“సామ్నా దానేన భేదేనసమస్తైర్యుతవా పృధక్ |
విజేతుం ప్రయతే తారీన్ న యుద్ధ్యేత కదాచన |
అనిత్యో విజయో యస్మాత్ దృశ్యతే యుద్ధ్యమానయోః |
పరాజయశ్చ సంగ్రామే తస్మాద్యుద్ధం వివర్జయేత్ |
త్రయాణామస్యుపాయానాం పూర్వోక్తానామసంభవే |
తథా యుద్ధ్యేత సంపత్తా విజయేత రిపూన్యథా ||“. (మహాభారతము - శాంతిపర్వము)
(సామముచేతగాని, దానముచేతగాని, భేదముచేతగాని, లేక సామ దానభేదముల మూడింటిచేతగాని శత్రువులను జయించుటకు ప్రయత్నించవలెను కాని, ఎన్నడూ యుద్ధము చేయుకూడదు. యుద్ధముచేయువారికి విజయము తప్పకవచ్చునను నిశ్చయములేదు - యుద్ధములో పరాజయముకూడ కలుగవచ్చును - “వచ్చినవాడు ఫల్గుణుడవశ్యము గెల్తుమనంగరాదు; రా| లచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వనేర్చునే -హెచ్చగు కుంజగున్ - - -” (ఆంధ్రమహాభారతము - విరాటపర్వము). కనుక వీలగునంతవరకు యుద్ధము - దండము - మానివేయవలయును.
సామ దాన భేదములు పనిచేయనప్పుడు తగినంత బలము చేకూర్చుకొని యుద్ధము చేయవలయును).
“sāmnā dānēna bhēdēnasamastairyutavā pṛdhak |
vijētuṃ prayatē tārīn na yuddhyēta kadācana |
anityō vijayō yasmāt dṛśyatē yuddhyamānayōḥ |
parājayaśca saṃgrāmē tasmādyuddhaṃ vivarjayēt |
trayāṇāmasyupāyānāṃ pūrvōktānāmasaṃbhavē |
tathā yuddhyēta saṃpattā vijayēta ripūnyathā ||“. (mahābhāratamu - śāṃtiparvamu)
(sāmamucētagāni, dānamucētagāni, bhēdamucētagāni, lēka sāma dānabhēdamula mūḍiṃṭicētagāni śatruvulanu jayiṃcuṭaku prayatniṃcavalenu kāni, ennaḍū yuddhamu cēyukūḍadu. yuddhamucēyuvāriki vijayamu tappakavaccunanu niścayamulēdu - yuddhamulō parājayamukūḍa kalugavaccunu - “vaccinavāḍu phalguṇuḍavaśyamu geltumanaṃgarādu; rā| laccikinai penaṃgina balaṃbulu reṃḍunu gelvanērcunē -heccagu kuṃjagun - - -” (āṃdhramahābhāratamu - virāṭaparvamu). kanuka vīlagunaṃtavaraku yuddhamu - daṃḍamu - mānivēyavalayunu.
sāma dāna bhēdamulu panicēyanappuḍu taginaṃta balamu cēkūrcukoni yuddhamu cēyavalayunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.