← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్మప్రాప్తి ātmaprāpti

Original — తెలుగు
  1. “నాయమాత్మ ప్రవచనేన లభ్యో, నమేధయా, న బహునా శ్రుతేన; యమేవైశ వృణుతే తేన లభ్యః, తస్యై స ఆత్మా వివృణుతే తనూం స్వాం”

(కఠోపనిషత్)

(ప్రవచనేన - వేదశాస్త్రాధ్యయన బాహుల్యేన, మేథయా = గ్రంధార్థ ధారణ శక్త్యా; శ్రుతేన = శ్రవణేన; వృణుతే = ప్రాప్తుమిచ్ఛతి, తేన కరణేన పరమాత్మా లభ్యః, న అన్యేన సాధనాం తరేణ, నిత్యలబ్ద స్వభావత్వాత్. అవిద్యా సంభన్నాం స్వాం పరాం తనుం స్వాత్మతత్వం స్వరూపం వివృణతే ప్రకాశయతి, ప్రకాశే ఇవ ఘటాది ర్విద్యాయాం సత్య మావిర్భవతీత్యర్థః. తస్మాదన్య త్యాగేన ఆత్మ లాభ ప్రార్థనైవ ఆత్మ లాభ సాధన మిత్యర్థః). .

(వేదములను శాస్త్రములను విశేషముగా అద్యయనము చేయుటచేగాని, చదివిన గ్రంధములందలి అర్థమును గ్రహించు శక్తివలనగాని, శ్రవణమువలనగాని ఈ ఆత్మ లభ్యముకాదు - ఈ ఆత్మను పొందలేరు. ఎవడు ఏ ప్రకారముగా ఆత్మను పొందగోరునో ఆప్రకారముగానే అతనికి పరమాత్మ లభ్యమగును. ఎల్లపుడు పొందుటకు వీలగు స్వభావము - లక్షణము - కలవాడగుటచేత అవిద్య - మాయ - చేత ఆవరించబడిన తనను, తనశరీరమును - ఆకారమును - ఆవిర్భవింప చేయును - ప్రకాశముగా నగుపడునట్లు చేయును - అందుచేత మిగిలినవన్నియు విడిచిపెట్టినయడల ఆత్మప్రాప్తి సాధించవలెనను ప్రార్థనవలననే సాధించడమగును. (చూడుము -“ఆత్మదర్శనము- 3”).

  1. “నిత్య కర్మానుష్టానా ద్ధర్మోత్పత్తిః; ధర్మోత్పత్తేః పాపహానిః; తతశ్చిత్త శుద్ధిః; తతస్సంసార యాధాత్మావ భోధః; తతో వైరాగ్యం; తతో ముముక్షత్వం; తతస్తదుపాయ పర్యేషణం; తతస్సర్వకర్మ తత్సాధన సన్యాసః తతో యోగాభ్యాసః; తతశ్చిత్తస్య ప్రత్యక్ప్రవణతా, తతః తత్వ మస్యాది వాక్యార్థ పరిజ్ఞానం; తతో అవిద్యోచ్ఛేదః తతః స్వాత్మ న్యేవావస్థానం”. (నైష్కర్మ్య సిద్ధి - 1 - 135)

(నిత్య కర్మలు చేయుటవలన ధర్మము తెలియును; ధర్మము తెలియగానే పాపము నశించును, అందువలన చిత్తశుద్ధి కలుగును; చిత్తశుద్ధికలుగుటవలన సంసారముయొక్క యధార్థస్థితి తెలియును. జననమరణ ప్రవాహరూపము సంసారమని తెలిసిన తర్వాత వైరాగ్యము కలుగును; దానివలన ఈ సంసారమునుండి విడుదల చేయగలుగు మోక్షమును గుఱించి కోరిక కలుగును; మోక్షము గుఱించి కోరిక కలుగగానే మోక్షమునకు సాధనము గుఱించి ప్రయత్నము చేయుటయగును; అప్పుడు సమస్త కర్మలను వదలివేయడమగును; దాని తర్వాత యోగాభ్యాసము చేయుటచేత పరమాత్మయందాసక్తి కలుగును, అప్పుడు “తత్వమసి” అను మొదలగు మహా వాక్యముల అర్థము, దాని జ్ఞానము కలుగును; బ్రహ్మజ్ఞానము కలిగినందువలన అవిద్య. లేక, అజ్ఞానము నశించును. జ్ఞానము కలుగగానే పరమాత్మయందు నిలకడ కలిగియుండును.)

  1. “సత్యేన లభ్యస్త వ సాహ్యేష ఆత్మా సమ్యక్ జ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం |

అంతశ్శరీరే జ్యోతిర్మయోహి శుభ్రో యే పశ్యంతి యతయః క్షీణ దోషాః ||“.

(తపసా ఇంద్రియమనో ఏకాగ్రతయా - “మనసశ్చేంద్రియాణాం చైకా గ్ర్యం పరమం తపః” ఇతి శ్రుతిః; సమ్యక్ జ్ఞానేన యథా భూతాత్మ దర్శనేన; బ్రహ్మచర్యేణ మైధునా సమాచరేణ, నిత్యం సర్వదా, నిత్యం సత్యేన, నిత్యం తపసా నిత్యం సమ్యక్ జ్ఞానేన, నిత్యం బ్రహ్మచర్యేణ ఆత్మా లభ్యః. అంతశ్శరీరే అంతః, మధ్యే శరీరస్య పుండరీకాకాశే, జ్యోతిర్మయః స్వయం ప్రకాశః, శుభ్రః శుద్ధః , య ఆత్మానం పశ్యంతి లభంతే; యతయః యతన శీలాః సన్యాసినః, క్షీణదోషాః క్షీణ క్రోధాది చిత్తమలాః, స ఆత్మా నిత్య సత్యాది సాధనైర్లభ్యః; న కదా చిత్తైర్లభ్యః“).

(మనసును ఇంద్రియములను ఏకాగ్రముచేయుట, ఒకే చోట, ఒకే వస్తువునందు కేంద్రీకరించుట పరమ తపస్సు అని శ్రుతి చెప్పుచున్నది. నిత్యము అటువంటి తపస్సు చేయుటచేతను, నిత్యము ఆత్మ యథాస్థితిని తెలుపు సమ్యక్ జ్ఞానము చేతను, మైధునకార్యము చేయక నిత్యము ఉండుటచేతను, నిత్యసత్యవ్రతము చేతను ఆత్మ లభ్యమగును. దేహము మధ్యను హృదయపద్మము అను ఆకాశములోనున్న స్వయం ప్రకాశము శుద్ధము అయిన ఆత్మను యతన శీలురగు యోగులు క్రోధము మొదలగు మనోమలములు లేనివారై పైన చెప్పిన రీతిగా నిత్య సత్యము మొదలగు సాధనములచేత చూచెదరు. ఇతరులకు ఆత్మ లభ్యముకాదు).

  1. “వేదాంత విజ్ఞాన సునిశ్చతార్థాః సన్యాస యోగాద్యతయ శ్శుద్ధ సత్వాః |

తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాః పరిముచ్యంతి సర్వే ||“.

“వేదాంత జనితం జ్ఞానం వేదాంత విజ్ఞానం, తస్యార్థః ఆత్మా విజ్ఞేయః, సో అర్థః సునిశ్చితో యేషాం తే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థః. తేచ సన్యాసయోగాత్ సర్వకర్మ పరిత్యాగ లక్షణాత్ యోగాత్ కేవలబ్రహ్మ నిష్ఠా రూపాత్ యోగాత్, యతయః యతన శీలాః, శుద్ధ సత్వాః శుద్ధం సత్వం యేషాం సన్యాస యోగాత్ తే శుద్ధ సత్వాః. తే బ్రహ్మలోకేషు సంసారిణాం యే మరణ కాలాః తే అపరాంతాః తానపేక్ష్య ముముక్షూణాం సంసారావసనే దేహ పరిత్యాగకాలః పరాంతకాలః, తస్మిన్ పరాంతకాలే సాధకానాం బహుత్వాత్, బ్రహ్మైవలోకః ఏకోపి అనేకవత్ దృశ్యతే, ప్రాప్యతే చ. అతో బహువచనేన బ్రహ్మలోకేషు ఇతి, బ్రహ్మణీత్యర్థః - పరామృతాః పరమమృతం అమరణ ధర్మకం బ్రహ్మ ఆత్మభూతం యేషాం తే పరామృతాః, పరామృతాస్సంతః పరిముచ్యంతి పరిసమంతాత్ ప్రదీప నిర్వాణవత్ భిన్న ఘటాకాశవచ్చ నిర్వృత్తి ముప యాంతి పరిసమంతాత్ ముచ్యంతే, సర్వే న దేశాంతరం గంతవ్యమపేక్షం తే”.

(ఉపనిషద్వాక్యముల ద్వారా కలిగిన జ్ఞానముచేత వాటి విషయమైన ఆత్మను తెలుసుకొనినవారు, సర్వ కర్మ పరిత్యాగ లక్షణమైన యోగము నవలంభించుటచేత పరిశుద్ధమైన సత్వము గలవారు - అనగా, కేవలము పరబ్రహ్మమందే నిష్ఠగలవారు, మరణకాలమునందు పరమాత్మను పొందుదురు, అనగా పరబ్రహ్మమును పొందుదురు,ఆరి పోయిన దీపమువలె, బద్దలైన ఘటములోని ఆకాశమువలె ముక్తిని పొందుచున్నారు. వేరు లోకమునకు పోవనవసరము లేకుండగనే ముక్తులగుచున్నారు).

  1. “పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయానాస్యకృతః కృతేన. తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్ఛేత్ సమిత్పాణిః శ్రోత్రియం బ్రహ్మనిష్ఠం తమే వైకం జానధ ఆత్మాన మన్యావాచో విముంచ థామృతస్యైష సేతుః”.

(“నిత్యానిత్య వస్తువివేక పురస్సరం వైరాగ్యం ప్రాప్తస్య ఆత్మ జ్ఞానార్థం బ్రహ్మ నిష్ఠ సద్గురుం ప్రతిపరిచరణ శీలస్య, తన్ముఖాత్ కృత వేదాంత శ్రవణస్య, నిరస్త సమస్త రాగాది దోషస్య, సత్యతపో బ్రహ్మ చర్యాది సాధన సంపన్నస్య, ఆత్మ ధ్యాన నిష్ఠస్య, ఆత్మ మాత్ర పరస్య, వేదాంత శాస్త్ర వ్యతిరిక్త వాగ్విమోచనం కృతవతో విషయ పరాఙ్ముఖస్య సన్యాసి నః జ్ఞాతస్యాత్మరతేః ఆత్మ క్రీడస్య జ్ఞాన ప్రసాదేన విశుద్ధ సత్వస్యైవ నామరూప సకలోపాధి వినిర్మోచక పురస్సరం పరిపూర్ణ బ్రహ్మరూపేణావస్థానం, నాన్యస్యేత్యేవమర్థో(అ)వగమ్యతే”).

(నిత్యవస్తువులు అనిత్య వస్తువులు, ఆత్మ అనాత్మ వస్తువులు - వీటి వివేకము కలిగియుండుటవలన వైరాగ్యమును పొందినవానికి ఆత్మజ్ఞానము కొఱకు - బ్రహ్మజ్ఞానము కొఱకు - బ్రహ్మనిష్ఠుడైన సద్గురు చరణముల నాశ్రయించి అతని నుండి వేదాంత శ్రవణము చేసినవానికి, రాగము మొదలగు సమస్త దోషములు పోయినటువంటి వానికి, సత్యము, తపస్సు, బ్రహ్మచర్యము మొదలగు సాధనములు కలిగినటువంటివానికి, ఆత్మసాధనమందే నిష్ఠగలవానికి - ఆత్మయందే తదేకధ్యానము గలవానికిన్నీ, ఉపనిషత్తులలోను శాస్త్రములలోను చెప్పిన విషయములకు వ్యతిరిక్తమైనవాటిని వదలివేసిన వానికిన్నీ, విషయములందాసక్తిలేనివానికిన్నీ - ఇట్టి సన్యాసికి - ఆత్మయందే రమించువానికి - ఆత్మయందే క్రీడించువానికి - జ్ఞానికి - శుద్ధసత్వ స్వభావము గలవానికి, నామరూపములుగల సమస్త ఉపాధులను వదలించుకొనినవానికి పరిపూర్ణ బ్రహ్మరూపముతోనుండు స్థితి కలుగును. ఇతరునికి ఇట్టి స్థితి కలుగదు).

  1. “ఆత్మాతు సతతం ప్రాప్నో అప్యప్రాప్తవద విద్యయా |

తన్నాశౌ ప్రాప్నువద్భాతి స్వకంఠాభరణం యధా ||“.

(ఆత్మ ఎప్పుడును ప్రాప్తించునదే. అవిద్య దానిని ఆవరించుకొనియుండుటవలన ప్రాప్తించలేదు అని పించును. ఆ అవిద్య నాశముకాగా ప్రాప్తమైనట్టుగనే ఉండును. తన కంఠమున నున్న ఆభరణము తనకు దగ్గరగా నున్నప్పటికీ భ్రాంతివలన లేనట్లే తోచును).

  1. “ఉ. ఏల కుమార శోషిలగ నీజననంబున నన్ను గానగా

జాలవు నీవ; గామముఖ షట్కము నిర్ద ళితంబుసేసి, ని

ర్మూలితకర్ముడైన ముని ముఖ్యుడుగాని కుయోగి గానగా

జాలడు - - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 6 - 88).

  1. “ఆ. అలుకనైన జెలిమినైన గామంబున

నైన బాంధవముననైన, భీతి

నైన దగిలి తలప నఖిలాత్ముడగు హరి

జేరవచ్చు, వేఱు సేయడతడు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 1 - 14)

Transliteration
  1. “nāyamātma pravacanēna labhyō, namēdhayā, na bahunā śrutēna; yamēvaiśa vṛṇutē tēna labhyaḥ, tasyai sa ātmā vivṛṇutē tanūṃ svāṃ”

(kaṭhōpaniṣat)

(pravacanēna - vēdaśāstrādhyayana bāhulyēna, mēthayā = graṃdhārtha dhāraṇa śaktyā; śrutēna = śravaṇēna; vṛṇutē = prāptumicchati, tēna karaṇēna paramātmā labhyaḥ, na anyēna sādhanāṃ tarēṇa, nityalabda svabhāvatvāt. avidyā saṃbhannāṃ svāṃ parāṃ tanuṃ svātmatatvaṃ svarūpaṃ vivṛṇatē prakāśayati, prakāśē iva ghaṭādi rvidyāyāṃ satya māvirbhavatītyarthaḥ. tasmādanya tyāgēna ātma lābha prārthanaiva ātma lābha sādhana mityarthaḥ). .

(vēdamulanu śāstramulanu viśēṣamugā adyayanamu cēyuṭacēgāni, cadivina graṃdhamulaṃdali arthamunu grahiṃcu śaktivalanagāni, śravaṇamuvalanagāni ī ātma labhyamukādu - ī ātmanu poṃdalēru. evaḍu ē prakāramugā ātmanu poṃdagōrunō āprakāramugānē ataniki paramātma labhyamagunu. ellapuḍu poṃduṭaku vīlagu svabhāvamu - lakṣaṇamu - kalavāḍaguṭacēta avidya - māya - cēta āvariṃcabaḍina tananu, tanaśarīramunu - ākāramunu - āvirbhaviṃpa cēyunu - prakāśamugā nagupaḍunaṭlu cēyunu - aṃducēta migilinavanniyu viḍicipeṭṭinayaḍala ātmaprāpti sādhiṃcavalenanu prārthanavalananē sādhiṃcaḍamagunu. (cūḍumu -“ātmadarśanamu- 3”).

  1. “nitya karmānuṣṭānā ddharmōtpattiḥ; dharmōtpattēḥ pāpahāniḥ; tataścitta śuddhiḥ; tatassaṃsāra yādhātmāva bhōdhaḥ; tatō vairāgyaṃ; tatō mumukṣatvaṃ; tatastadupāya paryēṣaṇaṃ; tatassarvakarma tatsādhana sanyāsaḥ tatō yōgābhyāsaḥ; tataścittasya pratyakpravaṇatā, tataḥ tatva masyādi vākyārtha parijñānaṃ; tatō avidyōcchēdaḥ tataḥ svātma nyēvāvasthānaṃ”. (naiṣkarmya siddhi - 1 - 135)

(nitya karmalu cēyuṭavalana dharmamu teliyunu; dharmamu teliyagānē pāpamu naśiṃcunu, aṃduvalana cittaśuddhi kalugunu; cittaśuddhikaluguṭavalana saṃsāramuyokka yadhārthasthiti teliyunu. jananamaraṇa pravāharūpamu saṃsāramani telisina tarvāta vairāgyamu kalugunu; dānivalana ī saṃsāramunuṃḍi viḍudala cēyagalugu mōkṣamunu guṟiṃci kōrika kalugunu; mōkṣamu guṟiṃci kōrika kalugagānē mōkṣamunaku sādhanamu guṟiṃci prayatnamu cēyuṭayagunu; appuḍu samasta karmalanu vadalivēyaḍamagunu; dāni tarvāta yōgābhyāsamu cēyuṭacēta paramātmayaṃdāsakti kalugunu, appuḍu “tatvamasi” anu modalagu mahā vākyamula arthamu, dāni jñānamu kalugunu; brahmajñānamu kaliginaṃduvalana avidya. lēka, ajñānamu naśiṃcunu. jñānamu kalugagānē paramātmayaṃdu nilakaḍa kaligiyuṃḍunu.)

  1. “satyēna labhyasta va sāhyēṣa ātmā samyak jñānēna brahmacaryēṇa nityaṃ |

aṃtaśśarīrē jyōtirmayōhi śubhrō yē paśyaṃti yatayaḥ kṣīṇa dōṣāḥ ||“.

(tapasā iṃdriyamanō ēkāgratayā - “manasaścēṃdriyāṇāṃ caikā gryaṃ paramaṃ tapaḥ” iti śrutiḥ; samyak jñānēna yathā bhūtātma darśanēna; brahmacaryēṇa maidhunā samācarēṇa, nityaṃ sarvadā, nityaṃ satyēna, nityaṃ tapasā nityaṃ samyak jñānēna, nityaṃ brahmacaryēṇa ātmā labhyaḥ. aṃtaśśarīrē aṃtaḥ, madhyē śarīrasya puṃḍarīkākāśē, jyōtirmayaḥ svayaṃ prakāśaḥ, śubhraḥ śuddhaḥ , ya ātmānaṃ paśyaṃti labhaṃtē; yatayaḥ yatana śīlāḥ sanyāsinaḥ, kṣīṇadōṣāḥ kṣīṇa krōdhādi cittamalāḥ, sa ātmā nitya satyādi sādhanairlabhyaḥ; na kadā cittairlabhyaḥ”).

(manasunu iṃdriyamulanu ēkāgramucēyuṭa, okē cōṭa, okē vastuvunaṃdu kēṃdrīkariṃcuṭa parama tapassu ani śruti ceppucunnadi. nityamu aṭuvaṃṭi tapassu cēyuṭacētanu, nityamu ātma yathāsthitini telupu samyak jñānamu cētanu, maidhunakāryamu cēyaka nityamu uṃḍuṭacētanu, nityasatyavratamu cētanu ātma labhyamagunu. dēhamu madhyanu hṛdayapadmamu anu ākāśamulōnunna svayaṃ prakāśamu śuddhamu ayina ātmanu yatana śīluragu yōgulu krōdhamu modalagu manōmalamulu lēnivārai paina ceppina rītigā nitya satyamu modalagu sādhanamulacēta cūcedaru. itarulaku ātma labhyamukādu).

  1. “vēdāṃta vijñāna suniścatārthāḥ sanyāsa yōgādyataya śśuddha satvāḥ |

tē brahmalōkēṣu parāṃtakālē parāmṛtāḥ parimucyaṃti sarvē ||“.

“vēdāṃta janitaṃ jñānaṃ vēdāṃta vijñānaṃ, tasyārthaḥ ātmā vijñēyaḥ, sō arthaḥ suniścitō yēṣāṃ tē vēdāṃta vijñāna suniścitārthaḥ. tēca sanyāsayōgāt sarvakarma parityāga lakṣaṇāt yōgāt kēvalabrahma niṣṭhā rūpāt yōgāt, yatayaḥ yatana śīlāḥ, śuddha satvāḥ śuddhaṃ satvaṃ yēṣāṃ sanyāsa yōgāt tē śuddha satvāḥ. tē brahmalōkēṣu saṃsāriṇāṃ yē maraṇa kālāḥ tē aparāṃtāḥ tānapēkṣya mumukṣūṇāṃ saṃsārāvasanē dēha parityāgakālaḥ parāṃtakālaḥ, tasmin parāṃtakālē sādhakānāṃ bahutvāt, brahmaivalōkaḥ ēkōpi anēkavat dṛśyatē, prāpyatē ca. atō bahuvacanēna brahmalōkēṣu iti, brahmaṇītyarthaḥ - parāmṛtāḥ paramamṛtaṃ amaraṇa dharmakaṃ brahma ātmabhūtaṃ yēṣāṃ tē parāmṛtāḥ, parāmṛtāssaṃtaḥ parimucyaṃti parisamaṃtāt pradīpa nirvāṇavat bhinna ghaṭākāśavacca nirvṛtti mupa yāṃti parisamaṃtāt mucyaṃtē, sarvē na dēśāṃtaraṃ gaṃtavyamapēkṣaṃ tē”.

(upaniṣadvākyamula dvārā kaligina jñānamucēta vāṭi viṣayamaina ātmanu telusukoninavāru, sarva karma parityāga lakṣaṇamaina yōgamu navalaṃbhiṃcuṭacēta pariśuddhamaina satvamu galavāru - anagā, kēvalamu parabrahmamaṃdē niṣṭhagalavāru, maraṇakālamunaṃdu paramātmanu poṃduduru, anagā parabrahmamunu poṃduduru,āri pōyina dīpamuvale, baddalaina ghaṭamulōni ākāśamuvale muktini poṃducunnāru. vēru lōkamunaku pōvanavasaramu lēkuṃḍaganē muktulagucunnāru).

  1. “parīkṣya lōkān karmacitān brāhmaṇō nirvēdamāyānāsyakṛtaḥ kṛtēna. tadvijñānārthaṃ sa gurumēvābhigacchēt samitpāṇiḥ śrōtriyaṃ brahmaniṣṭhaṃ tamē vaikaṃ jānadha ātmāna manyāvācō vimuṃca thāmṛtasyaiṣa sētuḥ”.

(“nityānitya vastuvivēka purassaraṃ vairāgyaṃ prāptasya ātma jñānārthaṃ brahma niṣṭha sadguruṃ pratiparicaraṇa śīlasya, tanmukhāt kṛta vēdāṃta śravaṇasya, nirasta samasta rāgādi dōṣasya, satyatapō brahma caryādi sādhana saṃpannasya, ātma dhyāna niṣṭhasya, ātma mātra parasya, vēdāṃta śāstra vyatirikta vāgvimōcanaṃ kṛtavatō viṣaya parāṅmukhasya sanyāsi naḥ jñātasyātmaratēḥ ātma krīḍasya jñāna prasādēna viśuddha satvasyaiva nāmarūpa sakalōpādhi vinirmōcaka purassaraṃ paripūrṇa brahmarūpēṇāvasthānaṃ, nānyasyētyēvamarthō(a)vagamyatē”).

(nityavastuvulu anitya vastuvulu, ātma anātma vastuvulu - vīṭi vivēkamu kaligiyuṃḍuṭavalana vairāgyamunu poṃdinavāniki ātmajñānamu koṟaku - brahmajñānamu koṟaku - brahmaniṣṭhuḍaina sadguru caraṇamula nāśrayiṃci atani nuṃḍi vēdāṃta śravaṇamu cēsinavāniki, rāgamu modalagu samasta dōṣamulu pōyinaṭuvaṃṭi vāniki, satyamu, tapassu, brahmacaryamu modalagu sādhanamulu kaliginaṭuvaṃṭivāniki, ātmasādhanamaṃdē niṣṭhagalavāniki - ātmayaṃdē tadēkadhyānamu galavānikinnī, upaniṣattulalōnu śāstramulalōnu ceppina viṣayamulaku vyatiriktamainavāṭini vadalivēsina vānikinnī, viṣayamulaṃdāsaktilēnivānikinnī - iṭṭi sanyāsiki - ātmayaṃdē ramiṃcuvāniki - ātmayaṃdē krīḍiṃcuvāniki - jñāniki - śuddhasatva svabhāvamu galavāniki, nāmarūpamulugala samasta upādhulanu vadaliṃcukoninavāniki paripūrṇa brahmarūpamutōnuṃḍu sthiti kalugunu. itaruniki iṭṭi sthiti kalugadu).

  1. “ātmātu satataṃ prāpnō apyaprāptavada vidyayā |

tannāśau prāpnuvadbhāti svakaṃṭhābharaṇaṃ yadhā ||“.

(ātma eppuḍunu prāptiṃcunadē. avidya dānini āvariṃcukoniyuṃḍuṭavalana prāptiṃcalēdu ani piṃcunu. ā avidya nāśamukāgā prāptamainaṭṭuganē uṃḍunu. tana kaṃṭhamuna nunna ābharaṇamu tanaku daggaragā nunnappaṭikī bhrāṃtivalana lēnaṭlē tōcunu).

  1. “u. ēla kumāra śōṣilaga nījananaṃbuna nannu gānagā

jālavu nīva; gāmamukha ṣaṭkamu nirda ḷitaṃbusēsi, ni

rmūlitakarmuḍaina muni mukhyuḍugāni kuyōgi gānagā

jālaḍu - - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 6 - 88).

  1. “ā. alukanaina jeliminaina gāmaṃbuna

naina bāṃdhavamunanaina, bhīti

naina dagili talapa nakhilātmuḍagu hari

jēravaccu, vēṟu sēyaḍataḍu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 1 - 14)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.