← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చైతన్యము caitanyamu

Original — తెలుగు
  1. చేతనా జ్ఞానం, తద్భావః చైతన్యం, జ్ఞానత్వం.

(చేతనా అనగా జ్ఞానము, దాని భావము చైతన్యము - జ్ఞానము కలిగియుండుట, చేతనత్వము కలిగి యుండుట).

  1. చేతనస్య భావం (చేతనత్వము కలిగియుండుట).

  2. అవస్థాత్రయ సాక్షిరూపం తత్వం పదార్థలక్ష్యం, ప్రత్యగభిన్నం బ్రహ్మేత్యర్థః.

(జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలందును సాక్షిగానుండునది. ‘తత్వం’ అను మహావాక్యములోని ‘తత్’ పదమునకు లక్ష్యమైనదిన్నీ, ప్రత్యగాత్మకన్న వేఱుకానిది చైతన్యము).

  1. “యచ్చైతన్య మనుస్యూతం జాగ్రత్స్వప్న సుషిప్తిషు |

తదేవత్వమిదం తత్వమితో నాస్త్యధికం పరం“.

(జాగ్రత్స్వప్న సుషుప్తులందు సర్వమును అనుస్యూతమై యున్న చైతన్యమే నువ్వు, ఇదే నీ తత్వము, దీనికన్న అధికమైనది, గొప్పది వేఱొకటి లేదు).

  1. చైతన్యం సర్వగం సర్వం సర్వభూతగుహాశయం |

యత్సర్వ విషయాతీతం తస్మై సర్వవిదేనమః ||.

(అన్నింటిలోనూ ప్రవేశించి యున్నదిన్నీ, సర్వము తానే అయినదిన్నీ, విషయములకు అతీతమైనదిన్నీ, సర్వజ్ఞుడైనదిన్నీ అయినది చైతన్యము).

  1. “యధా ఏకస్వైవాకాశస్య ఘటాకాశ ఇత్యాది చతుర్విధ భేధో అస్తి | తథా ఏకస్యైవ చైతన్యస్య కూటస్థః జీవః, ఈశ్వరః, బ్రహ్మ చ ఇతి భేద చతుష్టయమస్తి”,

(ఆకాశమనునది ఒకటే అయినప్పటికీ ఘటాకాశమని. జలాకాశమని, మేఘాకాశమని, మహాకాశమని నాలుగు విధములుగా చెప్పబడుచున్నది. ఆ ప్రకారముగానే ఒకటే అయిన చైతన్యము కూటస్థుడని, జీవుడని, ఈశ్వరుడని, బ్రహ్మయని నాలుగు విధములుగా చెప్పబడుచున్నది).

  1. “చైతన్యస్య నదృశ్యత్వం దృశ్యత్వే జడమేవ తత్ |

స్వ ప్రకాశం చ చైతన్యం నపరేణప్రకాశితం |

అన వస్థా సత్వాన్న స్వేనాపి ప్రకాశితం కర్మ |

కర్తృ విరోధస్యాత్ తస్మాత్తద్దీవత్స్వ యం |

ప్రకాశమానా మన్యేషాం భాసకం విద్ధిపర్వత |

అత ఏవ చ నిత్యత్వం సిద్ధం సం చిత్తనోర్మమ ||” (దేవీ భాగవతము)

(చైతన్యమనునది కనబడనిది. అది కనబడు వస్తువే అయిన యడల జడమే యగును. చైతన్యము తనంతట తానే ప్రకాశించునది. ఇంకొక వస్తువు చైతన్యమును ప్రకాశింపచేయదు. దీపమువలె చైతన్యము స్వయముగా ప్రకాశించును, ఇతర వస్తువులను ప్రకాశింపచేయును - “తద్భసా సర్వమిదం భాతి” (దాని కాంతిచే ఈ ప్రపంచమంతయు ప్రకాశించు చున్నది).

“యదా దిత్య గతం తేజో” - - - తత్తేజో విద్ధి మామకం (శ్రీమద్భగవద్గీత - 15 - 12)

(సూర్యునిలోనున్న తేజస్సు -సూర్యునివలె ప్రకాశించు అన్ని వస్తువుల తేజస్సు - నాదే). నన్ను ప్రకాశింపచేయునదేమిటి అని సంశయమవసరము లేదు - ఇందువలన అనవస్థాదోషము లేదు - ఎందుచేతననగా నేను దీపము వలె నా అంతట నేనే ప్రకాశించుదును, ప్రకాశించుచున్న ఇతర వస్తువులను ప్రకాశింప చేయువాడను. అందుచేత నేను - చైతన్యరూపములో నున్న పరబ్రహ్మ - నిత్యమైనవాడు - శాశ్వతుడు).

(“యథా దీపః స్వయం ప్రకాశం, పరప్రకాశశ్చ, తద్వత్ మదీయం చైతన్యం స్వయంభాసమానం అన్యేషాం సూర్యాదీనాం భాసకం”

(ఏ ప్రకారముగా దీపము తనంతట తానే ప్రకాశించుచు ఇతర వస్తువులను ప్రకాశింపచేయునో ఆ ప్రకారము గానే చైతన్యము అనునది తనంతట తానే ప్రకాశించునది, సూర్యుడు మొదలగు ఇతర ప్రకాశవస్తు వులను ప్రకాశింప చేయునది).

  1. “జీవో మనశ్చ ననుబుద్ధి రహం కృతశ్చే త్యేవం పదాముపగతే య మ నిర్మలాచిత్ |

సైషోచ్యతే జగతి చేతన చిత్త జీవనం జ్ఞాగణేన కిల నాస్తి వివాద ఏషః | (యోగవాసిష్టము - 96 - 73)

(నిర్మలమగు చైతన్యమొక్కటే జీవుడని, మనస్సు అని, బుద్ధియని, అహంకారమని ప్రపంచములో ప్రసిద్ధి కెక్కినది - ఈ విషయమై సంశయముగాని, వాదముగాని లేదు).

  1. “- - - చిత్ జీవ ఇత్యుచ్యతే లోకే మన ఇత్యపి కథ్యతే| చిత్త మిత్యుచ్యతే సైవ బుద్ధి రిత్యుచ్యతే తథా ||”. (యోగవాసిష్టము - 96 - 33, 34)

(అజ్ఞానము వలన స్వస్వరూపమును వదలి జడమగు దేహాదులతో కూడిన చిద్వస్తువే జీవుడు, మనస్సు, చిత్తము, బుద్ధి అని చెప్పబడుచున్నది).

  1. “మాయావచ్చ్ఛిన్నం చైతన్యం పరమేశ్వరః - మాయాః విశేషణత్వే ఈశ్వరత్వం ఉపాధిత్య సాక్షిత్వమితి ఈశ్వరత్వ సాక్షిత్వయోర్భేదః, నతు ధర్మణో ఈశ్వర తత్సాక్షిణోః స చ పరమేశ్వరః ఏకోపి స్వోపాధి భూతమాయావిష్ట సత్వ రజస్తమో గుణ భేదేన బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఇత్యాది శబ్ద వాచ్యతాం లభతే” (వేదాంత పరిభాషా)

(మాయ చేత ఆవరింపబడిన చైతన్యము పరమేశ్వరుడు - పరమేశ్వరుడు ఒకడే అయినను తన ఉపాధి అయిన మాయ సత్వరజస్తమములను త్రిగుణముల భేదము చేతనే బ్రహ్మ,విష్ణు,మహేశ్వరుడు అని చెప్ప బడుచున్నాడు - ఈశ్వర చైతన్యము,సాక్షి చైతన్యము అని భేదములేదు - చైతన్యమంతయు ఒకటే - భగ వంతుడు - చైతన్యము ఉన్న ఉపాధినిబట్టి పేర్లు వేరు వేరుగా చెప్పబడిచుచున్నవి).

(దేహముకన్న వేరైన ఆత్మ దేహములోనుండి దానిని జీవింపచేయును. అదియే చైతన్యము - జీవశక్తి, ఈ చైతన్యము ప్రతి వస్తువునందును ఇమిడియున్నది –

“క. ఇందు గలడందులేడని

సందేహము వలదు, చక్రి సర్వోపగతుం

డెందెందు వెతకి చూచిన

నందందే గలడు దానవాగ్రణి, వింటే ” (ప్రహ్లాదుడు - శ్రీమదాంధ్రమహాభాగవతము - - -)

చైతన్యము ఇట్లు అన్నివస్తువులలో నుండుటకు (Every particle of matter contains Energy). కారణమేమనగా - బ్రహ్మాండము (Cosmic Egg) పగిలి అందులోని భాగములు ఆకాశములో చెల్లాచెదరైనపుడు (Big Bang) కలిగిన చైతన్య శక్తి (Energy) అట్లు చెదరిన ప్రతి భాగములోను, ఒక్కొక్క భాగములోని ప్రతివస్తువులోను, పూర్తిగా ప్రవేశించి వ్యాపించియుండెను. ఈ చైతన్యశక్తి ప్రాణుల శరీరములో నున్నపుడు ఆ ప్రాణులుచేయు పనులను బట్టి అవి జీవించియున్నట్లు తెలియును - మానవుల శరీరములోనే కాక జంతువులలోను, చెట్లలోను ఈ చైతన్యమున్నట్లు తెలియనగును - జంతువులు, చెట్లు పెరుగుచుండుట మనకు తెలిసిన విషయమే - చైతన్యము లేనిజంతువులు. చెట్లుమొదలగు నవి చనిపోయినట్లే - పాషాణము మొదలగు వాటిలో కూడ చైతన్యమున్నది. కాని అవి చైతన్యవంతముగా నున్నట్లు కనబడకపోవుటకు కారణము వాటిలో అందుకు అనుకూలమైన పరిస్థితి లేకుండుటయే.

  1. “చేతనత్వంబు గలదేని జీవుడందురు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 57)

  2. త్రివిధం చైతన్యం - ప్రమాతృ చైతన్యం, ప్రమాణచైతన్యం విషయచైతన్యం చేతి -

(చైతన్యము మూడు విధములు - ప్రమాతృచైతన్యము, ప్రమాణచైతన్యము, విషయచైతన్యము. ఘటము మొదలగువాటిలోనుండు చైతన్యము విషయచైతన్యము, లేక జ్ఞేయచైతన్యము, అట్టి చైతన్యమును తెలుసుకొనినవాడు జీవుడు ప్రమాతృ చైతన్యము, లేక జ్ఞాతృ చైతన్యము, విషయములను (విషయ చైతన్యమును) ప్రమాతృ చైతన్యముతో (జీవునితో) సంబధము కలుపునది అంతఃకరణము - ఇది ప్రమాణ చైతన్యము).

Transliteration
  1. cētanā jñānaṃ, tadbhāvaḥ caitanyaṃ, jñānatvaṃ.

(cētanā anagā jñānamu, dāni bhāvamu caitanyamu - jñānamu kaligiyuṃḍuṭa, cētanatvamu kaligi yuṃḍuṭa).

  1. cētanasya bhāvaṃ (cētanatvamu kaligiyuṃḍuṭa).

  2. avasthātraya sākṣirūpaṃ tatvaṃ padārthalakṣyaṃ, pratyagabhinnaṃ brahmētyarthaḥ.

(jāgratsvapna suṣuptyavasthalaṃdunu sākṣigānuṃḍunadi. ‘tatvaṃ’ anu mahāvākyamulōni ‘tat’ padamunaku lakṣyamainadinnī, pratyagātmakanna vēṟukānidi caitanyamu).

  1. “yaccaitanya manusyūtaṃ jāgratsvapna suṣiptiṣu |

tadēvatvamidaṃ tatvamitō nāstyadhikaṃ paraṃ”.

(jāgratsvapna suṣuptulaṃdu sarvamunu anusyūtamai yunna caitanyamē nuvvu, idē nī tatvamu, dīnikanna adhikamainadi, goppadi vēṟokaṭi lēdu).

  1. caitanyaṃ sarvagaṃ sarvaṃ sarvabhūtaguhāśayaṃ |

yatsarva viṣayātītaṃ tasmai sarvavidēnamaḥ ||.

(anniṃṭilōnū pravēśiṃci yunnadinnī, sarvamu tānē ayinadinnī, viṣayamulaku atītamainadinnī, sarvajñuḍainadinnī ayinadi caitanyamu).

  1. “yadhā ēkasvaivākāśasya ghaṭākāśa ityādi caturvidha bhēdhō asti | tathā ēkasyaiva caitanyasya kūṭasthaḥ jīvaḥ, īśvaraḥ, brahma ca iti bhēda catuṣṭayamasti”,

(ākāśamanunadi okaṭē ayinappaṭikī ghaṭākāśamani. jalākāśamani, mēghākāśamani, mahākāśamani nālugu vidhamulugā ceppabaḍucunnadi. ā prakāramugānē okaṭē ayina caitanyamu kūṭasthuḍani, jīvuḍani, īśvaruḍani, brahmayani nālugu vidhamulugā ceppabaḍucunnadi).

  1. “caitanyasya nadṛśyatvaṃ dṛśyatvē jaḍamēva tat |

sva prakāśaṃ ca caitanyaṃ naparēṇaprakāśitaṃ |

ana vasthā satvānna svēnāpi prakāśitaṃ karma |

kartṛ virōdhasyāt tasmāttaddīvatsva yaṃ |

prakāśamānā manyēṣāṃ bhāsakaṃ viddhiparvata |

ata ēva ca nityatvaṃ siddhaṃ saṃ cittanōrmama ||” (dēvī bhāgavatamu)

(caitanyamanunadi kanabaḍanidi. adi kanabaḍu vastuvē ayina yaḍala jaḍamē yagunu. caitanyamu tanaṃtaṭa tānē prakāśiṃcunadi. iṃkoka vastuvu caitanyamunu prakāśiṃpacēyadu. dīpamuvale caitanyamu svayamugā prakāśiṃcunu, itara vastuvulanu prakāśiṃpacēyunu - “tadbhasā sarvamidaṃ bhāti” (dāni kāṃticē ī prapaṃcamaṃtayu prakāśiṃcu cunnadi).

“yadā ditya gataṃ tējō” - - - tattējō viddhi māmakaṃ (śrīmadbhagavadgīta - 15 - 12)

(sūryunilōnunna tējassu -sūryunivale prakāśiṃcu anni vastuvula tējassu - nādē). nannu prakāśiṃpacēyunadēmiṭi ani saṃśayamavasaramu lēdu - iṃduvalana anavasthādōṣamu lēdu - eṃducētananagā nēnu dīpamu vale nā aṃtaṭa nēnē prakāśiṃcudunu, prakāśiṃcucunna itara vastuvulanu prakāśiṃpa cēyuvāḍanu. aṃducēta nēnu - caitanyarūpamulō nunna parabrahma - nityamainavāḍu - śāśvatuḍu).

(“yathā dīpaḥ svayaṃ prakāśaṃ, paraprakāśaśca, tadvat madīyaṃ caitanyaṃ svayaṃbhāsamānaṃ anyēṣāṃ sūryādīnāṃ bhāsakaṃ”

(ē prakāramugā dīpamu tanaṃtaṭa tānē prakāśiṃcucu itara vastuvulanu prakāśiṃpacēyunō ā prakāramu gānē caitanyamu anunadi tanaṃtaṭa tānē prakāśiṃcunadi, sūryuḍu modalagu itara prakāśavastu vulanu prakāśiṃpa cēyunadi).

  1. “jīvō manaśca nanubuddhi rahaṃ kṛtaścē tyēvaṃ padāmupagatē ya ma nirmalācit |

saiṣōcyatē jagati cētana citta jīvanaṃ jñāgaṇēna kila nāsti vivāda ēṣaḥ | (yōgavāsiṣṭamu - 96 - 73)

(nirmalamagu caitanyamokkaṭē jīvuḍani, manassu ani, buddhiyani, ahaṃkāramani prapaṃcamulō prasiddhi kekkinadi - ī viṣayamai saṃśayamugāni, vādamugāni lēdu).

  1. “- - - cit jīva ityucyatē lōkē mana ityapi kathyatē| citta mityucyatē saiva buddhi rityucyatē tathā ||”. (yōgavāsiṣṭamu - 96 - 33, 34)

(ajñānamu valana svasvarūpamunu vadali jaḍamagu dēhādulatō kūḍina cidvastuvē jīvuḍu, manassu, cittamu, buddhi ani ceppabaḍucunnadi).

  1. “māyāvaccchinnaṃ caitanyaṃ paramēśvaraḥ - māyāḥ viśēṣaṇatvē īśvaratvaṃ upādhitya sākṣitvamiti īśvaratva sākṣitvayōrbhēdaḥ, natu dharmaṇō īśvara tatsākṣiṇōḥ sa ca paramēśvaraḥ ēkōpi svōpādhi bhūtamāyāviṣṭa satva rajastamō guṇa bhēdēna brahma, viṣṇu, mahēśvara ityādi śabda vācyatāṃ labhatē” (vēdāṃta paribhāṣā)

(māya cēta āvariṃpabaḍina caitanyamu paramēśvaruḍu - paramēśvaruḍu okaḍē ayinanu tana upādhi ayina māya satvarajastamamulanu triguṇamula bhēdamu cētanē brahma,viṣṇu,mahēśvaruḍu ani ceppa baḍucunnāḍu - īśvara caitanyamu,sākṣi caitanyamu ani bhēdamulēdu - caitanyamaṃtayu okaṭē - bhaga vaṃtuḍu - caitanyamu unna upādhinibaṭṭi pērlu vēru vērugā ceppabaḍicucunnavi).

(dēhamukanna vēraina ātma dēhamulōnuṃḍi dānini jīviṃpacēyunu. adiyē caitanyamu - jīvaśakti, ī caitanyamu prati vastuvunaṃdunu imiḍiyunnadi –

“ka. iṃdu galaḍaṃdulēḍani

saṃdēhamu valadu, cakri sarvōpagatuṃ

ḍeṃdeṃdu vetaki cūcina

naṃdaṃdē galaḍu dānavāgraṇi, viṃṭē ” (prahlāduḍu - śrīmadāṃdhramahābhāgavatamu - - -)

caitanyamu iṭlu annivastuvulalō nuṃḍuṭaku (Every particle of matter contains Energy). kāraṇamēmanagā - brahmāṃḍamu (Cosmic Egg) pagili aṃdulōni bhāgamulu ākāśamulō cellācedarainapuḍu (Big Bang) kaligina caitanya śakti (Energy) aṭlu cedarina prati bhāgamulōnu, okkokka bhāgamulōni prativastuvulōnu, pūrtigā pravēśiṃci vyāpiṃciyuṃḍenu. ī caitanyaśakti prāṇula śarīramulō nunnapuḍu ā prāṇulucēyu panulanu baṭṭi avi jīviṃciyunnaṭlu teliyunu - mānavula śarīramulōnē kāka jaṃtuvulalōnu, ceṭlalōnu ī caitanyamunnaṭlu teliyanagunu - jaṃtuvulu, ceṭlu perugucuṃḍuṭa manaku telisina viṣayamē - caitanyamu lēnijaṃtuvulu. ceṭlumodalagu navi canipōyinaṭlē - pāṣāṇamu modalagu vāṭilō kūḍa caitanyamunnadi. kāni avi caitanyavaṃtamugā nunnaṭlu kanabaḍakapōvuṭaku kāraṇamu vāṭilō aṃduku anukūlamaina paristhiti lēkuṃḍuṭayē.

  1. “cētanatvaṃbu galadēni jīvuḍaṃduru” (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 57)

  2. trividhaṃ caitanyaṃ - pramātṛ caitanyaṃ, pramāṇacaitanyaṃ viṣayacaitanyaṃ cēti -

(caitanyamu mūḍu vidhamulu - pramātṛcaitanyamu, pramāṇacaitanyamu, viṣayacaitanyamu. ghaṭamu modalaguvāṭilōnuṃḍu caitanyamu viṣayacaitanyamu, lēka jñēyacaitanyamu, aṭṭi caitanyamunu telusukoninavāḍu jīvuḍu pramātṛ caitanyamu, lēka jñātṛ caitanyamu, viṣayamulanu (viṣaya caitanyamunu) pramātṛ caitanyamutō (jīvunitō) saṃbadhamu kalupunadi aṃtaḥkaraṇamu - idi pramāṇa caitanyamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.