← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆవరణం āvaraṇaṃ

Original — తెలుగు
  1. ఆచ్ఛాదనము; కప్పు; మూత; చుట్టు ఆవరించుకొనియుండునది.

  2. స్వరూపాజ్ఞానం. (తానెవరో తెలియకుండుట; తను పరమాత్మయొక్క అంశయే, తనకీ భేదములేదు అను జ్ఞానములేకుండుట.

  3. వివేకించినను నిశ్చయమునకు రానివ్వనిది ఆవరణము. ఇది మాయాప్రభావము.

  4. ఆవరణమనగా మఱుపే.

  5. “అమార్గేణ విచార్యా ధనాస్తి నోభాతి చేత్య సౌ |

విపరీతవ్యవ హృతిరా వృత్తే ః కార్యమిష్యతే ||“.

(శాస్త్రములో చెప్పినమార్గమునకాక, తప్పు త్రోవను వెళ్ళి భగవంతుడు అగుపడలేదు, అందుచేత లేడు అను విపరీతబుద్ధితో వ్యవహరించుట ఆవరణము).

(బ్రహ్మనాస్తి, నభాతి ఇతి వ్యవహారకారణంతు ఆవరణం). (బ్రహ్మలేడు, కనబడడు అని వ్యవహరించుటకు ఆవరణమే కారణము).

  1. “అబగ్నీరనల నభో(అ)హం కృన్మహత్తత్వ గుణత్రయైః క్రమాద్దశగుణైరండమావృతం పరమాద్భుతం ||”.

(శ్రీవెంకటేశ్వరమహత్యము - 2 - 46)

(భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తత్వము, ప్రకృతియొక్క సత్వరజస్తమములను త్రిగుణములు బ్రహ్మాండమును ఆవరణములవలె కప్పుచున్నవి - ఆవరించియున్నవి).

వ. “వాని మేళనంబునం జతుర్దశ భువనాత్మకమైన విరాడ్రూపంబగు ఆరూపంబునకు గోటి యోజన విశాలంబైన యండకటాహంబు ప్రధమావరణంబైన పృధ్వియగు - - - అయ్యావరణంబుమీద సలిల తేజస్సమీర గగనాహంకార మహత్తత్వంబులనియెడి యాదరణంబులు క్రమంబున నొండొకటి దశగుణోత్తరాధికంబులైయుండు. అట్టి యేడింటిమీద బ్రకృత్యావరణంబున మహావ్యాపకంబగు బ్రహ్మాండంబు భేధించి - -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 2 - 32)

  1. పృధివి, ఆపః (నీరు), తేజస్సు (అగ్ని) వాయువు(గాలి) అకాశము, అహంకారము, మహత్తత్వము అను ఈ ఏడు తత్వములు పృధివిలో (దాని త్రిగుణములతోకలిసి). అష్టావరణములు - భగవంతునిలోనుండి ఒకదానిలోనుండి ఒకటిగా పుట్టిన ఈ తత్వములలో, లోపల పైన పూర్తిగా భగవంతుడు వ్యాపించియున్నాడు - “తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశత్” (వానిని - లోకములను - సృష్టించి, వానిలో ప్రవేశించెను). ఈ తత్వములన్నింటిలోను సూక్ష్మరూపములో భగవంతుడుంటవలన, వాటిలోనున్న భగవంతుని కనబడకుండా ఇవి కప్పుచున్నవి; ఆవరించియున్నవి. అందుచేత వాటిలోనున్న భగవంతునికి ఇవి ఆవరణములు. భగవంతుడు ప్రతి వస్తువులోను ఉన్నప్పటికీ పైకి అందఱికి కనబడకుండుటకు ఈ ఆవరణములే కారణము - పాంచ భౌతికమైన ప్రతివస్తువు ఈ సప్త తత్వములతో - ప్రకృతియొక్క వికారములలో - నిండియున్నవే కనుక, ప్రతివస్తువులోనున్న భగవంతు ని ఆ ఆవరణములు కనబడకుండ ఆచ్ఛాదించుచున్నవి - కప్పుచున్నవి. వీటి అన్నింటిలోను భగవంతుడు వ్యాపించియున్నాడు).
Transliteration
  1. ācchādanamu; kappu; mūta; cuṭṭu āvariṃcukoniyuṃḍunadi.

  2. svarūpājñānaṃ. (tānevarō teliyakuṃḍuṭa; tanu paramātmayokka aṃśayē, tanakī bhēdamulēdu anu jñānamulēkuṃḍuṭa.

  3. vivēkiṃcinanu niścayamunaku rānivvanidi āvaraṇamu. idi māyāprabhāvamu.

  4. āvaraṇamanagā maṟupē.

  5. “amārgēṇa vicāryā dhanāsti nōbhāti cētya sau |

viparītavyava hṛtirā vṛttē ḥ kāryamiṣyatē ||“.

(śāstramulō ceppinamārgamunakāka, tappu trōvanu veḷḷi bhagavaṃtuḍu agupaḍalēdu, aṃducēta lēḍu anu viparītabuddhitō vyavahariṃcuṭa āvaraṇamu).

(brahmanāsti, nabhāti iti vyavahārakāraṇaṃtu āvaraṇaṃ). (brahmalēḍu, kanabaḍaḍu ani vyavahariṃcuṭaku āvaraṇamē kāraṇamu).

  1. “abagnīranala nabhō(a)haṃ kṛnmahattatva guṇatrayaiḥ kramāddaśaguṇairaṃḍamāvṛtaṃ paramādbhutaṃ ||”.

(śrīveṃkaṭēśvaramahatyamu - 2 - 46)

(bhūmi, jalamu, agni, vāyuvu, ākāśamu, ahaṃkāramu, mahattatvamu, prakṛtiyokka satvarajastamamulanu triguṇamulu brahmāṃḍamunu āvaraṇamulavale kappucunnavi - āvariṃciyunnavi).

va. “vāni mēḷanaṃbunaṃ jaturdaśa bhuvanātmakamaina virāḍrūpaṃbagu ārūpaṃbunaku gōṭi yōjana viśālaṃbaina yaṃḍakaṭāhaṃbu pradhamāvaraṇaṃbaina pṛdhviyagu - - - ayyāvaraṇaṃbumīda salila tējassamīra gaganāhaṃkāra mahattatvaṃbulaniyeḍi yādaraṇaṃbulu kramaṃbuna noṃḍokaṭi daśaguṇōttarādhikaṃbulaiyuṃḍu. aṭṭi yēḍiṃṭimīda brakṛtyāvaraṇaṃbuna mahāvyāpakaṃbagu brahmāṃḍaṃbu bhēdhiṃci - -” (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 2 - 32)

  1. pṛdhivi, āpaḥ (nīru), tējassu (agni) vāyuvu(gāli) akāśamu, ahaṃkāramu, mahattatvamu anu ī ēḍu tatvamulu pṛdhivilō (dāni triguṇamulatōkalisi). aṣṭāvaraṇamulu - bhagavaṃtunilōnuṃḍi okadānilōnuṃḍi okaṭigā puṭṭina ī tatvamulalō, lōpala paina pūrtigā bhagavaṃtuḍu vyāpiṃciyunnāḍu - “tat sṛṣṭvā tadēvānu prāviśat” (vānini - lōkamulanu - sṛṣṭiṃci, vānilō pravēśiṃcenu). ī tatvamulanniṃṭilōnu sūkṣmarūpamulō bhagavaṃtuḍuṃṭavalana, vāṭilōnunna bhagavaṃtuni kanabaḍakuṃḍā ivi kappucunnavi; āvariṃciyunnavi. aṃducēta vāṭilōnunna bhagavaṃtuniki ivi āvaraṇamulu. bhagavaṃtuḍu prati vastuvulōnu unnappaṭikī paiki aṃdaṟiki kanabaḍakuṃḍuṭaku ī āvaraṇamulē kāraṇamu - pāṃca bhautikamaina prativastuvu ī sapta tatvamulatō - prakṛtiyokka vikāramulalō - niṃḍiyunnavē kanuka, prativastuvulōnunna bhagavaṃtu ni ā āvaraṇamulu kanabaḍakuṃḍa ācchādiṃcucunnavi - kappucunnavi. vīṭi anniṃṭilōnu bhagavaṃtuḍu vyāpiṃciyunnāḍu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.