← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్మారాముడు ātmārāmuḍu

Original — తెలుగు
  1. ఆత్మన్యేవ ఆరామో రతిః యస్య సః -

(ఆత్మయందే రమించువాడు, క్రీడించువాడు - ఆత్మయే విహారస్థానముగా గలవాడు, ఆత్మయే ఆరామమువలె రమణస్థానముగా గలవాడు).

  1. ఆత్మన్యేవ రమ మాణః. (ఆత్మయందే రమించువాడు).

  2. ఆత్మన్యేవ ఆరమతే ఇతి ఆత్మారామః, విషయాంతరాసక్తి శూన్యః -

ఆత్మయందే ఆరామము - విహరించుస్థానము - గలవాడు - ఇతర విషయములందాసక్తి లేనివాడు).

  1. అంతర్యామి - (అందఱిలోను, అన్నింటిలోను ఉండి నియమించువాడు).

  2. అపరిచ్ఛిన్న స్వానందానుభవ రతః. (ఎడతెగనట్లు ఆత్మానందముననుభవించుటయందు ఆసక్తిగలవాడు).

  3. ప్రత్యగాది రూపేణ సర్వాత్మసు రమతే ఇతి ఆత్మారామః.

(ప్రత్యగాత్మరూపములో అందఱి శరీరములందు రమించువాడు).

  1. ఆత్మ ఆనందమయః సంపద్యతే అయ్మేవ ఆత్మారామః కథ్యతే అస్యాం ఆత్మారామ స్థితౌ విషయ తృష్ణాతు కుత్రాపి అపతిష్టతే ఏవన.

“నహి స్వాత్మారామం విషయ మృగతృష్ణా భ్రమయతి”.

(ఆత్మా ఆనందమయుడు - ఇదియే ఆత్మారామస్థితి. ఈ స్థితిలో విషయ,ములగుఱించి ఆత్మ ఉండదు - విషయములను ఎండమావులు భ్రమింపచేయవు -)

  1. పరమాత్మని ఏవ అనురక్తాః - మునయః, యోగినః,

(పరమాత్మయందే నిరంతరము ధ్యానము కలవాడు; మునులు; యోగులు).

Transliteration
  1. ātmanyēva ārāmō ratiḥ yasya saḥ -

(ātmayaṃdē ramiṃcuvāḍu, krīḍiṃcuvāḍu - ātmayē vihārasthānamugā galavāḍu, ātmayē ārāmamuvale ramaṇasthānamugā galavāḍu).

  1. ātmanyēva rama māṇaḥ. (ātmayaṃdē ramiṃcuvāḍu).

  2. ātmanyēva āramatē iti ātmārāmaḥ, viṣayāṃtarāsakti śūnyaḥ -

ātmayaṃdē ārāmamu - vihariṃcusthānamu - galavāḍu - itara viṣayamulaṃdāsakti lēnivāḍu).

  1. aṃtaryāmi - (aṃdaṟilōnu, anniṃṭilōnu uṃḍi niyamiṃcuvāḍu).

  2. aparicchinna svānaṃdānubhava rataḥ. (eḍateganaṭlu ātmānaṃdamunanubhaviṃcuṭayaṃdu āsaktigalavāḍu).

  3. pratyagādi rūpēṇa sarvātmasu ramatē iti ātmārāmaḥ.

(pratyagātmarūpamulō aṃdaṟi śarīramulaṃdu ramiṃcuvāḍu).

  1. ātma ānaṃdamayaḥ saṃpadyatē aymēva ātmārāmaḥ kathyatē asyāṃ ātmārāma sthitau viṣaya tṛṣṇātu kutrāpi apatiṣṭatē ēvana.

“nahi svātmārāmaṃ viṣaya mṛgatṛṣṇā bhramayati”.

(ātmā ānaṃdamayuḍu - idiyē ātmārāmasthiti. ī sthitilō viṣaya,mulaguṟiṃci ātma uṃḍadu - viṣayamulanu eṃḍamāvulu bhramiṃpacēyavu -)

  1. paramātmani ēva anuraktāḥ - munayaḥ, yōginaḥ,

(paramātmayaṃdē niraṃtaramu dhyānamu kalavāḍu; munulu; yōgulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.