బ్రహ్మజ్ఞానము; ఆత్మసాక్షాత్కారము, తన స్వస్వరూపమును చూపునది.
ఆత్మా పరమ పురుషః దృశ్యతే, సాక్షాత్క్రియతే అనేన ఇత్యాత్మ దర్శనం.
(దీని ద్వారా పరమాత్మ - పరమపురుషుడు - సాక్షాత్కరించును , దర్శనమిచ్చును కనుక ఇది ఆత్మ దర్శనము).
(ప్రకృతి సంబంధములేని జీవాత్మ పరమాత్మల యదార్థతత్వమును తెలియచేయు జ్ఞానము ). ఈ ఆత్మదర్శనము - బ్రహ్మసాక్షాత్కారము ఎట్లు కలుగుననగా : -
“నాయమాత్మా ప్రవచనేన లభ్యో, నమేథయా, బహునా శ్రుతేన; యమే వైష వృణుతే తేన లభ్యస్త స్యైవ ఆత్మా వివృణుతే తనూం స్వాం”
(ముండకోపనిషత్ - 3). (చూడుము - 'ఆత్మజ్ఞానము' - 3)
(ఎవడు ఏ ప్రకారముగా ఆత్మను పొందకోరునో ఆ ప్రకారముగానే పరమాత్మ లభ్యమగును - ఎల్లపుడు పొందుటకు వీలగు స్వభావము కలవాడగుటచేత మాయచేత ఆవరింపబడిన తన శరీరమును - ఆకారమును ఆవిర్భవింపచేయును - ప్రకాశముగా కనబడునట్లు చేయును). (చూడుము - 'ఆత్మ ప్రాప్తి' - 1).
దృశ్యతే త్వగ్ర్యయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మ దర్శిభిః ||“. (చూడుము - 'ఆత్మ' – 10.5).
స్ఫురణ గలప్పుడవ్విభుని భూరికళాకలిత స్వరూపముం
దరమిడి చూతురెప్పుడు; కుతర్క తమో హతిచేత సజ్ఞతం
బొరసిన యప్పుడవ్విభుని మూర్తి గనుం గొనలేరు, నారదా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2- 6 - 111)
సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్, సంబంధులై నృష్ణులుం
బ్రేమన్ మీరలు, భక్తినేము, నిదె చక్రిం గంటి మెట్లనను
ద్దామ ధ్యాన గరిష్టుడైన హరి చెందన్ వచ్చు ధాత్రీశ్వరా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 1 - 18)
నైన బాంధవమున నైన, భీతి
నైన దగిలి తలప నఖిలాత్ముడగు హరి
జేరవచ్చు; వేఱు సేయ డతుడు“. (శ్రీమదాంధ్రమహాభాగవత,ము - 7 - 1 - 14)
పశ్యంత్యాత్మని చాత్మానం భక్త్యా శృతగృహీతయా ||“.
(భగవంతుని ధ్యానించుటయందే శ్రద్ధగల మునులు శ్రవణమువలన కలిగినదిన్నీ జ్ఞాన వైరాగ్యములతో కూడియున్నది అయిన భక్తిచేత తమలోనే పరమాత్మను చూచెదరు ).
వ. “వేదాంత శ్రవణంబున గ్రహింపబడి జ్ఞానవైరాగ్యంబులతోడం గూడిన భక్తిచేత తత్పరులైన పెద్దలు క్షేత్రజ్ఞుండైన యాత్మయందు బరమాత్మం బొడగందురు”. (పోతన తెలుగు భాగవతము - 1 - 58)
(అంతరింద్రియనిగ్రహము, బహిరింద్రియనిగ్రహము గలవాడై లౌకిక వైదిక సర్వకర్మలను పరిత్యజించి శీతోష్ణాది ద్వంద్వమును సహించినవాడై ఏకాగ్రచిత్తము కలవాడై, గురువునందు శాస్త్రమునందు విశ్వాసముగలవాడై ప్రత్యగాత్మయందు పరమాత్మను చూడగలుగును).
అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే |
అన్యేత్వేవమ జానంతః శృత్వా (అ)న్యేభ్య ఉపాసతే |
తేపి చాతి తరం త్యేవ మృత్యుం శ్రుతి పరాయణాః ||“. (శ్రీమద్భగవద్గీత - 13 - 24, 25)
“తైల థారదత్ అవిచ్ఛిన్న ప్రత్యయో ధ్యానం, తేన ధ్యానేన ఆత్మని - బుద్ధౌ - కేచిత్ పశ్యంతి ఆత్మానం - ప్రత్యక్చేతనం ఆత్మనా, స్వేనైవ ప్రత్యక్చేతనేన, ధ్యాన సంస్కృతేన అంతఃకరణేన, కేచిత్ యోగినః పశ్యంతి అన్యే సాంఖ్యేన యోగేన ఆత్మానం పశ్యంతి; అపరే కర్మయోగేన - (కర్మైవ యోగః, ఈశ్వరార్పణ బుద్ధ్యా అనుష్టీయమానం యోర్థత్వాత్ యోగః) -, తేన సత్వ శుద్ధి జ్ఞానోత్పత్తి ద్వారేణ పశ్యంతి. అన్యే ఏతేషు వికల్పేషు అన్యతమేనాపి ఏవం యధోక్తం ఆత్మానం అజానంతః అన్యేభ్యః ఆచార్యేభ్యః శృత్వా” ఇదం యేవం చింతయ “ఇతి ఉక్తాః ఉపాసతే శ్రద్ధధానాః నంతః చింతయంతి. తే అపి మృత్యుం అతి తరంతి”. (శ్రీ శంకరః)
(ధ్యానమనగా తైలధారవలె ఎడతెగక యుండునట్లుగా చిత్తమును ఏకాగ్రము చేసి యుంచుట. అటువంటి ధ్యానముతో కొందఱు వారి బుద్ధియందు ప్రత్యక్చేతనమును చూతురు - దర్శింతురు. వారి ప్రత్యగాత్మచేత అనగా ధ్యానముతో కూడిన అంతఃకరణము చేత - కొందఱు యోగులు ఆత్మను చూచెదరు. మఱికొందఱు సాంఖ్యయోగముచేత ఆత్మను దర్శింతురు. ఇంకను కొందఱు వారు చేసినకర్మలన్నియు పరమాత్మకు అర్పించుట, వాటి ఫలమునాశించకయుండుట అను కర్మయోగము చేత ఆత్మను చూచెదరు. ఈ నిష్కామకర్మయోగముచేత సత్వశుద్ధి (మనశ్శుద్ధి), జ్ఞానోదయము కలుగుటద్వారా ఆత్మను చూడగలుగుదురు. ఈ చెప్పినసాధనముల ద్వారా ఆత్మదర్శనముచేసుకొనలేనివారు, గురువునాశ్రయించి, “ఈ ప్రకారము ధ్యానము చేయుము” అని ఉపదేశింపబడినవారై శ్రద్ధతో సత్పురుషులైనవారు ధ్యానింతురు, అట్టివారుకూడ మృత్యువును తరించెదరు. - జననమరణ రూపమైన సంసారమును దాటెదరు, ముక్తిని పొందెదరు, ఆత్మ దర్శనము చేయగలుగుదురు).
“కేచిత్ నిష్పన్న యోగాః ఆతని (శరీరే) అవస్థితం ఆత్మానం ఆత్మనా (మనసా). ధ్యానేన యోగేన పశ్యంతి. అన్యే అనిష్పన్న యోగాః సాంఖ్యేన యోగేన (జ్ఞానయోగేన) యోగయోగ్యం మనః కృత్వా ఆత్మానం పశ్యంతి. ఆపరే జ్ఞానయోగానధికారిణః తదధికారిణశ్చ సుకరోపాయ సక్తాః వ్యపదేశాశ్చ కర్మయోగానంతర జ్ఞానేన మనసా యోగయోగ్యతాం ఆపాద్య ఆత్మానం పశ్యంతి. అన్యేతు కర్మ యోగాదిషు ఆత్మావలోకన సాధనేషు అనధికృతాః అన్యేభ్యః (తత్వ దర్శిభ్యః, జ్ఞానిభ్యః ) శృత్వా కర్మయోగిభిః ఆత్మానం ఉపాసతే. తే అపి ఆత్మదర్శనేన మృత్యుం అతి తరంతి, యేశ్రుతి పరాయణాః (శ్రవణమాత్ర నిష్టాః) (పూతపాపాః) క్రమేణ కర్మయోగాదికం ఆరభ్య మృత్యుం అతి తరం త్యేవ” (శ్రీమాన్ రామానుజః)
(కొందఱు నిష్పన్నయోగులు తమశరీరములోనే ఉన్న ఆత్మను మనసులో ధ్యానము చేయుటచేత చూచెదరు - నిష్పన్నయోగులు కొందఱు మనస్సును యోగమునకు యోగ్యమైనదానినిగా చేసి సాంఖ్యయోగముచేత - జ్ఞానయోగముచేత - ఆత్మను చూచెదరు - జ్ఞానయోగమందు అధికారులుకానివారు కొందఱు, సులభమైన ఉపాయములందు ఆసక్తిగలవారు నిష్కామకర్మయోగము చేసిన తర్వాత జ్ఞానముచేత మనస్సును యోగమునకు తగినదానినిగ చేసి ఆత్మను చూడగలుగుదురు. మఱికొందఱు నిష్కామకర్మయోగమునందు, ఇతరసాధనములందు అధికారులుకానివారు ఇతరులవలన - తత్వమును తెలిసినవారివలన, జ్ఞానులవలన, కర్మయోగులవలన విని ఆత్మను ఉపాసెంచెదరు - వారుకూడా ఆత్మ దర్శనము పొందినవారై మృత్యువును దాటెదరు - శ్రుతి పరాయణులైనవారు - అనగా శ్రవణమందు మాత్రమే నిష్ఠగలవారు - పాపములను నశింపచేసుకొనినవారై క్రమముగా కర్మయోగముతో నారంభించి మృత్యువును తప్పించుకొనెదరు).
brahmajñānamu; ātmasākṣātkāramu, tana svasvarūpamunu cūpunadi.
ātmā parama puruṣaḥ dṛśyatē, sākṣātkriyatē anēna ityātma darśanaṃ.
(dīni dvārā paramātma - paramapuruṣuḍu - sākṣātkariṃcunu , darśanamiccunu kanuka idi ātma darśanamu).
(prakṛti saṃbaṃdhamulēni jīvātma paramātmala yadārthatatvamunu teliyacēyu jñānamu ). ī ātmadarśanamu - brahmasākṣātkāramu eṭlu kalugunanagā : -
“nāyamātmā pravacanēna labhyō, namēthayā, bahunā śrutēna; yamē vaiṣa vṛṇutē tēna labhyasta syaiva ātmā vivṛṇutē tanūṃ svāṃ”
(muṃḍakōpaniṣat - 3). (cūḍumu - 'ātmajñānamu' - 3)
(evaḍu ē prakāramugā ātmanu poṃdakōrunō ā prakāramugānē paramātma labhyamagunu - ellapuḍu poṃduṭaku vīlagu svabhāvamu kalavāḍaguṭacēta māyacēta āvariṃpabaḍina tana śarīramunu - ākāramunu āvirbhaviṃpacēyunu - prakāśamugā kanabaḍunaṭlu cēyunu). (cūḍumu - 'ātma prāpti' - 1).
dṛśyatē tvagryayā buddhyā sūkṣmayā sūkṣma darśibhiḥ ||“. (cūḍumu - 'ātma' – 10.5).
sphuraṇa galappuḍavvibhuni bhūrikaḷākalita svarūpamuṃ
daramiḍi cūtureppuḍu; kutarka tamō haticēta sajñataṃ
borasina yappuḍavvibhuni mūrti ganuṃ gonalēru, nāradā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2- 6 - 111)
sāmagrin śiśupāla mukhya nṛpatul, saṃbaṃdhulai nṛṣṇuluṃ
brēman mīralu, bhaktinēmu, nide cakriṃ gaṃṭi meṭlananu
ddāma dhyāna gariṣṭuḍaina hari ceṃdan vaccu dhātrīśvarā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 1 - 18)
naina bāṃdhavamuna naina, bhīti
naina dagili talapa nakhilātmuḍagu hari
jēravaccu; vēṟu sēya ḍatuḍu”. (śrīmadāṃdhramahābhāgavata,mu - 7 - 1 - 14)
paśyaṃtyātmani cātmānaṃ bhaktyā śṛtagṛhītayā ||“.
(bhagavaṃtuni dhyāniṃcuṭayaṃdē śraddhagala munulu śravaṇamuvalana kaliginadinnī jñāna vairāgyamulatō kūḍiyunnadi ayina bhakticēta tamalōnē paramātmanu cūcedaru ).
va. “vēdāṃta śravaṇaṃbuna grahiṃpabaḍi jñānavairāgyaṃbulatōḍaṃ gūḍina bhakticēta tatparulaina peddalu kṣētrajñuṃḍaina yātmayaṃdu baramātmaṃ boḍagaṃduru”. (pōtana telugu bhāgavatamu - 1 - 58)
(aṃtariṃdriyanigrahamu, bahiriṃdriyanigrahamu galavāḍai laukika vaidika sarvakarmalanu parityajiṃci śītōṣṇādi dvaṃdvamunu sahiṃcinavāḍai ēkāgracittamu kalavāḍai, guruvunaṃdu śāstramunaṃdu viśvāsamugalavāḍai pratyagātmayaṃdu paramātmanu cūḍagalugunu).
anyē sāṃkhyēna yōgēna karmayōgēna cāparē |
anyētvēvama jānaṃtaḥ śṛtvā (a)nyēbhya upāsatē |
tēpi cāti taraṃ tyēva mṛtyuṃ śruti parāyaṇāḥ ||“. (śrīmadbhagavadgīta - 13 - 24, 25)
“taila thāradat avicchinna pratyayō dhyānaṃ, tēna dhyānēna ātmani - buddhau - kēcit paśyaṃti ātmānaṃ - pratyakcētanaṃ ātmanā, svēnaiva pratyakcētanēna, dhyāna saṃskṛtēna aṃtaḥkaraṇēna, kēcit yōginaḥ paśyaṃti anyē sāṃkhyēna yōgēna ātmānaṃ paśyaṃti; aparē karmayōgēna - (karmaiva yōgaḥ, īśvarārpaṇa buddhyā anuṣṭīyamānaṃ yōrthatvāt yōgaḥ) -, tēna satva śuddhi jñānōtpatti dvārēṇa paśyaṃti. anyē ētēṣu vikalpēṣu anyatamēnāpi ēvaṃ yadhōktaṃ ātmānaṃ ajānaṃtaḥ anyēbhyaḥ ācāryēbhyaḥ śṛtvā” idaṃ yēvaṃ ciṃtaya “iti uktāḥ upāsatē śraddhadhānāḥ naṃtaḥ ciṃtayaṃti. tē api mṛtyuṃ ati taraṃti”. (śrī śaṃkaraḥ)
(dhyānamanagā tailadhāravale eḍategaka yuṃḍunaṭlugā cittamunu ēkāgramu cēsi yuṃcuṭa. aṭuvaṃṭi dhyānamutō koṃdaṟu vāri buddhiyaṃdu pratyakcētanamunu cūturu - darśiṃturu. vāri pratyagātmacēta anagā dhyānamutō kūḍina aṃtaḥkaraṇamu cēta - koṃdaṟu yōgulu ātmanu cūcedaru. maṟikoṃdaṟu sāṃkhyayōgamucēta ātmanu darśiṃturu. iṃkanu koṃdaṟu vāru cēsinakarmalanniyu paramātmaku arpiṃcuṭa, vāṭi phalamunāśiṃcakayuṃḍuṭa anu karmayōgamu cēta ātmanu cūcedaru. ī niṣkāmakarmayōgamucēta satvaśuddhi (manaśśuddhi), jñānōdayamu kaluguṭadvārā ātmanu cūḍagaluguduru. ī ceppinasādhanamula dvārā ātmadarśanamucēsukonalēnivāru, guruvunāśrayiṃci, “ī prakāramu dhyānamu cēyumu” ani upadēśiṃpabaḍinavārai śraddhatō satpuruṣulainavāru dhyāniṃturu, aṭṭivārukūḍa mṛtyuvunu tariṃcedaru. - jananamaraṇa rūpamaina saṃsāramunu dāṭedaru, muktini poṃdedaru, ātma darśanamu cēyagaluguduru).
“kēcit niṣpanna yōgāḥ ātani (śarīrē) avasthitaṃ ātmānaṃ ātmanā (manasā). dhyānēna yōgēna paśyaṃti. anyē aniṣpanna yōgāḥ sāṃkhyēna yōgēna (jñānayōgēna) yōgayōgyaṃ manaḥ kṛtvā ātmānaṃ paśyaṃti. āparē jñānayōgānadhikāriṇaḥ tadadhikāriṇaśca sukarōpāya saktāḥ vyapadēśāśca karmayōgānaṃtara jñānēna manasā yōgayōgyatāṃ āpādya ātmānaṃ paśyaṃti. anyētu karma yōgādiṣu ātmāvalōkana sādhanēṣu anadhikṛtāḥ anyēbhyaḥ (tatva darśibhyaḥ, jñānibhyaḥ ) śṛtvā karmayōgibhiḥ ātmānaṃ upāsatē. tē api ātmadarśanēna mṛtyuṃ ati taraṃti, yēśruti parāyaṇāḥ (śravaṇamātra niṣṭāḥ) (pūtapāpāḥ) kramēṇa karmayōgādikaṃ ārabhya mṛtyuṃ ati taraṃ tyēva” (śrīmān rāmānujaḥ)
(koṃdaṟu niṣpannayōgulu tamaśarīramulōnē unna ātmanu manasulō dhyānamu cēyuṭacēta cūcedaru - niṣpannayōgulu koṃdaṟu manassunu yōgamunaku yōgyamainadāninigā cēsi sāṃkhyayōgamucēta - jñānayōgamucēta - ātmanu cūcedaru - jñānayōgamaṃdu adhikārulukānivāru koṃdaṟu, sulabhamaina upāyamulaṃdu āsaktigalavāru niṣkāmakarmayōgamu cēsina tarvāta jñānamucēta manassunu yōgamunaku taginadāniniga cēsi ātmanu cūḍagaluguduru. maṟikoṃdaṟu niṣkāmakarmayōgamunaṃdu, itarasādhanamulaṃdu adhikārulukānivāru itarulavalana - tatvamunu telisinavārivalana, jñānulavalana, karmayōgulavalana vini ātmanu upāseṃcedaru - vārukūḍā ātma darśanamu poṃdinavārai mṛtyuvunu dāṭedaru - śruti parāyaṇulainavāru - anagā śravaṇamaṃdu mātramē niṣṭhagalavāru - pāpamulanu naśiṃpacēsukoninavārai kramamugā karmayōgamutō nāraṃbhiṃci mṛtyuvunu tappiṃcukonedaru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.