చక్రం అస్యా స్తీతి చక్రీ - (చక్రము అన ఆయుధముగలవాడు చక్రి - విష్ణువు).
“చలస్వ రూపమత్యంతం మనశ్చక్రం నిగద్యతే”. (గోపాల తాపిన్యుపనిషత్)
(అంతములేక చలించుస్వభావముగల మనస్సే చక్రము).
(లోకములన్నింటినీ రక్షించుటకొరకు మనోతత్వమైన సుదర్శనం అను పేరుగల చక్రమును ధరించువాడు).
(అంతములేకుండగ చలించుస్వభావముగలదిన్నీ, వాయువేగమును మించినవేగముకలదిన్నీ అయిన మనస్సును చేతితో ధరించినవాడు - విష్ణువు).
“చక్రం జగత్ ధరతీతి చక్రధరః, చక్రీ”. (చక్రమువలె తిరుగు జగత్తును ధరించువాడు).
“మనస్తత్వాత్మకం చక్రం బుధ్ధి తత్వాత్మకం గదాం |
ధారయన్ లోకరక్షణార్థం ఉక్తశ్చక్రగదాధరః ||“.
ఇతి శ్రుతేః.
(మనస్తత్వాత్మకమైన చక్రమును, బుధ్ధితత్వాత్మకమైన గదను లోకమును రక్షించుటకొఱకు ధరించినవాడు కనుక చక్రగదాధరుడు అని చెప్పబడుచున్నాడు).
(జననమరణములు ఒకదానితర్వతా ఒకటి వచ్చుచు పోవుచుండు చక్రరూపమైన సంసారము శ్రీమహావిష్ణువుయొక్క ఆజ్ఞచేత తిరుగుచున్నది కనుక అతను చక్రి).
cakraṃ asyā stīti cakrī - (cakramu ana āyudhamugalavāḍu cakri - viṣṇuvu).
“calasva rūpamatyaṃtaṃ manaścakraṃ nigadyatē”. (gōpāla tāpinyupaniṣat)
(aṃtamulēka caliṃcusvabhāvamugala manassē cakramu).
(lōkamulanniṃṭinī rakṣiṃcuṭakoraku manōtatvamaina sudarśanaṃ anu pērugala cakramunu dhariṃcuvāḍu).
(aṃtamulēkuṃḍaga caliṃcusvabhāvamugaladinnī, vāyuvēgamunu miṃcinavēgamukaladinnī ayina manassunu cētitō dhariṃcinavāḍu - viṣṇuvu).
“cakraṃ jagat dharatīti cakradharaḥ, cakrī”. (cakramuvale tirugu jagattunu dhariṃcuvāḍu).
“manastatvātmakaṃ cakraṃ budhdhi tatvātmakaṃ gadāṃ |
dhārayan lōkarakṣaṇārthaṃ uktaścakragadādharaḥ ||“.
iti śrutēḥ.
(manastatvātmakamaina cakramunu, budhdhitatvātmakamaina gadanu lōkamunu rakṣiṃcuṭakoṟaku dhariṃcinavāḍu kanuka cakragadādharuḍu ani ceppabaḍucunnāḍu).
(jananamaraṇamulu okadānitarvatā okaṭi vaccucu pōvucuṃḍu cakrarūpamaina saṃsāramu śrīmahāviṣṇuvuyokka ājñacēta tirugucunnadi kanuka atanu cakri).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.