← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్మ తృప్తః ātma tṛptaḥ

Original — తెలుగు
  1. ఆత్మనా ఏవ తృప్తః; న అన్నరసాదినా, ఆత్మ వ్యతిరిక్తైః -

(ఆత్మకు వ్యతిరేకమైన అన్నరసాదుల వలనకాక ఆత్మయందే తృప్తిని పొందువాడు - ఆత్మధ్యానమునందే తృప్తిని పొందువాడు).

  1. “ఆత్మన్యేవ తుష్టః, నబాహ్యేషు అర్థేషు, సర్వతః నిగత తృష్ణః ఇత్యర్థః”. (భాష్యోత్కర్ష దీపికా)

(తనకు వెలుపలచుట్టూ ఉన్న విషయములందుకాక తనలోనున్న ఆత్మయందే - పరమాత్మ ధ్యానమునందే సంతోషించువాడు - అన్ని విధముల, అన్నింటియందు ఆశ వదలుకొనినవాడు).

  1. “స్వానందాను భవేన నిర్వృతః -”. (శ్రీధరీయ వ్యాఖ్యా)

(స్వానందము అనగా ఆత్మానందము, బ్రహ్మానందము - దానిచే సంతుష్టి పొందినవాడు).

  1. “ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే |” (శ్రీమద్భగవద్గీత - 2 - 55)

“- - - ఇంద్రియారామః - - - |

తృప్తిం యాత్యన్నపానాదౌ - - - |

విషయాణాం యధోక్తానామ భావే దుఃఖమేతిచ |

సాక్షాత్కృత నిజానందో ద్వైత దృష్టేర భావతః |

అతి తుచ్ఛతయా భోగ్యసుఖం నేచ్ఛతి తత్వ విత్ |

- - - మనో వృత్తి విశేషా హి స్యుః రతి తృప్తి తుష్ట యః |

సాక్షి సిద్ధా అతో(అ)నాత్మ ధర్మాస్తేషు కథం బుధః |

సజ్జేతాత్మ సుఖే మగ్నో గలితానాత్మ థీః స్వతః |

ఆత్మన్యేవ సుఖాంబోధే స్వభావాదేవ తత్వవిత్ |

రతిం తృప్తించ తుష్టించ యాత్యసౌ సుఖసాగరః ||“.

(ఇంద్రియములద్వారా తృప్తిని పొందువాడు, అన్నపానాదులతో తృప్తిని పొందును. కాని ఇంద్రియములకు విషయములైన భోగములు లేకున్న దుఃఖమును పొందును. భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, ఉన్నది అంతా భగవంతుడే, అనుజ్ఞానము కలిగినవాడు - పరమాత్మయొక్క ఆనందస్వరూపమును సాక్షాత్కరించుకొనినవాడు - ఇంద్రియములద్వారా కలిగిన భోగములను అతి తుచ్ఛములని వాటిని కోరడు. విషయములవలన వలన కలిగిన రతి, తృప్తి, తుష్టి అనునవి మనస్సు యొక్క వ్యాపారములు; వాటికి ఆత్మయను సాక్షి కలదు, అందుచేత అవి అనాత్మ ధర్మములు - జ్ఞానియగువాడు అనాత్మ వస్తువులందిచ్ఛలేనివాడు, ఆత్మ సుఖమందు - ఆత్మానందమునందు, బ్రహ్మానందమునందు - మునిగియున్నవాడు అనాత్మ ధర్మములందు మునిగియుండడు, వాటిని ఆశించడు. సుఖసముద్రుడు, ఆనందఘనము అయిన పరమాత్మయందే రతిని, తుష్టిని, తృప్తిని పొందును).

Transliteration
  1. ātmanā ēva tṛptaḥ; na annarasādinā, ātma vyatiriktaiḥ -

(ātmaku vyatirēkamaina annarasādula valanakāka ātmayaṃdē tṛptini poṃduvāḍu - ātmadhyānamunaṃdē tṛptini poṃduvāḍu).

  1. “ātmanyēva tuṣṭaḥ, nabāhyēṣu arthēṣu, sarvataḥ nigata tṛṣṇaḥ ityarthaḥ”. (bhāṣyōtkarṣa dīpikā)

(tanaku velupalacuṭṭū unna viṣayamulaṃdukāka tanalōnunna ātmayaṃdē - paramātma dhyānamunaṃdē saṃtōṣiṃcuvāḍu - anni vidhamula, anniṃṭiyaṃdu āśa vadalukoninavāḍu).

  1. “svānaṃdānu bhavēna nirvṛtaḥ -”. (śrīdharīya vyākhyā)

(svānaṃdamu anagā ātmānaṃdamu, brahmānaṃdamu - dānicē saṃtuṣṭi poṃdinavāḍu).

  1. “ātmanyēvātmanā tuṣṭaḥ sthita prajñastadōcyatē |” (śrīmadbhagavadgīta - 2 - 55)

“- - - iṃdriyārāmaḥ - - - |

tṛptiṃ yātyannapānādau - - - |

viṣayāṇāṃ yadhōktānāma bhāvē duḥkhamētica |

sākṣātkṛta nijānaṃdō dvaita dṛṣṭēra bhāvataḥ |

ati tucchatayā bhōgyasukhaṃ nēcchati tatva vit |

- - - manō vṛtti viśēṣā hi syuḥ rati tṛpti tuṣṭa yaḥ |

sākṣi siddhā atō(a)nātma dharmāstēṣu kathaṃ budhaḥ |

sajjētātma sukhē magnō galitānātma thīḥ svataḥ |

ātmanyēva sukhāṃbōdhē svabhāvādēva tatvavit |

ratiṃ tṛptiṃca tuṣṭiṃca yātyasau sukhasāgaraḥ ||“.

(iṃdriyamuladvārā tṛptini poṃduvāḍu, annapānādulatō tṛptini poṃdunu. kāni iṃdriyamulaku viṣayamulaina bhōgamulu lēkunna duḥkhamunu poṃdunu. bhagavaṃtuḍu okkaḍē unnāḍu, unnadi aṃtā bhagavaṃtuḍē, anujñānamu kaliginavāḍu - paramātmayokka ānaṃdasvarūpamunu sākṣātkariṃcukoninavāḍu - iṃdriyamuladvārā kaligina bhōgamulanu ati tucchamulani vāṭini kōraḍu. viṣayamulavalana valana kaligina rati, tṛpti, tuṣṭi anunavi manassu yokka vyāpāramulu; vāṭiki ātmayanu sākṣi kaladu, aṃducēta avi anātma dharmamulu - jñāniyaguvāḍu anātma vastuvulaṃdicchalēnivāḍu, ātma sukhamaṃdu - ātmānaṃdamunaṃdu, brahmānaṃdamunaṃdu - munigiyunnavāḍu anātma dharmamulaṃdu munigiyuṃḍaḍu, vāṭini āśiṃcaḍu. sukhasamudruḍu, ānaṃdaghanamu ayina paramātmayaṃdē ratini, tuṣṭini, tṛptini poṃdunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.