← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్మస్వరూపము ātmasvarūpamu

Original — తెలుగు
  1. జీవేశ్వర స్వరూపం సాంఖ్యాఖ్యం ఇత్యర్థః.

(సాంఖ్యామతములో చెప్పబడిన ఆత్మతత్వము - సాంఖ్యమను పేరుగల శాస్త్రములో చెప్పబడిన జీవాత్మ పరమాత్మ తత్వము).

  1. ప్రత్యక్ జ్ఞానానందత్వాది విశిష్టం ఆత్మనః స్వరూపం.

(సత్యము, జ్ఞానము, ఆనందము మొదలగు లక్షణములు గలిగియుండుటచేత విశిష్టమైనది ఆత్మస్వరూపము).

  1. పామరాది సర్వసాధారణ్యేన భాసమానం సద్రూపం ఆత్మనః సామాన్య స్వరూపం; కేవల బ్రహ్మానుభవ సిద్ధ చిదానందాది స్వరూపం తు విశేషరూపం. రజ్జోః స్వరూపద్వయమస్తి - ఏకం సామాన్య రూపం, అపరం విశేష రూపం ఇతి చ. తత్రీ ఇయం ఇతి సామాన్యరూపం, ‘రజ్జుః’ ఇతి విశేషరూపం. అయం సర్పః ఇతి భ్రాంతి దశాయాం మిథ్యాభూత సర్పేణ తాదాత్మ్యపన్నం సద్భాసమానం అయం ఇతి యత్స్వరూపం తత్సామాన్యరూపం; భ్రాంతి దశాయాం యత్స్వరూపం నభాసతే, యస్య స్వరూపస్య సాక్షాత్కార మాత్రేణ భ్రమో నివర్తతే తదేవ రజ్జోర్విశేషరూపం. ఏవమేవ ఆత్మనః అపి ఏకః సామాన్యరూపం, అపరం విశేషరూపమితి రూపద్వయమస్తి. తత్ర సద్రూపం సామాన్యరూపం. అసంగత్వ కూటస్థత్వ నిత్యత్వ శుద్ధత్వ ముక్తత్వాది విశేషరూప,”

(పామరులు మొదలగు వారందఱికి రూపముతో సర్వసాధారణముగా తెలిసిన సద్రూపము - జీవాత్మ - ఆత్మ యొక్క సామాన్యస్వరూపము - బ్రహ్మానుభవము వలన సిద్ధించిన చిదానందాదిరూపము ఆత్మయొక్క విశేషరూపము - త్రాడునకు రెండు రూపములు గలవు - ఒకటి సామాన్యరూపము, రెండవది విశేషరూపము. ‘ఇది’ అనునది సామాన్యరూపము. ‘త్రాడు’ అనునది విశేషరూపము - అన్ని వస్తువులను ‘ఇవి’, ‘ఇది’ అని చెప్పుచున్నాము కనుక ‘ఇది’ అనునది సామాన్యరూపము - అన్నియు ఒకమాదిరిగా ఉండవు. అందుచేత ఒక దానిని ‘త్రాడు’ అని విశేషముగా చెప్పుచున్నాము. చీకటిలో త్రాడును చూచి ‘ఇది పాము’ అని భ్రాంతి పడినపుడు అబద్ధపు పామును చెప్పు ‘ఇది’ అనుట సామాన్యరూపము - ఈ భ్రాంతి తొలగి పోగానే అసలు రూపము తెలిసిన తర్వాత కలుగు ‘త్రాడు’ అనునది విశేషరూపము, ఈ ప్రకారముగాబే ఆత్మకు సామాన్యరూపము విశేషరూపము అని రెండు రూపములు గలవు. ఆత్మయొక్క సద్రూపము సామాన్యరూపము; దేనితోను సంబంధించినదిన్నీ కూటస్థమైనటువంటిన్నీ, శుద్ధమైనటువంటిన్నీ, ముక్తమైనటువంటిదిన్నీ, రూపము (స్థితి) విశేషరూపము).

  1. “యథా కుసుమ ధర్మైః గంధైః తదాశ్రయం వాయుః జ్ఞాయతే తథా ఆత్మనః స్వరూపం త్రిగుణాత్మకైః కర్మ జన్యైః బుద్ధి వృత్తైః జాగరణ స్వప్న సిషుప్తిభిః జానీయాత్”. (ఛూడుము - ఆత్మ - 10 - (12)).

  2. “సీ. వినుమాత్మవేత్తకు విష్ణు స్వరూపంబు నెఱుగంగబడు; నది యెట్లన్న - - -”. (చూడుము - ‘ఆత్మ’ – 10.6)

  3. “ఆత్మ స్వరూపం బెట్టిదనిన ననాదియు, బురుషుండును, సత్వాదిగుణశూన్యుండును, బ్రకృతిగుణ విలక్షణుండును, బ్రత్యక్స్వ రూపుండును, స్వయం ప్రకాశుండును, మఱియు నెవ్వనితోడ నీ విశ్వంబు సమన్వితంబగు నతండు గుణత్రయాత్మకత్వంబున వ్యక్తంబును భగవత్సంబంధియునగు ప్రకృతియందు యదృచ్ఛచేత లీలావశంబునం బ్రవేశించిన నా ప్రకృతి గుణత్రయమయంబైన రూపం బయిన ప్రజా సర్గంబు జేయం గనుంగొని యప్పుడు మోహితుండయి, విజ్ఞాన తిరోధానంబునం జేసి గుణత్రయాత్మకంబయిన ప్రకృత్యభ్యాసంబున నన్యోన్యమేళనంబగుటయు, నంతం బ్రకృతి గుణంబు దనయందు నారోపించుకొని క్రియామాణంబులగు కార్యంబులవలన కర్తృత్వంబు గలిగి సంసార బద్ధుండై పార తంత్ర్యంబు గలిగియుండు కర్తృత్వశూన్యుండగు నీశ్వరుండు సాక్షియగుటంజేసి యాత్మకుం గార్యకారణ కర్తృత్వంబులు ప్రకృత్యధీనంబులనియు, సుఖదుఃఖభోక్తృత్వంబులు ప్రకృతి విలక్షణుండయిన పురుషునివనియు నెఱుంగుదురు. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 26 - 886)

Transliteration
  1. jīvēśvara svarūpaṃ sāṃkhyākhyaṃ ityarthaḥ.

(sāṃkhyāmatamulō ceppabaḍina ātmatatvamu - sāṃkhyamanu pērugala śāstramulō ceppabaḍina jīvātma paramātma tatvamu).

  1. pratyak jñānānaṃdatvādi viśiṣṭaṃ ātmanaḥ svarūpaṃ.

(satyamu, jñānamu, ānaṃdamu modalagu lakṣaṇamulu galigiyuṃḍuṭacēta viśiṣṭamainadi ātmasvarūpamu).

  1. pāmarādi sarvasādhāraṇyēna bhāsamānaṃ sadrūpaṃ ātmanaḥ sāmānya svarūpaṃ; kēvala brahmānubhava siddha cidānaṃdādi svarūpaṃ tu viśēṣarūpaṃ. rajjōḥ svarūpadvayamasti - ēkaṃ sāmānya rūpaṃ, aparaṃ viśēṣa rūpaṃ iti ca. tatrī iyaṃ iti sāmānyarūpaṃ, ‘rajjuḥ’ iti viśēṣarūpaṃ. ayaṃ sarpaḥ iti bhrāṃti daśāyāṃ mithyābhūta sarpēṇa tādātmyapannaṃ sadbhāsamānaṃ ayaṃ iti yatsvarūpaṃ tatsāmānyarūpaṃ; bhrāṃti daśāyāṃ yatsvarūpaṃ nabhāsatē, yasya svarūpasya sākṣātkāra mātrēṇa bhramō nivartatē tadēva rajjōrviśēṣarūpaṃ. ēvamēva ātmanaḥ api ēkaḥ sāmānyarūpaṃ, aparaṃ viśēṣarūpamiti rūpadvayamasti. tatra sadrūpaṃ sāmānyarūpaṃ. asaṃgatva kūṭasthatva nityatva śuddhatva muktatvādi viśēṣarūpa,”

(pāmarulu modalagu vāraṃdaṟiki rūpamutō sarvasādhāraṇamugā telisina sadrūpamu - jīvātma - ātma yokka sāmānyasvarūpamu - brahmānubhavamu valana siddhiṃcina cidānaṃdādirūpamu ātmayokka viśēṣarūpamu - trāḍunaku reṃḍu rūpamulu galavu - okaṭi sāmānyarūpamu, reṃḍavadi viśēṣarūpamu. ‘idi’ anunadi sāmānyarūpamu. ‘trāḍu’ anunadi viśēṣarūpamu - anni vastuvulanu ‘ivi’, ‘idi’ ani ceppucunnāmu kanuka ‘idi’ anunadi sāmānyarūpamu - anniyu okamādirigā uṃḍavu. aṃducēta oka dānini ‘trāḍu’ ani viśēṣamugā ceppucunnāmu. cīkaṭilō trāḍunu cūci ‘idi pāmu’ ani bhrāṃti paḍinapuḍu abaddhapu pāmunu ceppu ‘idi’ anuṭa sāmānyarūpamu - ī bhrāṃti tolagi pōgānē asalu rūpamu telisina tarvāta kalugu ‘trāḍu’ anunadi viśēṣarūpamu, ī prakāramugābē ātmaku sāmānyarūpamu viśēṣarūpamu ani reṃḍu rūpamulu galavu. ātmayokka sadrūpamu sāmānyarūpamu; dēnitōnu saṃbaṃdhiṃcinadinnī kūṭasthamainaṭuvaṃṭinnī, śuddhamainaṭuvaṃṭinnī, muktamainaṭuvaṃṭidinnī, rūpamu (sthiti) viśēṣarūpamu).

  1. “yathā kusuma dharmaiḥ gaṃdhaiḥ tadāśrayaṃ vāyuḥ jñāyatē tathā ātmanaḥ svarūpaṃ triguṇātmakaiḥ karma janyaiḥ buddhi vṛttaiḥ jāgaraṇa svapna siṣuptibhiḥ jānīyāt”. (chūḍumu - ātma - 10 - (12)).

  2. “sī. vinumātmavēttaku viṣṇu svarūpaṃbu neṟugaṃgabaḍu; nadi yeṭlanna - - -”. (cūḍumu - ‘ātma’ – 10.6)

  3. “ātma svarūpaṃ beṭṭidanina nanādiyu, buruṣuṃḍunu, satvādiguṇaśūnyuṃḍunu, brakṛtiguṇa vilakṣaṇuṃḍunu, bratyaksva rūpuṃḍunu, svayaṃ prakāśuṃḍunu, maṟiyu nevvanitōḍa nī viśvaṃbu samanvitaṃbagu nataṃḍu guṇatrayātmakatvaṃbuna vyaktaṃbunu bhagavatsaṃbaṃdhiyunagu prakṛtiyaṃdu yadṛcchacēta līlāvaśaṃbunaṃ bravēśiṃcina nā prakṛti guṇatrayamayaṃbaina rūpaṃ bayina prajā sargaṃbu jēyaṃ ganuṃgoni yappuḍu mōhituṃḍayi, vijñāna tirōdhānaṃbunaṃ jēsi guṇatrayātmakaṃbayina prakṛtyabhyāsaṃbuna nanyōnyamēḷanaṃbaguṭayu, naṃtaṃ brakṛti guṇaṃbu danayaṃdu nārōpiṃcukoni kriyāmāṇaṃbulagu kāryaṃbulavalana kartṛtvaṃbu galigi saṃsāra baddhuṃḍai pāra taṃtryaṃbu galigiyuṃḍu kartṛtvaśūnyuṃḍagu nīśvaruṃḍu sākṣiyaguṭaṃjēsi yātmakuṃ gāryakāraṇa kartṛtvaṃbulu prakṛtyadhīnaṃbulaniyu, sukhaduḥkhabhōktṛtvaṃbulu prakṛti vilakṣaṇuṃḍayina puruṣunivaniyu neṟuṃguduru. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 26 - 886)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.