← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చతుష్పాద్బ్రహ్మ catuṣpādbrahma

Original — తెలుగు
  1. “తదేతద్బ్రహ్మ చతుష్పాదష్టాశఫం, షోదశకలమితి” - ప్రకాశవాన్నమపాదః పృధివ్యంతరిక్షం ద్యౌః సముద్ర ఇత్యనంత వాన్నామపాదః, అగ్నిశ్చంద్ర సూర్యో విద్యుదితి జ్యోష్మానామపాదః, చక్షుశ్శ్రోత్రః వా ఙ్మన ఇత్యాయ తనవాన్నామపాద ఇతి చతుషాద్బ్రహ్మ.పాదానామర్థాని అష్టశపా అస్యేత్యష్ట శఫం. పాదేషు చతుర్షు ప్రత్యేకంచ చతస్రంకలాః ఇతి షోడశ కలమి త్యర్థః.

(ఛాందోగ్యోపనిషత్తులో పరమేశ్వరునకు నాలుగు పాదములు, పదియారుకళలు అని చెప్పబడినది - అవి ఏవిఅనగా - ప్రకాశవంతము, అనంతవంతము, జ్యోతిష్మంతము, ఆయతనవంతము, కాంతి కలదికనుక ప్రకాశవంతమైనది మొదటిపాదము. ఆది, అంతములేక నిత్యముగానుండునది కనుక అనంతవంతము. తేజోరూపము కలదికనుక జ్యోతిష్మంతము - “జ్యోతిషామసితత్ జ్యోతిః”. మనోరూపముకనుక ఆయతనము. ఈ నాలుగు పాదములలో ఒక్కొక్కదానికి నాలుగు భాగములు - అవయవములు -. ప్రకాశవంతముకను పూర్వ దక్షిణ పశ్చిమోత్తరములు అని నాలుగు పాదములు - అనగా, నాలుగు దిక్కులలోను ప్రకాశించునది. అనంతవంతమునకు భూమి, అంతరిక్షము, ద్యులోకము, సముద్రము అని నాలుగుపాదములు. జ్యోతిష్మంతమునకు చంద్రుడు, సూర్యుడు, అగ్ని, మెరుపు అను నాలుగు పాదములు - నాలుగువిధములైన తేజస్సు. ఆయతనవంతమునకు నాసిక, నేత్రము, శ్రోత్రము, వాక్కు అనునది నాలుగు పాదములు. ఈ పాదములన్నియు కలిసి పదహారు - ఇవియే షోడశకళలు - ఈ ప్రకారముగా నాలుగు పాదములు, ఎనిమిది శషలు, పదియారుకళలు కలది ఆత్మ.

  1. “దిశశ్చ తస్రః కలాః ప్రకాశవాన్నామ పాదః| పౄధివ్యంతరిక్షం ద్యౌః సముద్రః ఇత్యనంతవాన్నామ పాదః|

అగ్నిశ్చంద్రస్సూర్యో విధ్యుదితి జ్యోతిష్మానామపాదః | చక్షుశ్రోత్రం వాఙ్మనస ఇత్యాయ తనవాన్నామ పాదః ఇతి

చతుష్పాద్బ్రహ్మ పాదానా మర్థాని“.

(బ్రహ్మ నాలుగు పాదములుగలది - అవి ఏవి అనగా : - నాలుగు దిక్కులను కళలు ప్రకాశించువాడుకనుక ప్రకాశవంతుడు అనునది ఒకపాదము. భూమి, అంతరిక్షము, ద్యౌః, సముద్రము అను నాలుగింటిచేత అనంతము అనుపేరు గలది ఒకపాదము - అగ్ని, చంద్రుడు, సూర్యుడు, విద్యుత్ అనుపేర్లుగలదగుటచేత జ్యోతిష్మంతుడను పేరు గలది ఒకపాదము. కన్ను, చెవి, వాక్కు, మనస్సు కలవాడగుటచేత ఆయతనముశ్గలవాడు అనుపేరుగలది ఒకపాదము - ఈ నాలుగుపాదములు కలవాడగుటచేత చతుష్పాద్ బ్రహ్మ).

  1. “విశ్వ తైజస ప్రాజ్ఞ తురీయ భేదేనవ్యష్టౌ, సమష్టేతువిరాట్ సూత్రబీజ తుర్య భేదేన, వ్యష్టి సమష్టి. విభాగేతు ఓతా నజ్ఞాత్యను జ్ఞైక రసాది కల్ప భేదేన చత్వారః పదాః యస్య సః చతుష్పదః”

(వ్యష్టియందు - అనగా, సృష్టిక్రమములో ఒక్కొక్క వస్తువు వేరు వేరు నామరూపములు గలవిగానున్నస్థితిలో - విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, తురీయుడు అను భేదములతోను, సమష్టియందు - అనగా, సృష్టిక్రమమందు వస్తువులన్నియు వేరు వేరు నామరూపములు తెలియబడకుండనుండు స్థితిలో - విరాడ్రూపుడు సూత్రాత్మ, బీజము, తురీయుడు అను నాలుగు భేదములతోను వ్యష్టి సమష్టి విభాగమందు, ఓతా అనుజ్ఞాత, అను జ్ఞైకరసములు అను భేదములతో - ఈ నాలుగు పాదములు గలవాడు కనుక బ్రహ్మ చతుష్పాదుడు).

  1. “చత్వారః పాదాః అంశా స్వరూప భూతాః యస్య సః చతుష్పాత్ - సర్వ బీజనియామకతయా తత్త ద్దేహేషు చతూరూపతయా తిష్టతి ఇత్యర్థః -” (శ్రీకూరనారాయణః)

(తనయొక్క నాలుగు అంశలే తన స్వరూపముగా గలవాడు - సమస్త భూతములను వాటి వాటి పనులలో నియమించుటచేత ఆయా దేహములందు నాలుగు రూపములతో నున్నవాడు).

    1. “సోయమాత్మా చతుష్పాత్ - జాగరితస్థానః స్థూల ప్రజ్ఞః, సప్తాంగ, ఏకోనవింశతి ముఖః, స్థూలభుక్; చతురాత్మా విశ్వో వైశ్వావరః ప్రధమః పాదః” ఇతి శ్రుతిః -.

(ఈ ఆత్మ నాలుగు పాదములుగలది - జాగ్రదవస్త స్థానముగాగలది, స్థూలప్రజ్ఞ గలది, సప్తాంగములు గలది, పందొమ్మిది ముఖములుకలది, స్థూలభుక్, విశ్వుడు, వైశ్వానరుడు అనుపేరు గలది మొదటిపాదము అని శ్రుతి చెప్పుచున్నది).

(“ఏతత్సర్వం స్ఫుటీకర్తుం చతుష్పాద్బ్రహ్మ” (బ్రహ్మ నాలుగుపాదములు గలది) అను మాట ఇప్పుడు స్ఫుటము చేయబడినది - ఇంద్రియములచేత విషయములను తెలుసుకొనుట జాగంతమని చెప్పబడినది. బాహ్యేంద్రియములచేత స్థూలరూపములోనున్న జగత్తును తెలుసుకొనుట స్థూల ప్రజ్ఞ అనబడును. శిరస్సు, కండ్లు, ముఖము, మీద, క్రింద, మధ్యమము అనునవి ఏడు అంగములు. జ్ఞానేంద్రియములైదు, కర్మేంద్రియములైదు, పంచప్రాణములుఅయిదు అను పదిహేనున్నూ, చిత్తము, మనస్సు, బుధి, అహంకారము అనునవి నాలుగు కలిసి మొత్తము పదిహేనున్నూ పందొమ్మిది ముఖములు - ఇంద్రియములకు లభ్యమైనవి, తినునవి - అనుభవించునవి - స్థూల భుక్. జాగ్రదవస్థ కండ్లతో చేయు వ్యవహారము. స్వప్నావస్థ అనగా మనసులో ఆలోచించుట సుషుప్తి యనగా యేమియు చేయకుండుట. తురీయావస్థయనగా తృప్తి చెందియుండుట. ఈ నాలుగు అవస్థలు కలిగియుండుటచేత చతురాత్మా. అధ్యాత్మము, అధిదైవము, విశ్వుడు, వైశ్వానరుడు అను పేరుగలవాడు - ఇది చతుష్పాదము అయిన ఆత్మ యొక్కమొదటిపాదము -

  1. “స్వప్నస్థానః సూక్ష్మ ప్రజ్ఞః, సప్తాంగః, ఏకోన వింశతి ముఖః సూక్ష్మ భుక్, చతురాత్మా, తైజసో, హిరణ్యగర్భో ద్వితీయః పాదః ఇతి శ్రుతిః.

“ఇంద్రియాణా ముపరమే ధియా జగరవాసనం |

సూక్ష్మ జానన్ వాసనాత్మా సప్తాంగాదియుతో భవేత్ –

హిరణ్యగర్భో అధి దైవమధ్యాత్మం తైజసాభిధః |

ద్వితీయపాద ఏష స్యాదాత్మనో అస్య చతుష్పదః.” ఇతి.

(స్వప్నావస్థ స్థానముగా గలది, సూక్ష్మ ప్రజ్ఞగలది, ఏడు అంగములు గలది, ఇరువదియొక్కముఖములు గలది, సూక్ష్మవస్తువులను భుజించునది - అనుభవించునది -,సూక్ష్మములైన వాసనలను - కర్మ వాసనలను - తెలుసుకొనునది, ఏడు అంగములు గలది హిరణ్యగర్భుడు, అధిదైవము, అధ్యాత్మము, తైజసుడు అను పేర్లు గలది చతుష్పాద్ బ్రహ్మ - నాలుగు పాదములు గల బ్రహ్మ - యొక్క రెండవపాదము -).

  1. “యత్రసుప్తోన కించనకామం కామయతే, న కంచనస్వప్నం పశ్యతి, తత్ సుషుప్తం సుషుప్తస్థాన ఏకీభూతఃప్రజ్ఞాన ఘన ఏవానంద మ యోహ్యానంద భుక్ చేతో ముఖశ్చతురాత్మా ప్రాజ్ఞ ఈశ్వర స్తృతీయ పాదః” ఇతి శ్రుతిః“.

“ధియో లయే సుషుప్తి స్థ ఏకో అభూత్ ద్వైత లోపనాత్. |

ధీవృత్తి రూపాః, ప్రజ్ఞాస్తాఏకీభావ ముపాగతాః |

దుఃఖహాన్యానందమ యో భుంక్తే బ్రహ్మ సుఖం తదా |

అవిద్యా వృత్య విచ్ఛిన్నం భోగసాధనం |

సుషుప్తౌ చతురా త్మత్వంజాగరాది విభేదితః |

తంద్రా మిధ్యా లపేద్వా చా తదాస్యాత్ సుప్తి జాగరం |

ధ్యానాభాసస్తు యస్తం ధ్యాసుప్తి స్వప్నస్య ఉచ్యతే |

గాధనిద్రా సుప్తి సుప్తిః సుప్తి తుర్యం సుభోద్భివః |

ఆధ్యాత్మం ప్రాజ్ఞ ఏవస్యాదధి దైవం త ధేశ్వరః |

తృతీయ పాద ఆత్మనో(అ)స్య చతుష్పదః“.

(స్వప్నావస్థలో ఏ కామము (కోరిక) లేకయుండునో, ఏ స్వప్నము లేకయుండునో - అట్టి స్వప్నావస్థయే సుషుప్తి. ఈ సుషుప్త్వవస్తయందు బుద్ధి లయమును పొందును - పరమాత్మ కాక మఱియొకటి లేనందున (ద్వైతవస్తువులేనందున ‘ఏకః’ ఒకడే అయినవాడు. మనస్సుయొక్క వృత్తులే ప్రజ్ఞలు. అవన్నియు ఏకమగుటచేత ఏకః అని చెప్పబడుచున్నాడు - దుఃఖము అనునది లేకుండుటచేత ఆనందమయుడై బ్రహ్మానందము ననుభవించును - అధ్యాత్మము, ప్రాజ్ఞుడు, అధిదైవము ఈశ్వరుడైనవాడు.ఇట్టివాడు చతుష్పాద్బ్రహ్మయొక్క మూడవపాదము).

“పాద త్రయమిదం మాయా మాత్రం స్యాన్నతు తాత్వికం |

సుషుప్త స్వప్న నామభ్యాని తత్వవిద్వక్తి తత్ త్రయం |

తత్త్వా వృత్తేః సుషుప్తె త్వం స్వప్నతా త్వన్యధే క్షణాత్ |

పాదత్రయే ణావృతో (అ)సౌ చిదేక రసతాత్మనః ||“.

(ఈ మూడుపాదములు మాయామాత్రములు, తత్వరీత్యా - యదార్థముగా - కాదు - ఈ మూడింటిని తత్వము తెలిసినవారు సుషుప్తి, స్వప్నము అని చెప్పుదురు. ఈ మూడుపాదములచేత చైతన్యమొక్కటే రసముగా (తత్వముగానున్న పరమాత్మయొక్కడే కప్పబడియున్నాడు, ఆవరించబడియున్నాడు).

  1. “నిరుపాధిక చైతన్య ప్రతి పత్యర్థం చతుర్థపాదం విభజతే శ్రుతిః -” అథ చతుర్థశ్చతురాత్మాతుర్యావని తత్వాదే కైకస్య ఓ తాను జ్ఞాత్రను జ్ఞా(అ)నికల్పై స్తయమత్రాపి సుషుప్తం, స్వప్నం మాయామాత్రం చిదేకరసో హ్యధాయ మాదేశః న స్థూల ప్రజ్ఞం - ఇత్యాదినా“.

(ఉపాధి లేనటువంటి చైతన్యమే చతుష్పాద్బ్రహ్మ యొక్కనాలుగవ పాదము. (పరమాత్మయే విశ్వుడని, తైజసుడని, ప్రాజ్ఞుడని, పరమాత్మయని ఆ పరమాత్మయే చెప్పబడుచున్నాడు. ఆ పరమాత్మయే స్థూలశరీరమను ఉపాధిలోనున్నపుడు విశ్వుడని, సూక్ష్మశరీరమను ఉపాధిలో నున్నపుడు తైజసుడని,కారణశరీరమను ఉపాధిలోనున్నపుడు ప్రాజ్ఞుడు అని, ఏ విధమైన ఉపాధిలేక - ప్రకృతితోగాని, దాని వికరములతోగాని కలియక తానొక్కడే యున్నపుడు కేవలుడైన పరమాత్మయని నాలుగు విధములుగా చెప్పబడుచున్నాడు. కనుక చతుష్పాద్బ్రహ్మయని చెప్పబడుచున్నాడు).

  1. “పాథో(అ)స్య సర్వభూతాని త్రిపాదస్యామృతం దివి” ఇతి శ్రుతిః -

(పరబ్రహ్మకు సర్వభూతములు ఒక పాదము - స్థూలరూపము - మిగిలిన మూడు పాదములు ద్యులోకములో నున్నవి- సూక్ష్మము, సూక్ష్మాతిసూక్ష్మము, తురీయము. పైన చెప్పిబడిన 1, 2 , 3 పాదములవియే - ఈ విషయము శ్రీమద్భగ్వద్గీతలో చెప్పబడినది : -“విష్టభ్యాహమిదం కృత్స్నమేకాంశేన స్థితో జగత్” (10 - 42).

“పాదో(అ)స్య విశ్వభూతా నీత్యాది శ్రుత్యాహమీశ్వరః |

ఏక ఏవ వినిర్ణీతః తం త్వం మా విద్ధి సర్వదా ||“. (గీతాభావప్రకాశము- 10 - 172, 173)

(ఈ సమస్త భూతములు నా ఒకే పాదము - అని శ్రుతిలో చెప్పిన ప్రకారము ఉన్నదంతా నేనొక్కడినే అని తెలుసుకొనుము),“ఒక పాదంబున భూమికప్పి” అని వామనావతారములో చెప్పిన ప్రకారము ఇదియే).

Transliteration
  1. “tadētadbrahma catuṣpādaṣṭāśaphaṃ, ṣōdaśakalamiti” - prakāśavānnamapādaḥ pṛdhivyaṃtarikṣaṃ dyauḥ samudra ityanaṃta vānnāmapādaḥ, agniścaṃdra sūryō vidyuditi jyōṣmānāmapādaḥ, cakṣuśśrōtraḥ vā ṅmana ityāya tanavānnāmapāda iti catuṣādbrahma.pādānāmarthāni aṣṭaśapā asyētyaṣṭa śaphaṃ. pādēṣu caturṣu pratyēkaṃca catasraṃkalāḥ iti ṣōḍaśa kalami tyarthaḥ.

(chāṃdōgyōpaniṣattulō paramēśvarunaku nālugu pādamulu, padiyārukaḷalu ani ceppabaḍinadi - avi ēvianagā - prakāśavaṃtamu, anaṃtavaṃtamu, jyōtiṣmaṃtamu, āyatanavaṃtamu, kāṃti kaladikanuka prakāśavaṃtamainadi modaṭipādamu. ādi, aṃtamulēka nityamugānuṃḍunadi kanuka anaṃtavaṃtamu. tējōrūpamu kaladikanuka jyōtiṣmaṃtamu - “jyōtiṣāmasitat jyōtiḥ”. manōrūpamukanuka āyatanamu. ī nālugu pādamulalō okkokkadāniki nālugu bhāgamulu - avayavamulu -. prakāśavaṃtamukanu pūrva dakṣiṇa paścimōttaramulu ani nālugu pādamulu - anagā, nālugu dikkulalōnu prakāśiṃcunadi. anaṃtavaṃtamunaku bhūmi, aṃtarikṣamu, dyulōkamu, samudramu ani nālugupādamulu. jyōtiṣmaṃtamunaku caṃdruḍu, sūryuḍu, agni, merupu anu nālugu pādamulu - nāluguvidhamulaina tējassu. āyatanavaṃtamunaku nāsika, nētramu, śrōtramu, vākku anunadi nālugu pādamulu. ī pādamulanniyu kalisi padahāru - iviyē ṣōḍaśakaḷalu - ī prakāramugā nālugu pādamulu, enimidi śaṣalu, padiyārukaḷalu kaladi ātma.

  1. “diśaśca tasraḥ kalāḥ prakāśavānnāma pādaḥ| pṝdhivyaṃtarikṣaṃ dyauḥ samudraḥ ityanaṃtavānnāma pādaḥ|

agniścaṃdrassūryō vidhyuditi jyōtiṣmānāmapādaḥ | cakṣuśrōtraṃ vāṅmanasa ityāya tanavānnāma pādaḥ iti

catuṣpādbrahma pādānā marthāni”.

(brahma nālugu pādamulugaladi - avi ēvi anagā : - nālugu dikkulanu kaḷalu prakāśiṃcuvāḍukanuka prakāśavaṃtuḍu anunadi okapādamu. bhūmi, aṃtarikṣamu, dyauḥ, samudramu anu nālugiṃṭicēta anaṃtamu anupēru galadi okapādamu - agni, caṃdruḍu, sūryuḍu, vidyut anupērlugaladaguṭacēta jyōtiṣmaṃtuḍanu pēru galadi okapādamu. kannu, cevi, vākku, manassu kalavāḍaguṭacēta āyatanamuśgalavāḍu anupērugaladi okapādamu - ī nālugupādamulu kalavāḍaguṭacēta catuṣpād brahma).

  1. “viśva taijasa prājña turīya bhēdēnavyaṣṭau, samaṣṭētuvirāṭ sūtrabīja turya bhēdēna, vyaṣṭi samaṣṭi. vibhāgētu ōtā najñātyanu jñaika rasādi kalpa bhēdēna catvāraḥ padāḥ yasya saḥ catuṣpadaḥ”

(vyaṣṭiyaṃdu - anagā, sṛṣṭikramamulō okkokka vastuvu vēru vēru nāmarūpamulu galavigānunnasthitilō - viśvuḍu, taijasuḍu, prājñuḍu, turīyuḍu anu bhēdamulatōnu, samaṣṭiyaṃdu - anagā, sṛṣṭikramamaṃdu vastuvulanniyu vēru vēru nāmarūpamulu teliyabaḍakuṃḍanuṃḍu sthitilō - virāḍrūpuḍu sūtrātma, bījamu, turīyuḍu anu nālugu bhēdamulatōnu vyaṣṭi samaṣṭi vibhāgamaṃdu, ōtā anujñāta, anu jñaikarasamulu anu bhēdamulatō - ī nālugu pādamulu galavāḍu kanuka brahma catuṣpāduḍu).

  1. “catvāraḥ pādāḥ aṃśā svarūpa bhūtāḥ yasya saḥ catuṣpāt - sarva bījaniyāmakatayā tatta ddēhēṣu catūrūpatayā tiṣṭati ityarthaḥ -” (śrīkūranārāyaṇaḥ)

(tanayokka nālugu aṃśalē tana svarūpamugā galavāḍu - samasta bhūtamulanu vāṭi vāṭi panulalō niyamiṃcuṭacēta āyā dēhamulaṃdu nālugu rūpamulatō nunnavāḍu).

    1. “sōyamātmā catuṣpāt - jāgaritasthānaḥ sthūla prajñaḥ, saptāṃga, ēkōnaviṃśati mukhaḥ, sthūlabhuk; caturātmā viśvō vaiśvāvaraḥ pradhamaḥ pādaḥ” iti śrutiḥ -.

(ī ātma nālugu pādamulugaladi - jāgradavasta sthānamugāgaladi, sthūlaprajña galadi, saptāṃgamulu galadi, paṃdommidi mukhamulukaladi, sthūlabhuk, viśvuḍu, vaiśvānaruḍu anupēru galadi modaṭipādamu ani śruti ceppucunnadi).

(“ētatsarvaṃ sphuṭīkartuṃ catuṣpādbrahma” (brahma nālugupādamulu galadi) anu māṭa ippuḍu sphuṭamu cēyabaḍinadi - iṃdriyamulacēta viṣayamulanu telusukonuṭa jāgaṃtamani ceppabaḍinadi. bāhyēṃdriyamulacēta sthūlarūpamulōnunna jagattunu telusukonuṭa sthūla prajña anabaḍunu. śirassu, kaṃḍlu, mukhamu, mīda, kriṃda, madhyamamu anunavi ēḍu aṃgamulu. jñānēṃdriyamulaidu, karmēṃdriyamulaidu, paṃcaprāṇamuluayidu anu padihēnunnū, cittamu, manassu, budhi, ahaṃkāramu anunavi nālugu kalisi mottamu padihēnunnū paṃdommidi mukhamulu - iṃdriyamulaku labhyamainavi, tinunavi - anubhaviṃcunavi - sthūla bhuk. jāgradavastha kaṃḍlatō cēyu vyavahāramu. svapnāvastha anagā manasulō ālōciṃcuṭa suṣupti yanagā yēmiyu cēyakuṃḍuṭa. turīyāvasthayanagā tṛpti ceṃdiyuṃḍuṭa. ī nālugu avasthalu kaligiyuṃḍuṭacēta caturātmā. adhyātmamu, adhidaivamu, viśvuḍu, vaiśvānaruḍu anu pērugalavāḍu - idi catuṣpādamu ayina ātma yokkamodaṭipādamu -

  1. “svapnasthānaḥ sūkṣma prajñaḥ, saptāṃgaḥ, ēkōna viṃśati mukhaḥ sūkṣma bhuk, caturātmā, taijasō, hiraṇyagarbhō dvitīyaḥ pādaḥ iti śrutiḥ.

“iṃdriyāṇā muparamē dhiyā jagaravāsanaṃ |

sūkṣma jānan vāsanātmā saptāṃgādiyutō bhavēt –

hiraṇyagarbhō adhi daivamadhyātmaṃ taijasābhidhaḥ |

dvitīyapāda ēṣa syādātmanō asya catuṣpadaḥ.” iti.

(svapnāvastha sthānamugā galadi, sūkṣma prajñagaladi, ēḍu aṃgamulu galadi, iruvadiyokkamukhamulu galadi, sūkṣmavastuvulanu bhujiṃcunadi - anubhaviṃcunadi -,sūkṣmamulaina vāsanalanu - karma vāsanalanu - telusukonunadi, ēḍu aṃgamulu galadi hiraṇyagarbhuḍu, adhidaivamu, adhyātmamu, taijasuḍu anu pērlu galadi catuṣpād brahma - nālugu pādamulu gala brahma - yokka reṃḍavapādamu -).

  1. “yatrasuptōna kiṃcanakāmaṃ kāmayatē, na kaṃcanasvapnaṃ paśyati, tat suṣuptaṃ suṣuptasthāna ēkībhūtaḥprajñāna ghana ēvānaṃda ma yōhyānaṃda bhuk cētō mukhaścaturātmā prājña īśvara stṛtīya pādaḥ” iti śrutiḥ”.

“dhiyō layē suṣupti stha ēkō abhūt dvaita lōpanāt. |

dhīvṛtti rūpāḥ, prajñāstāēkībhāva mupāgatāḥ |

duḥkhahānyānaṃdama yō bhuṃktē brahma sukhaṃ tadā |

avidyā vṛtya vicchinnaṃ bhōgasādhanaṃ |

suṣuptau caturā tmatvaṃjāgarādi vibhēditaḥ |

taṃdrā midhyā lapēdvā cā tadāsyāt supti jāgaraṃ |

dhyānābhāsastu yastaṃ dhyāsupti svapnasya ucyatē |

gādhanidrā supti suptiḥ supti turyaṃ subhōdbhivaḥ |

ādhyātmaṃ prājña ēvasyādadhi daivaṃ ta dhēśvaraḥ |

tṛtīya pāda ātmanō(a)sya catuṣpadaḥ”.

(svapnāvasthalō ē kāmamu (kōrika) lēkayuṃḍunō, ē svapnamu lēkayuṃḍunō - aṭṭi svapnāvasthayē suṣupti. ī suṣuptvavastayaṃdu buddhi layamunu poṃdunu - paramātma kāka maṟiyokaṭi lēnaṃduna (dvaitavastuvulēnaṃduna ‘ēkaḥ’ okaḍē ayinavāḍu. manassuyokka vṛttulē prajñalu. avanniyu ēkamaguṭacēta ēkaḥ ani ceppabaḍucunnāḍu - duḥkhamu anunadi lēkuṃḍuṭacēta ānaṃdamayuḍai brahmānaṃdamu nanubhaviṃcunu - adhyātmamu, prājñuḍu, adhidaivamu īśvaruḍainavāḍu.iṭṭivāḍu catuṣpādbrahmayokka mūḍavapādamu).

“pāda trayamidaṃ māyā mātraṃ syānnatu tātvikaṃ |

suṣupta svapna nāmabhyāni tatvavidvakti tat trayaṃ |

tattvā vṛttēḥ suṣupte tvaṃ svapnatā tvanyadhē kṣaṇāt |

pādatrayē ṇāvṛtō (a)sau cidēka rasatātmanaḥ ||“.

(ī mūḍupādamulu māyāmātramulu, tatvarītyā - yadārthamugā - kādu - ī mūḍiṃṭini tatvamu telisinavāru suṣupti, svapnamu ani ceppuduru. ī mūḍupādamulacēta caitanyamokkaṭē rasamugā (tatvamugānunna paramātmayokkaḍē kappabaḍiyunnāḍu, āvariṃcabaḍiyunnāḍu).

  1. “nirupādhika caitanya prati patyarthaṃ caturthapādaṃ vibhajatē śrutiḥ -” atha caturthaścaturātmāturyāvani tatvādē kaikasya ō tānu jñātranu jñā(a)nikalpai stayamatrāpi suṣuptaṃ, svapnaṃ māyāmātraṃ cidēkarasō hyadhāya mādēśaḥ na sthūla prajñaṃ - ityādinā”.

(upādhi lēnaṭuvaṃṭi caitanyamē catuṣpādbrahma yokkanālugava pādamu. (paramātmayē viśvuḍani, taijasuḍani, prājñuḍani, paramātmayani ā paramātmayē ceppabaḍucunnāḍu. ā paramātmayē sthūlaśarīramanu upādhilōnunnapuḍu viśvuḍani, sūkṣmaśarīramanu upādhilō nunnapuḍu taijasuḍani,kāraṇaśarīramanu upādhilōnunnapuḍu prājñuḍu ani, ē vidhamaina upādhilēka - prakṛtitōgāni, dāni vikaramulatōgāni kaliyaka tānokkaḍē yunnapuḍu kēvaluḍaina paramātmayani nālugu vidhamulugā ceppabaḍucunnāḍu. kanuka catuṣpādbrahmayani ceppabaḍucunnāḍu).

  1. “pāthō(a)sya sarvabhūtāni tripādasyāmṛtaṃ divi” iti śrutiḥ -

(parabrahmaku sarvabhūtamulu oka pādamu - sthūlarūpamu - migilina mūḍu pādamulu dyulōkamulō nunnavi- sūkṣmamu, sūkṣmātisūkṣmamu, turīyamu. paina ceppibaḍina 1, 2 , 3 pādamulaviyē - ī viṣayamu śrīmadbhagvadgītalō ceppabaḍinadi : -“viṣṭabhyāhamidaṃ kṛtsnamēkāṃśēna sthitō jagat” (10 - 42).

“pādō(a)sya viśvabhūtā nītyādi śrutyāhamīśvaraḥ |

ēka ēva vinirṇītaḥ taṃ tvaṃ mā viddhi sarvadā ||“. (gītābhāvaprakāśamu- 10 - 172, 173)

(ī samasta bhūtamulu nā okē pādamu - ani śrutilō ceppina prakāramu unnadaṃtā nēnokkaḍinē ani telusukonumu),“oka pādaṃbuna bhūmikappi” ani vāmanāvatāramulō ceppina prakāramu idiyē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.