← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్మపదము ātmapadamu

Original — తెలుగు
  1. “దూరాత్సుదూరే తదిహాంతికేచ పశ్యత్సి హైవ నిహితం గుహాయాం |”. (ముండకోపనిషత్ - 3 - 1 - 7)

(పద్యతే, గమ్యతే ఇతిపదం - పొందబడునది కనుక పదము. మోక్షము కోరువారు కోరిపొంద తగు నత్యంత సుఖకరమగు స్థానము - అదియే పరమపదము, అదియే ఆత్మపదము, మోక్షము - పరమాత్మయే ఆత్మపదము, ఆత్మపదమే పరమాత్మ. పరమపదమును పొందుట యనగా ఆత్మలో, పరమాత్మలో లీనమగుట. అట్టి పరమపదము, లేక, పరమాత్మ ఎక్కడ పడితే అక్కడ, దేనిలో పడితే దానిలో, ఉండుటవలన ప్రతివానికి దగ్గరనే ఉన్నది - నమ్మిన భక్తులకు దగ్గరగానే ఉన్నది, దగ్గరవస్తువులలోనే, తనలోనే, ఉన్నది. ఇట్లు నమ్మనివారికి దూరముగా ఎక్కడో, వైకుంఠములోనో, కైలాసములోనో, దూరముగా భగవంతుడు ఉన్నాడు అనిపించును. ఈ అత్మపదము అనుమానించువారికి లబ్దముకాదు. ఆత్మపదము అనునది నిర్వికల్పము, నిరాయాసము, నిర్వికారము, నిరంజనము. తెలియనివారికి ఉన్నట్లు, పొందుటకు వీలుకాదు అను నట్లుగా అనుపించును. తెలిసినవారికి, దగ్గరగానే, తనలోనే, తన హృదయములోనే, పైకి కనబడకుండా దాగి యున్నట్లు అనుపించును - -

“ఈశ్వరః స్సర్వభూతానాం హృద్దేశే (అ)ర్జున తిష్ఠతి :. (శ్రీమద్భగవద్గీత - 18 - 61)

(సమస్త భూతముల హృదయమందు ఈశ్వరుడు - భగవంతుడు - ఉన్నాడు ) –

“సదా భోగాభాజాం సుదూరే విభాతం ముదాయోగభాజా మదూరే విభాతం |

- - ||“. (శ్రీరామకర్ణామృతం - 4 - 107)

  1. “సూక్ష్మత్వాత్తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్”. (శ్రీమద్భగవద్గీత - 13 - 15)

(పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్మమైనదగుటచేత అది అందఱికి తెలియునదికాదు. భగవంతుడున్నాడు అను నమ్మకములేనివారికి, దుర్మార్గులకు దూరముగా నున్నట్లుండును. భగవంతుడు ఉన్నాడు అను నమ్మకముగలవారికి, భగవద్భక్తులకు దగ్గరగానే యుండును - అన్ని వస్తువులలోను ఉండుటచేత తనదగ్గరనున్న వస్తువులలోను, అంతకన్న దగ్గరగానున్న తనలోను, తనహృదయములోను ఉన్నాడు. అందుచేత భగవంతుడు ఎక్కడ ఉంటే అదే అతని పదము, నివాసస్థానము - భగవంతుడే భగవత్పదము, ఆత్మపదము, ఆత్మపదము, ఆత్మపదమే భగవంతుడు).

Transliteration
  1. “dūrātsudūrē tadihāṃtikēca paśyatsi haiva nihitaṃ guhāyāṃ |”. (muṃḍakōpaniṣat - 3 - 1 - 7)

(padyatē, gamyatē itipadaṃ - poṃdabaḍunadi kanuka padamu. mōkṣamu kōruvāru kōripoṃda tagu natyaṃta sukhakaramagu sthānamu - adiyē paramapadamu, adiyē ātmapadamu, mōkṣamu - paramātmayē ātmapadamu, ātmapadamē paramātma. paramapadamunu poṃduṭa yanagā ātmalō, paramātmalō līnamaguṭa. aṭṭi paramapadamu, lēka, paramātma ekkaḍa paḍitē akkaḍa, dēnilō paḍitē dānilō, uṃḍuṭavalana prativāniki daggaranē unnadi - nammina bhaktulaku daggaragānē unnadi, daggaravastuvulalōnē, tanalōnē, unnadi. iṭlu nammanivāriki dūramugā ekkaḍō, vaikuṃṭhamulōnō, kailāsamulōnō, dūramugā bhagavaṃtuḍu unnāḍu anipiṃcunu. ī atmapadamu anumāniṃcuvāriki labdamukādu. ātmapadamu anunadi nirvikalpamu, nirāyāsamu, nirvikāramu, niraṃjanamu. teliyanivāriki unnaṭlu, poṃduṭaku vīlukādu anu naṭlugā anupiṃcunu. telisinavāriki, daggaragānē, tanalōnē, tana hṛdayamulōnē, paiki kanabaḍakuṃḍā dāgi yunnaṭlu anupiṃcunu - -

“īśvaraḥ ssarvabhūtānāṃ hṛddēśē (a)rjuna tiṣṭhati :. (śrīmadbhagavadgīta - 18 - 61)

(samasta bhūtamula hṛdayamaṃdu īśvaruḍu - bhagavaṃtuḍu - unnāḍu ) –

“sadā bhōgābhājāṃ sudūrē vibhātaṃ mudāyōgabhājā madūrē vibhātaṃ |

- - ||“. (śrīrāmakarṇāmṛtaṃ - 4 - 107)

  1. “sūkṣmatvāttadavijñēyaṃ dūrasthaṃ cāṃtikē ca tat”. (śrīmadbhagavadgīta - 13 - 15)

(paramātma sūkṣmāti sūkṣmamainadaguṭacēta adi aṃdaṟiki teliyunadikādu. bhagavaṃtuḍunnāḍu anu nammakamulēnivāriki, durmārgulaku dūramugā nunnaṭluṃḍunu. bhagavaṃtuḍu unnāḍu anu nammakamugalavāriki, bhagavadbhaktulaku daggaragānē yuṃḍunu - anni vastuvulalōnu uṃḍuṭacēta tanadaggaranunna vastuvulalōnu, aṃtakanna daggaragānunna tanalōnu, tanahṛdayamulōnu unnāḍu. aṃducēta bhagavaṃtuḍu ekkaḍa uṃṭē adē atani padamu, nivāsasthānamu - bhagavaṃtuḍē bhagavatpadamu, ātmapadamu, ātmapadamu, ātmapadamē bhagavaṃtuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.