← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆసురీసంపద āsurīsaṃpada

Original — తెలుగు
  1. “దంభో దర్పో అభిమానశ్చ క్రోధః పారుష్య మేవ చ |

అజ్ఞానం చాభి జాతస్య పార్థ సంపదమాసురీం ||” (శ్రీమద్భగవద్గీత - 16 - 4)

(దంభము, గర్వము, అభిమానము, కోపము, కాఠిన్యము, అవివేకము అను దుర్గుణములు కలిగియుండుట ఆసురీసంపద).

(శ్రీమద్భగవద్గీతలో 16 వ అధ్యాయములో 7 మొదలు 20 వరకుగల శ్లోకములలో ఆసురీసంపద చెప్పబడినది. దాని భావము ఈ క్రిందవిధముగానున్నది :-

“ఆసురో మనుష్యాః ధర్మా ధర్మ విషయణి ప్రవృత్తిం నివృత్తించ న జానంతి. అతః తేషు న శౌచమస్తి, నాచారో అస్తి, నచ సత్యమేవ తిష్టతి. తే ఆసురాః మనుష్యాః కథయంతి. యజ్జగదసత్య మప్రతిష్టం (ధర్మాధర్మ వ్యవస్థా రహితం), ఈశ్వరరహితం, అన్యోన్య సంభూతం చాస్తి, (స్త్రీ పురుష మిథున జనిత మస్తీత్యర్థః). అస్య జగతఃనాన్యత్ కిమపి కారణమస్తి. ఇదం కేవలం స్త్రీపురుష యోః కామజనిత సం యోగాదేవ ఉత్పన్నమస్తి. తే సర్వే మందబుద్ధయః మనుష్యాః. ఏతాం దృష్టి మాశ్రిత్య మలినచిత్తాః ఉగ్రకర్మాణః అహిత కారిణశ్చ భూత్వా జగతఃవినాశాయైవ జాయంతే. తే దుష్పూరాః (కేనాపి ప్రకారేణ అపూరణీయాః), కామనా ఆశ్రిత్య దంభామాన మద వశీభూతాః మోహాత్ అసద్గ్రహాన్ (అనేక కపటప్రబంధే నాముకో మనోరధో పూర్ణో భవిష్యతీతి ఈ దృశం వేదశాస్త్ర నిరుద్ధాం దురాశాం స్వీకృత్య, అశుచివ్రతాని (మద్య మాంసాదినా తథా చర్యేణ, అసత్యేన కపటాదినా సంపాదితాని నరకాద్యుత్పాదకాని కువ్రతాని) పరిగృహ్య, శాస్త్ర విరుద్ధే కర్మసు - పాపకర్మసు - ప్రవృత్తిం భవంతి. అంతిమశ్వాస పర్యంతం అపార విషయ చింతాభిరా వృతాస్తే.” కామోపభోగ ఏవ పరమః పురుషార్థః ” ఇత్యేవం రూపం స్థిర నిశ్చయం కృత్వా ఆశాపాశ శతైర్బద్ధాః కామ క్రోధ పరాయణాః భూత్వా కామోపభోగార్థం అన్యాయేన - చౌర్యేణ, విశ్వాస ఘతాదినా - ధన సంచయ మీహతే. అద్యమయా ఇదం ప్రాప్తం, అయం మనోరధోపి పూర్ణా భవిష్యతి, ఇదం ధనం మమాస్తి, పునస్తద్ధనమపి ప్రాప్తం భవిష్యతి. మయాముకః శతృర్హతః, అధునాతాన్శత్రూన్ అపి హనిష్యామి. అహమీశ్వరః (ఇవ సర్వ శక్తిమాన్) అస్మి, అహంభోగీ, అహం సిద్ధో, అహం బలవాన్, అహం సుఖీ, అహం ఆఢ్యః, అహం అభిజనవానస్మి, కో అన్యో మయా సదృశోస్తి. అహం యజ్ఞం కరిష్యామి, అహం (నామఖ్యాపనార్థం యశసే స్వార్థాయవా) దానం కరిష్యామి, అహం మోష్యే ఇత్య్తేవం రూపేణా జ్ఞానేన మోహితాస్తే వివిధ విషయాణాం చింతనే సం లగ్నాః విభ్రాంత చిత్తాః, మోహజాలసమావృతాః, కామభోగా సక్తాః భూత్వా మహాక్లేశదాయకేష్పూ పవిత్రేషు, నరకేషు పతంతే అభిమానినః స్వయం ఆత్మానం శ్రేష్గ్తం మన్యంతే - స్వాత్మని పూజ్య బుద్ధిం దధతి - స్తబ్దాస్తిష్టంతి. ధనమానమదైః మత్తాస్తే కేవలం దంభ పూర్వకం లోకానాం సమక్షే ద్వీయం ధర్మాత్మతాం ఖ్యాపయితుం - నతు ఈశ్వర ప్రీత్యర్థం శ్రద్ధావిశ్వాస పూర్వకం) అవిధ పూర్వకం నామ మాత్రైః యజ్ఞైః యజంతి. అహంకారం బలం దర్పం కామక్రోధంచ సంశ్రితాస్తే స్వాత్మ పరదేహేషు - ఆత్మరూపేణ స్థితం మాం భగవంతం ద్విషంతి, తథా సత్యమార్గే విచారత్సు సాధుషు దోషారోపణం కుర్వంతి. అహం తాన్ మాం ద్విషతః క్రూరాన్ నరాధమాన్ పాపినశ్చ మనుష్యాన్ సంసారే భూయో భూయః ఆసురీషు యోనిష్వేవక్షిపామి. హే అర్జున ! తే మూఢాః పురుషాః ఏవం జన్మని జన్మని వారం వారం ఆసరీం యోని మాపన్నాః మాం - భగవంతం - అప్రాప్య - మమ ప్రాప్తిస్తు దూరే తిష్టతు, మత్ప్రాప్తి యోగ్యతా శ్రయం మనుష్య శరీరమపి న ప్రాప్య - అతోప్యధమాం యోనిం ప్రాప్నువంతి,

“శ్రీమద్భగవద్గీతయాః షోడశోధ్యాయే శ్రీభగవతా ఆసుర సంపత్తే ర్యద్వర్ణనం కృతం తస్య భావార్థమేవ మస్తి”.

(ధర్మాధర్మ విషయమైన ప్రవృత్తి నివృత్తి మార్గములను తెలియనటువంటి మనుష్యులు ఆసురులు - అందుచేత వారిలో శుచి,శుభ్రము ఉండదు, ఆచారములేదు, సత్యములేదు. ఆసురులని చెప్పబడు మనుష్యుల అభిప్రాయము ఈ విధముగా నున్నది :- ఈ జగత్తు అసత్యము, ధర్మా ధర్మములు లేనిది; దీనికి ఈశ్వరుడన్నవాడు లేడు - ఒకదానితో ఒకటి కలియుటవలన ఈ జగత్తు కలిగినది - స్త్రీపురుష సంయోగమువలన కలిగినది. ఇది కలుగుటకు ఇంకొక కారణములేదు. ఇటువంటి అభిప్రాయము గలవారు, మంద బుద్ధిగలవారు, కాలుష్యము పొందిన మనస్సు గలవారు, ఉగ్రకర్మలు చేయువారు, జగత్తుకు కావలసిన మంచిపనులు చేయనివారు. ఇట్టివారు జగత్తుయొక్క నాశనముకొఱకే పుట్టుచుందురు - ఇట్టివారు ఏ విధమైనకోరికలచేతను సంతుష్టి పొందక, దంభము, అభిమానము మొదలైనవాటికి వశులై, ఈ కపటచర్యలవలన మా కోరికలు నెరవేరును. వేదశాస్త్ర విరుద్ధమైన మోహబుద్ధిగలవారై మాంసభక్షణమువలన, కపటమువలన, అసత్యమువలన, నరకముల పొందింపచేయు పాపకర్మలు చేయువారగుదురు. ఆఖరు నిముషమువరకు విషయములందు మితిలేని చింతగలిగి యుందురు. కోరికలననుభవించుటయే పరమ పురుషార్థము - మోక్షము - అని నిశ్చయించుకొని వందలకొలది ఆశలను పాశములచేత కట్టబడినవారై కామ క్రోధములందు మిక్కిలి ఆసక్తి గలవారై కోరికలననుభవించుటకు విశ్వాసఘాతము మొదలైన అన్యాయమార్గములద్వారా ధనము సంపాదింపకోరుదురు. “ఇప్పుడు ఇది నాకు కలిగినది, నా కోరిక పూర్తిగ నిండును, ఈ ధనమంతా నాకు ప్రాప్తించినది. ఇంకను ఇటువంటి ధనము కలుగగలదు. నేను శత్రువులను చంపితిని, ఇంకను శత్రువులను చంపివేసెదను; నేను సర్వ శక్తులుగలవాడను, అందుచేత ఈశ్వరుడను నేనే. నేను భోగములననుభవించుచున్నాను, నేనే సిద్ధిని పొందువాడను. నేనే బలవంతుడను, సుఖముగానున్నాను, శక్తిగలవాడను, గొప్పవాడను, గొప్పకులమందు పుట్టినవాడను, నాతో సమానుడెవ్వడున్నాడు; నేను యజ్ఞము చేయుచున్నాను - పేరు తెచ్చుకొనుటకుగాని, కీర్తి సంపాదించుటకుగాని, స్వార్థముగుఱించిగాని - దానము చేయుచున్నాను, నేను సంతోషముగానున్నాను.” ఈ విధమైన అజ్ఞానముచేత మోహము చెందినవారై, అనేక విషయములందు తగులుకొనిన ఆలోచనలు కలవారై, భ్రాంతిచెందిన చిత్తముగలవారై, గొప్ప కష్టములననుభవింపచేయు అపరిమితమైన నరకములందు పడుదురు. అటువంటి ఆత్మాభిమానముకలవారు తామే శ్రేష్టులమని - గొప్పవారమని - తలంచెదరు, అందుచేత తామే పూజనీయులమని తలచెదరు. అట్టివారు స్తబ్దులు, మత్తులు, లోకులముందు డాబుకొఱకు పనులు చేయువారు - శ్రద్ధావిశ్వాసములతో భగవంతుని ఉద్దేశించికాక, తమపేరు నిలబెట్టుకొనుటకు నామమాత్రముగా - చేసేను అంటే చేసేను అనినట్లు - యజ్ఞములు చేయువారు. అహంకారము, బలము, ధర్పము, కామము, క్రోధమును అవలంభించినవారై, తమలోను, అందఱిలోను ఆత్మ రూపమున నున్న భగవంతుని ద్వేషించుచుందురు. సత్యప్రవర్తనగల సాధువులందు దోషముల నారోపించెదరు. నన్ను ద్వేషించుచున్న ఆ క్రూరులను, పాపులను, నరాధములను సంసారమందు ఆసురయోనులందే - ఆసురులుగా పుట్టినట్లు - మరల మరల నేను త్రోసివేయుచుందును. ఈ ప్రకారముగా మూఢులయిన ఇట్టి పురుషులు మాటి మాటికి ఆసుర జన్మమెత్తుచు, నన్ను చేరలేక - నన్ను చేరుటకు యోగ్యమైన మానవశరీరమునైనను పొందలేక, అధమ శరీరమును - జన్మమును - పొందుచున్నారు).

(శ్రీమద్భగవద్గీతయందు 16 వ అధ్యాయములో శ్రీకృష్ణభగవానుడు ఆసుర సంపద వర్ణించియున్నాడు - దాని భావమే పైన చెప్పబడినది).

  1. “దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమతా” (శ్రీమద్భగవద్గీత - 16 - 5)

(ఆసురీసంపద బంధమును కలుగచేయును).

Transliteration
  1. “daṃbhō darpō abhimānaśca krōdhaḥ pāruṣya mēva ca |

ajñānaṃ cābhi jātasya pārtha saṃpadamāsurīṃ ||” (śrīmadbhagavadgīta - 16 - 4)

(daṃbhamu, garvamu, abhimānamu, kōpamu, kāṭhinyamu, avivēkamu anu durguṇamulu kaligiyuṃḍuṭa āsurīsaṃpada).

(śrīmadbhagavadgītalō 16 va adhyāyamulō 7 modalu 20 varakugala ślōkamulalō āsurīsaṃpada ceppabaḍinadi. dāni bhāvamu ī kriṃdavidhamugānunnadi :-

“āsurō manuṣyāḥ dharmā dharma viṣayaṇi pravṛttiṃ nivṛttiṃca na jānaṃti. ataḥ tēṣu na śaucamasti, nācārō asti, naca satyamēva tiṣṭati. tē āsurāḥ manuṣyāḥ kathayaṃti. yajjagadasatya mapratiṣṭaṃ (dharmādharma vyavasthā rahitaṃ), īśvararahitaṃ, anyōnya saṃbhūtaṃ cāsti, (strī puruṣa mithuna janita mastītyarthaḥ). asya jagataḥnānyat kimapi kāraṇamasti. idaṃ kēvalaṃ strīpuruṣa yōḥ kāmajanita saṃ yōgādēva utpannamasti. tē sarvē maṃdabuddhayaḥ manuṣyāḥ. ētāṃ dṛṣṭi māśritya malinacittāḥ ugrakarmāṇaḥ ahita kāriṇaśca bhūtvā jagataḥvināśāyaiva jāyaṃtē. tē duṣpūrāḥ (kēnāpi prakārēṇa apūraṇīyāḥ), kāmanā āśritya daṃbhāmāna mada vaśībhūtāḥ mōhāt asadgrahān (anēka kapaṭaprabaṃdhē nāmukō manōradhō pūrṇō bhaviṣyatīti ī dṛśaṃ vēdaśāstra niruddhāṃ durāśāṃ svīkṛtya, aśucivratāni (madya māṃsādinā tathā caryēṇa, asatyēna kapaṭādinā saṃpāditāni narakādyutpādakāni kuvratāni) parigṛhya, śāstra viruddhē karmasu - pāpakarmasu - pravṛttiṃ bhavaṃti. aṃtimaśvāsa paryaṃtaṃ apāra viṣaya ciṃtābhirā vṛtāstē.” kāmōpabhōga ēva paramaḥ puruṣārthaḥ ” ityēvaṃ rūpaṃ sthira niścayaṃ kṛtvā āśāpāśa śatairbaddhāḥ kāma krōdha parāyaṇāḥ bhūtvā kāmōpabhōgārthaṃ anyāyēna - cauryēṇa, viśvāsa ghatādinā - dhana saṃcaya mīhatē. adyamayā idaṃ prāptaṃ, ayaṃ manōradhōpi pūrṇā bhaviṣyati, idaṃ dhanaṃ mamāsti, punastaddhanamapi prāptaṃ bhaviṣyati. mayāmukaḥ śatṛrhataḥ, adhunātānśatrūn api haniṣyāmi. ahamīśvaraḥ (iva sarva śaktimān) asmi, ahaṃbhōgī, ahaṃ siddhō, ahaṃ balavān, ahaṃ sukhī, ahaṃ āḍhyaḥ, ahaṃ abhijanavānasmi, kō anyō mayā sadṛśōsti. ahaṃ yajñaṃ kariṣyāmi, ahaṃ (nāmakhyāpanārthaṃ yaśasē svārthāyavā) dānaṃ kariṣyāmi, ahaṃ mōṣyē itytēvaṃ rūpēṇā jñānēna mōhitāstē vividha viṣayāṇāṃ ciṃtanē saṃ lagnāḥ vibhrāṃta cittāḥ, mōhajālasamāvṛtāḥ, kāmabhōgā saktāḥ bhūtvā mahāklēśadāyakēṣpū pavitrēṣu, narakēṣu pataṃtē abhimāninaḥ svayaṃ ātmānaṃ śrēṣgtaṃ manyaṃtē - svātmani pūjya buddhiṃ dadhati - stabdāstiṣṭaṃti. dhanamānamadaiḥ mattāstē kēvalaṃ daṃbha pūrvakaṃ lōkānāṃ samakṣē dvīyaṃ dharmātmatāṃ khyāpayituṃ - natu īśvara prītyarthaṃ śraddhāviśvāsa pūrvakaṃ) avidha pūrvakaṃ nāma mātraiḥ yajñaiḥ yajaṃti. ahaṃkāraṃ balaṃ darpaṃ kāmakrōdhaṃca saṃśritāstē svātma paradēhēṣu - ātmarūpēṇa sthitaṃ māṃ bhagavaṃtaṃ dviṣaṃti, tathā satyamārgē vicāratsu sādhuṣu dōṣārōpaṇaṃ kurvaṃti. ahaṃ tān māṃ dviṣataḥ krūrān narādhamān pāpinaśca manuṣyān saṃsārē bhūyō bhūyaḥ āsurīṣu yōniṣvēvakṣipāmi. hē arjuna ! tē mūḍhāḥ puruṣāḥ ēvaṃ janmani janmani vāraṃ vāraṃ āsarīṃ yōni māpannāḥ māṃ - bhagavaṃtaṃ - aprāpya - mama prāptistu dūrē tiṣṭatu, matprāpti yōgyatā śrayaṃ manuṣya śarīramapi na prāpya - atōpyadhamāṃ yōniṃ prāpnuvaṃti,

“śrīmadbhagavadgītayāḥ ṣōḍaśōdhyāyē śrībhagavatā āsura saṃpattē ryadvarṇanaṃ kṛtaṃ tasya bhāvārthamēva masti”.

(dharmādharma viṣayamaina pravṛtti nivṛtti mārgamulanu teliyanaṭuvaṃṭi manuṣyulu āsurulu - aṃducēta vārilō śuci,śubhramu uṃḍadu, ācāramulēdu, satyamulēdu. āsurulani ceppabaḍu manuṣyula abhiprāyamu ī vidhamugā nunnadi :- ī jagattu asatyamu, dharmā dharmamulu lēnidi; dīniki īśvaruḍannavāḍu lēḍu - okadānitō okaṭi kaliyuṭavalana ī jagattu kaliginadi - strīpuruṣa saṃyōgamuvalana kaliginadi. idi kaluguṭaku iṃkoka kāraṇamulēdu. iṭuvaṃṭi abhiprāyamu galavāru, maṃda buddhigalavāru, kāluṣyamu poṃdina manassu galavāru, ugrakarmalu cēyuvāru, jagattuku kāvalasina maṃcipanulu cēyanivāru. iṭṭivāru jagattuyokka nāśanamukoṟakē puṭṭucuṃduru - iṭṭivāru ē vidhamainakōrikalacētanu saṃtuṣṭi poṃdaka, daṃbhamu, abhimānamu modalainavāṭiki vaśulai, ī kapaṭacaryalavalana mā kōrikalu neravērunu. vēdaśāstra viruddhamaina mōhabuddhigalavārai māṃsabhakṣaṇamuvalana, kapaṭamuvalana, asatyamuvalana, narakamula poṃdiṃpacēyu pāpakarmalu cēyuvāraguduru. ākharu nimuṣamuvaraku viṣayamulaṃdu mitilēni ciṃtagaligi yuṃduru. kōrikalananubhaviṃcuṭayē parama puruṣārthamu - mōkṣamu - ani niścayiṃcukoni vaṃdalakoladi āśalanu pāśamulacēta kaṭṭabaḍinavārai kāma krōdhamulaṃdu mikkili āsakti galavārai kōrikalananubhaviṃcuṭaku viśvāsaghātamu modalaina anyāyamārgamuladvārā dhanamu saṃpādiṃpakōruduru. “ippuḍu idi nāku kaliginadi, nā kōrika pūrtiga niṃḍunu, ī dhanamaṃtā nāku prāptiṃcinadi. iṃkanu iṭuvaṃṭi dhanamu kalugagaladu. nēnu śatruvulanu caṃpitini, iṃkanu śatruvulanu caṃpivēsedanu; nēnu sarva śaktulugalavāḍanu, aṃducēta īśvaruḍanu nēnē. nēnu bhōgamulananubhaviṃcucunnānu, nēnē siddhini poṃduvāḍanu. nēnē balavaṃtuḍanu, sukhamugānunnānu, śaktigalavāḍanu, goppavāḍanu, goppakulamaṃdu puṭṭinavāḍanu, nātō samānuḍevvaḍunnāḍu; nēnu yajñamu cēyucunnānu - pēru teccukonuṭakugāni, kīrti saṃpādiṃcuṭakugāni, svārthamuguṟiṃcigāni - dānamu cēyucunnānu, nēnu saṃtōṣamugānunnānu.” ī vidhamaina ajñānamucēta mōhamu ceṃdinavārai, anēka viṣayamulaṃdu tagulukonina ālōcanalu kalavārai, bhrāṃticeṃdina cittamugalavārai, goppa kaṣṭamulananubhaviṃpacēyu aparimitamaina narakamulaṃdu paḍuduru. aṭuvaṃṭi ātmābhimānamukalavāru tāmē śrēṣṭulamani - goppavāramani - talaṃcedaru, aṃducēta tāmē pūjanīyulamani talacedaru. aṭṭivāru stabdulu, mattulu, lōkulamuṃdu ḍābukoṟaku panulu cēyuvāru - śraddhāviśvāsamulatō bhagavaṃtuni uddēśiṃcikāka, tamapēru nilabeṭṭukonuṭaku nāmamātramugā - cēsēnu aṃṭē cēsēnu aninaṭlu - yajñamulu cēyuvāru. ahaṃkāramu, balamu, dharpamu, kāmamu, krōdhamunu avalaṃbhiṃcinavārai, tamalōnu, aṃdaṟilōnu ātma rūpamuna nunna bhagavaṃtuni dvēṣiṃcucuṃduru. satyapravartanagala sādhuvulaṃdu dōṣamula nārōpiṃcedaru. nannu dvēṣiṃcucunna ā krūrulanu, pāpulanu, narādhamulanu saṃsāramaṃdu āsurayōnulaṃdē - āsurulugā puṭṭinaṭlu - marala marala nēnu trōsivēyucuṃdunu. ī prakāramugā mūḍhulayina iṭṭi puruṣulu māṭi māṭiki āsura janmamettucu, nannu cēralēka - nannu cēruṭaku yōgyamaina mānavaśarīramunainanu poṃdalēka, adhama śarīramunu - janmamunu - poṃducunnāru).

(śrīmadbhagavadgītayaṃdu 16 va adhyāyamulō śrīkṛṣṇabhagavānuḍu āsura saṃpada varṇiṃciyunnāḍu - dāni bhāvamē paina ceppabaḍinadi).

  1. “daivī saṃpadvimōkṣāya nibaṃdhāyāsurīmatā” (śrīmadbhagavadgīta - 16 - 5)

(āsurīsaṃpada baṃdhamunu kalugacēyunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.