← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్మసంతుష్టః ātmasaṃtuṣṭaḥ

Original — తెలుగు
  1. ఆత్మని యేవ సంతుష్టః - సంతోషోహి బాహ్యార్థలాభే సర్వస్య భవతి - తం అనపేక్ష్య ఆత్మన్యేవ చ సంతుష్టః, సర్వతః వీత తృష్ణః ఇత్యే తత్.

(బాహ్యార్థములవలన - అనగా ముందఱ చుట్టు ప్రక్కల కనబడే విషయములవలన కలిగే - లాభమువల్ల అందఱికి సంతోషము కలుగును - అటువంటి బాహ్య సుఖమునపేక్షించక ఆత్మయందే - తనలోన ఉండే పరమాత్మయందే, సంతోషము పొందువాడు; మిగిలినవాటియందు ఆశ వదలివేసినవాడు).

  1. న ఉద్యాన స్రక్చందన గీతవాదిత్ర నృత్తదౌ ధారణ పోషణ భోగ్యాధికం, సర్వమాత్మైవ యస్య.

(ఉద్యాన విహారము, సువాసనగల పూవుల దండ, సంగీతము, వాద్యములు, నృత్యములు మొదలగువాటితో భోగము ననుభవంచుట యందు సంతుష్టి లేనివాడు. ఈ సర్వభోగములు ఆత్మయందే కలవని అన్నీ ఆత్మే యని ఆత్మయందు సంతుష్టిపొందువాడు).

(చూడుము - ‘ఆత్మరతిః’).

  1. “ప్రజహాతి యథా కామాన్ పార్థమనోగతాన్ |

ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః స్థితప్రజ్ఞ స్తదోచ్యతే ||“. (శ్రీమద్భగవద్గీత - 2 - 55)

(మనసులోనున్న కోరికలనన్నింటినీ వదలివేసి, ఆత్మయందే మనస్సును నిలిపి సంతుష్టిని పొండినవాడు స్థిత ప్రజ్ఞుడు అని చెప్పబడుచున్నాడు).

Transliteration
  1. ātmani yēva saṃtuṣṭaḥ - saṃtōṣōhi bāhyārthalābhē sarvasya bhavati - taṃ anapēkṣya ātmanyēva ca saṃtuṣṭaḥ, sarvataḥ vīta tṛṣṇaḥ ityē tat.

(bāhyārthamulavalana - anagā muṃdaṟa cuṭṭu prakkala kanabaḍē viṣayamulavalana kaligē - lābhamuvalla aṃdaṟiki saṃtōṣamu kalugunu - aṭuvaṃṭi bāhya sukhamunapēkṣiṃcaka ātmayaṃdē - tanalōna uṃḍē paramātmayaṃdē, saṃtōṣamu poṃduvāḍu; migilinavāṭiyaṃdu āśa vadalivēsinavāḍu).

  1. na udyāna srakcaṃdana gītavāditra nṛttadau dhāraṇa pōṣaṇa bhōgyādhikaṃ, sarvamātmaiva yasya.

(udyāna vihāramu, suvāsanagala pūvula daṃḍa, saṃgītamu, vādyamulu, nṛtyamulu modalaguvāṭitō bhōgamu nanubhavaṃcuṭa yaṃdu saṃtuṣṭi lēnivāḍu. ī sarvabhōgamulu ātmayaṃdē kalavani annī ātmē yani ātmayaṃdu saṃtuṣṭipoṃduvāḍu).

(cūḍumu - ‘ātmaratiḥ’).

  1. “prajahāti yathā kāmān pārthamanōgatān |

ātmanyēva ātmanā tuṣṭaḥ sthitaprajña stadōcyatē ||“. (śrīmadbhagavadgīta - 2 - 55)

(manasulōnunna kōrikalananniṃṭinī vadalivēsi, ātmayaṃdē manassunu nilipi saṃtuṣṭini poṃḍinavāḍu sthita prajñuḍu ani ceppabaḍucunnāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.