(త్రిగుణముల కలియకవలన పుట్టిన వాసన, రుచి, శ్రద్ధా అనునవి మూడు ఆత్మ ధర్మములు - వాసన మొదలగు ఈ ఆత్మధర్మములను కలుగచేయునవి దేహమునకు - ఇంద్రియములకు, అంతఃకరణమునకు విషయములకు సంబంధించిన ధర్మములు - దేహాదులవలననే ఈ వాసన మొదలగు ధర్మములు పుట్టుట. కార్యములను నిరూపించునవి సత్వరజస్తమో గుణములు -).
సత్తా, భావ, ప్రియములు ఆత్మధర్మములు (అస్తి - సత్తా = కలదు; భాతి = స్ఫురించుచున్నది, ప్రకాశించుచున్నది; ప్రీణాతి = ప్రియమును కలిగించుచున్నది - అను వ్యాపారములు).
“మనోబుద్ధ్యహంకార చిత్తాది నాహం నశ్రోత్రం న జిహ్వా నచ ఘ్రాణం న నేత్రం |
నచవ్యోమ భూమిః న తేరో, న వాయుః, చిదానందరూపః శివోహం శివోహం ||“.
(మనోబుద్ధి చిత్తాహంకారములు అంతఃకరణ చతుష్టయము నేనుకాను - చెవులు, నాలుక, ముక్కు నేత్రము మొదలగు ఇంద్రియములు నేనుకాను - ఆకాశము, భూమి, అగ్ని, వాయువు నేను కాను - నేను చిదానంద స్వరూపమగు శివుడను - పరమాత్మను - (చైతన్యము, ఆనందము - మోక్షము, రూపముగా గలవాడను).
నవాక్పాణి పాదౌ న చోసస్థ పాయూ చిదానందరూపః శివోహం శివోహం ||“.
(నేను ప్రాణముకాను, ప్రాణవాయువు మొదలగు పంచవాయువులు నేనుకాను, సప్త ధాతువులు నేనుకాను, పంచకోశములు, వాక్పాణి పాదపాయూవస్తలు నేను కాను. నేను చిదానంద స్వరూపుడను, శివుడను).
(పుణ్యపాపములు నేనుకాను, సుఖదుఃఖములు నేనుకాను; మంత్రము, తీర్థము, వేదములు, యజ్ఞములు నేనుకాను - నేను భోజనము కాను, భోక్తనుకాను - చిదానంద స్వరూపుడగు శివుడను నేను).
నధర్మో, నచార్థో, న కామో న మోక్షః చిదానంద రూపః శివోహం శివోహం ||“.
(రాగద్వేషములు నాకు లేవు; లోభము, మోహము, మదము, మాత్సర్యము మొదలగు భావములు నాకు లేవు - ధర్మార్థకామమోక్షములు నాకు లేవు. చిదానందస్వరూపుడగు శివుడను నేను).
న బంధుర్న మిత్రం గురుర్నై న శిష్యః చిదానంద స్వరూపం శివోహం శివోహం ||“.
(మృత్యువు నాకు లేదు, సంశయములేదు, జాతి భేదములేదు; తండ్రిలేడు, తల్లి లేదు; జన్మలేదు, బంధు వు లేడు, - మిత్రుడు లేడు; గురుడు లేడు, శిష్యుడులేడు; చిదానంద స్వరూపుడగు శివుడను నేనే).
నవా బంధనం, నైవ ముక్తిః న బంధః చ్దానందరూపః శివోహం, శివోహం ||“.
(నేను నిర్వికల్పుడను, నిరాకారుడను - సర్వేంద్రియములకు విభుడను కనుక. నాకు ముక్తిలేదు, బంధములేదు, నేను చిదానందరూపుడైన శివుడను - (అహం బ్రహ్మాస్మి; జీవబ్రహ్మలకు భేదము లేదు).
(triguṇamula kaliyakavalana puṭṭina vāsana, ruci, śraddhā anunavi mūḍu ātma dharmamulu - vāsana modalagu ī ātmadharmamulanu kalugacēyunavi dēhamunaku - iṃdriyamulaku, aṃtaḥkaraṇamunaku viṣayamulaku saṃbaṃdhiṃcina dharmamulu - dēhādulavalananē ī vāsana modalagu dharmamulu puṭṭuṭa. kāryamulanu nirūpiṃcunavi satvarajastamō guṇamulu -).
sattā, bhāva, priyamulu ātmadharmamulu (asti - sattā = kaladu; bhāti = sphuriṃcucunnadi, prakāśiṃcucunnadi; prīṇāti = priyamunu kaligiṃcucunnadi - anu vyāpāramulu).
“manōbuddhyahaṃkāra cittādi nāhaṃ naśrōtraṃ na jihvā naca ghrāṇaṃ na nētraṃ |
nacavyōma bhūmiḥ na tērō, na vāyuḥ, cidānaṃdarūpaḥ śivōhaṃ śivōhaṃ ||“.
(manōbuddhi cittāhaṃkāramulu aṃtaḥkaraṇa catuṣṭayamu nēnukānu - cevulu, nāluka, mukku nētramu modalagu iṃdriyamulu nēnukānu - ākāśamu, bhūmi, agni, vāyuvu nēnu kānu - nēnu cidānaṃda svarūpamagu śivuḍanu - paramātmanu - (caitanyamu, ānaṃdamu - mōkṣamu, rūpamugā galavāḍanu).
navākpāṇi pādau na cōsastha pāyū cidānaṃdarūpaḥ śivōhaṃ śivōhaṃ ||“.
(nēnu prāṇamukānu, prāṇavāyuvu modalagu paṃcavāyuvulu nēnukānu, sapta dhātuvulu nēnukānu, paṃcakōśamulu, vākpāṇi pādapāyūvastalu nēnu kānu. nēnu cidānaṃda svarūpuḍanu, śivuḍanu).
(puṇyapāpamulu nēnukānu, sukhaduḥkhamulu nēnukānu; maṃtramu, tīrthamu, vēdamulu, yajñamulu nēnukānu - nēnu bhōjanamu kānu, bhōktanukānu - cidānaṃda svarūpuḍagu śivuḍanu nēnu).
nadharmō, nacārthō, na kāmō na mōkṣaḥ cidānaṃda rūpaḥ śivōhaṃ śivōhaṃ ||“.
(rāgadvēṣamulu nāku lēvu; lōbhamu, mōhamu, madamu, mātsaryamu modalagu bhāvamulu nāku lēvu - dharmārthakāmamōkṣamulu nāku lēvu. cidānaṃdasvarūpuḍagu śivuḍanu nēnu).
na baṃdhurna mitraṃ gururnai na śiṣyaḥ cidānaṃda svarūpaṃ śivōhaṃ śivōhaṃ ||“.
(mṛtyuvu nāku lēdu, saṃśayamulēdu, jāti bhēdamulēdu; taṃḍrilēḍu, talli lēdu; janmalēdu, baṃdhu vu lēḍu, - mitruḍu lēḍu; guruḍu lēḍu, śiṣyuḍulēḍu; cidānaṃda svarūpuḍagu śivuḍanu nēnē).
navā baṃdhanaṃ, naiva muktiḥ na baṃdhaḥ cdānaṃdarūpaḥ śivōhaṃ, śivōhaṃ ||“.
(nēnu nirvikalpuḍanu, nirākāruḍanu - sarvēṃdriyamulaku vibhuḍanu kanuka. nāku muktilēdu, baṃdhamulēdu, nēnu cidānaṃdarūpuḍaina śivuḍanu - (ahaṃ brahmāsmi; jīvabrahmalaku bhēdamu lēdu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.