(భగవంతుని అవసరములేకుండగనే కర్మలు ఫలములనిచ్చుచున్నవి అని తలచువారు మోఘాశులు. భగవంతునియందు విముఖతగలవారు, భ్రమచెందినవారు కనుక అట్టివారుచేసిన అగ్నిహోత్రము మొదలగు కర్మలు చేసినను అవి శ్రమ మాత్రములే. అందుచేత మోఘకర్మలు - వ్యర్థకర్మలు - చేసినవారగుదురు. భగవంతుని నింద చేయుటచేత కుతర్కము చేయుటవలన భ్రాంతి చెందుటవలన అట్టి వారి జ్ఞానము వ్యర్థమైనదే. నన్ను తెలియకపోవుటచేత వారు ఊరకనే హింస చేయువారు, ఊరకనే ద్వేషముగలవారు అగుటచేత రాక్షసస్వభావమును, తామసగుణప్రథానమైన స్వభావము గలవారై, శాస్త్రముచే నిందింప దుష్టభోగములైన కామము రాగము మొదలగునవి కలవారై శాస్త్రజ్ఞానమును నాశము చేయునదియు, నరకమునకు కారణమైనదియు అగు దుస్స్వభావమైన ఆసురీ ప్రకృతిని ఆశ్రయించువారగుదురు) (ఇట్లు పైన చెప్పిన గుణములుగలది ఆసురీ ప్రకృతి).
(bhagavaṃtuni avasaramulēkuṃḍaganē karmalu phalamulaniccucunnavi ani talacuvāru mōghāśulu. bhagavaṃtuniyaṃdu vimukhatagalavāru, bhramaceṃdinavāru kanuka aṭṭivārucēsina agnihōtramu modalagu karmalu cēsinanu avi śrama mātramulē. aṃducēta mōghakarmalu - vyarthakarmalu - cēsinavāraguduru. bhagavaṃtuni niṃda cēyuṭacēta kutarkamu cēyuṭavalana bhrāṃti ceṃduṭavalana aṭṭi vāri jñānamu vyarthamainadē. nannu teliyakapōvuṭacēta vāru ūrakanē hiṃsa cēyuvāru, ūrakanē dvēṣamugalavāru aguṭacēta rākṣasasvabhāvamunu, tāmasaguṇaprathānamaina svabhāvamu galavārai, śāstramucē niṃdiṃpa duṣṭabhōgamulaina kāmamu rāgamu modalagunavi kalavārai śāstrajñānamunu nāśamu cēyunadiyu, narakamunaku kāraṇamainadiyu agu dussvabhāvamaina āsurī prakṛtini āśrayiṃcuvāraguduru) (iṭlu paina ceppina guṇamulugaladi āsurī prakṛti).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.