(ప్రపంచములోని వస్తువులన్నింటిని వదలిపెట్టనంతసేపు ఆ ఆత్మ లభ్యముకాదు. వస్తువులన్నింటినీ విడిచిపెట్టగా మిగిలినదే ఆత్మ. ప్రకృతి దాని కార్యములన్నింటిలోను ఆత్మ ఉన్నది. ఆ వస్తువులను జ్ఞానదృష్టిలో వేఱు పరచగా మిగిలియుండునది ఆత్మ ఒక్కటే. అందుచేత ఆత్మను చూడవలెననిన - ఆత్మావలోకనము కలుగవలెననిన - సమస్త వస్తువులను ఆత్మనుండి వేఱుచేసి - విడదీసి మిగిలియుండు ఆత్మను చూడవచ్చును - ఇది జ్ఞాననేత్రముతో చేయగలిగిన పని, వ్యావహారికములో ప్రతి వస్తువులోను ఆత్మ ఎడతెగని సంబంధముతో - అవినావ సంబంధముతో - కలిసియున్నది. ఆ సంబంధమును విడదీయుట అప్రాకృతమైన పని, అసంభవమైన పని - ప్రకృతిని పురుషుని విడదీయుట అశక్యము - అర్థనారీశ్వరరూపములోని పార్వతిని, ఈశ్వరుని వేఱుచేయుట అసాధ్యమైనట్లే - అందుచేత ఇది మనసులో జ్ఞానము చేతనే చేయతగినది).
(prapaṃcamulōni vastuvulanniṃṭini vadalipeṭṭanaṃtasēpu ā ātma labhyamukādu. vastuvulanniṃṭinī viḍicipeṭṭagā migilinadē ātma. prakṛti dāni kāryamulanniṃṭilōnu ātma unnadi. ā vastuvulanu jñānadṛṣṭilō vēṟu paracagā migiliyuṃḍunadi ātma okkaṭē. aṃducēta ātmanu cūḍavalenanina - ātmāvalōkanamu kalugavalenanina - samasta vastuvulanu ātmanuṃḍi vēṟucēsi - viḍadīsi migiliyuṃḍu ātmanu cūḍavaccunu - idi jñānanētramutō cēyagaligina pani, vyāvahārikamulō prati vastuvulōnu ātma eḍategani saṃbaṃdhamutō - avināva saṃbaṃdhamutō - kalisiyunnadi. ā saṃbaṃdhamunu viḍadīyuṭa aprākṛtamaina pani, asaṃbhavamaina pani - prakṛtini puruṣuni viḍadīyuṭa aśakyamu - arthanārīśvararūpamulōni pārvatini, īśvaruni vēṟucēyuṭa asādhyamainaṭlē - aṃducēta idi manasulō jñānamu cētanē cēyataginadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.