← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్మయోనిః ātmayōniḥ

Original — తెలుగు
  1. స్వతస్సిద్ధం. (తనంతట తానే కలిగినవాడు).

  2. “ఆత్మైవ యోనిః” (శ్రీశంకరః)

(తానే జగత్తుపుట్టుటకు కారణమైనవాడు).”ఆత్మైవ యోనిః ఉపాదానకారణం న అన్యత్ ఇతి ఆత్మయోనిః“. (జగత్తు పుట్టుటకు తానే ఉపాదానకారణమైనవాడు - ఇతర వస్తువు కాదు - కుండ పుట్టుటకు కుమ్మరివాడు నిమిత్త కారణము, మట్టి ఉపాదాన కారణము కాని జగత్తు పుట్టుటకు నిమిత్త కారణము, ఉపాదాన కారణము పరబ్రహ్మమే - జగత్తుకు ఉపాదానకారణము ప్రకృతి (Matter) కాని ఆ ప్రకృతి భగవంతునిలోనుండి పుట్టినది కనుక అదికూడ భగవంతుని రూపమే - అందుచేత భగవంతుడే జగత్తునకు ఉపాదానకరణము -

  1. బ్రహ్మాది స్తంబాంతానాం యోనిః ఆత్మ యోనిః -

(చతుర్ముఖ బ్రహ్మ బ్రహ్మ మొదలు స్తంబమువఱకు గల సమస్త వస్తువులకు యోని - పుట్టుటకు స్థానము - అయినవాడు. సృష్టిలోని సమస్త వస్తువులు పరమాత్మనుండియే ఒకదానిలోనుండి ఒకటిగా పుట్టినవి.

  1. ఆత్మా చా సౌ యోనిశ్చ ఆత్మయోనిః , సర్వస్యాత్మా, సర్వస్య యోనిః -

(ఆత్మయును, యోనియు తానే అయినవాడు, అన్నింటికి తానే ఆత్మ అయినవాడు, అన్నింటికి తానే యోని అయినవాడు - ప్రతివస్తువులోను ఆత్మయొక్క అంశ - పరమాత్మయొక్క అంశ - ప్రకృతియొక్క అంశ ఉన్నది - ప్రకృతి దాని వికారములు యోని, అందులో ఉన్న చిచ్ఛక్తి ఆత్మ - ప్రకృతి భగవంతునిలోనుండి పుట్టినదగుటచేత భగవంతుని రూపమే కనుక అదియు ఆత్మయే - అందుచేత ప్రతివస్తువులోనున్న ఆత్మ, యోని తానే అయినవాడు).

  1. “యచ్చాపి సర్వ భూతానాం బీజం తదహ మర్జున |. (శ్రీమద్భగవద్గీత - 10 - 39)

“మమ యోనిర్మహ ద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం |

సంభవ స్సర్వ భూతానాం తతో భవతి భారత - ||“. (శ్రీమద్భగవద్గీత - 14 - 3)

(సమస్త భూతములకు బీజమునేనే - మహద్బ్రహ్మ - అనగా ప్రకృతి - దానిలో నేను నా చిచ్ఛక్తితో ప్రవేశించుట వలన - నా బీజము దానిలో నుంచుటవలన - అది గర్భము ధరించును. దానిలోనుండి సమస్త భూతములు ఒకదానిలోనుండి ఒకటిగా పుట్టుచున్నవి - అందుచేత అది నా యోని. దానిలోనుండి పుట్టిన సమస్త వస్తువులలోను ప్రకృతి అంశ యోని, నా చిచ్ఛక్తి బీజము - అందుచేత ప్రతి వస్తువులోని ఆత్మ నేనే, యోనియు నేనే).

Transliteration
  1. svatassiddhaṃ. (tanaṃtaṭa tānē kaliginavāḍu).

  2. “ātmaiva yōniḥ” (śrīśaṃkaraḥ)

(tānē jagattupuṭṭuṭaku kāraṇamainavāḍu).”ātmaiva yōniḥ upādānakāraṇaṃ na anyat iti ātmayōniḥ”. (jagattu puṭṭuṭaku tānē upādānakāraṇamainavāḍu - itara vastuvu kādu - kuṃḍa puṭṭuṭaku kummarivāḍu nimitta kāraṇamu, maṭṭi upādāna kāraṇamu kāni jagattu puṭṭuṭaku nimitta kāraṇamu, upādāna kāraṇamu parabrahmamē - jagattuku upādānakāraṇamu prakṛti (Matter) kāni ā prakṛti bhagavaṃtunilōnuṃḍi puṭṭinadi kanuka adikūḍa bhagavaṃtuni rūpamē - aṃducēta bhagavaṃtuḍē jagattunaku upādānakaraṇamu -

  1. brahmādi staṃbāṃtānāṃ yōniḥ ātma yōniḥ -

(caturmukha brahma brahma modalu staṃbamuvaṟaku gala samasta vastuvulaku yōni - puṭṭuṭaku sthānamu - ayinavāḍu. sṛṣṭilōni samasta vastuvulu paramātmanuṃḍiyē okadānilōnuṃḍi okaṭigā puṭṭinavi.

  1. ātmā cā sau yōniśca ātmayōniḥ , sarvasyātmā, sarvasya yōniḥ -

(ātmayunu, yōniyu tānē ayinavāḍu, anniṃṭiki tānē ātma ayinavāḍu, anniṃṭiki tānē yōni ayinavāḍu - prativastuvulōnu ātmayokka aṃśa - paramātmayokka aṃśa - prakṛtiyokka aṃśa unnadi - prakṛti dāni vikāramulu yōni, aṃdulō unna cicchakti ātma - prakṛti bhagavaṃtunilōnuṃḍi puṭṭinadaguṭacēta bhagavaṃtuni rūpamē kanuka adiyu ātmayē - aṃducēta prativastuvulōnunna ātma, yōni tānē ayinavāḍu).

  1. “yaccāpi sarva bhūtānāṃ bījaṃ tadaha marjuna |. (śrīmadbhagavadgīta - 10 - 39)

“mama yōnirmaha dbrahma tasmin garbhaṃ dadāmyahaṃ |

saṃbhava ssarva bhūtānāṃ tatō bhavati bhārata - ||“. (śrīmadbhagavadgīta - 14 - 3)

(samasta bhūtamulaku bījamunēnē - mahadbrahma - anagā prakṛti - dānilō nēnu nā cicchaktitō pravēśiṃcuṭa valana - nā bījamu dānilō nuṃcuṭavalana - adi garbhamu dhariṃcunu. dānilōnuṃḍi samasta bhūtamulu okadānilōnuṃḍi okaṭigā puṭṭucunnavi - aṃducēta adi nā yōni. dānilōnuṃḍi puṭṭina samasta vastuvulalōnu prakṛti aṃśa yōni, nā cicchakti bījamu - aṃducēta prati vastuvulōni ātma nēnē, yōniyu nēnē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.