ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః ||
యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మ యి పశ్యతి |
- - సర్వభూతస్థితం యో మాం భజత్యే కత్వమాస్థితః |
సర్వథా వర్తమానో(అ)పి స యోగీ మ యి వర్తతే ||“. (శ్రీమద్భగవద్గీత - 6 - 29 to 31)
(మీదను చతుర్ముఖ బ్రహ్మ మొదలు క్రింద స్థావరముల వఱకు గల సమస్త భూతములందు ఒకే చైతన్యఘనమైనదిన్నీ, తనుకాక వేఱొక చైతన్య వస్తువు లేనిదిన్నీ అయిన ఒకే ఆత్మ వ్యాపించియున్నదనిన్నీ, ఆ ఆత్మ తనే అనిన్నీ, ఆ ప్రకారముగానే బ్రహ్మమొదలగు భూతములు ఒకే ఆత్మలో - తనే అయిన ఒకే ఆత్మలో ఐక్యమైనదనిన్నీ -అవన్నియు కలిసి ఒకే ఆత్మ అయినదనిన్నీ, యోగయుక్తుడైన ముని తెలుసుకొని అట్లు చూచును. అట్టివాడు ఆత్మైకత్వదర్శీ, అనగా, అన్నివస్తువులు, అన్ని వస్తువుల ఆత్మ ఒకటేయని తెలుసుకొనును - ఇట్లు తెలుసు కొనుటయే ఆత్మైకత్వ దర్శనము - అంతా ఒకటే ఆత్మ యని తెలుసుకొనుట అట్లు తెలుసుకొనువాడు ఆత్మైకత్వ దర్శి).
(అబద్ధము, దుఃఖము మొదలగువాటితో కూడియున్న సాక్ష్యవస్తువులు అసంగుడు, ప్రత్యగాత్మ అయిన సాక్షికంటె వేఱు అని వివేకముచేత తెలుసుకొనినవాడున్నూ, సాక్షి అయిన పరమాత్మయందు సమస్త భూతములు కల్పితములు - అనగా, అంతా పరమాత్మయే అయినను ఆత్మ మాయవలన వేఱు వేఱు నామరూపములుగల వస్తువులున్నట్లు కనబడినను, అవన్నియు యధార్థముగా భగవంతుడే అనియును, అట్టి మిథ్యాభూతములను వివేకముచేత నిరసించి, విడిచిపెట్టి, యోగముచేత ఏకాగ్ర్యమైన మనసుతో సమాహితమైన మనస్సుతో, ఎవడు అంతటను, అన్నింటినీ సమముగా - ఏకముగా, ఒకటిగా - పరబ్రహ్మ వాటిలో గోచరమైనట్లు చూచునో అటువంటి బ్రహ్మజ్ఞాని అయిన యోగి పరమాత్మ దర్శనమును పొందినవాడు - ఆత్మైకదర్శీ, ఇతరుడుకాడు. అనగా ప్రపంచములోని సమస్త వస్తువులు పరమాత్మయే అని ” తత్వ మసి ” యను మహావాక్యములోని త్వం పదమునకు అర్థమైనవి. అన్నీ ‘తత్’ పరమాత్మ అయినవే అని మహావాక్యముయొక్క పరమార్థము).
(ప్రపంచములోని సమస్త వస్తువులు ‘త్వం’ పదార్థమనిచెప్పి, మహావాక్యములోని ‘తత్’ (పరమాత్మ) యను పదమునకు ఈ క్రింద రీతిగా అర్థము చెప్పబడినది : - జగత్తు అంతటికి సృష్టిస్థితిలయములకు కారణమైనటువంటిన్నీ, జగత్తు అంతటికీ ఈశ్వరుడు ప్రభువు అయినటువంటిన్నీ, ఏ విధమైన ఉపాధియు లేనటువంటిన్నీ, తనకంటె రెండవ వస్తువు లేనటువంటిన్నీ, ఆనందరూపుడైనటువంటిన్నీ, పరమాత్మ అయిన నన్ను నా యొక్క సత్తాస్ఫురణతో జగత్తు అంతటిలోను - జగత్తులో ఉన్న వస్తువు లన్నింటిలోనున్నూ, - ‘ఓత ప్రోతము’ వలె అనున్యూతమైన వానినిగా యే యోగి తెలుసుకొని నన్ను అపరోక్షునిగా - తనయెదుట ప్రత్యక్షముగా ప్రతివస్తువులోని సాక్షాత్కరించినవానినిగా - తెలుసుకొనునో, మఱియు ఆ ప్రకారముగానే మాయచేత సమస్తముమిధ్యగా ఆరోపితము అని తెలుసుకొనునో - అట్టివానికి, అట్టి ఆత్మైక దర్శికి - అంతా ఆత్మగానే చూచువానికి, మహేశ్వరుడును, ‘తత్’ పదమునకు అర్థమైన వాడను అయిన నేను పరోక్షజ్ఞానమునకు విష య భూతుడనుకాను - అపరోక్షముగా - ప్రత్యక్షముగా నేను అన్నింటిలోను కనబడుచునే యుందును. అతని ఆత్మ నేనే యని అతనిలోనుండి తెలియచేయుదును, అతని జీవాత్మయగు నేనే పరమాత్మయని తెలియచేయుదును).
(ఈశ్వరుడనువాడొకడు, నాకన్న వేరైనవాడు ఒకడు ఉన్నాడు అని ఇంతకు పూర్వమున్న బుద్ధి తనే పరమాత్మ యని తెలియుటచేత నశించిపోవును. విద్వాంసుడు, ఆత్మజ్ఞాని అయినవాడు - అనగా, పైన చెప్పిన విధముగా అంతా ఒకే ఆత్మ యను జ్ఞానముకలవాడు - నారూపుడే, పరమాత్మరూపుడే. అందుచేత నాకు పరోక్షుడుకాడు - అవిద్వాన్సుడు, పైన చెప్పిన ప్రకారము ఆత్మైక జ్ఞానము లేనివాడు తనలోనే పరమాత్మ అయిన నేను ఉండినను తెలుసుకొనలేడు. అందుచేత పరమాత్మకూడ అతనిని చూదడు - అనుగ్రహించడు. ఆత్మైకజ్ఞానము గలవాడు ఎల్లపుడు భగవంతుని అపరోక్షముగానే తనయెదుటనున్న అన్నింటిలోను ఉండి సాక్షాత్కరించినవాడుగనే చూచుటచేత పరమాత్మ అనుగ్రహము కలవాడగును).
(సమస్తమైన వాటికి ఆత్మ అయిన వాసుదేవుడనైన నన్ను - (సర్వ శరీరములందు - సర్వ వస్తువులందు - నివసించువాడు కనుక వాసుదేవుడు) అంతట, అన్ని భూతములందు ఎవడు చూచునో, బ్రహ్మ మొదలగు సమస్త భూతములను సర్వాత్ముడనైన నాయందు ఎవడు చూచునో వాడు ఆత్మైక దర్శీ). (చూడుము - ‘ఆత్మ’ - 11).
īkṣatē yōgayuktātmā sarvatra samadarśanaḥ ||
yōmāṃ paśyati sarvatra sarvaṃ ca ma yi paśyati |
- - sarvabhūtasthitaṃ yō māṃ bhajatyē katvamāsthitaḥ |
sarvathā vartamānō(a)pi sa yōgī ma yi vartatē ||“. (śrīmadbhagavadgīta - 6 - 29 to 31)
(mīdanu caturmukha brahma modalu kriṃda sthāvaramula vaṟaku gala samasta bhūtamulaṃdu okē caitanyaghanamainadinnī, tanukāka vēṟoka caitanya vastuvu lēnidinnī ayina okē ātma vyāpiṃciyunnadaninnī, ā ātma tanē aninnī, ā prakāramugānē brahmamodalagu bhūtamulu okē ātmalō - tanē ayina okē ātmalō aikyamainadaninnī -avanniyu kalisi okē ātma ayinadaninnī, yōgayuktuḍaina muni telusukoni aṭlu cūcunu. aṭṭivāḍu ātmaikatvadarśī, anagā, annivastuvulu, anni vastuvula ātma okaṭēyani telusukonunu - iṭlu telusu konuṭayē ātmaikatva darśanamu - aṃtā okaṭē ātma yani telusukonuṭa aṭlu telusukonuvāḍu ātmaikatva darśi).
(abaddhamu, duḥkhamu modalaguvāṭitō kūḍiyunna sākṣyavastuvulu asaṃguḍu, pratyagātma ayina sākṣikaṃṭe vēṟu ani vivēkamucēta telusukoninavāḍunnū, sākṣi ayina paramātmayaṃdu samasta bhūtamulu kalpitamulu - anagā, aṃtā paramātmayē ayinanu ātma māyavalana vēṟu vēṟu nāmarūpamulugala vastuvulunnaṭlu kanabaḍinanu, avanniyu yadhārthamugā bhagavaṃtuḍē aniyunu, aṭṭi mithyābhūtamulanu vivēkamucēta nirasiṃci, viḍicipeṭṭi, yōgamucēta ēkāgryamaina manasutō samāhitamaina manassutō, evaḍu aṃtaṭanu, anniṃṭinī samamugā - ēkamugā, okaṭigā - parabrahma vāṭilō gōcaramainaṭlu cūcunō aṭuvaṃṭi brahmajñāni ayina yōgi paramātma darśanamunu poṃdinavāḍu - ātmaikadarśī, itaruḍukāḍu. anagā prapaṃcamulōni samasta vastuvulu paramātmayē ani ” tatva masi ” yanu mahāvākyamulōni tvaṃ padamunaku arthamainavi. annī ‘tat’ paramātma ayinavē ani mahāvākyamuyokka paramārthamu).
(prapaṃcamulōni samasta vastuvulu ‘tvaṃ’ padārthamaniceppi, mahāvākyamulōni ‘tat’ (paramātma) yanu padamunaku ī kriṃda rītigā arthamu ceppabaḍinadi : - jagattu aṃtaṭiki sṛṣṭisthitilayamulaku kāraṇamainaṭuvaṃṭinnī, jagattu aṃtaṭikī īśvaruḍu prabhuvu ayinaṭuvaṃṭinnī, ē vidhamaina upādhiyu lēnaṭuvaṃṭinnī, tanakaṃṭe reṃḍava vastuvu lēnaṭuvaṃṭinnī, ānaṃdarūpuḍainaṭuvaṃṭinnī, paramātma ayina nannu nā yokka sattāsphuraṇatō jagattu aṃtaṭilōnu - jagattulō unna vastuvu lanniṃṭilōnunnū, - ‘ōta prōtamu’ vale anunyūtamaina vāninigā yē yōgi telusukoni nannu aparōkṣunigā - tanayeduṭa pratyakṣamugā prativastuvulōni sākṣātkariṃcinavāninigā - telusukonunō, maṟiyu ā prakāramugānē māyacēta samastamumidhyagā ārōpitamu ani telusukonunō - aṭṭivāniki, aṭṭi ātmaika darśiki - aṃtā ātmagānē cūcuvāniki, mahēśvaruḍunu, ‘tat’ padamunaku arthamaina vāḍanu ayina nēnu parōkṣajñānamunaku viṣa ya bhūtuḍanukānu - aparōkṣamugā - pratyakṣamugā nēnu anniṃṭilōnu kanabaḍucunē yuṃdunu. atani ātma nēnē yani atanilōnuṃḍi teliyacēyudunu, atani jīvātmayagu nēnē paramātmayani teliyacēyudunu).
(īśvaruḍanuvāḍokaḍu, nākanna vērainavāḍu okaḍu unnāḍu ani iṃtaku pūrvamunna buddhi tanē paramātma yani teliyuṭacēta naśiṃcipōvunu. vidvāṃsuḍu, ātmajñāni ayinavāḍu - anagā, paina ceppina vidhamugā aṃtā okē ātma yanu jñānamukalavāḍu - nārūpuḍē, paramātmarūpuḍē. aṃducēta nāku parōkṣuḍukāḍu - avidvānsuḍu, paina ceppina prakāramu ātmaika jñānamu lēnivāḍu tanalōnē paramātma ayina nēnu uṃḍinanu telusukonalēḍu. aṃducēta paramātmakūḍa atanini cūdaḍu - anugrahiṃcaḍu. ātmaikajñānamu galavāḍu ellapuḍu bhagavaṃtuni aparōkṣamugānē tanayeduṭanunna anniṃṭilōnu uṃḍi sākṣātkariṃcinavāḍuganē cūcuṭacēta paramātma anugrahamu kalavāḍagunu).
(samastamaina vāṭiki ātma ayina vāsudēvuḍanaina nannu - (sarva śarīramulaṃdu - sarva vastuvulaṃdu - nivasiṃcuvāḍu kanuka vāsudēvuḍu) aṃtaṭa, anni bhūtamulaṃdu evaḍu cūcunō, brahma modalagu samasta bhūtamulanu sarvātmuḍanaina nāyaṃdu evaḍu cūcunō vāḍu ātmaika darśī). (cūḍumu - ‘ātma’ - 11).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.