← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్మస్థః ātmasthaḥ

Original — తెలుగు
  1. ఆత్మమాత్ర తయా తిష్టతీతి ఆత్మస్థః.

(ఆత్మమాత్రముగా నున్నవాడు - ప్రకృతి సంబంధము లేనివాడు).

  1. స్వ శరీర హృదయాకాశే బుద్ధౌ చైతన్యాకారేణ అభివ్యక్తః; నహి శరీరావఠత్వమాత్మనః సంభవతి, ఆకాశవదమూర్తత్వాత్.

(తన శరీరములో హృదయమనే ఆకాశమందు, అనగా, బుద్ధియందు చైతన్యరూపముగా తెలియబడువాడు - ఆత్మ ఆకాశమువలె సూక్ష్మమైన దగుటచేత ఆత్మకు శరీరావరత్వము సంభవింపదు).

  1. వ. “కోరికలు లేక యొక్క సమయంబున దిగంబరుడనై పిశాచంబు చందంబున నుండుచు బెక్కు దినంబులుం గోలె బెను పాపవర్తనంబు గైకొని నిమీలిత లోచనత్వంబున నేకాంత భావంబు విష్ణుని యందే జేర్చివికల్పంబు భేద గ్రాహక చిత్త వృత్తుల జిత్తంబు నర్థరూప విభ్రమంబుగల మనంబునందు, మనంబు నహంకారంబునందు, నహంకారంబును మాయయందు, మాయను, నాత్మానుభూతియందు లయంబు నొందించి, సత్యంబు దర్శించుచు విరక్తినొంది స్వానుభవంబున నాత్మ సిద్ధితుండనై యుందుడు - నీవు భగవత్పరుండవుగావున రహస్యంబైన పరమహంసధర్మంబు స్వానుభవగోచరంబైన తెఱంగును నీకు హృద్గోచరంబగునట్లు సెప్పితి”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 13 - 441)
Transliteration
  1. ātmamātra tayā tiṣṭatīti ātmasthaḥ.

(ātmamātramugā nunnavāḍu - prakṛti saṃbaṃdhamu lēnivāḍu).

  1. sva śarīra hṛdayākāśē buddhau caitanyākārēṇa abhivyaktaḥ; nahi śarīrāvaṭhatvamātmanaḥ saṃbhavati, ākāśavadamūrtatvāt.

(tana śarīramulō hṛdayamanē ākāśamaṃdu, anagā, buddhiyaṃdu caitanyarūpamugā teliyabaḍuvāḍu - ātma ākāśamuvale sūkṣmamaina daguṭacēta ātmaku śarīrāvaratvamu saṃbhaviṃpadu).

  1. va. “kōrikalu lēka yokka samayaṃbuna digaṃbaruḍanai piśācaṃbu caṃdaṃbuna nuṃḍucu bekku dinaṃbuluṃ gōle benu pāpavartanaṃbu gaikoni nimīlita lōcanatvaṃbuna nēkāṃta bhāvaṃbu viṣṇuni yaṃdē jērcivikalpaṃbu bhēda grāhaka citta vṛttula jittaṃbu nartharūpa vibhramaṃbugala manaṃbunaṃdu, manaṃbu nahaṃkāraṃbunaṃdu, nahaṃkāraṃbunu māyayaṃdu, māyanu, nātmānubhūtiyaṃdu layaṃbu noṃdiṃci, satyaṃbu darśiṃcucu viraktinoṃdi svānubhavaṃbuna nātma siddhituṃḍanai yuṃduḍu - nīvu bhagavatparuṃḍavugāvuna rahasyaṃbaina paramahaṃsadharmaṃbu svānubhavagōcaraṃbaina teṟaṃgunu nīku hṛdgōcaraṃbagunaṭlu seppiti”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 13 - 441)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.