← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చతుర్విధముక్తులు caturvidhamuktulu

Original — తెలుగు
  1. (1). “రాజుయొక్క రాష్ట్రమునందు ప్రజలవలె ఈశ్వరుని లోకమందు నివసించుట సాలోక్యముక్తి - (2). రాజుయొక్క సేవకులవలె ఈశ్వర సమీపమందుండుట సామీప్యముక్తి (3). రాజుయొక్క అనుజులవలె ఈశ్వర సమాన, రూపప్రాప్తి సారూప్యముక్తి (4) రాజుయొక్క జ్యేష్టపుత్రునివలె ఈశ్వరునితో సమానముగ సత్యసంకల్పా ద్యైశ్వర్యప్రాప్తి సార్షిముక్తి. ఈ నాలుగింటిలోను సార్షిముక్తి అత్యంతశ్రేష్టము - దీనినే సాయుజ్యముక్తియని యందురు -”.

  2. బ్రహ్మయొక్క కామధేను, వాహనహంసాదులంబోలె నాయా దేవతాలోకంబులయందు నుండుట సాలోక్యంబనంబడు. మఱియు నా బ్రహ్మ సంబంధంబగు సావిత్ర్యాదిమంత్ర శక్తులంబోలె అత్యంత సమీపస్థితి సామీప్యమనంబడు, మరియు నా శివసంబంధంబగు రుద్రాణులకైవడి నాయా దేవతా సమానా కారత్వంబు సారూప్యంబనంబడు. మఱియు నా విష్ణుసంబంధంబగు శిశుబాలాదిచందంబున నాయా దేవతులయడల ఏకదేహలక్షణంబు సాయుజ్యము -” (వివేకచింతామణి)

Transliteration
  1. (1). “rājuyokka rāṣṭramunaṃdu prajalavale īśvaruni lōkamaṃdu nivasiṃcuṭa sālōkyamukti - (2). rājuyokka sēvakulavale īśvara samīpamaṃduṃḍuṭa sāmīpyamukti (3). rājuyokka anujulavale īśvara samāna, rūpaprāpti sārūpyamukti (4) rājuyokka jyēṣṭaputrunivale īśvarunitō samānamuga satyasaṃkalpā dyaiśvaryaprāpti sārṣimukti. ī nālugiṃṭilōnu sārṣimukti atyaṃtaśrēṣṭamu - dīninē sāyujyamuktiyani yaṃduru -”.

  2. brahmayokka kāmadhēnu, vāhanahaṃsādulaṃbōle nāyā dēvatālōkaṃbulayaṃdu nuṃḍuṭa sālōkyaṃbanaṃbaḍu. maṟiyu nā brahma saṃbaṃdhaṃbagu sāvitryādimaṃtra śaktulaṃbōle atyaṃta samīpasthiti sāmīpyamanaṃbaḍu, mariyu nā śivasaṃbaṃdhaṃbagu rudrāṇulakaivaḍi nāyā dēvatā samānā kāratvaṃbu sārūpyaṃbanaṃbaḍu. maṟiyu nā viṣṇusaṃbaṃdhaṃbagu śiśubālādicaṃdaṃbuna nāyā dēvatulayaḍala ēkadēhalakṣaṇaṃbu sāyujyamu -” (vivēkaciṃtāmaṇi)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.