← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చతుర్ముఖుడు caturmukhuḍu

Original — తెలుగు
  1. “క. తన జఠరములోపల దా

చిన లోకనికాయముల సృజించుటకును సా

ధనమగు సూక్ష్మా ర్థము మన

సున గని కాలానుగత రజోగుణముమంతన్.”

సీ. పుట్టించె; దద్గుణంబున బరమేశ్వరు నాభి దేశమందు నళిన నాళ

ముదయించె; మఱియప్పయోరుహ ముకుళంబు గర్మబోధితమైనకాలమందు

దన తేజమున బ్రవృద్ధంబైన జలముచే జలజాప్తు గతి బ్రకాశంబునొంద

జేసి, లోకాశ్రయస్థితి సర్వగుణ విభాసితగతి నొప్పు రాజీవమందు

తే. నిజకళా కవితాంశంబు నిలిపి, దాని

వలన నామ్నాయమయుడును వరగుణుండు

నాత్మయోనియునైన తోయజ భవుండు

సరవి జతురాన నుండునా జననమయ్యె“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 8 - 274, 275)

  1. “సీ. - - -

- - - ఆ వాసుదేవుని నాభియందు సహస్ర సూర్య ప్రదీప్తి

దనరుచు సకలజీవ వికాయయుతమగు పంకజాతంబు సంభవమునొందె

బరగంగనందులో భగవదధిష్టితుండై స్వరాట్టగు చతురాననుండు

తే. జననమందెను; దత్పద్మ సంభవుండు

నామరూపగుణాది సంజా సమేతు

డగుచు నిర్మాణమొనరించె నఖిల జగము

- - ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము- 3 - 20 - 719)

  1. చతుర్ముఖబ్రహ్మకాలము ఈ క్రింద విధముగా చెప్పబడినది : -

“సీ. భూర్భువస్స్వర్లోకములకంటె బొడవున గడు నొప్పు సత్యలోకంబునందు

నుండు బ్రహ్మకు చతుర్యుగ సహస్రములేగ దివమొక్కటియగు, రాత్రియును నిట్ల

చన, థాతనిద్రవో జగములడంగు, మేల్కని చూడ మరల లోకములు పుట్టు - - - . (శ్రీమదాంధ్రమహాభాగవతము- 3 - 11 - 352)

“సహస్రయుగ పర్యంతమహర్యద్బ్రహ్మణో విదః |

రాత్రిం యుగ సహస్రాంతాం తే (అ)హో రాత్రివిదో జనాః ||“. (శ్రీమద్భగవద్గీత- 8 - 17)

(చతుర్ముఖబ్రహ్మయుక్క అహోరాత్రి పరిమాణము తెలిసినవారు అతనికి సహస్ర యుగములు ఒక పగటికాలమని, సహస్రయుగములు క రాత్రికాలమనియు చెప్పియున్నారు).

ఈ చతుర్ముఖబ్రహ్మయొక్క పగటికాలమందు అంతకుముందు వ్యక్తముగాక సూక్ష్మరూపములో అతనియందణగియున్న సమస్త వస్తువులు అన్నియు వ్యక్తమగుచున్నవి - నామరూపములు దాల్చి సృష్టింపబడుచున్నవి.ఈ చతుర్ముఖబ్రహ్మయే అవ్యక్తమని, ప్రకృతియని, మాయయని చెప్పబడిచున్నాడు - ఈ చతుర్ముఖబ్రహ్మ పగటికాలమందు సృష్టి జరుగుచుండును, అతనికిరాత్రియనగా సర్వప్రపంచము దానికి కారణమైన చతుర్ముఖబ్రహ్మలో లయమగుట, లీనమైపోవుట. అట్లు అతనిలో లీనమై ఉండిపోయిన స్థితియే అతని రాత్రికాలము అని చెప్పబడినది. చతుర్ముఖబ్రహ్మ పగటికాలమనగా, అతని రాత్రికాలములో తనలో లీనమై యున్న సర్వప్రపంచము భగవంతుని శక్తివలన తిరిగి సృష్టింపబడుటకు ఉన్ముఖమై యుండుకాలము - ఎడములేక - వచ్చునట్లు చతుర్ముఖ బ్రహ్మయొక్కరాత్రి పగలు ఒకటితర్వాత నొకటి వచ్చుచుండును. (`It is a continuous process, which goes on forever, without there being a stop at any stage at any time `- అందుచేతనే ఇది ప్రవాహరూపముగలది). ఈ చతుర్ముఖబ్రహ్మను - ప్రకృతిని - అధిష్టించియుండి భగవంతుడు - నిర్గుణ, నిరాకార, నిర్విశేష పరబ్రహ్మ తన సత్తాస్పూర్తిని - చైతన్య శక్తిని దానికిచ్చి దానిచేత పైన చెప్పిన విధముగా ఈ చరాచర సృష్టి చేయించుచున్నాడు –

“సర్వభూతాని కౌంతేయ, ప్రకృతిం యాంతి మామికాం |

కల్ప క్షయే; పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం |

ప్రకృతిం స్వామనష్టభ్య విసృజామి పునః పునః |

భూతగ్రామ మిముం కృత్స్న మవశ్చం ప్రకృతేర్వశాత్ ||” (శ్రీమద్భగవద్గీత - 9 - 7, 8)

కల్ప ప్రళయకాలమందు సమస్త భూతములు నా ప్రకృతిని పొందుచున్నవి - ప్రకృతిలో లీనమగుచున్నవి, లయమగుచున్నవి. మరల కల్ప ప్రారంభమున - సృష్టికాలమందు - నేను వాటిని విడిచిపెట్టివేయుచున్నాను - ప్రకృతిద్వారా సృష్టించబడినట్లు చేయుచున్నాను - ఇట్లు నేను ప్రకృతిలో అధిష్టించియుండుటవలన మరల మరల భూతములన్నింటినీ సృష్టించుచున్నాను - వాటికి స్వతంత్రములేక నా వశములో నుండుటవలన అవి మరల మరల సృష్టింపబడుచు లయింపబడుచున్నవి. దీని వల్ల తెలియునదేమనగా భగవంతుని శక్తి లేనిదే ఏ వస్తువు పుట్టదు, పుట్టినది లయము పొందదు - సృష్టికి లయమునకు భగవంతుడే కారణము -) (ప్రకృతి పురుష సం యోగమువలననే సృష్టి జరుగుచున్నది (Creation is going on due to the combination of Matter and Energy).

Transliteration
  1. “ka. tana jaṭharamulōpala dā

cina lōkanikāyamula sṛjiṃcuṭakunu sā

dhanamagu sūkṣmā rthamu mana

suna gani kālānugata rajōguṇamumaṃtan.”

sī. puṭṭiṃce; dadguṇaṃbuna baramēśvaru nābhi dēśamaṃdu naḷina nāḷa

mudayiṃce; maṟiyappayōruha mukuḷaṃbu garmabōdhitamainakālamaṃdu

dana tējamuna bravṛddhaṃbaina jalamucē jalajāptu gati brakāśaṃbunoṃda

jēsi, lōkāśrayasthiti sarvaguṇa vibhāsitagati noppu rājīvamaṃdu

tē. nijakaḷā kavitāṃśaṃbu nilipi, dāni

valana nāmnāyamayuḍunu varaguṇuṃḍu

nātmayōniyunaina tōyaja bhavuṃḍu

saravi jaturāna nuṃḍunā jananamayye”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 8 - 274, 275)

  1. “sī. - - -

- - - ā vāsudēvuni nābhiyaṃdu sahasra sūrya pradīpti

danarucu sakalajīva vikāyayutamagu paṃkajātaṃbu saṃbhavamunoṃde

baragaṃganaṃdulō bhagavadadhiṣṭituṃḍai svarāṭṭagu caturānanuṃḍu

tē. jananamaṃdenu; datpadma saṃbhavuṃḍu

nāmarūpaguṇādi saṃjā samētu

ḍagucu nirmāṇamonariṃce nakhila jagamu

- - ||“. (śrīmadāṃdhramahābhāgavatamu- 3 - 20 - 719)

  1. caturmukhabrahmakālamu ī kriṃda vidhamugā ceppabaḍinadi : -

“sī. bhūrbhuvassvarlōkamulakaṃṭe boḍavuna gaḍu noppu satyalōkaṃbunaṃdu

nuṃḍu brahmaku caturyuga sahasramulēga divamokkaṭiyagu, rātriyunu niṭla

cana, thātanidravō jagamulaḍaṃgu, mēlkani cūḍa marala lōkamulu puṭṭu - - - . (śrīmadāṃdhramahābhāgavatamu- 3 - 11 - 352)

“sahasrayuga paryaṃtamaharyadbrahmaṇō vidaḥ |

rātriṃ yuga sahasrāṃtāṃ tē (a)hō rātrividō janāḥ ||“. (śrīmadbhagavadgīta- 8 - 17)

(caturmukhabrahmayukka ahōrātri parimāṇamu telisinavāru ataniki sahasra yugamulu oka pagaṭikālamani, sahasrayugamulu ka rātrikālamaniyu ceppiyunnāru).

ī caturmukhabrahmayokka pagaṭikālamaṃdu aṃtakumuṃdu vyaktamugāka sūkṣmarūpamulō ataniyaṃdaṇagiyunna samasta vastuvulu anniyu vyaktamagucunnavi - nāmarūpamulu dālci sṛṣṭiṃpabaḍucunnavi.ī caturmukhabrahmayē avyaktamani, prakṛtiyani, māyayani ceppabaḍicunnāḍu - ī caturmukhabrahma pagaṭikālamaṃdu sṛṣṭi jarugucuṃḍunu, atanikirātriyanagā sarvaprapaṃcamu dāniki kāraṇamaina caturmukhabrahmalō layamaguṭa, līnamaipōvuṭa. aṭlu atanilō līnamai uṃḍipōyina sthitiyē atani rātrikālamu ani ceppabaḍinadi. caturmukhabrahma pagaṭikālamanagā, atani rātrikālamulō tanalō līnamai yunna sarvaprapaṃcamu bhagavaṃtuni śaktivalana tirigi sṛṣṭiṃpabaḍuṭaku unmukhamai yuṃḍukālamu - eḍamulēka - vaccunaṭlu caturmukha brahmayokkarātri pagalu okaṭitarvāta nokaṭi vaccucuṃḍunu. (`It is a continuous process, which goes on forever, without there being a stop at any stage at any time `- aṃducētanē idi pravāharūpamugaladi). ī caturmukhabrahmanu - prakṛtini - adhiṣṭiṃciyuṃḍi bhagavaṃtuḍu - nirguṇa, nirākāra, nirviśēṣa parabrahma tana sattāspūrtini - caitanya śaktini dānikicci dānicēta paina ceppina vidhamugā ī carācara sṛṣṭi cēyiṃcucunnāḍu –

“sarvabhūtāni kauṃtēya, prakṛtiṃ yāṃti māmikāṃ |

kalpa kṣayē; punastāni kalpādau visṛjāmyahaṃ |

prakṛtiṃ svāmanaṣṭabhya visṛjāmi punaḥ punaḥ |

bhūtagrāma mimuṃ kṛtsna mavaścaṃ prakṛtērvaśāt ||” (śrīmadbhagavadgīta - 9 - 7, 8)

kalpa praḷayakālamaṃdu samasta bhūtamulu nā prakṛtini poṃducunnavi - prakṛtilō līnamagucunnavi, layamagucunnavi. marala kalpa prāraṃbhamuna - sṛṣṭikālamaṃdu - nēnu vāṭini viḍicipeṭṭivēyucunnānu - prakṛtidvārā sṛṣṭiṃcabaḍinaṭlu cēyucunnānu - iṭlu nēnu prakṛtilō adhiṣṭiṃciyuṃḍuṭavalana marala marala bhūtamulanniṃṭinī sṛṣṭiṃcucunnānu - vāṭiki svataṃtramulēka nā vaśamulō nuṃḍuṭavalana avi marala marala sṛṣṭiṃpabaḍucu layiṃpabaḍucunnavi. dīni valla teliyunadēmanagā bhagavaṃtuni śakti lēnidē ē vastuvu puṭṭadu, puṭṭinadi layamu poṃdadu - sṛṣṭiki layamunaku bhagavaṃtuḍē kāraṇamu -) (prakṛti puruṣa saṃ yōgamuvalananē sṛṣṭi jarugucunnadi (Creation is going on due to the combination of Matter and Energy).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.