← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆర్తుడు ārtuḍu

Original — తెలుగు
  1. “ఆర్తి పరిగృహీతః, తస్కరరోగ, వ్యాఘ్రాదినా అభిభూతః, ఆపన్నః -” (శ్రీశంకరః)

(బాధలు పడుచున్నవాడు; రోగముచేత, దొంగలచేత పులి మొదలగు క్రూరజంతువులచేత బాధపడుచున్నవాడు - ఆపదనొందినవాడు).

  1. జ్ఞానాది సాధనాంతరరహితాః, భగవంతమేవ ఆర్తిః అపహర్తుం అనువర్తంతే తే; పీడితాః.

(జ్ఞానము మొదలగు ఇతర మోక్షసాధనములు లేకుండుటవలన భగవంతుడే తనబాధను పోగొట్టగలవాడు అని భగవంతుని ఆశ్రయించుయుండువారు; బాధలు పడుచుండువారు).

  1. “శ్లో||. ఆర్తో వ్యాధాదినాగ్రస్తస్త న్నివృత్తీచ్ఛాయా సుధీః |

గ్రాహగ్రస్తో యథాహస్తీ యథాచ ద్రుపదాత్మ జా ||“. (గీతాభావప్రకాశము - 7 - 98, 99)

(రోగముతో బాధపడుచున్నవాడు ఆ బాధ నివారణకొఱకు భగవంతుని ఆశ్రయించువాడు - మొసలిచేత పట్టుబడియున్న గజేంద్రుడు తనను రక్షించుటకు భగవంతుని వేడుకొనెను. కౌరవసభలో కౌరవులచేత మానభంగమునుండి రక్షించమని శ్రీకృష్ణుని ద్రౌపది ప్రార్థించెను. ఇట్టివారు ఆర్తులు).

“కృష్ణా ! కృష్ణా ! సభాయాం సపది కురుపతేః యం శరణ్యం శ్రితా(ఆ)సీత్ |

ముక్తా దుఃఖా ద్గజేంద్రో జలచర వివశోయం స్మరన్ పాశ ముక్తః |

కారాగారే విరుద్ధాఃశరణముపగతాయం నృపా ముక్తబంధాః |

ఆ సంస్థం శ్రీముకుందం సతతమహమజం నేమి ముక్తేర్నిధానం ||“. (గీతాభావప్రకాశము - 1 - 2)

(కౌరవసభలో మానభంగము కలుగకుండ రక్షింపమని వేడిన వెంటనే రక్షించినవాడున్నూ, మొసలిచే పట్టుబడి ప్రాణములు వీడనున్న గజేంద్రుని ఆ మొసలి అను పాశమునుండి రక్షించినవాడున్నూ, కారాగారములో నరకాసురునిచే బంధింపబడిన రాజులు బంధము విడిపించమని కోరగా వారిని విమిక్తులుఇగా చేసినటువంటిన్నీ, జన్మ లేనటువంటిన్నీ, మోక్షము నిచ్చువాడు అయినటువంటిన్నీ భగవంతుని గుఱించి ఎల్లపుడు నమస్కారము చేయుచున్నాను).

  1. నష్టైశ్వర్య కామః. (నష్టపోయిన ఐశ్వర్యమును మరల పొందకోరువాడు).

  2. “ప్రతిష్టాహీనః, భ్రష్టైశ్వర్యః; పునస్తత్ప్రాప్తి కామః”. (శ్రీరామానుజః)

(ప్రతిష్టను, ఐశ్వర్తమును కోలుపోయి, తిరిగి వాటిని పొందకోరువాడు).

  1. “చతుర్విధాః భజంతేమాం జనాః సుకృతినో (అ)ర్జున |

ఆర్తో, జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ ||“. (శ్రీమద్భగవద్గీత - 7 -16)

(ఆర్తుడు, బ్రహ్మజ్ఞానముకొఱకు ప్రయత్నించువాడు, ఏదేని ఒక ప్రయోజనము నాశించినవాడు, బ్రహ్మజ్ఞానము కలవాడు - అను ఈ నలుగురు నన్ను - భగవంతుని - భజించెదరు - ఆశ్రయించెదరు).

Transliteration
  1. “ārti parigṛhītaḥ, taskararōga, vyāghrādinā abhibhūtaḥ, āpannaḥ -” (śrīśaṃkaraḥ)

(bādhalu paḍucunnavāḍu; rōgamucēta, doṃgalacēta puli modalagu krūrajaṃtuvulacēta bādhapaḍucunnavāḍu - āpadanoṃdinavāḍu).

  1. jñānādi sādhanāṃtararahitāḥ, bhagavaṃtamēva ārtiḥ apahartuṃ anuvartaṃtē tē; pīḍitāḥ.

(jñānamu modalagu itara mōkṣasādhanamulu lēkuṃḍuṭavalana bhagavaṃtuḍē tanabādhanu pōgoṭṭagalavāḍu ani bhagavaṃtuni āśrayiṃcuyuṃḍuvāru; bādhalu paḍucuṃḍuvāru).

  1. “ślō||. ārtō vyādhādināgrastasta nnivṛttīcchāyā sudhīḥ |

grāhagrastō yathāhastī yathāca drupadātma jā ||“. (gītābhāvaprakāśamu - 7 - 98, 99)

(rōgamutō bādhapaḍucunnavāḍu ā bādha nivāraṇakoṟaku bhagavaṃtuni āśrayiṃcuvāḍu - mosalicēta paṭṭubaḍiyunna gajēṃdruḍu tananu rakṣiṃcuṭaku bhagavaṃtuni vēḍukonenu. kauravasabhalō kauravulacēta mānabhaṃgamunuṃḍi rakṣiṃcamani śrīkṛṣṇuni draupadi prārthiṃcenu. iṭṭivāru ārtulu).

“kṛṣṇā ! kṛṣṇā ! sabhāyāṃ sapadi kurupatēḥ yaṃ śaraṇyaṃ śritā(ā)sīt |

muktā duḥkhā dgajēṃdrō jalacara vivaśōyaṃ smaran pāśa muktaḥ |

kārāgārē viruddhāḥśaraṇamupagatāyaṃ nṛpā muktabaṃdhāḥ |

ā saṃsthaṃ śrīmukuṃdaṃ satatamahamajaṃ nēmi muktērnidhānaṃ ||“. (gītābhāvaprakāśamu - 1 - 2)

(kauravasabhalō mānabhaṃgamu kalugakuṃḍa rakṣiṃpamani vēḍina veṃṭanē rakṣiṃcinavāḍunnū, mosalicē paṭṭubaḍi prāṇamulu vīḍanunna gajēṃdruni ā mosali anu pāśamunuṃḍi rakṣiṃcinavāḍunnū, kārāgāramulō narakāsurunicē baṃdhiṃpabaḍina rājulu baṃdhamu viḍipiṃcamani kōragā vārini vimiktuluigā cēsinaṭuvaṃṭinnī, janma lēnaṭuvaṃṭinnī, mōkṣamu niccuvāḍu ayinaṭuvaṃṭinnī bhagavaṃtuni guṟiṃci ellapuḍu namaskāramu cēyucunnānu).

  1. naṣṭaiśvarya kāmaḥ. (naṣṭapōyina aiśvaryamunu marala poṃdakōruvāḍu).

  2. “pratiṣṭāhīnaḥ, bhraṣṭaiśvaryaḥ; punastatprāpti kāmaḥ”. (śrīrāmānujaḥ)

(pratiṣṭanu, aiśvartamunu kōlupōyi, tirigi vāṭini poṃdakōruvāḍu).

  1. “caturvidhāḥ bhajaṃtēmāṃ janāḥ sukṛtinō (a)rjuna |

ārtō, jijñāsurarthārthī jñānī ca bharatarṣabha ||“. (śrīmadbhagavadgīta - 7 -16)

(ārtuḍu, brahmajñānamukoṟaku prayatniṃcuvāḍu, ēdēni oka prayōjanamu nāśiṃcinavāḍu, brahmajñānamu kalavāḍu - anu ī naluguru nannu - bhagavaṃtuni - bhajiṃcedaru - āśrayiṃcedaru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.