← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చతుర్వింశతి తత్వములు caturviṃśati tatvamulu

Original — తెలుగు
  1. జ్ఞానేంద్రియాణి పంచైవ శ్రోత్ర త్వగ్గోచరాదయః |

కర్మేంద్రియాణి పంచైవ వాక్పాణ్యం ఘ్ర్యా దయః |

క్రమాత్| ప్రాణాదయశ్చ పంచైవ శబ్దాదయ స్తదా |

మనో బుద్ధిరహంకారశ్చిత్తం చేతి చతుష్టయం |

చతుర్వింశతి తత్వాని తాని బ్రహ్మవిదోవిదుః ||” (వరాహోపనిషత్)

(జ్ఞానేంద్రియములగు శ్రోత్రము మొదలగునవి అయిదున్నూ, కర్మేంద్రియములైన వాక్కు చేతులు, కాళ్ళు మొదలగునవి అయిదున్నూ, పంచప్రాణములయిన ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములయి దున్నూ, శబ్ద, స్పర్శ, రూప, రస గంధములను అయిదున్నూ, మనస్సు బుద్ధి, చిత్తము, అహంకారము అను నాలుగున్నూ కలిసి ఇరువది నాలుగు తత్వములు -).

  1. “మూల ప్రకృతిః, మహానహంకారో మనశ్చ, పంచతన్మాత్రాణి, పంచ బుద్ధీంద్రియాణి, పంచ కర్మేంద్రియాణి,పంచమహాభూతాని ఇతి చతుర్వింశతి తత్వాని”.

(మూలప్రకృతి, మహత్తత్వము, అహంకారము, మనస్సు, పంచతన్మాత్రలు, పంచజ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచబూతములు - ఇవన్నియు కలిసి ఇరువది నాలుగు తత్వములు -) - (చూడుము - ‘తత్వములు’).

  1. “ప్రకృతి చతుర్వింశతి తత్వాత్మకము” –

(ప్రకృతిలో పైన చెప్పిన ఇరువదినాలుగు తత్వములు కలిసియున్నవి - ఈ ఇరువదినాలుగు తత్వములు కలిసి యున్నదే ప్రకృతి).

Transliteration
  1. jñānēṃdriyāṇi paṃcaiva śrōtra tvaggōcarādayaḥ |

karmēṃdriyāṇi paṃcaiva vākpāṇyaṃ ghryā dayaḥ |

kramāt| prāṇādayaśca paṃcaiva śabdādaya stadā |

manō buddhirahaṃkāraścittaṃ cēti catuṣṭayaṃ |

caturviṃśati tatvāni tāni brahmavidōviduḥ ||” (varāhōpaniṣat)

(jñānēṃdriyamulagu śrōtramu modalagunavi ayidunnū, karmēṃdriyamulaina vākku cētulu, kāḷḷu modalagunavi ayidunnū, paṃcaprāṇamulayina prāṇa, apāna, vyāna, udāna samānamulayi dunnū, śabda, sparśa, rūpa, rasa gaṃdhamulanu ayidunnū, manassu buddhi, cittamu, ahaṃkāramu anu nālugunnū kalisi iruvadi nālugu tatvamulu -).

  1. “mūla prakṛtiḥ, mahānahaṃkārō manaśca, paṃcatanmātrāṇi, paṃca buddhīṃdriyāṇi, paṃca karmēṃdriyāṇi,paṃcamahābhūtāni iti caturviṃśati tatvāni”.

(mūlaprakṛti, mahattatvamu, ahaṃkāramu, manassu, paṃcatanmātralu, paṃcajñānēṃdriyamulu, paṃca karmēṃdriyamulu, paṃcabūtamulu - ivanniyu kalisi iruvadi nālugu tatvamulu -) - (cūḍumu - ‘tatvamulu’).

  1. “prakṛti caturviṃśati tatvātmakamu” –

(prakṛtilō paina ceppina iruvadinālugu tatvamulu kalisiyunnavi - ī iruvadinālugu tatvamulu kalisi yunnadē prakṛti).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.