(ఇప్పుడు అనేక నామరూపములతో కనబడుచున్న ఈ ప్రపంచమంతయు ఈ సృష్టికిముందు సత్ గానే (సన్మా త్రముగానే) ఉండెను. ఆ సద్వస్తువు నిత్యముక్తము, మార్పులులేనిది, మూడుకాలములందు ఉండునది, చిన్మాత్రము. ఆనందమయము, పరిపూర్ణము, సనాతనము. అది ఒక్కటేయుండెను. అటువంటిది మఱియొకటిగాని, మఱి ఏ విధమైన ఇతరవస్తువుగాని అప్పుడు లేదు. అదియే పరబ్రహ్మ. చీకటిలో జలమువలె కనుపించు ఎండమావులు, వెండివలె తోచు ముత్యపు చిప్ప, మనిషివలె కనుపించు చెట్టుమొరడు లేక స్తంబమువలె తోచునట్లు సత్వరజస్తమోగుణములు సామాన్యావస్థలో యున్నటువంటిదిన్నీ, అనిర్వచనీయమైనదిన్నీ (ఇటువంటిది అని చెప్పుటకు వీలు లేనిది) అయిన మూల ప్రకృతి ఆ సత్పదార్థమైన పరబ్రహ్మలోనుండి పుట్టినేది. అందులో ప్రతిబింబించిన సత్ప దార్థము - (భగవంతుడు తన చైతన్యశక్తి రూపముతో ఆ ప్రకృతిలో ప్రవేశించనది) సాక్షి చైతన్యమాయెను - (ప్రకృతి ఎన్ని రూపములుగా, ఆకారములుగా, వస్తువులుగా మారినను వాటి అన్నింటిలోను పూర్తిగా వ్యాపించియుండుటచేత వాటి చేష్టలు చూచునదికనుక ఆచైతన్యము సాక్షిచైతన్యమని చెప్పబడినది). ఆ మూల ప్రకృతిమరల వికృతిని పొంది సత్వగుణముయొక్క ఉద్రిక్తతను పొంది అవ్యక్తమను పేరుగల ఆవరణశక్తి ఆయెను).
(మాయచేత ఆవరించుబడుటచేత అదే శరీరముగా గలవాడు)
(భగవంతుడు మాయలో - ప్రకృతిలో - ప్రవేశించుటచేత, - పురుషుడు ప్రకృతితో కలియుటచేత, ఆ మూల ప్రకృతి అతనికి శరీరము ఆయెను. తరువాత ఆ ప్రకృతి అనేకమార్పులు చెంది అనేకరూపములుగా మారినను, వాటి అన్నింటిలోను భగవంతుడు యన చైతన్య శక్తితో ఉండుటచేత అవన్నియు అతనికి శరీరములే అయినవి - వేలకొలది శిరస్సు మొదలైన శరీరాంగములు గలవాడు అని చెప్పబడినది).
(మేఘము చిన్నదైనను అనేక యోజనముల మేర వ్యాపించియున్న సూర్యమండలమును చూచువారి దృష్టినుండి అడ్డివేయుచున్నదో అట్లే అజ్ఞానము చిన్నదైనను అపరిచ్ఛిన్నుడు - పరిమితిలేకుండా వ్యాపించియున్నవాడు - అయిన ఆత్మను దర్శించువాని అజ్ఞానము అడ్డివేయుచున్నది. ఇదియే ఆవరణశక్తి. ఈ విషయమే ఈ క్రిందవిధముగా చెప్పబడినది - ” మేఘము అడ్డివేసిన దృష్టికి మేఘముచే అడ్డివేయబడిన సూర్యుడు ప్రభలేనివాడుగా కనబడును).
(ippuḍu anēka nāmarūpamulatō kanabaḍucunna ī prapaṃcamaṃtayu ī sṛṣṭikimuṃdu sat gānē (sanmā tramugānē) uṃḍenu. ā sadvastuvu nityamuktamu, mārpululēnidi, mūḍukālamulaṃdu uṃḍunadi, cinmātramu. ānaṃdamayamu, paripūrṇamu, sanātanamu. adi okkaṭēyuṃḍenu. aṭuvaṃṭidi maṟiyokaṭigāni, maṟi ē vidhamaina itaravastuvugāni appuḍu lēdu. adiyē parabrahma. cīkaṭilō jalamuvale kanupiṃcu eṃḍamāvulu, veṃḍivale tōcu mutyapu cippa, maniṣivale kanupiṃcu ceṭṭumoraḍu lēka staṃbamuvale tōcunaṭlu satvarajastamōguṇamulu sāmānyāvasthalō yunnaṭuvaṃṭidinnī, anirvacanīyamainadinnī (iṭuvaṃṭidi ani ceppuṭaku vīlu lēnidi) ayina mūla prakṛti ā satpadārthamaina parabrahmalōnuṃḍi puṭṭinēdi. aṃdulō pratibiṃbiṃcina satpa dārthamu - (bhagavaṃtuḍu tana caitanyaśakti rūpamutō ā prakṛtilō pravēśiṃcanadi) sākṣi caitanyamāyenu - (prakṛti enni rūpamulugā, ākāramulugā, vastuvulugā mārinanu vāṭi anniṃṭilōnu pūrtigā vyāpiṃciyuṃḍuṭacēta vāṭi cēṣṭalu cūcunadikanuka ācaitanyamu sākṣicaitanyamani ceppabaḍinadi). ā mūla prakṛtimarala vikṛtini poṃdi satvaguṇamuyokka udriktatanu poṃdi avyaktamanu pērugala āvaraṇaśakti āyenu).
(māyacēta āvariṃcubaḍuṭacēta adē śarīramugā galavāḍu)
(bhagavaṃtuḍu māyalō - prakṛtilō - pravēśiṃcuṭacēta, - puruṣuḍu prakṛtitō kaliyuṭacēta, ā mūla prakṛti ataniki śarīramu āyenu. taruvāta ā prakṛti anēkamārpulu ceṃdi anēkarūpamulugā mārinanu, vāṭi anniṃṭilōnu bhagavaṃtuḍu yana caitanya śaktitō uṃḍuṭacēta avanniyu ataniki śarīramulē ayinavi - vēlakoladi śirassu modalaina śarīrāṃgamulu galavāḍu ani ceppabaḍinadi).
(mēghamu cinnadainanu anēka yōjanamula mēra vyāpiṃciyunna sūryamaṃḍalamunu cūcuvāri dṛṣṭinuṃḍi aḍḍivēyucunnadō aṭlē ajñānamu cinnadainanu aparicchinnuḍu - parimitilēkuṃḍā vyāpiṃciyunnavāḍu - ayina ātmanu darśiṃcuvāni ajñānamu aḍḍivēyucunnadi. idiyē āvaraṇaśakti. ī viṣayamē ī kriṃdavidhamugā ceppabaḍinadi - ” mēghamu aḍḍivēsina dṛṣṭiki mēghamucē aḍḍivēyabaḍina sūryuḍu prabhalēnivāḍugā kanabaḍunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.