“హేతుమద్భావంబున శోకహేతువు అహంకార మమకారాత్మకంబయిన ద్వైత భ్రమంబనియును, ద్వైత భ్రమంబునకు కారణంబు దేహంబనియును, దేహంబునకు బీజంబు లింగంబనియును, (సూక్ష్మశరీరము అనియును), లింగంబునకు మూలంబు గుణంబులనియు, గుణంబునకు నిదానంబు (మొదలి కారణము) ప్రకృతియనియు, బ్రహ్మాహమనియెడి జ్ఞానంబున లీనమై ప్రకృతి లేకుండుననియు, ప్రకృతియడంగుటయ నైర్గుణ్యంబనియు, నైర్గుణ్యంబువలన కార్య లింగనాశనం బగుననియు, కార్య లింగనాసనంబున నసంభవంబు - (జన్మ రాహిత్యము) - అగుననియు, ప్రకృతి బాసి క్రమ్మఱ స్థూల శరీరప్రాప్తుండు గాక పురుషుండు సమ్యగ్భోగంబున (ఆత్మానుభవంబున) నుండును అనియు నిశ్చయ,ము) - - - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 -- )
“hētumadbhāvaṃbuna śōkahētuvu ahaṃkāra mamakārātmakaṃbayina dvaita bhramaṃbaniyunu, dvaita bhramaṃbunaku kāraṇaṃbu dēhaṃbaniyunu, dēhaṃbunaku bījaṃbu liṃgaṃbaniyunu, (sūkṣmaśarīramu aniyunu), liṃgaṃbunaku mūlaṃbu guṇaṃbulaniyu, guṇaṃbunaku nidānaṃbu (modali kāraṇamu) prakṛtiyaniyu, brahmāhamaniyeḍi jñānaṃbuna līnamai prakṛti lēkuṃḍunaniyu, prakṛtiyaḍaṃguṭaya nairguṇyaṃbaniyu, nairguṇyaṃbuvalana kārya liṃganāśanaṃ bagunaniyu, kārya liṃganāsanaṃbuna nasaṃbhavaṃbu - (janma rāhityamu) - agunaniyu, prakṛti bāsi krammaṟa sthūla śarīraprāptuṃḍu gāka puruṣuṃḍu samyagbhōgaṃbuna (ātmānubhavaṃbuna) nuṃḍunu aniyu niścaya,mu) - - - (śrīmadāṃdhramahābhāgavatamu - 1 -- )
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.