సత్తు, చిత్తు, ఆనందము, నిత్యపరిపూర్ణములు అనెడివి ఆత్మయొక్క పంచ స్వరూపలక్షణములు -
ఆత్మా నిత్యో, అవ్యయః, శుద్ధో, హ్యేకః, క్షేత్రజ్ఞః, ఆశ్రయః, అవిక్రియః, స్వదృక్, హేతుః,వ్యాపకో,
అనంగీ, అనావృతః - ఏతే ద్వాదశ లక్షణాః.
ఈ పై విషయమే శ్రీమదాంధ్రమహాభాగవతములో ఈ క్రింద విధముగా చెప్పబడినది : -
“నిత్యుడు, క్షయ రహితుడు, శుద్ధుడు, క్షేత్రజ్ఞుడు, గగనాదులకు నాశ్రయుడు, క్రియాశూన్యుడు, స్వప్రకాశుడు, సృష్టి హేతువు, వ్యాపకుడు, నిస్సంగుడు, పరిపూర్ణుడు , ఒక్కడు అని వివేకసమర్థంబులగు నాత్మ లక్షణంబులు పండ్రెండు”. ( - 7 - )
(ఆత్మ లక్షణములు కొన్ని ఈ క్రింద చెప్పబడినవి. ఆత్మ అనగా పరబ్రహ్మమేకనుక కొన్ని పరబ్రహ్మ లక్షణములు కూడా ఇక్కడ సూచించబడినవి : -
(సత్, చిత్, ఆనందము, సత్యజ్ఞానము, అనంతము, అవ్యక్తము, అచింత్యము, అవికారి, చేదింప (తగనిది) వీలుకానిది, దహింప శక్యముకానిది, అక్లేద్యము, అశోష్యము, ఎల్లపుడు ఉండువాడు, అన్నింటిలోను ఉండువాడు, స్థాణువు, చలింపనిది, పూర్వమునుండి - ఎప్పటినుండియో ఉన్నది, జన్మ లేనిది, శాశ్వతముగా నుండునది, పూర్వకాలమునుండి ఉన్నది, శరీరము చనిపోయిన దానితో చనిపోనిది, ప్రకాశించు వస్తువులకన్నా హెచ్చుగా ప్రకాశించునది, సత్పదార్థమనికాని, అసత్పదార్థమనికాని చెప్పుటకు వీలుకానిది, పరమాణువుకన్న చిన్నది, అన్నింటికంటె పెద్దది యగు మహత్తత్త్వముకంటె పెద్దది, అంతములేని వీర్యముకలది,. అంతములేని పరాక్రమము కలది, అన్నింటిలోను అడ్డులేక పూర్తిగా వ్యాపించి ఉండునది, సర్వము, అన్ని వస్తువులు తానే అయినది, సమస్త భూతములలోను ఉండు జీవము, అన్నింటి హృదయములోను ఉండునది, తినిన అన్నమును అరుగుదలకు వచ్చునట్లుచేయు వైశ్యానరుడు, భూమిలోనుండి తన బీజశ్శక్తి చే భూతములను ధరించువాడు, లోకములను నశింపచేయు కాలరూపుడు, చైతన్యమే తత్వముగా గలది, స్త్రీకాదు, పురుషుడుకాడు, నపుంసకుడుకాడు, ఏ శరీరములో ఉండిన ఆ శరీరములోనుండి ఇంకొకదానిని ఆవిర్భవింపచేయు వాడు, భూతముల జననమరణ పోషణములు తానే అయినవాడు, పరంధాముడు, - గొప్ప తేజశ్శాలి, పరమపదము అయినవాడు, పవిత్రుడు, పరముడు - ఉత్కృష్టుడు, అన్నింటిలోను వ్యాపించియుండువాడు, అన్నింటికి ఉపాదానకారణము, అన్నింటికి ఆత్మ, తనకంటె ఉత్కృష్టమైన వస్తువు మఱియొకటి లేనిది, దారమందు మణులు గుచ్చబడియున్నట్లు తనయందే ప్రపంచమంతయు - నా శక్తిచే కట్టబడియున్నది, ప్రకృతి యనెడి మాయచేత యోగవశమున ఆవరించబడి యున్నందున ఎవరికి కనబడనిది, అన్నింటికి ప్రభువైనది; - అన్నింటిని పుట్టించునది; అన్నింటినీ ప్రవర్తింపచేయునది; సమస్త భూతములు పుట్టుటకు - సమస్త భూతములను పుట్టించు బీజము; చరాచరములలో తానులేనిది ఏదియును లేదు; కనబడనిరూపముతో అన్నింటిలోను వ్యాపించియుండునది లోకలములను సృష్టించి, వాటిలో ప్రవేశించి సత్ పదార్థము, అసత్ పదార్థము తానే అయినది; తానే బ్రహ్మ; ఈ కనబడు ప్రపంచమంతయు ఆత్మయే; సూర్య చంద్రాగ్నుల తేజస్సు ఆత్మదే; ఆత్మయే ప్రపంచము; ఆత్మకంBook 17టె వేఱులేదు - ప్రపంచమంతయు ఆత్మమయము - ఆత్మతో నిండియున్నది; జీవులలోని జీవుడు ఆత్మయొక్క అంశయే - ఈ కనబడు ప్రపంచము పుట్టకముందు అది ఒకే ఒకటి అయిన ఆత్మగా నుండెను - మఱియొక ఆత్మగాని, ఇతర వస్తువుగాని లేదు).
sattu, cittu, ānaṃdamu, nityaparipūrṇamulu aneḍivi ātmayokka paṃca svarūpalakṣaṇamulu -
ātmā nityō, avyayaḥ, śuddhō, hyēkaḥ, kṣētrajñaḥ, āśrayaḥ, avikriyaḥ, svadṛk, hētuḥ,vyāpakō,
anaṃgī, anāvṛtaḥ - ētē dvādaśa lakṣaṇāḥ.
ī pai viṣayamē śrīmadāṃdhramahābhāgavatamulō ī kriṃda vidhamugā ceppabaḍinadi : -
“nityuḍu, kṣaya rahituḍu, śuddhuḍu, kṣētrajñuḍu, gaganādulaku nāśrayuḍu, kriyāśūnyuḍu, svaprakāśuḍu, sṛṣṭi hētuvu, vyāpakuḍu, nissaṃguḍu, paripūrṇuḍu , okkaḍu ani vivēkasamarthaṃbulagu nātma lakṣaṇaṃbulu paṃḍreṃḍu”. ( - 7 - )
(ātma lakṣaṇamulu konni ī kriṃda ceppabaḍinavi. ātma anagā parabrahmamēkanuka konni parabrahma lakṣaṇamulu kūḍā ikkaḍa sūciṃcabaḍinavi : -
(sat, cit, ānaṃdamu, satyajñānamu, anaṃtamu, avyaktamu, aciṃtyamu, avikāri, cēdiṃpa (taganidi) vīlukānidi, dahiṃpa śakyamukānidi, aklēdyamu, aśōṣyamu, ellapuḍu uṃḍuvāḍu, anniṃṭilōnu uṃḍuvāḍu, sthāṇuvu, caliṃpanidi, pūrvamunuṃḍi - eppaṭinuṃḍiyō unnadi, janma lēnidi, śāśvatamugā nuṃḍunadi, pūrvakālamunuṃḍi unnadi, śarīramu canipōyina dānitō canipōnidi, prakāśiṃcu vastuvulakannā heccugā prakāśiṃcunadi, satpadārthamanikāni, asatpadārthamanikāni ceppuṭaku vīlukānidi, paramāṇuvukanna cinnadi, anniṃṭikaṃṭe peddadi yagu mahattattvamukaṃṭe peddadi, aṃtamulēni vīryamukaladi,. aṃtamulēni parākramamu kaladi, anniṃṭilōnu aḍḍulēka pūrtigā vyāpiṃci uṃḍunadi, sarvamu, anni vastuvulu tānē ayinadi, samasta bhūtamulalōnu uṃḍu jīvamu, anniṃṭi hṛdayamulōnu uṃḍunadi, tinina annamunu arugudalaku vaccunaṭlucēyu vaiśyānaruḍu, bhūmilōnuṃḍi tana bījaśśakti cē bhūtamulanu dhariṃcuvāḍu, lōkamulanu naśiṃpacēyu kālarūpuḍu, caitanyamē tatvamugā galadi, strīkādu, puruṣuḍukāḍu, napuṃsakuḍukāḍu, ē śarīramulō uṃḍina ā śarīramulōnuṃḍi iṃkokadānini āvirbhaviṃpacēyu vāḍu, bhūtamula jananamaraṇa pōṣaṇamulu tānē ayinavāḍu, paraṃdhāmuḍu, - goppa tējaśśāli, paramapadamu ayinavāḍu, pavitruḍu, paramuḍu - utkṛṣṭuḍu, anniṃṭilōnu vyāpiṃciyuṃḍuvāḍu, anniṃṭiki upādānakāraṇamu, anniṃṭiki ātma, tanakaṃṭe utkṛṣṭamaina vastuvu maṟiyokaṭi lēnidi, dāramaṃdu maṇulu guccabaḍiyunnaṭlu tanayaṃdē prapaṃcamaṃtayu - nā śakticē kaṭṭabaḍiyunnadi, prakṛti yaneḍi māyacēta yōgavaśamuna āvariṃcabaḍi yunnaṃduna evariki kanabaḍanidi, anniṃṭiki prabhuvainadi; - anniṃṭini puṭṭiṃcunadi; anniṃṭinī pravartiṃpacēyunadi; samasta bhūtamulu puṭṭuṭaku - samasta bhūtamulanu puṭṭiṃcu bījamu; carācaramulalō tānulēnidi ēdiyunu lēdu; kanabaḍanirūpamutō anniṃṭilōnu vyāpiṃciyuṃḍunadi lōkalamulanu sṛṣṭiṃci, vāṭilō pravēśiṃci sat padārthamu, asat padārthamu tānē ayinadi; tānē brahma; ī kanabaḍu prapaṃcamaṃtayu ātmayē; sūrya caṃdrāgnula tējassu ātmadē; ātmayē prapaṃcamu; ātmakaṃBook 17ṭe vēṟulēdu - prapaṃcamaṃtayu ātmamayamu - ātmatō niṃḍiyunnadi; jīvulalōni jīvuḍu ātmayokka aṃśayē - ī kanabaḍu prapaṃcamu puṭṭakamuṃdu adi okē okaṭi ayina ātmagā nuṃḍenu - maṟiyoka ātmagāni, itara vastuvugāni lēdu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.