← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్మ విదులు ātma vidulu

Original — తెలుగు
  1. బ్రహ్మ విద్; ముక్తః.

(ఆత్మజ్ఞానము నెఱిగినవాడు; బ్రహ్మ జ్ఞానము నెఱిగినవాడు, బ్రహ్మ తత్త్వమె ఱిగినవాడు. “జ్ఞానదేవ తుకైవల్యం” (జ్ఞానమువలననే - బ్రహ్మజ్ఞానము కలిగినవలననే మోక్షము) అని చెప్పబడియున్నది కనుక ఆత్మవిదులు అనగా ఆత్మజ్ఞానము కలవారు ముక్తులు అని కూడ అర్థము).

  1. ఆత్మానం స్వస్వరూపం విందంతి సాక్షాత్కుర్వంతి ఇతి ఆత్మ విదః.

(తనయొక్క నిజస్వరూపమును - తాను పరమాత్మయే కనుక పరమాత్మ యొక్క నిజస్వరూపమును తెలుసుకొనినవాడు; ఆత్మను సాక్షాత్కరించుకొనువారు.)

  1. ఆత్మానం విదంతి, ఉపాసతే ఇత్యాత్మవిదః - భగవదుపాసనాత్మక యోగ పరిశుద్ధాంతః కరణాః -

(ఆత్మ నిజస్వరూపమును తెలుసుకొనువారు, తెలిసి ఉపాసన చేయువారు. భగవంతుని ఉపాసన అను యోగముచే పరిశుద్ధమైన అంతఃకరణము గలవారు.)

  1. జన్మాది సర్వ విక్రియా రహితత్వేన నిష్క్రియం ఆత్మానం ఆత్మత్వేన యోవేత్తి సః ఆత్మవిత్.

(జన్మ మొదలగు ఏ విధమైన మార్పులు లేకపోవుటచేత ఆత్మను ఆత్మగా తెలుసుకొనినవాడు ఆత్మవిత్ - తనను ఆత్మ యనియే తెలుసుకొనినవాడు).

  1. “సుషుప్తవత్ జాగ్రతి యో నపశ్యతి ద్వయంతు పశ్యన్నపి చా ద్వయత్వతః |

తథాచ కుర్వన్నపి నిష్క్రియశ్చయః స ఆత్మ విన్నాన్య ఇతీహ నిశ్చయః ||“. (ఉపదేశసాహశ్రికాయాం)

“యథా సుషుప్తే కరణో పరమాత్ ద్వయం న పశ్యతి, తథా జాగారితే యో జ్ఞాననిష్ఠః ద్వయం న పశ్యత్యేవ, పశ్యన్నపి మిథ్యారూప సర్పవత్ పరమార్థ బుద్ధ్యా న పశ్యతి అద్వయ రూపత్వాత్, తథాచ భిక్షాటనాదికం ప్రారబ్ధ కర్మఫలం కర్మ జన్మాంతర సంస్కారవశాత్ కుర్వన్నపి పరమార్థ తః నిష్క్రయశ్చ యః స ఆత్మవిత్ నాన్యః అన్యథా దర్శీ”.

(సుషుప్తి అవస్థయందు ఇంద్రియములను జయించి ఉపరతిలోనుండుటవలన ఆత్మకాక ఇతరవస్తువును - రెండవ వస్తువును చూడడు. అట్లే జ్ఞాననిష్ఠలోనున్నవాడు జాగ్రదవస్థలోనున్న ఆత్మగాక ఇంకొక వస్తువును చూడడు, అంతా ఆత్మగానే చూచును - ఆత్మ తప్ప రెండవ వస్తువు లేదని తెలుసుకొనినవాడు కనుక. ప్రపంచమును చూచుచున్నప్పటికీ, కళ్ళు తెరచియుంచి ప్రపంచమును చూచుచునట్లు కనబడినప్పటికీ, కనబడుచున్నదంతయు పరమాత్మయే అని భావించుటవలన చీకటిలో త్రాడును చూచి పాము అనుకొనుట భ్రమవలననే అయినట్లు అంతా పరమాత్మయేగాని ప్రపంచము అని అనుకొనుట భ్రాంతియని తెలుసుకొనును - ప్రపంచమంతా ఆత్మయే కనుక ఆత్మకాక వేరే రెండవ వస్తువు లేనే లేదను జ్ఞానము కలిగియుండుటవలన. ఆ ప్రకారముగానే పూర్వ జన్మలలో చేసిన కర్మ ఫలము నిచ్చుటకు ఆరంభించుటవల తని భిక్షాటనము చేయుచున్నను నిష్క్రియుడే - ఏ పనియును చేయనివాడే).

  1. “తరతి శోకమాత్మ విత్” (ఛాందోగ్యోపనిషత్ - 7 - 1 - 3)

(ఆత్మజ్ఞానము గలవాడు దుఃఖసముద్రమైన, జననమరణరూపమైన సంసారమును తరించును, దాటును).

  1. “ఆ. అన్నమవనియందు, నమృతంబు గోవుల

యందు వహ్ని సమిధలందు నమర

యోగవశతబొందునో జను బుద్ధిచే

నగుణు నిన్నుగాంతురాత్మ విదులు “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 6 - 166)

(చూడుము - ‘ఆత్మ’ – 10.3)

  1. “సీ. వినుమాత్మవేత్తకు విష్ణుస్వరూపంబు నెఱుంగం బడు - - -”. (చూడుము - ‘ఆత్మ’ – 10.6).

  2. “కొందఱు జగచ్ఛరీరుడవుగాన - - - (చూడుము ‘ఆత్మ’ – 10.8).

జగద్రూపకుండవైన నిన్ను గటకమకుటకర్ణికాది వివిధ భూషణ భేదంబులం గనకంబు నిజస్వరూపంబు విడువకవర్తించు చందంబున జగత్వికారానుగతుండవయ్యును నిఖిలహేయ ప్రత్యనీక కల్యాణగుణాత్మకుండవై యుందువని యాత్మవిదులైనవారు తెలియుదురు“.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. - 1220)

Transliteration
  1. brahma vid; muktaḥ.

(ātmajñānamu neṟiginavāḍu; brahma jñānamu neṟiginavāḍu, brahma tattvame ṟiginavāḍu. “jñānadēva tukaivalyaṃ” (jñānamuvalananē - brahmajñānamu kaliginavalananē mōkṣamu) ani ceppabaḍiyunnadi kanuka ātmavidulu anagā ātmajñānamu kalavāru muktulu ani kūḍa arthamu).

  1. ātmānaṃ svasvarūpaṃ viṃdaṃti sākṣātkurvaṃti iti ātma vidaḥ.

(tanayokka nijasvarūpamunu - tānu paramātmayē kanuka paramātma yokka nijasvarūpamunu telusukoninavāḍu; ātmanu sākṣātkariṃcukonuvāru.)

  1. ātmānaṃ vidaṃti, upāsatē ityātmavidaḥ - bhagavadupāsanātmaka yōga pariśuddhāṃtaḥ karaṇāḥ -

(ātma nijasvarūpamunu telusukonuvāru, telisi upāsana cēyuvāru. bhagavaṃtuni upāsana anu yōgamucē pariśuddhamaina aṃtaḥkaraṇamu galavāru.)

  1. janmādi sarva vikriyā rahitatvēna niṣkriyaṃ ātmānaṃ ātmatvēna yōvētti saḥ ātmavit.

(janma modalagu ē vidhamaina mārpulu lēkapōvuṭacēta ātmanu ātmagā telusukoninavāḍu ātmavit - tananu ātma yaniyē telusukoninavāḍu).

  1. “suṣuptavat jāgrati yō napaśyati dvayaṃtu paśyannapi cā dvayatvataḥ |

tathāca kurvannapi niṣkriyaścayaḥ sa ātma vinnānya itīha niścayaḥ ||“. (upadēśasāhaśrikāyāṃ)

“yathā suṣuptē karaṇō paramāt dvayaṃ na paśyati, tathā jāgāritē yō jñānaniṣṭhaḥ dvayaṃ na paśyatyēva, paśyannapi mithyārūpa sarpavat paramārtha buddhyā na paśyati advaya rūpatvāt, tathāca bhikṣāṭanādikaṃ prārabdha karmaphalaṃ karma janmāṃtara saṃskāravaśāt kurvannapi paramārtha taḥ niṣkrayaśca yaḥ sa ātmavit nānyaḥ anyathā darśī”.

(suṣupti avasthayaṃdu iṃdriyamulanu jayiṃci uparatilōnuṃḍuṭavalana ātmakāka itaravastuvunu - reṃḍava vastuvunu cūḍaḍu. aṭlē jñānaniṣṭhalōnunnavāḍu jāgradavasthalōnunna ātmagāka iṃkoka vastuvunu cūḍaḍu, aṃtā ātmagānē cūcunu - ātma tappa reṃḍava vastuvu lēdani telusukoninavāḍu kanuka. prapaṃcamunu cūcucunnappaṭikī, kaḷḷu teraciyuṃci prapaṃcamunu cūcucunaṭlu kanabaḍinappaṭikī, kanabaḍucunnadaṃtayu paramātmayē ani bhāviṃcuṭavalana cīkaṭilō trāḍunu cūci pāmu anukonuṭa bhramavalananē ayinaṭlu aṃtā paramātmayēgāni prapaṃcamu ani anukonuṭa bhrāṃtiyani telusukonunu - prapaṃcamaṃtā ātmayē kanuka ātmakāka vērē reṃḍava vastuvu lēnē lēdanu jñānamu kaligiyuṃḍuṭavalana. ā prakāramugānē pūrva janmalalō cēsina karma phalamu niccuṭaku āraṃbhiṃcuṭavala tani bhikṣāṭanamu cēyucunnanu niṣkriyuḍē - ē paniyunu cēyanivāḍē).

  1. “tarati śōkamātma vit” (chāṃdōgyōpaniṣat - 7 - 1 - 3)

(ātmajñānamu galavāḍu duḥkhasamudramaina, jananamaraṇarūpamaina saṃsāramunu tariṃcunu, dāṭunu).

  1. “ā. annamavaniyaṃdu, namṛtaṃbu gōvula

yaṃdu vahni samidhalaṃdu namara

yōgavaśataboṃdunō janu buddhicē

naguṇu ninnugāṃturātma vidulu “. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 6 - 166)

(cūḍumu - ‘ātma’ – 10.3)

  1. “sī. vinumātmavēttaku viṣṇusvarūpaṃbu neṟuṃgaṃ baḍu - - -”. (cūḍumu - ‘ātma’ – 10.6).

  2. “koṃdaṟu jagaccharīruḍavugāna - - - (cūḍumu ‘ātma’ – 10.8).

jagadrūpakuṃḍavaina ninnu gaṭakamakuṭakarṇikādi vividha bhūṣaṇa bhēdaṃbulaṃ ganakaṃbu nijasvarūpaṃbu viḍuvakavartiṃcu caṃdaṃbuna jagatvikārānugatuṃḍavayyunu nikhilahēya pratyanīka kalyāṇaguṇātmakuṃḍavai yuṃduvani yātmavidulainavāru teliyuduru”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. - 1220)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.