṭa).

(pāmuvale vakratagalavāniyaṃdu pāmulō viṣamunnaṭlu, aṭṭivāḍu viṣasvabhāvamu kaligiyuṃḍunu).

  1. “parān prativāṅmanaḥ kāya pravṛttīnāṃ ēkarūpatā” (śrīrāmānujaḥ)

(itarula viṣayamulō manōvākkāyamula vṛttulanu okērītigā pravartiṃpacēyuṭa - anagā manasulō anukoninaṭluganē śarīramutō cēyuṭa. manasulōni uddēśamu okaṭi, śarīramutō cēyupani maṟiyokaṭi kākuṃḍuṭa - trikaraṇa śuddhi kaligiyuṃḍuṭa).

  1. “yathā manaśśārīra vṛttaṃ” (śrīrāmānujaḥ)

(manasulōni ālōcana prakāramu śarīra cēṣṭalu kaligiyuṃḍuṭa).

  1. “parēṣu manōnurūpaṃ bāhya cēṣṭā prakā śanaṃ” (śrīrāmanujaḥ)

(cūḍumu - 3)

  1. svacchatā -

  2. saralatā.

  3. “ārjavaṃ nāma manōvākāyakarmaṇāṃ vihitā vihitēṣu janēṣu pravṛttau nivṛttēvā ēkarūpatvaṃ” (śāṃḍilyōpaniṣat)

(manōvākāyakarmalaṃdu iṣṭamainavāriyaḍala, iṣṭamukānivāralaṃdu, pravṛtti nivṛtti rūpakarmalaṃdu okē rītigā pravartiṃcuṭa).

  1. “manasyēkaṃ, vacasyēkaṃ, karmaṇyēkaṃ mahātmanāṃ”

(mahātmulaku manasulōnu, māṭalōnu, karmalōnu okērītigānuṃḍunu).

  1. “putrau, mitrau, kaḷatrēca ripau, svātmani saṃtataṃ ||”. (darśanōpaniṣat)

(putruniyaṃdu, mitruniyaṃdu, kaḷatramaṃdu, śatruvunaṃdu, tanayaṃdu okērītigānuṃḍuṭa ārjavamu ani ceppabaḍucunnadi).

  1. “manōvākkāya karmaṇāṃ avaiparītyaṃ” (ānaṃda tīrthaḥ)

(manōvākkāyakarmalu vēruvērugā kāka okērītigānuṃḍuṭa).

  1. trikaraṇaśuddhi kaligiyuṃḍuṭa; dharma pravartanamu, mukkuku sūṭigā naḍacuṭa; tinnani naḍaka.

  2. svadharmē manōvākkāya pravṛtai sadā ēkarūpatvaṃ.

(svadharmamaṃdu manōvākkāyakarmalu okē vidhamugā nuṃcuṭa). (ciṃtiṃcina prakāramu māṭalāḍuṭa, māṭalāḍina prakāramu pani cēyuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.