(మనస్సు నిర్మలముగా నుండుట - అంతఃకరణము నిర్మలముగా - దోషము లేకుండ - నుండుట).
(భగవంతుడు రజస్తమోగుణములతో కలియని సత్వగుణముకలవాడు - అందుచేత శుద్ధ సత్వగుణము కలిగియుండుట).
(మనస్సు శుద్ధసత్వగుణము కలిగియుండుట),
(బంధమునకు మోక్షమునకు మనస్సే కారణము. మనస్సు శుద్ధముగా నుండిన - నిర్మలముగా నుండిన - పాప కర్మల దోషము అంటదు. చేసిన కర్మలన్నియు భగవంతునికొఱకే చేయుచున్నానని, వాటి ఫలమును తాను ఆశించక భగవంతునికి అర్పణచేయుటవలన అవి బంధము కలుగచేయవు. ఈ ప్రకారముగా ఆత్మశుద్ధి వలన - చిత్త శుద్ధివలన బంధము పోయి ముక్తికి కారణమగును).
(ఇది వఱకు జన్మలలో చేసిన కర్మలవలన కలిగిన బంధము నశించుట).
యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా త్మ శుద్ధయే ||“. (శ్రీమద్భగవద్గీత - 5 - 11)
(ఆత్మ శుద్ధికొఱకు - నిష్కామకర్మయోగులు తాము శరీరముతోను, మనస్సుతోను, బుద్ధితోను, ఇంద్రియములతోను చేయు కర్మలన్నియు వాటి ఫలమందు అభిలాషలేక చేయుదురు. ఆత్మశుద్ధి కొఱకు నిష్కామకర్మయోగులు తాము శరీరముచేతగాని, ఇంద్రియములచేతగాని, మనస్సుచేతగాని చేయు కర్మలన్నియు వాటి ఫలమందాసక్తి లేకనే, కేవలము భగవంతునికొఱకే నేనీ కర్మ చేయుచున్నాను - యజమాని కర్మ సేవకుడు చేయునట్లు చేయుచున్నాను కాని దీని ఫలము నాకు కలుగవలెనని నేను ఈ కర్మలను చేయుటలేదు, భగవంతుడు నా యజమాని, అతని సేవకుడను నేను, అతని భక్తుడను - అను అభిప్రాయముతో చేయుదురు).
నిత్యం నైమిత్తికం కర్మ సదైవాత్మ విశుద్ధయే ||“. (నైష్కర్మ్య సిద్ధి - 1 - 50)
(ఆత్మజ్ఞానము కోఱువారు, మోక్షము కోరువారు చిత్తశుద్ధి కొఱకు నిత్య నైమిత్తిక కర్మలను ఎల్లపుడు చేయవలసినదే).
అజ్ఞానాన్మలినో భాతి జ్ఞానాత్ శుద్ధో విభాత్యయం |
అజ్ఞానమల పంకం యః క్షాళయేత్ జ్ఞానతోయతః |
స ఏవ సర్వదా శుద్ధో నాన్యకర్మ రతోహి సః ||“. (దర్శనోపనిషత్)
(ఆత్మ ఎప్పుడూ శుద్ధమైనది, నిత్యమైనది, సుఖరూపమైనది, స్వయముగా ప్రకాశించునది, అజ్ఞానమువలన మలినమై యుండును, అనగా మసి పూసినట్లు కప్పబడియుండును. జ్ఞానమువలన శుద్ధముగా, నిర్మలముగా కనబడును - అజ్ఞానమువలన కలిగిన మలినమును - బురదను - జ్ఞానమను నీటితో కడిగివేయవలెను - ఈ ప్రకారము చేసినవాడు ఎల్లపుడు శుద్ధుడే).
(యోగియగువాడు మనశ్శుద్ధికొఱకు శుభ్రమైన ప్రదేశమునందు స్థిరమైన ఆసనము వేసికొని, అక్కడ మనస్సును ఒకే ఒక ధ్యానమందు ఏకాగ్రముగా చేసి నిలుపుకొని, కర్మలను, ఇంద్రియములను, మనస్సును తన స్వాధీనములో నుంచుకొని యోగము నభ్యసించవలెను).
(ప్రపంచములోని వస్తువుల మాలిన్యము నీటితో కడిగిన పోదు - భగవంతునియందు భక్తికలిగియుండి, ఫలాసక్తిలేక కర్మలు చేసి వాటిని భగవంతునికి అర్పించుటవలన మనస్సు (ఆత్మ) శుద్ధమగును - నిర్మలమగును).
(manassu nirmalamugā nuṃḍuṭa - aṃtaḥkaraṇamu nirmalamugā - dōṣamu lēkuṃḍa - nuṃḍuṭa).
(bhagavaṃtuḍu rajastamōguṇamulatō kaliyani satvaguṇamukalavāḍu - aṃducēta śuddha satvaguṇamu kaligiyuṃḍuṭa).
(manassu śuddhasatvaguṇamu kaligiyuṃḍuṭa),
(baṃdhamunaku mōkṣamunaku manassē kāraṇamu. manassu śuddhamugā nuṃḍina - nirmalamugā nuṃḍina - pāpa karmala dōṣamu aṃṭadu. cēsina karmalanniyu bhagavaṃtunikoṟakē cēyucunnānani, vāṭi phalamunu tānu āśiṃcaka bhagavaṃtuniki arpaṇacēyuṭavalana avi baṃdhamu kalugacēyavu. ī prakāramugā ātmaśuddhi valana - citta śuddhivalana baṃdhamu pōyi muktiki kāraṇamagunu).
(idi vaṟaku janmalalō cēsina karmalavalana kaligina baṃdhamu naśiṃcuṭa).
yōginaḥ karma kurvaṃti saṃgaṃ tyaktvā tma śuddhayē ||“. (śrīmadbhagavadgīta - 5 - 11)
(ātma śuddhikoṟaku - niṣkāmakarmayōgulu tāmu śarīramutōnu, manassutōnu, buddhitōnu, iṃdriyamulatōnu cēyu karmalanniyu vāṭi phalamaṃdu abhilāṣalēka cēyuduru. ātmaśuddhi koṟaku niṣkāmakarmayōgulu tāmu śarīramucētagāni, iṃdriyamulacētagāni, manassucētagāni cēyu karmalanniyu vāṭi phalamaṃdāsakti lēkanē, kēvalamu bhagavaṃtunikoṟakē nēnī karma cēyucunnānu - yajamāni karma sēvakuḍu cēyunaṭlu cēyucunnānu kāni dīni phalamu nāku kalugavalenani nēnu ī karmalanu cēyuṭalēdu, bhagavaṃtuḍu nā yajamāni, atani sēvakuḍanu nēnu, atani bhaktuḍanu - anu abhiprāyamutō cēyuduru).
nityaṃ naimittikaṃ karma sadaivātma viśuddhayē ||“. (naiṣkarmya siddhi - 1 - 50)
(ātmajñānamu kōṟuvāru, mōkṣamu kōruvāru cittaśuddhi koṟaku nitya naimittika karmalanu ellapuḍu cēyavalasinadē).
ajñānānmalinō bhāti jñānāt śuddhō vibhātyayaṃ |
ajñānamala paṃkaṃ yaḥ kṣāḷayēt jñānatōyataḥ |
sa ēva sarvadā śuddhō nānyakarma ratōhi saḥ ||“. (darśanōpaniṣat)
(ātma eppuḍū śuddhamainadi, nityamainadi, sukharūpamainadi, svayamugā prakāśiṃcunadi, ajñānamuvalana malinamai yuṃḍunu, anagā masi pūsinaṭlu kappabaḍiyuṃḍunu. jñānamuvalana śuddhamugā, nirmalamugā kanabaḍunu - ajñānamuvalana kaligina malinamunu - buradanu - jñānamanu nīṭitō kaḍigivēyavalenu - ī prakāramu cēsinavāḍu ellapuḍu śuddhuḍē).
(yōgiyaguvāḍu manaśśuddhikoṟaku śubhramaina pradēśamunaṃdu sthiramaina āsanamu vēsikoni, akkaḍa manassunu okē oka dhyānamaṃdu ēkāgramugā cēsi nilupukoni, karmalanu, iṃdriyamulanu, manassunu tana svādhīnamulō nuṃcukoni yōgamu nabhyasiṃcavalenu).
(prapaṃcamulōni vastuvula mālinyamu nīṭitō kaḍigina pōdu - bhagavaṃtuniyaṃdu bhaktikaligiyuṃḍi, phalāsaktilēka karmalu cēsi vāṭini bhagavaṃtuniki arpiṃcuṭavalana manassu (ātma) śuddhamagunu - nirmalamagunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.