← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆసనం āsanaṃ

Original — తెలుగు
  1. ఆస్తే అనేన ఇత్యాసనం. (దీనితో కూర్చుని ఉండును కనుక ఆసనము అని చెప్పబడినది).

  2. కరచరణాది సంస్థాన విశేష లక్షణాని, పద్మ, స్వస్తికాదీని ఆసనాని.

(కాళ్ళు, చేతులు, మొదలగువాటిని ఒక ప్రత్యేకమైన విధముగా నుంచుటయే లక్షణముగాగలవి ఆసనములు - పద్మాసనము, స్వస్తికాసనము మొదలగునవి).

  1. “యేన కేనాసనేన సుఖధారణం భవతి అశక్తస్తమాచరేత్”. (శాండిల్యోపనిషత్)

(ఏ ఆసనముచేతనైనను సుఖముగా ధారణ చేయగలడో శక్తిలేనివాడు ఆ ఆసనమును ఆచరించవలెను - అవలంభించవలెను).

  1. ” స్థిరం సుఖమాసనం (పతంజలి యోగసూత్రములు - 2 - 4).

(ఆసనము స్థిరముగానుండవలెను - చాలాకాలము అట్లు కదలకుండనుండవలెను - ఎంతకాలమట్లుండినను సుఖముగా నుండవలెను -).

  1. “సుఖేనైవ భవేద్యస్మిన్ అజస్రంబ్రహ్మ చింతనం |

ఆసనం తద్విజానీయాత్ నేతరత్సుఖ నాశనం ||“.

(ఏ రీతిగా శరీరమునుంచిన అనాయాసముగా సుఖముగా బ్రహ్మ గుఱించి చింతించుటకు ఉపయోగపడునో ఆ రీతిగా శరీరమునుంచుట ఆసనమని చెప్పబడినది. సుఖముగా లేని ఇతర ఆసనములు ఆసనముకాదు).

  1. ” అనంతాః ఆసనభేదాః తత్ర 1. స్వస్తికం, 2. గోముఖం, 3. వీరం, 4. కూర్మం, 5. పద్మం, 6. కుక్కుటం, 7. ఉత్తానం, 8. కూర్మకం, 9. ధానుష్కం, 10. మత్స్యం, 11. పశ్చిమతాసనం, 12. మయూరం, 13. శవం, 14. సింహం, 15. భద్రం 16. సిద్ధం ఇత్యుపక్రమ్య చతురశీత్యాసనాని యోగ గ్రంధేషు నిరూపితాని. తేషు సింహం, భద్రం, పద్మం, సిద్ధం ఇతి చత్వారిముఖ్యాని ఆసనాని. తత్రాపి సిద్ధాసనమేవ అత్యంత సాధనం, అత్యంతం ప్రధానం “.

(ఆసనములు అనేకముగానున్నవి. అవి స్వస్తికము, గోముఖము, వీరము, కూర్మము, ధానిష్కము,మత్స్యము, పశ్చిమతాసనము, మయూరాసనము, శవాసనము, సింహాసనము, భద్రాసనము, సిద్ధాసనము మొదలగునవి 84 యోగ గ్రంధములలో చెప్పబడినవి. వాటిలో సింహాసనము, భద్రాసనము, పద్మాసనము, సిద్ధాసనము అనునవి ముఖ్యమైనవి. ఈ నాలుగు ఆసనములఓను సిద్ధాసనము అత్యంతము ప్రధానమైనవి).

“సిద్ధం పద్మం తథా సింహం భద్రంచేతి చతుష్టయం |

శ్రేష్టం తత్రాపిచ సుఖే తిష్టేత్ సిద్ధాసనే సదా ||“.

  1. “కాని చిదాసనాని రోగనాశకహేతూని, కానిచిత్ ప్రాణాయామాది సమాధ్యంగసాధకాని. సిద్ధాసనంతు సమాదికాలోపయోగిత్వాత్ అత్యంతం ప్రథానం ఉచ్యతే ఇదమేవ వజ్రాసనం, ముక్తాసనం, గుప్తాసనం ఇత్యనేకథా ఉచ్యతే”.

(కొన్ని ఆసనములు రోగములను పోగొట్టునవి, కొన్ని ప్రాణాయామము మొదలగు యోగాంగములను సాధించుటకు ఉపయోగపడుచున్నవి. సమాధిలోనున్న కాలములో ఉపయోగకరములగుటవలన చాలా ముఖ్యమైనవి సిద్ధాసనము. దీనినే వజ్రాసనమని, ముక్తాసనమని. గుప్తాసనమని చెప్పుచున్నారు).

  1. “ఆసనేన రజోహంతి” ఆసనము వేయుట అభ్యాసము చేసుకొనినయడల రజోగుణము. దాని ప్రభావమువలన కలుగు రోగములు నశించిపోవును - నాడులు శక్తివంతములై ఆరోగ్యమును కలుగచేయును.

  2. శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః |

నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజినకుశోత్తరం ||“. (శ్రీమద్భగవద్గీత - 6 - 11)

(శుద్ధి చేయబడిన స్థలమున మరీ ఎత్తుగా కానిదీ, మరీ క్రిందగా కానిది అయిన స్థలమున మొదట కుశలు పఱచి, వాటిమీద తోలు పఱచి, దీనిమీద వస్త్రము పఱచి దానిమీద స్థిరమైన ఆసనము వేసుకొనవలెను).

  1. ఆసనము వేయుటకు కొన్ని ముఖ్యసూత్రములు : -

    1. “సమం కాయశిరోగ్రీవం” (శ్రీమద్భగవద్గీత - 6 - 13)

(శరీరమును - వెన్నెముకను - కంఠమును, శిరస్సును ఒకే రీతిగా నిటారుగా - వంచకుండ - నుంచవలెను).

  1. చేతులు, కాళ్ళు వత్తిడి లేకుండ, బిగించక, ఉంచవలెను.
Transliteration
  1. āstē anēna ityāsanaṃ. (dīnitō kūrcuni uṃḍunu kanuka āsanamu ani ceppabaḍinadi).

  2. karacaraṇādi saṃsthāna viśēṣa lakṣaṇāni, padma, svastikādīni āsanāni.

(kāḷḷu, cētulu, modalaguvāṭini oka pratyēkamaina vidhamugā nuṃcuṭayē lakṣaṇamugāgalavi āsanamulu - padmāsanamu, svastikāsanamu modalagunavi).

  1. “yēna kēnāsanēna sukhadhāraṇaṃ bhavati aśaktastamācarēt”. (śāṃḍilyōpaniṣat)

(ē āsanamucētanainanu sukhamugā dhāraṇa cēyagalaḍō śaktilēnivāḍu ā āsanamunu ācariṃcavalenu - avalaṃbhiṃcavalenu).

  1. ” sthiraṃ sukhamāsanaṃ (pataṃjali yōgasūtramulu - 2 - 4).

(āsanamu sthiramugānuṃḍavalenu - cālākālamu aṭlu kadalakuṃḍanuṃḍavalenu - eṃtakālamaṭluṃḍinanu sukhamugā nuṃḍavalenu -).

  1. “sukhēnaiva bhavēdyasmin ajasraṃbrahma ciṃtanaṃ |

āsanaṃ tadvijānīyāt nētaratsukha nāśanaṃ ||“.

(ē rītigā śarīramunuṃcina anāyāsamugā sukhamugā brahma guṟiṃci ciṃtiṃcuṭaku upayōgapaḍunō ā rītigā śarīramunuṃcuṭa āsanamani ceppabaḍinadi. sukhamugā lēni itara āsanamulu āsanamukādu).

  1. ” anaṃtāḥ āsanabhēdāḥ tatra 1. svastikaṃ, 2. gōmukhaṃ, 3. vīraṃ, 4. kūrmaṃ, 5. padmaṃ, 6. kukkuṭaṃ, 7. uttānaṃ, 8. kūrmakaṃ, 9. dhānuṣkaṃ, 10. matsyaṃ, 11. paścimatāsanaṃ, 12. mayūraṃ, 13. śavaṃ, 14. siṃhaṃ, 15. bhadraṃ 16. siddhaṃ ityupakramya caturaśītyāsanāni yōga graṃdhēṣu nirūpitāni. tēṣu siṃhaṃ, bhadraṃ, padmaṃ, siddhaṃ iti catvārimukhyāni āsanāni. tatrāpi siddhāsanamēva atyaṃta sādhanaṃ, atyaṃtaṃ pradhānaṃ “.

(āsanamulu anēkamugānunnavi. avi svastikamu, gōmukhamu, vīramu, kūrmamu, dhāniṣkamu,matsyamu, paścimatāsanamu, mayūrāsanamu, śavāsanamu, siṃhāsanamu, bhadrāsanamu, siddhāsanamu modalagunavi 84 yōga graṃdhamulalō ceppabaḍinavi. vāṭilō siṃhāsanamu, bhadrāsanamu, padmāsanamu, siddhāsanamu anunavi mukhyamainavi. ī nālugu āsanamulaōnu siddhāsanamu atyaṃtamu pradhānamainavi).

“siddhaṃ padmaṃ tathā siṃhaṃ bhadraṃcēti catuṣṭayaṃ |

śrēṣṭaṃ tatrāpica sukhē tiṣṭēt siddhāsanē sadā ||“.

  1. “kāni cidāsanāni rōganāśakahētūni, kānicit prāṇāyāmādi samādhyaṃgasādhakāni. siddhāsanaṃtu samādikālōpayōgitvāt atyaṃtaṃ prathānaṃ ucyatē idamēva vajrāsanaṃ, muktāsanaṃ, guptāsanaṃ ityanēkathā ucyatē”.

(konni āsanamulu rōgamulanu pōgoṭṭunavi, konni prāṇāyāmamu modalagu yōgāṃgamulanu sādhiṃcuṭaku upayōgapaḍucunnavi. samādhilōnunna kālamulō upayōgakaramulaguṭavalana cālā mukhyamainavi siddhāsanamu. dīninē vajrāsanamani, muktāsanamani. guptāsanamani ceppucunnāru).

  1. “āsanēna rajōhaṃti” āsanamu vēyuṭa abhyāsamu cēsukoninayaḍala rajōguṇamu. dāni prabhāvamuvalana kalugu rōgamulu naśiṃcipōvunu - nāḍulu śaktivaṃtamulai ārōgyamunu kalugacēyunu.

  2. śucau dēśē pratiṣṭhāpya sthiramāsanamātmanaḥ |

nātyucchritaṃ nāti nīcaṃ cēlājinakuśōttaraṃ ||“. (śrīmadbhagavadgīta - 6 - 11)

(śuddhi cēyabaḍina sthalamuna marī ettugā kānidī, marī kriṃdagā kānidi ayina sthalamuna modaṭa kuśalu paṟaci, vāṭimīda tōlu paṟaci, dīnimīda vastramu paṟaci dānimīda sthiramaina āsanamu vēsukonavalenu).

  1. āsanamu vēyuṭaku konni mukhyasūtramulu : -

    1. “samaṃ kāyaśirōgrīvaṃ” (śrīmadbhagavadgīta - 6 - 13)

(śarīramunu - vennemukanu - kaṃṭhamunu, śirassunu okē rītigā niṭārugā - vaṃcakuṃḍa - nuṃcavalenu).

  1. cētulu, kāḷḷu vattiḍi lēkuṃḍa, bigiṃcaka, uṃcavalenu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.