← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చాతుర్వ్యూహము cāturvyūhamu

Original — తెలుగు
  1. “వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న అనిరుద్ధాః, చత్వారః. భగవాన్ వాసుదేవః పరమేశ్వరః సర్వకారణం. తస్మాదుత్పద్యతే సంకర్షణాఖ్యో జీవః, తస్మాన్మనః ప్రద్యుమ్నః, తస్మాత్ అనిరుద్ధో అహంకారః సర్వేచ ఏతే భగవతః వాసుదేవస్య ఏవ అంశభూతాః, తదభిన్నాః ఏవ, ఇతి తస్య వాసుదేవస్య మనోవాక్కా యభిః ఆరాధనం కృత్యా కృత కృత్యో భవతి - ఇత్యాది నిరూపితం పాంచ రాత్రే”.

(వ్యూహములు నాలుగు - వాసుదేవవ్యూహము, సంకర్షణవ్యూహము, ప్రద్యుమ్నవ్యూహము, అనిరుద్ధవ్యూహము. వీటిలో భగన్వతుడైన వాసుదేవుడు పరమేశ్వరుడు, సమస్తమునకు కారణమైనవాడు. అట్టివాసుదేవునినుండి సంకర్షణుడనుపేరుగల జీవుడు నాడు పుట్టెను. ఆ సంకర్షణునుండి ప్రద్యుమ్ను అను మనస్సు పుట్టినది. ఆ ప్రద్యుమ్నునినుండి అనిరుద్ధుడనుపేరుతో అహంకారము పుట్టినది. ఇవన్నియు భగవంతుడైన వాసుదేవునియొక్క అంశములే - (అంశవలనకలిగినవే), అతనికన్న భిన్నమైనవికావు. అని ఈ ప్రకారముగా ఆ వాసుదేవుని మనోవాక్కాయములతో అరాధించి మనుజుడు కృతకృత్యుడగును అని పాంచరాత్ర గ్రంధములందు నిరూపించబడినది).

  1. “భాగవతాః మన్యంతే - భగవనేవ ఏకో వాసుదేవః - నిరంజన జ్ఞానస్వరూపః పరమార్థ తత్వం. స చ చతుర్థా త్మానం ప్రవిభజ్య ప్రతిష్టితో వాసుదేవవ్యూహ రూపేణ, సంకర్షణవ్యూహ రూపేణ, ప్రద్యుమ్నవ్యూహరూపేణ, అనిరుద్ధవ్యూహ రూపేణ వాసుదేవోనామ పరమాత్మా ఉచ్యతే. సంకర్షణో నామ జీవః, ప్రద్యుమ్నోనామ మనః అనిరుద్ధోనామాహంకారః; తేషాం వాసుదేవః పరాప్రకృతిః, ఇతరే సంకర్షణా దయః కార్యం; తమిత్థం భూతం భగవంతమేవ ప్రతిపద్యతే ఇతి. తత్ర యత్తావదుచ్యతే యో అసౌ నారాయణః పరో అవ్యక్తా త్ప్రసిద్ధః పరమాత్మా, సర్వాత్మా స ఆత్మనా ఆత్మానం అనేక థా వ్యూహ్యవ తిష్టతి ఇతి. తన్నిరాక్రియతే -”స ఏకథా భవతి ఇత్యాది శ్రుతిభ్యః పరమాత్మనః అనేకథా భావస్యాధిగతత్వాత్ యదపి తస్య భగవతః అభిగమనాది లక్షణః ఆరాధనం అజస్రం అనన్య చిత్తతయా అభి ప్రేయతే, తదపి న ప్రతిషిద్ధ్యతే. శ్రుతి స్మృత్యోః ఈశ్వరప్రణిదానస్య ప్రతిసిద్ధత్వాత్. యత్పునరిద ముచ్యతే - వాసుదేవాత్ సంకర్షణః ఉత్పద్యతే సంకర్షణాచ్చ ప్రద్యుమ్నః, ప్రద్యుమ్నాచ్చ అనిరుద్ధః ఇతి అత్రభూమః న వాసుదేవ సంజ్ఞకాత్ పరమాత్మనః సంకర్షణ సంజ్ఞస్య జీవస్యోత్పత్తిః సంభవతి, అనిత్యత్వాది దోష ప్రసంగాత్ ఉత్పత్తిమత్త్వేహి జీవస్య అనిత్యత్వా దయః దోషాః ప్రసజ్యేరన్. తతశ్చైవాస్య భగవత్ప్రాప్తిః మోక్షస్స్యాత్, కారణాప్రాప్తౌ కార్యస్య ప్రవిలయ ప్రసంగాత్ ప్రతి షేధిష్యతిచ. ఆచార్యో జీవస్య వృత్తిం” “నాత్మ శ్రుతేర్నిత్యత్వాచ్చ. తాభ్యః ఇతి. తస్మాత్ అసంగ తైషా కల్పనా” .

(భగవద్భక్తులు ఈ ప్రకారముగా అభిప్రాయపడుచున్నారు - భగవంతుడైన వాసుదేవుడొక్కడే నిరంజన జ్ఞాన స్వరూపుడు, పరతత్వమైనవాడు అతనే తనను నాలుగు విధములుగా విభజించుకొనియున్నాడు - ఎట్లంటే - వాసుదేవవ్యూహరూపముగాను, సంకర్షణవ్యూహరూపముగాను, ప్రద్యుమ్నవ్యూహరూపముగాను, అనిరుద్ధవ్యూహరూపముగాను, తానే ఆయెను - వాసుదేవుడనగా పరమాత్మయే యని చెప్పబడుచున్నది. సంకర్షణుడనగా జీవుడు, ప్రద్యుమ్నుడు అనగా మనస్సు. అనిరుద్ధుడనగా అహంకారము. వీటిలో వాసుదేవుడు పరాప్రకృతి. మిగిలిన సంకర్షణుడు మొదలగునవి కార్యము - అనగా పరాప్రకృతిలోనుండి ఒకదానిలోనుండి ఒకటిగా పుట్టినవి. ఈ విధముగా భగవంతుడుండునట్లు చెప్పబడుచున్నది. ఇట్లు వరుడు, పరమాత్మ, సర్వాత్మ, అవ్యక్తముకన్న ప్రసిద్ధుడైన నారాయణుడు తనను తానే అనేకవిధములుగా వ్యూహములుగాచేసి ఉంటున్నాడు అను విషయము నిరాకరించబడినది. “అతను ఒకే ప్రకారముగా నుండును” అను శ్రుతి చెప్పుచున్నందున అతనే అనేకములుగా, అనేక వ్యూహములుగా, ఉండును అనుటకు అవకాశము చాలదు - అట్లు అనేకరూపములుగా తానే మారెను అని వాటి ఆరాధనము అనన్య చిత్తముతో ఎల్లపుడూ చేయవలసినదని అభిప్రాయమున్నను ఉండవచ్చును - శ్రుతి స్మృతులలో ఈశ్వరప్రణిధానము - భగవంతుని గుఱించి శ్రద్ధతో ధ్యానించుట - చేయుట చెప్పబడియున్నది కనుక - ఈ విషయమై ఈ క్రింది విధముగా కూడ చెప్పబడుచున్నది : - వాసుదేవునినుండి సంకర్షణుడు పుట్టెను, సంకర్షణుడునుండి ప్రద్యుమ్నుడు, ప్రద్యుమ్నుడునుండు అనిరుద్ధుడు పుట్టుచున్నారు. వాసుదేవుడని పేరుగల పరమాత్మనుండి సంకర్షణుడనుపేరుగల జీవుని పుట్టుక కలుగుచున్నది. ఇట్లు ఒకదానిలోనుండి పుట్టినది అనిత్యము అనుదోషము కలుగును. అందుచేత ఇంకొకదానిలోనుండి - వాసుదేవవ్యూహములోనుండి - పుట్టిన జీవునకూనిత్యుడైనవాడు అను మొదలగు దోషములు కలిగును - అందుచేత ఈ నాలుగు వ్యూహములువాసుదేవుడే, వాసుదేవునితో (నారాయణునితో) సమానమే యనుట పొసగదు -

“వర్ణయంతి చ భాగవతాః కర్తుర్జీవాత్ సంకర్షణ సంజ్ఞికాత్ కరణం మనః ప్రద్యుమ్న సంజ్ఞికం ఉత్పద్యతే.

కర్తృజాచ్చ తస్మాత్ అనిరుద్ధ సంజ్ఞికో అహంకారః ఉత్పద్యతే ఇతి - - న చైవం భూతాం శ్రుతిం ఉపల భామహే”

(కర్త అయిన సంకర్షణుడను జీవునివలన ప్రద్యుమ్నుడను పేరుగల మనస్సు - కరణము - పుట్టుచున్నది. కర్త అయిన ప్రద్యుమ్నునినుండి అనిరుద్ధుడను పేరుగల అహంకారము పుట్టుచున్నది - అని భాగవతుల - భగవద్భక్తుల అభిప్రాయము - కాని, ఇట్లు చెప్పు శ్రుతి ఏదియు మాకు లభించలేదు.

“అధాపిస్యాన్న చైతే సంకర్షణా దయో జీవాది భావేన అభిప్రేయంతే, కింతర్హీశ్వరా ఏ వైతే సర్వే జ్ఞానైశ్వర్య శక్తిబల వీర్య తేజో భిరైశ్వర్యై ర్థ ర్మైః అన్వితా అభ్యువగమ్యంతే వాసుదేవా ఏ వైతే నిర్దోషాః, నిరధిష్టానః నిరవద్యాశ్చేత్. తస్మాన్నాయం యథా వర్ణితః ఉత్పత్య సంభవో దోషః ప్రాప్నోతీతి. అత్ర ఉచ్యతే - ఏవ మపి తద ప్రతిషేదః ప్రాప్నోత్యే వాయముత్పత్య సంభవో దోషః ప్రకారాంత రేణ ఇత్యభిప్రాయః కథం. యది తావదయమభిప్రాయః పరస్పర భిన్నా ఏవైతే వాసుదేవా దయశ్చ త్వారో ఈశ్వరాః తుల్ల ధర్మాణః నైషామేకాంతకత్వమస్తీతి”తతో

అనేకేశ్వరకలప్పనా నర్థక్యం ఏకే నైవ ఈ శ్వరేణ ఈశ్వర కార్య సిద్ధేః సిద్ధాంతహానిశ్చ. భగవానైవ ఏకో వాసుదేవః పరమార్థ తత్వం త్యభ్యుపగమాత్. అథా అయమభిప్రాయః - ఏకస్యైవ భగవతః ఏతే చత్వారో వ్యూహః తుల్య ధర్మాణః ఇతి. తథాపి తదవస్థ ఏవోత్పత్య సంభవో దోషః. నహి వాసుదేవాత్ సంకర్షణస్యోత్పత్తి స్సంభవో దోషః. నహి వాసుదేవాత్ సంకర్షణస్యోత్పత్తి స్సంభవతి. సంకర్షణాచ్చ ప్రద్యుమ్నస్య, ప్రద్యుమ్నాచ్చ అనిరుద్ధస్య అతిశయా భావాత్ - భవి తవ్యం హి కార్యకారణయోః, అతిశయేన, యథా మద్ఘట యోః నహ్య సత్యతిశయే కార్యం కారణమత్యవకల్పతే. న చ పాంచరాత్ర సిద్ధాంతి భిః వాసుదేవాదిషు ఏకస్మిన్ సర్వేషు వా జ్ఞానైశ్వర్యాది తారతమ్యకృతః కశ్చిద్భేదో అభ్యుపగమ్యతే వాసుదేవాః ఏవ హి సర్వే వ్యూహాః నిర్విశేషాః ఇష్యంతే. న చైతే భగవద్వ్యూహాశ్చ తుస్సంఖ్యాయమే వాదతిష్టేరన్ - బ్రహ్మాదిస్తంబ పర్యంతస్య సమస్తైవ జగతః భగవద్వ్యూహావగమాత్.” (శ్రీశంకరః - బ్రహ్మసూత్రభాష్యే)

(ఈ సంకర్షణుడు మొదలగునవి జీవుడు మొదలగువాటివలె - జీవుడు, మనస్సు, అహంకారమువలె - భేదముగలవియను యభిప్రాయము లేనిచో, ఇవన్నీ ఈ నాలుగు వ్యూహములు - జ్ఞానము, ఐశ్వర్యము, శక్తి, బలము, వీర్యము, తేజస్సు అను షడ్గుణైశ్వర్యములుగల పరమేశ్వరుడేనా ? - పరమాత్మయేనా ? ఇవన్నియు నిరవద్యుడు, నిర్దోషుడు అయిన వాసుదేవుడేనా ? ఆ ప్రకారముగా ఇవన్నియు వాసుదేవులే అయినచో అవి ఒక వ్యూహములోనుండి ఇంకొక వ్యూహము పుట్టినది యని దోషము పట్టదు. ఈ నాలుగు వ్యూహములు ఒకదానినుండి ఇంకొకటి వేరైనప్పటికీ ఒకే విధమైన ధర్మములు కలిగి యుండునవి - షడ్గుణైశ్వర్యములు కలిగియుండునవి - ఎట్లగును ? ఇందువలన ఒకే ఈశ్వరుడుకాక అనేకమంది ఈశ్వరులు (పరమాత్మలు) - ఉండునను అనర్థముకలుగును - ఒకే ఈశ్వరుడు కార్యమైన ఈ సృష్టిని చేయుచున్నాడు. భగవంతుడైన వాసుదేవుడొకడే పరమార్థతత్వము అను సిద్ధాంతమునకు భంగముకలుగును. ఒకడే అయిన భగవంతునియొక్క ధర్మములు - షడ్గుణైశ్వర్యములు - గలవియే ఈ నాలుగు వ్యూహములు అయినచో ఒకవ్యూహములోనుండి ఇంకొక వ్యూహము పుట్టినదనుటకు వీలుపడదు అను దోషము కలుగును. అప్పుడు వాసుదేవుని వలన సంకర్షణుడు, (సంకర్షణవ్యూహము), సంకర్షణునివలన ప్రద్యుమ్నుడు, ప్రద్యుమ్నునివలన అనిరుద్ధుడు పుట్టి ఉండుటకు అవకాశము లేదు; ఒకదానికంటె ఒకటి ప్రకృష్టమనుటకు వీలులేదు కనుక. కుండకన్న మట్టి అతిశయమైనది - కార్యముకన్న కారణము ప్రకృష్టమైనట్లు. పాంచరాత్రసిద్ధాంతులచేత ఈ నాలుగు వ్యూహములలోకాని, ఏ ఒకదానిలోగాని, జ్ఞాన బలాది ధర్మములలో తారత్మ్యము కనపర్చబడలేదు - ఒకదానిని, ఇంకొకదానిని భేదము చెప్పబడలేదు. ఈ నాలుగు నిర్విశేషపరబ్రహ్మయొక్క వ్యూహములు అని చెప్పుటకు వలనుపడదు - చాతుర్ముఖబ్రహ్మ మొదలు స్తంబమువరకుగల సమస్త జగత్తు భగవంతుని వ్యూహమే యని తెలియవచ్చుటచేత).

  1. “వాసుదేవః ఖలు పరమాత్మ జగదుపాదానా నిమిత్తంచ తస్మాత్ సంకర్షణాఖ్యో జీవః ఉదేతి. తస్మాత్ ప్రద్యుమ్నాఖ్యో మనోజాయతే తస్మాత్ అనిరుద్ధాఖ్యో అహంకారో జాయత ఇతి భాగవత రాద్ధాంతః - స కిం ప్రమాణమూలో, భ్రాంతిమూలో వా ఇతి సం దేహే ప్రమాణమూలః ఇతి పూర్వ పక్షః -” సంకర్షణాదీనాం త్రయాణాం వాసుదేవ వత్ విజ్ఞానాది భావే వా విజ్ఞా నైశ్వర్యబలవన్నిర్దోష నిరవద్య స్వరూపత్వేపి తద ప్రతిషేదః - తస్యోత్సత్త్య సంభవ రూపదోష స్య ప్రకారాంతరేణా ప్రతిషేదః ఇత్యర్థః. కిం వాసుదేవాదయః చత్వారో అపి ఈశ్వరాః ఉత సంకర్షణాదయః త్రయో వాసుదేవతుల్యాః. ఆద్యే భగవాన్ ఏక ఏవ వాసుదేవః ఇతి స్వసిద్దాంతహానిః ; ద్వితీయే ఉత్పత్య సంభవదోషః తదవస్థ ఏవ ఇతి భావః“.

(వాసుదేవుడు పరమాత్మ. అతనే జగత్తునకు ఉపాదానకారణము, నిమిత్తకారణమున్నూ, అతనిలోనుండి సంకర్షణుడను జీవుడు పుట్టుచున్నాడు. అతనినుండి ప్రద్యుమ్నుడను పేరుతో మనస్సు పుట్టుచున్నది. ఆ ప్రద్యుమ్నునినుండి అనిరుద్ధుడను పేరుగల అహంకారము పుట్టుచున్నది. అని భాగవతుల - వైష్ణవమతస్థుల సిద్ధాంతము. ఇట్లు చెప్పుటకేమైన ప్రమాణము కలదా, లేక, ఇది కేవలము భ్రమ యేనా అనుసందేహము కలుగగా ప్రమాణముకలదే అని పూర్వ పక్షము వాదము - పరబ్రహ్మయగు వాసుదేవునివలె సంకర్షణుడు మొదలగునవి షడ్గుణైశ్వర్యములు గలవియా ? ఒకదానిలోనుండి ఒకటి పుట్టుటచేత ఇవి వాసుదేవునివలె షడ్గుణైశ్వర్యములు కలిగినవికావు. వాసుదేవుడు మొదలగు ఈ నాలుగు ఈశ్వరుడేనా - పరమాత్మయేనా , లేక పరమాత్మయగు వాసుదేవునితో సమానమైన గుణములు కలవియా ? మొదటిది నిజమైనయడల సృష్టికి ముందు వాసుదేవుడొక్కడే యుండెను అనువారి సిద్ధాంతమునకే భంగము వచ్చును - ఒకదానిలోనుండి ఒకటి పుట్టుటచేత రెండవ సిద్ధాంతముకూడ అసంగతము).

  1. “నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి |

ప్రద్యుమ్నాయానిరుద్ధాయ నమః సంకర్షణాయచ ||” ఇతి

మూర్త్యాభిధానేన మంత్రమూర్తిమ మూర్తికం |

యజతే యజ్ఞపురుషం స సమ్యగ్దర్శనః పుమాన్ ||“. (శ్రీమద్భాగవతం - 1 - 5 - 37)

పైశ్లోకమునకు శ్రీమదాంధ్రమహాభాగవతములో ఈ క్రింద విధముగా చెప్పబడినది : -

“వ. ప్రణవపూర్వకంబుగా వాసుదేవ, ప్రద్యుమ్న సంకర్షణానిరుద్ధ మూర్తి నామంబులు నాలుగు భక్తిం బలికి, నమస్కారంబుచేసి, మంత్రమూర్తియు, మూర్తిశూన్యుండునయిన యజ్ణపురుషుం బూజించు పురుషుండు సమ్యగ్దర్శనుండగు” (1 - 5 - 73)

  1. “అప్పరమేశ్వరుండె తత్ప్రపంచంబునకు నుదయస్థితి విలయకారణమ్ములైన రజస్సత్వతమో గుణమ్ముల నాశ్రయించి వాసుదేవాది వ్యూహ భేదమ్ములను, రామకృష్ణాద్యవతార విశేషంబులను వినోదంబు సలుపుచుందు”. (కులశేఖరమహీపాల చరిత్ర - 2 - 122)

  2. “ఈ నాలుగు వ్యూహములు ఒకదానిలోనుండు ఒకటి పుట్టినట్లు శ్రీమదాంధ్రమాహాభాగవతములో వాసుదేవుడైన వసుదేవుని కుమారుడైన శ్రీకృష్ణుని కొడుకు ప్రద్యుమ్నుడని, ప్రద్యుమ్నుని కుమారుడు అనిరుద్ధుడని, అనిరుద్ధుని కుమారుడు సంకర్షణుడనియు చెప్పబడినది : -”ఉ. తామరసాక్షు వంశమున దర్పకుడీశ్వరుకంటి మంటలన్

దామును దగ్ధుడై పీదప దత్పరమేశుని దేహ లబ్దికై

వేమఱు నిష్ఠజేసి హరివీర్యమునం బ్రభవించె రుక్మిణీ

కామనిగర్భమం దసురఖండను మారుట మూర్తి యో యనన్.

“వ. అంత నా డింభకుడు ప్రద్యుమ్నుం డనుపేర విఖ్యాతుండయ్యె”. (10 - ఉ. భా. 3. 4)

- -” అందు గోవిందు నందనుండైన ప్రద్యుమ్నునకు రుక్మిస్కూతువలన ననిరుద్ధుండు సంభవించె” - (10 - ఉ.. భా. - 279)

  1. “సీ. సత్వప్రథానమై - -

రుచిరషాడ్గుణ్య పరిపూర్ణమై, నిత్యమై - -

వలనొప్పుచుండు నవ్వాసుదేవ వ్యూహమంత మహత్తత్తమందు నోలి

రూఢి గ్రియాశక్తి రూపంబుగల్గు నహంకారముత్పన్నమయ్యె - - - “.

“సీ. అట్టి యహంకారమందధిష్టించి సాహస్ర షణామండలాభిరాము

డై తనరారు ననంతుడు సంకర్షణుండనదగు పురుషుండు ఘనుడు

మహిత భూతీంద్రీయ మానసమయుడునై - - -

తే. - -అమ్మేటి రెండవ వ్యూహమనగ

ఘనవికారంబు బొందు వైకారికంబు

వలన వినుము మనస్తత్వ మెలమి బుట్టె

- - -“.

“వ. విద్ది యనిరుద్ధా ఖ్యంబయిన వ్యూహంబదియ హృషీకంబునకు నధీశ్వరంబు - -”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 26 - 890 to 893)

(వాసుదేవుడనగా వసుదేవుని కుమారుడైన శ్రీకృష్ణుడని పురాణములవలన తెలియవచ్చుచున్నది - కాని దాని అంతరార్థము ఈ విధముగా నున్నది – “వసతి అసౌ దేవః సర్వ భూతేషు ఇతి వాసుదేవః” (సమస్త భూతములందు నివసించియుండు దేవుడు కనుక వాసుదేవుడు). సమస్త భూతములందు నివసించియుండు నిర్గుణ నిరాకార పరబ్రహ్మయే - అందుచేత వాసుదేవుడనగా పరబ్రహ్మయే).

Transliteration
  1. “vāsudēva, saṃkarṣaṇa, pradyumna aniruddhāḥ, catvāraḥ. bhagavān vāsudēvaḥ paramēśvaraḥ sarvakāraṇaṃ. tasmādutpadyatē saṃkarṣaṇākhyō jīvaḥ, tasmānmanaḥ pradyumnaḥ, tasmāt aniruddhō ahaṃkāraḥ sarvēca ētē bhagavataḥ vāsudēvasya ēva aṃśabhūtāḥ, tadabhinnāḥ ēva, iti tasya vāsudēvasya manōvākkā yabhiḥ ārādhanaṃ kṛtyā kṛta kṛtyō bhavati - ityādi nirūpitaṃ pāṃca rātrē”.

(vyūhamulu nālugu - vāsudēvavyūhamu, saṃkarṣaṇavyūhamu, pradyumnavyūhamu, aniruddhavyūhamu. vīṭilō bhaganvatuḍaina vāsudēvuḍu paramēśvaruḍu, samastamunaku kāraṇamainavāḍu. aṭṭivāsudēvuninuṃḍi saṃkarṣaṇuḍanupērugala jīvuḍu nāḍu puṭṭenu. ā saṃkarṣaṇunuṃḍi pradyumnu anu manassu puṭṭinadi. ā pradyumnuninuṃḍi aniruddhuḍanupērutō ahaṃkāramu puṭṭinadi. ivanniyu bhagavaṃtuḍaina vāsudēvuniyokka aṃśamulē - (aṃśavalanakaliginavē), atanikanna bhinnamainavikāvu. ani ī prakāramugā ā vāsudēvuni manōvākkāyamulatō arādhiṃci manujuḍu kṛtakṛtyuḍagunu ani pāṃcarātra graṃdhamulaṃdu nirūpiṃcabaḍinadi).

  1. “bhāgavatāḥ manyaṃtē - bhagavanēva ēkō vāsudēvaḥ - niraṃjana jñānasvarūpaḥ paramārtha tatvaṃ. sa ca caturthā tmānaṃ pravibhajya pratiṣṭitō vāsudēvavyūha rūpēṇa, saṃkarṣaṇavyūha rūpēṇa, pradyumnavyūharūpēṇa, aniruddhavyūha rūpēṇa vāsudēvōnāma paramātmā ucyatē. saṃkarṣaṇō nāma jīvaḥ, pradyumnōnāma manaḥ aniruddhōnāmāhaṃkāraḥ; tēṣāṃ vāsudēvaḥ parāprakṛtiḥ, itarē saṃkarṣaṇā dayaḥ kāryaṃ; tamitthaṃ bhūtaṃ bhagavaṃtamēva pratipadyatē iti. tatra yattāvaducyatē yō asau nārāyaṇaḥ parō avyaktā tprasiddhaḥ paramātmā, sarvātmā sa ātmanā ātmānaṃ anēka thā vyūhyava tiṣṭati iti. tannirākriyatē -”sa ēkathā bhavati ityādi śrutibhyaḥ paramātmanaḥ anēkathā bhāvasyādhigatatvāt yadapi tasya bhagavataḥ abhigamanādi lakṣaṇaḥ ārādhanaṃ ajasraṃ ananya cittatayā abhi prēyatē, tadapi na pratiṣiddhyatē. śruti smṛtyōḥ īśvarapraṇidānasya pratisiddhatvāt. yatpunarida mucyatē - vāsudēvāt saṃkarṣaṇaḥ utpadyatē saṃkarṣaṇācca pradyumnaḥ, pradyumnācca aniruddhaḥ iti atrabhūmaḥ na vāsudēva saṃjñakāt paramātmanaḥ saṃkarṣaṇa saṃjñasya jīvasyōtpattiḥ saṃbhavati, anityatvādi dōṣa prasaṃgāt utpattimattvēhi jīvasya anityatvā dayaḥ dōṣāḥ prasajyēran. tataścaivāsya bhagavatprāptiḥ mōkṣassyāt, kāraṇāprāptau kāryasya pravilaya prasaṃgāt prati ṣēdhiṣyatica. ācāryō jīvasya vṛttiṃ” “nātma śrutērnityatvācca. tābhyaḥ iti. tasmāt asaṃga taiṣā kalpanā” .

(bhagavadbhaktulu ī prakāramugā abhiprāyapaḍucunnāru - bhagavaṃtuḍaina vāsudēvuḍokkaḍē niraṃjana jñāna svarūpuḍu, paratatvamainavāḍu atanē tananu nālugu vidhamulugā vibhajiṃcukoniyunnāḍu - eṭlaṃṭē - vāsudēvavyūharūpamugānu, saṃkarṣaṇavyūharūpamugānu, pradyumnavyūharūpamugānu, aniruddhavyūharūpamugānu, tānē āyenu - vāsudēvuḍanagā paramātmayē yani ceppabaḍucunnadi. saṃkarṣaṇuḍanagā jīvuḍu, pradyumnuḍu anagā manassu. aniruddhuḍanagā ahaṃkāramu. vīṭilō vāsudēvuḍu parāprakṛti. migilina saṃkarṣaṇuḍu modalagunavi kāryamu - anagā parāprakṛtilōnuṃḍi okadānilōnuṃḍi okaṭigā puṭṭinavi. ī vidhamugā bhagavaṃtuḍuṃḍunaṭlu ceppabaḍucunnadi. iṭlu varuḍu, paramātma, sarvātma, avyaktamukanna prasiddhuḍaina nārāyaṇuḍu tananu tānē anēkavidhamulugā vyūhamulugācēsi uṃṭunnāḍu anu viṣayamu nirākariṃcabaḍinadi. “atanu okē prakāramugā nuṃḍunu” anu śruti ceppucunnaṃduna atanē anēkamulugā, anēka vyūhamulugā, uṃḍunu anuṭaku avakāśamu cāladu - aṭlu anēkarūpamulugā tānē mārenu ani vāṭi ārādhanamu ananya cittamutō ellapuḍū cēyavalasinadani abhiprāyamunnanu uṃḍavaccunu - śruti smṛtulalō īśvarapraṇidhānamu - bhagavaṃtuni guṟiṃci śraddhatō dhyāniṃcuṭa - cēyuṭa ceppabaḍiyunnadi kanuka - ī viṣayamai ī kriṃdi vidhamugā kūḍa ceppabaḍucunnadi : - vāsudēvuninuṃḍi saṃkarṣaṇuḍu puṭṭenu, saṃkarṣaṇuḍunuṃḍi pradyumnuḍu, pradyumnuḍunuṃḍu aniruddhuḍu puṭṭucunnāru. vāsudēvuḍani pērugala paramātmanuṃḍi saṃkarṣaṇuḍanupērugala jīvuni puṭṭuka kalugucunnadi. iṭlu okadānilōnuṃḍi puṭṭinadi anityamu anudōṣamu kalugunu. aṃducēta iṃkokadānilōnuṃḍi - vāsudēvavyūhamulōnuṃḍi - puṭṭina jīvunakūnityuḍainavāḍu anu modalagu dōṣamulu kaligunu - aṃducēta ī nālugu vyūhamuluvāsudēvuḍē, vāsudēvunitō (nārāyaṇunitō) samānamē yanuṭa posagadu -

“varṇayaṃti ca bhāgavatāḥ karturjīvāt saṃkarṣaṇa saṃjñikāt karaṇaṃ manaḥ pradyumna saṃjñikaṃ utpadyatē.

kartṛjācca tasmāt aniruddha saṃjñikō ahaṃkāraḥ utpadyatē iti - - na caivaṃ bhūtāṃ śrutiṃ upala bhāmahē”

(karta ayina saṃkarṣaṇuḍanu jīvunivalana pradyumnuḍanu pērugala manassu - karaṇamu - puṭṭucunnadi. karta ayina pradyumnuninuṃḍi aniruddhuḍanu pērugala ahaṃkāramu puṭṭucunnadi - ani bhāgavatula - bhagavadbhaktula abhiprāyamu - kāni, iṭlu ceppu śruti ēdiyu māku labhiṃcalēdu.

“adhāpisyānna caitē saṃkarṣaṇā dayō jīvādi bhāvēna abhiprēyaṃtē, kiṃtarhīśvarā ē vaitē sarvē jñānaiśvarya śaktibala vīrya tējō bhiraiśvaryai rtha rmaiḥ anvitā abhyuvagamyaṃtē vāsudēvā ē vaitē nirdōṣāḥ, niradhiṣṭānaḥ niravadyāścēt. tasmānnāyaṃ yathā varṇitaḥ utpatya saṃbhavō dōṣaḥ prāpnōtīti. atra ucyatē - ēva mapi tada pratiṣēdaḥ prāpnōtyē vāyamutpatya saṃbhavō dōṣaḥ prakārāṃta rēṇa ityabhiprāyaḥ kathaṃ. yadi tāvadayamabhiprāyaḥ paraspara bhinnā ēvaitē vāsudēvā dayaśca tvārō īśvarāḥ tulla dharmāṇaḥ naiṣāmēkāṃtakatvamastīti”tatō

anēkēśvarakalappanā narthakyaṃ ēkē naiva ī śvarēṇa īśvara kārya siddhēḥ siddhāṃtahāniśca. bhagavānaiva ēkō vāsudēvaḥ paramārtha tatvaṃ tyabhyupagamāt. athā ayamabhiprāyaḥ - ēkasyaiva bhagavataḥ ētē catvārō vyūhaḥ tulya dharmāṇaḥ iti. tathāpi tadavastha ēvōtpatya saṃbhavō dōṣaḥ. nahi vāsudēvāt saṃkarṣaṇasyōtpatti ssaṃbhavō dōṣaḥ. nahi vāsudēvāt saṃkarṣaṇasyōtpatti ssaṃbhavati. saṃkarṣaṇācca pradyumnasya, pradyumnācca aniruddhasya atiśayā bhāvāt - bhavi tavyaṃ hi kāryakāraṇayōḥ, atiśayēna, yathā madghaṭa yōḥ nahya satyatiśayē kāryaṃ kāraṇamatyavakalpatē. na ca pāṃcarātra siddhāṃti bhiḥ vāsudēvādiṣu ēkasmin sarvēṣu vā jñānaiśvaryādi tāratamyakṛtaḥ kaścidbhēdō abhyupagamyatē vāsudēvāḥ ēva hi sarvē vyūhāḥ nirviśēṣāḥ iṣyaṃtē. na caitē bhagavadvyūhāśca tussaṃkhyāyamē vādatiṣṭēran - brahmādistaṃba paryaṃtasya samastaiva jagataḥ bhagavadvyūhāvagamāt.” (śrīśaṃkaraḥ - brahmasūtrabhāṣyē)

(ī saṃkarṣaṇuḍu modalagunavi jīvuḍu modalaguvāṭivale - jīvuḍu, manassu, ahaṃkāramuvale - bhēdamugalaviyanu yabhiprāyamu lēnicō, ivannī ī nālugu vyūhamulu - jñānamu, aiśvaryamu, śakti, balamu, vīryamu, tējassu anu ṣaḍguṇaiśvaryamulugala paramēśvaruḍēnā ? - paramātmayēnā ? ivanniyu niravadyuḍu, nirdōṣuḍu ayina vāsudēvuḍēnā ? ā prakāramugā ivanniyu vāsudēvulē ayinacō avi oka vyūhamulōnuṃḍi iṃkoka vyūhamu puṭṭinadi yani dōṣamu paṭṭadu. ī nālugu vyūhamulu okadāninuṃḍi iṃkokaṭi vērainappaṭikī okē vidhamaina dharmamulu kaligi yuṃḍunavi - ṣaḍguṇaiśvaryamulu kaligiyuṃḍunavi - eṭlagunu ? iṃduvalana okē īśvaruḍukāka anēkamaṃdi īśvarulu (paramātmalu) - uṃḍunanu anarthamukalugunu - okē īśvaruḍu kāryamaina ī sṛṣṭini cēyucunnāḍu. bhagavaṃtuḍaina vāsudēvuḍokaḍē paramārthatatvamu anu siddhāṃtamunaku bhaṃgamukalugunu. okaḍē ayina bhagavaṃtuniyokka dharmamulu - ṣaḍguṇaiśvaryamulu - galaviyē ī nālugu vyūhamulu ayinacō okavyūhamulōnuṃḍi iṃkoka vyūhamu puṭṭinadanuṭaku vīlupaḍadu anu dōṣamu kalugunu. appuḍu vāsudēvuni valana saṃkarṣaṇuḍu, (saṃkarṣaṇavyūhamu), saṃkarṣaṇunivalana pradyumnuḍu, pradyumnunivalana aniruddhuḍu puṭṭi uṃḍuṭaku avakāśamu lēdu; okadānikaṃṭe okaṭi prakṛṣṭamanuṭaku vīlulēdu kanuka. kuṃḍakanna maṭṭi atiśayamainadi - kāryamukanna kāraṇamu prakṛṣṭamainaṭlu. pāṃcarātrasiddhāṃtulacēta ī nālugu vyūhamulalōkāni, ē okadānilōgāni, jñāna balādi dharmamulalō tāratmyamu kanaparcabaḍalēdu - okadānini, iṃkokadānini bhēdamu ceppabaḍalēdu. ī nālugu nirviśēṣaparabrahmayokka vyūhamulu ani ceppuṭaku valanupaḍadu - cāturmukhabrahma modalu staṃbamuvarakugala samasta jagattu bhagavaṃtuni vyūhamē yani teliyavaccuṭacēta).

  1. “vāsudēvaḥ khalu paramātma jagadupādānā nimittaṃca tasmāt saṃkarṣaṇākhyō jīvaḥ udēti. tasmāt pradyumnākhyō manōjāyatē tasmāt aniruddhākhyō ahaṃkārō jāyata iti bhāgavata rāddhāṃtaḥ - sa kiṃ pramāṇamūlō, bhrāṃtimūlō vā iti saṃ dēhē pramāṇamūlaḥ iti pūrva pakṣaḥ -” saṃkarṣaṇādīnāṃ trayāṇāṃ vāsudēva vat vijñānādi bhāvē vā vijñā naiśvaryabalavannirdōṣa niravadya svarūpatvēpi tada pratiṣēdaḥ - tasyōtsattya saṃbhava rūpadōṣa sya prakārāṃtarēṇā pratiṣēdaḥ ityarthaḥ. kiṃ vāsudēvādayaḥ catvārō api īśvarāḥ uta saṃkarṣaṇādayaḥ trayō vāsudēvatulyāḥ. ādyē bhagavān ēka ēva vāsudēvaḥ iti svasiddāṃtahāniḥ ; dvitīyē utpatya saṃbhavadōṣaḥ tadavastha ēva iti bhāvaḥ”.

(vāsudēvuḍu paramātma. atanē jagattunaku upādānakāraṇamu, nimittakāraṇamunnū, atanilōnuṃḍi saṃkarṣaṇuḍanu jīvuḍu puṭṭucunnāḍu. ataninuṃḍi pradyumnuḍanu pērutō manassu puṭṭucunnadi. ā pradyumnuninuṃḍi aniruddhuḍanu pērugala ahaṃkāramu puṭṭucunnadi. ani bhāgavatula - vaiṣṇavamatasthula siddhāṃtamu. iṭlu ceppuṭakēmaina pramāṇamu kaladā, lēka, idi kēvalamu bhrama yēnā anusaṃdēhamu kalugagā pramāṇamukaladē ani pūrva pakṣamu vādamu - parabrahmayagu vāsudēvunivale saṃkarṣaṇuḍu modalagunavi ṣaḍguṇaiśvaryamulu galaviyā ? okadānilōnuṃḍi okaṭi puṭṭuṭacēta ivi vāsudēvunivale ṣaḍguṇaiśvaryamulu kaliginavikāvu. vāsudēvuḍu modalagu ī nālugu īśvaruḍēnā - paramātmayēnā , lēka paramātmayagu vāsudēvunitō samānamaina guṇamulu kalaviyā ? modaṭidi nijamainayaḍala sṛṣṭiki muṃdu vāsudēvuḍokkaḍē yuṃḍenu anuvāri siddhāṃtamunakē bhaṃgamu vaccunu - okadānilōnuṃḍi okaṭi puṭṭuṭacēta reṃḍava siddhāṃtamukūḍa asaṃgatamu).

  1. “namō bhagavatē tubhyaṃ vāsudēvāya dhīmahi |

pradyumnāyāniruddhāya namaḥ saṃkarṣaṇāyaca ||” iti

mūrtyābhidhānēna maṃtramūrtima mūrtikaṃ |

yajatē yajñapuruṣaṃ sa samyagdarśanaḥ pumān ||“. (śrīmadbhāgavataṃ - 1 - 5 - 37)

paiślōkamunaku śrīmadāṃdhramahābhāgavatamulō ī kriṃda vidhamugā ceppabaḍinadi : -

“va. praṇavapūrvakaṃbugā vāsudēva, pradyumna saṃkarṣaṇāniruddha mūrti nāmaṃbulu nālugu bhaktiṃ baliki, namaskāraṃbucēsi, maṃtramūrtiyu, mūrtiśūnyuṃḍunayina yajṇapuruṣuṃ būjiṃcu puruṣuṃḍu samyagdarśanuṃḍagu” (1 - 5 - 73)

  1. “apparamēśvaruṃḍe tatprapaṃcaṃbunaku nudayasthiti vilayakāraṇammulaina rajassatvatamō guṇammula nāśrayiṃci vāsudēvādi vyūha bhēdammulanu, rāmakṛṣṇādyavatāra viśēṣaṃbulanu vinōdaṃbu salupucuṃdu”. (kulaśēkharamahīpāla caritra - 2 - 122)

  2. “ī nālugu vyūhamulu okadānilōnuṃḍu okaṭi puṭṭinaṭlu śrīmadāṃdhramāhābhāgavatamulō vāsudēvuḍaina vasudēvuni kumāruḍaina śrīkṛṣṇuni koḍuku pradyumnuḍani, pradyumnuni kumāruḍu aniruddhuḍani, aniruddhuni kumāruḍu saṃkarṣaṇuḍaniyu ceppabaḍinadi : -”u. tāmarasākṣu vaṃśamuna darpakuḍīśvarukaṃṭi maṃṭalan

dāmunu dagdhuḍai pīdapa datparamēśuni dēha labdikai

vēmaṟu niṣṭhajēsi harivīryamunaṃ brabhaviṃce rukmiṇī

kāmanigarbhamaṃ dasurakhaṃḍanu māruṭa mūrti yō yanan.

“va. aṃta nā ḍiṃbhakuḍu pradyumnuṃ ḍanupēra vikhyātuṃḍayye”. (10 - u. bhā. 3. 4)

- -” aṃdu gōviṃdu naṃdanuṃḍaina pradyumnunaku rukmiskūtuvalana naniruddhuṃḍu saṃbhaviṃce” - (10 - u.. bhā. - 279)

  1. “sī. satvaprathānamai - -

ruciraṣāḍguṇya paripūrṇamai, nityamai - -

valanoppucuṃḍu navvāsudēva vyūhamaṃta mahattattamaṃdu nōli

rūḍhi griyāśakti rūpaṃbugalgu nahaṃkāramutpannamayye - - - “.

“sī. aṭṭi yahaṃkāramaṃdadhiṣṭiṃci sāhasra ṣaṇāmaṃḍalābhirāmu

ḍai tanarāru nanaṃtuḍu saṃkarṣaṇuṃḍanadagu puruṣuṃḍu ghanuḍu

mahita bhūtīṃdrīya mānasamayuḍunai - - -

tē. - -ammēṭi reṃḍava vyūhamanaga

ghanavikāraṃbu boṃdu vaikārikaṃbu

valana vinumu manastatva melami buṭṭe

- - -“.

“va. viddi yaniruddhā khyaṃbayina vyūhaṃbadiya hṛṣīkaṃbunaku nadhīśvaraṃbu - -”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 26 - 890 to 893)

(vāsudēvuḍanagā vasudēvuni kumāruḍaina śrīkṛṣṇuḍani purāṇamulavalana teliyavaccucunnadi - kāni dāni aṃtarārthamu ī vidhamugā nunnadi – “vasati asau dēvaḥ sarva bhūtēṣu iti vāsudēvaḥ” (samasta bhūtamulaṃdu nivasiṃciyuṃḍu dēvuḍu kanuka vāsudēvuḍu). samasta bhūtamulaṃdu nivasiṃciyuṃḍu nirguṇa nirākāra parabrahmayē - aṃducēta vāsudēvuḍanagā parabrahmayē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.