అతల, వితల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ, భూలోక, భువర్లోక, స్వర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్య లోకములు. పాతాళలోకమువరకుగల లోకములు ఏడును అధోలోకములు, తక్కినవి ఊర్ధ్వలోకములు -
“క. భువనాత్మకుడా యీశుడు
బవనాకృతి తోడనుండు బ్రహ్మాండంబున్
వివరముతో బదునాలుగు
వివరంబులుగా నొనర్చె విశదంబులుగన్.
మ. బహపాదోరు భుజాననేక్షణ శిరః ఫాల శ్రవోపేతుడై
విహరించున్ బహుదేహి దేహగతుడై; విద్వాన్సులూహించి త
ద్బహురూపావయవంబులన్ భువనపంక్తిన్ విచారింతురా
మహనీయాద్భుతమూర్తి యోగి జనహృన్మాన్యుండు మేథానిథీ“.
“వ. వినుము చతుర్దశలోకంబులందు మీది ఏడు లోకంబులు శ్రీమహావిష్ణువునకు గటి ప్రదేశముననుండి యూర్థ్వదేహమనియు గ్రింది యేడు లోకంబులు జఘనంబుననుండి యథోదేహమనియును బలుకుదురు - - భూలోకంబు గటి పర్యంత ప్రదేశంబు, భువర్లోకంబు నాభి, సువర్లోకంబు హృదయంబు, మహర్లోకంబు వక్షంబు, జనలోకంబు గ్రీవంబు, తపోలోకంబు స్తనద్వయంబు, సనాతనంబును బ్రహ్మనివాసంబునునైన సత్యలోకంబు శిరంబు, గటి ప్రదేశం బతలంబు, తోడలు వితలంబు, జానువులు సుతలంబు, జంఘలు దలాతలంబు, గల్ఫంబులు మహాతలంబు, పాదాగ్రంబులు రసాతలంబు, పాదతలంబు పాతాళంబునని, లోకమయుంగా భావింతురు” (శ్రీమదాంధ్రమహాభాగవతము- 2 - 6 - 89)
(భగవంతుని కోమలమైన అంగములవలన చతుర్దశ భువనములు - పదునాలుగు లోకములు - కలిగినవి).
atala, vitala, rasātala, talātala, mahātala, pātāḷa, bhūlōka, bhuvarlōka, svarlōka, maharlōka, janalōka, tapōlōka, satya lōkamulu. pātāḷalōkamuvarakugala lōkamulu ēḍunu adhōlōkamulu, takkinavi ūrdhvalōkamulu -
“ka. bhuvanātmakuḍā yīśuḍu
bavanākṛti tōḍanuṃḍu brahmāṃḍaṃbun
vivaramutō badunālugu
vivaraṃbulugā nonarce viśadaṃbulugan.
ma. bahapādōru bhujānanēkṣaṇa śiraḥ phāla śravōpētuḍai
vihariṃcun bahudēhi dēhagatuḍai; vidvānsulūhiṃci ta
dbahurūpāvayavaṃbulan bhuvanapaṃktin vicāriṃturā
mahanīyādbhutamūrti yōgi janahṛnmānyuṃḍu mēthānithī”.
“va. vinumu caturdaśalōkaṃbulaṃdu mīdi ēḍu lōkaṃbulu śrīmahāviṣṇuvunaku gaṭi pradēśamunanuṃḍi yūrthvadēhamaniyu griṃdi yēḍu lōkaṃbulu jaghanaṃbunanuṃḍi yathōdēhamaniyunu balukuduru - - bhūlōkaṃbu gaṭi paryaṃta pradēśaṃbu, bhuvarlōkaṃbu nābhi, suvarlōkaṃbu hṛdayaṃbu, maharlōkaṃbu vakṣaṃbu, janalōkaṃbu grīvaṃbu, tapōlōkaṃbu stanadvayaṃbu, sanātanaṃbunu brahmanivāsaṃbununaina satyalōkaṃbu śiraṃbu, gaṭi pradēśaṃ batalaṃbu, tōḍalu vitalaṃbu, jānuvulu sutalaṃbu, jaṃghalu dalātalaṃbu, galphaṃbulu mahātalaṃbu, pādāgraṃbulu rasātalaṃbu, pādatalaṃbu pātāḷaṃbunani, lōkamayuṃgā bhāviṃturu” (śrīmadāṃdhramahābhāgavatamu- 2 - 6 - 89)
(bhagavaṃtuni kōmalamaina aṃgamulavalana caturdaśa bhuvanamulu - padunālugu lōkamulu - kaliginavi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.