← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆరోహావరోహములు ārōhāvarōhamulu

Original — తెలుగు

“సం యమనే యమాలయే స్వపాపానురూపాః యామీః యాతనాం అనుభూయ పునరిమంలోకం ప్రత్యవరోహంతి. ఇత్యేవం భూతావేవ తేషాం పాటినాం ఆరోహావరోహౌ భవతః.”

(యముని ఆలయమైన నరకమందు తమతమ పాపానుసారముగా యమునివలన కలిగిన బాధలను అనుభవించి, తిరిగి, ఆ జీవులు ఈ లోకమునకు - కర్మచేయుటకు - వచ్చెదరు. యమలోకము పాతాళలోకము కనుక అక్కడికి వెళ్ళుట అవరోహము (దిగుట). అక్కడి బాధము ఇక్కడి బాధంలుకన్న కఠినమైనవిగాన ఆ బాధలను అనుభవించడమే అవరోహము. భూలోకము యమలోకముకన్న మీదనున్నదికనుక భూలోకములో మరల జన్మించుట ఆరోహము. అటువంటి పాపులకు ఇదియే ఆరోహావరోహములు).

(మానవజన్మలో చేసిన పాపపుణ్యములబట్టి ఆరోహావరోహములు కలుగును. మానవ ఉజన్మకంటె నీచమైన జన్మలు పశు, పక్షి, పన్నగ, క్రిమి కీటకములు, స్థావరములు. ఈ జీవులుగా జన్మించుట అవరోహము. భూలోకములఓనే ఉత్తమ మానవ జన్మ ఎత్తుట, భూలోకమునకు పైన ఉన్న స్వర్గాదులలో వసించుట ఆరోహము. నీచ జన్మలనుండి ఉత్తమజన్మల వఱకు వచ్చుట ఆరోహము).

Transliteration

“saṃ yamanē yamālayē svapāpānurūpāḥ yāmīḥ yātanāṃ anubhūya punarimaṃlōkaṃ pratyavarōhaṃti. ityēvaṃ bhūtāvēva tēṣāṃ pāṭināṃ ārōhāvarōhau bhavataḥ.”

(yamuni ālayamaina narakamaṃdu tamatama pāpānusāramugā yamunivalana kaligina bādhalanu anubhaviṃci, tirigi, ā jīvulu ī lōkamunaku - karmacēyuṭaku - vaccedaru. yamalōkamu pātāḷalōkamu kanuka akkaḍiki veḷḷuṭa avarōhamu (diguṭa). akkaḍi bādhamu ikkaḍi bādhaṃlukanna kaṭhinamainavigāna ā bādhalanu anubhaviṃcaḍamē avarōhamu. bhūlōkamu yamalōkamukanna mīdanunnadikanuka bhūlōkamulō marala janmiṃcuṭa ārōhamu. aṭuvaṃṭi pāpulaku idiyē ārōhāvarōhamulu).

(mānavajanmalō cēsina pāpapuṇyamulabaṭṭi ārōhāvarōhamulu kalugunu. mānava ujanmakaṃṭe nīcamaina janmalu paśu, pakṣi, pannaga, krimi kīṭakamulu, sthāvaramulu. ī jīvulugā janmiṃcuṭa avarōhamu. bhūlōkamulaōnē uttama mānava janma ettuṭa, bhūlōkamunaku paina unna svargādulalō vasiṃcuṭa ārōhamu. nīca janmalanuṃḍi uttamajanmala vaṟaku vaccuṭa ārōhamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.