చార్వాకుడు బోధించిన మతము - చార్వాకుడనగా - చారుః లోకసమ్మతో వాకో వాక్యం యస్స సః. లోకులకు - సామాన్యులకు - సమ్మతమైన వాక్కు - వాక్యముగలవాడు.
“ఆకాశం వినా భూత చతుష్టయమాత్రం అంగీకృత్య తత్కార్య భూతో దేహః ఏవ ఆత్మా ఇతి వదంతి చార్వాకాః -
(ఆకాశముకాక మిగిలిన నాలుగు భూతములైన వాయువు, అగ్ని, జలము, భూమి - వీటిని భూతములుగా అంగీకరించి, వాటి కార్యమైన దేహమే ఆత్మయని చెప్పువారిమతము).
చార్వాకమతంబనునది పృధివ్యాది చతుర్భూత వికారంబగు జగత్తున సుఖంచే స్వర్గము, దుఃఖంబే నరకంబు, గాక వేరే స్వర్గనరకాదులు లేవు - అని చెప్పువారిమతము. (వివేకచింతామణి).
“అహం ధీ విషయః యః స ఆత్మా –” అహం మనుష్యః అహం స్థూలః, అహం కృశః, అహం బ్రాహ్మణః ఇత్యాద్యను భవేషు మనుష్యత్వాది ధర్మ విశిష్టః స్థూల దేహః ఏవ విషయో భవతీతి సదేహ ఏవ ఆత్మా. 2. అధవా పరమప్రేమ విషయః యః స ఆత్మా. ఏ తత్ స్థూల దేహోప కారకత్వ నిమిత్తం పురస్కృత్యైవ పుత్రమిత్ర కళత్రాదయః ప్రియాః భవంతి. అతః దేహ ఏవ పరమ ప్రీతి విషయః - ఏవం పరమ ప్రేమాస్పదత్వ రూపాత్మ లక్షణ యోగాత్ స్థూల దేహః ఏవ ఆత్మా. 3. తస్య దేహస్య అలంకణ పోషణాది జన్య భోగ ఏవ పరమ పురుషార్థః. 4. మరణ మేవ మోక్షః. 5. ప్రత్యక్షం ఏకమేవ ప్రమాణం, న అన్యత్ ప్రమాణమస్తి - ఇతి.
(అహం = నేను అను బుద్ధియే ఆత్మ - నేనుమనుష్యుడను, నేనుస్థూలముగానున్నాను - నేనుసన్నముగా నున్నాను - నేను బ్రాహ్మణుడను“. అను మాటలలోని అనుభవమును బట్టి వాటికి విషయమైన మనుష్యుడు మొదలగువారికి సంబంధించిన స్థూలదేహమే ఆత్మ. 2. పరమప్రేమ విషయమైనదే ఆత్మ. ఈ స్థూలదేహమునకు ఉపకారము చేయు నిమిత్తమే పుత్రులు, మిత్రులు, భార్య మొదలగువారు ప్రియలగుచున్నారు - అందుచేత దేహమే పరమప్రేమ విషయమైనది - పరమప్రేమకు విషయమైనది. అందుచేత స్థూలదేహమే ఆత్మ. 3. అటువంటి దేహము నలంకరించుట, పోషించుటవలన కలిగిన భోగమే పరమ పురుషార్థము. 4. మరణమే మోక్షము. 5. ప్రత్యక్షముగా మనకంటికి కనబడునదే ప్రమాణము - (రుజువు కనబడునది). మఱియొక ప్రమాణములేదు. అని ఈ ప్రకారము అభిప్రాయపడునది చార్వకమతము).
ఏ తచ్చార్వాకమతం అసంగతం. దేహో న ఆత్మా చేతన ఏవ ఆత్మా భవితు మర్హతి.
(ఈ మతము సంగతముకాదు - దేహము ఆత్మకాదు, స్వతః చేతనత్వములేనిది - చేతనత్వము కలదే ఆత్మ).
cārvākuḍu bōdhiṃcina matamu - cārvākuḍanagā - cāruḥ lōkasammatō vākō vākyaṃ yassa saḥ. lōkulaku - sāmānyulaku - sammatamaina vākku - vākyamugalavāḍu.
“ākāśaṃ vinā bhūta catuṣṭayamātraṃ aṃgīkṛtya tatkārya bhūtō dēhaḥ ēva ātmā iti vadaṃti cārvākāḥ -
(ākāśamukāka migilina nālugu bhūtamulaina vāyuvu, agni, jalamu, bhūmi - vīṭini bhūtamulugā aṃgīkariṃci, vāṭi kāryamaina dēhamē ātmayani ceppuvārimatamu).
cārvākamataṃbanunadi pṛdhivyādi caturbhūta vikāraṃbagu jagattuna sukhaṃcē svargamu, duḥkhaṃbē narakaṃbu, gāka vērē svarganarakādulu lēvu - ani ceppuvārimatamu. (vivēkaciṃtāmaṇi).
“ahaṃ dhī viṣayaḥ yaḥ sa ātmā –” ahaṃ manuṣyaḥ ahaṃ sthūlaḥ, ahaṃ kṛśaḥ, ahaṃ brāhmaṇaḥ ityādyanu bhavēṣu manuṣyatvādi dharma viśiṣṭaḥ sthūla dēhaḥ ēva viṣayō bhavatīti sadēha ēva ātmā. 2. adhavā paramaprēma viṣayaḥ yaḥ sa ātmā. ē tat sthūla dēhōpa kārakatva nimittaṃ puraskṛtyaiva putramitra kaḷatrādayaḥ priyāḥ bhavaṃti. ataḥ dēha ēva parama prīti viṣayaḥ - ēvaṃ parama prēmāspadatva rūpātma lakṣaṇa yōgāt sthūla dēhaḥ ēva ātmā. 3. tasya dēhasya alaṃkaṇa pōṣaṇādi janya bhōga ēva parama puruṣārthaḥ. 4. maraṇa mēva mōkṣaḥ. 5. pratyakṣaṃ ēkamēva pramāṇaṃ, na anyat pramāṇamasti - iti.
(ahaṃ = nēnu anu buddhiyē ātma - nēnumanuṣyuḍanu, nēnusthūlamugānunnānu - nēnusannamugā nunnānu - nēnu brāhmaṇuḍanu”. anu māṭalalōni anubhavamunu baṭṭi vāṭiki viṣayamaina manuṣyuḍu modalaguvāriki saṃbaṃdhiṃcina sthūladēhamē ātma. 2. paramaprēma viṣayamainadē ātma. ī sthūladēhamunaku upakāramu cēyu nimittamē putrulu, mitrulu, bhārya modalaguvāru priyalagucunnāru - aṃducēta dēhamē paramaprēma viṣayamainadi - paramaprēmaku viṣayamainadi. aṃducēta sthūladēhamē ātma. 3. aṭuvaṃṭi dēhamu nalaṃkariṃcuṭa, pōṣiṃcuṭavalana kaligina bhōgamē parama puruṣārthamu. 4. maraṇamē mōkṣamu. 5. pratyakṣamugā manakaṃṭiki kanabaḍunadē pramāṇamu - (rujuvu kanabaḍunadi). maṟiyoka pramāṇamulēdu. ani ī prakāramu abhiprāyapaḍunadi cārvakamatamu).
ē taccārvākamataṃ asaṃgataṃ. dēhō na ātmā cētana ēva ātmā bhavitu marhati.
(ī matamu saṃgatamukādu - dēhamu ātmakādu, svataḥ cētanatvamulēnidi - cētanatvamu kaladē ātma).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.